ADVERTISEMENT
home / Budget Trips
జేబులో రూ.10,000 ఉంటే చాలు.. ఈ టూరిస్ట్ ప్రదేశాలకు చెక్కేయచ్చు..!

జేబులో రూ.10,000 ఉంటే చాలు.. ఈ టూరిస్ట్ ప్రదేశాలకు చెక్కేయచ్చు..!

అస్తమానూ టూర్లకు, టూరిస్ట్ ప్రదేశాలకు(tourist places) వెళ్లే వారిని చూస్తుంటే.. మనకు కూడా వారిలాగే.. దేశవిదేశాల్లోని అందమైన ప్రాంతాలకు వెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆర్థిక స్థోమత కారణంగా ఈ ఆలోచనను తమలోనే అదిమి పెట్టి ఉంచుకునేవారెందరో ఉంటారు. అయితే.. ఓ పదివేలు జేబులో పెట్టుకుంటే చాలు.. ఓ మంచి ప్రదేశానికి వెళ్లి చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు.

పదివేలు ఎలా సరిపోతాయని ఆలోచిస్తున్నారా? ఫ్లయిట్‌కి బదులుగా బస్ లేదా ట్రెయిన్లో వెళితే కచ్చితంగా మీరనుకున్న బడ్జెట్‌లో (budget) మీకు నచ్చిన చోటుకు విహారయాత్రకు వెళ్లి రావచ్చు. అయితే మన దేశంలో అంత తక్కువ బడ్జెట్లో వెళ్లగలిగిన ప్రాంతాలేమున్నాయో తెలుసుకుందాం. బడ్జెట్ దృష్ట్యా మన తెలుగు రాష్ట్రాలకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల వివరాలను మీకు అందిస్తున్నాం.

1. మాథేరాన్

సౌత్ ఇండియా గ్రాండ్ కాన్యన్‌గా పిలిచే ఈ హిల్ స్టేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మన రాష్ట్రం నుంచి ముంబయి వరకు ట్రెయిన్లో వెళ్లి.. అక్కడి నుంచి నీరల్ స్టేషన్‌కు టాయ్ ట్రెయిన్ ద్వారా వెళితే మాథేరాన్ చేరుకోవచ్చు. లగ్జరీల జోలికి వెళ్లకుండా ఉంటే.. నాలుగు రోజుల పాటు ఇక్కడ ఎంజాయ్ చేయచ్చు.

2. ఊటీ

ఈ హనీమూన్ స్పాట్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడి అందాలను మనం ఎన్నో సినిమాల్లో తిలకించాం. మరి వాటిని నేరుగా చూడాలనుకునేవారికీ కొదవ లేదు. కాకపోతే అక్కడి హోటళ్లలో ఉండాలంటే.. మన పదివేల రూపాయల బడ్జెట్ సరిపోదు కదా. అందుకే అక్కడ మనలాంటి వారి అవసరాలను తీర్చడానికే స్టే హోంస్ ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతోనే ఇక్కడ మనం స్టే చేయచ్చు. కాబట్టి మన బడ్జెట్లోనే ఊటీ అందాలను తిలకించి రావచ్చు.

ADVERTISEMENT

Shutterstock

3. లోనార్

ఔరంగాబాద్ నుంచి మూడు నాలుగొందల కి.మీ. దూరంలో ఉంటుంది ఈ ప్రదేశం. సుమారుగా ఐదువేల సంవత్సరాల క్రితం ఉల్క ఢీ కొనడం ద్వారా ఏర్పడిన గొయ్యి.. ఆ తర్వాత ఉప్పునీటి చెరువుగా రూపాంతరం చెందింది. ఇక్కడి ప్రకృతి అందాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేంత అందంగా ఉంటాయి. ఇక్కడికి ఔరంగాబాద్ నుంచి ట్రెయిన్లో చేరుకోవచ్చు.

4. గోవా

గోవా వెళ్లడం మనలో చాలామందికి పెద్ద డ్రీం అనే చెప్పాలి. కానీ అక్కడకి వెళితే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనని వెనకడుగు వేసే వారుంటారు. కానీ గోవా టూర్‌ను చాలా చౌకగా పది వేలలోపు మొత్తంతోనే పూర్తి చేయచ్చు. తక్కువ బడ్జెట్లో వెళుతున్నాం కాబట్టి సౌత్ గోవాకు వెళ్లడం మంచిది. హైదరాబాద్ నుంచి గోవాకు ట్రెయిన్ ద్వారా చేరుకుంటే.. చాలా డబ్బులను ఆదా చేసినట్టే.

ADVERTISEMENT

గోవాకున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ మనం విడిది చేయడానికి స్థానికులే తమ ఇంట్లోని కొన్ని గదులను కేటాయిస్తారు. వీటి అద్దె రోజుకి ఐదువందల లోపే ఉంటుంది. కావాలంటే మనమే వంట చేసుకుని తినొచ్చు. అందుకే ఫారినర్స్ సైతం హోటల్స్‌కి బదులుగా ఇలాంటి స్టే హోంస్, హాస్టళ్లలో ఉండటానికే ఇష్టపడుతుంటారు. దారి ఖర్చులు మినహాయిస్తే.. ఏడెనిమిది వేల లోపులోనే ఓ నాలుగు రోజులు సరదాగా గడపొచ్చు.

Shutterstock

5. కొడగు

కర్ణాటకలోని కొడగు కాఫీ తోటలకు ప్రసిద్ధి. దీన్నే మనం కూర్గ్ అని పిలుస్తాం. ఆహారం, విడిదితో కలిపి రోజుకు నాలుగు నుంచి ఆరొందలు ఖర్చుతో ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు. మైసూర్ వరకు రైలు మార్గం ద్వారా చేరుకుని అక్కడి నుంచి బస్ ద్వారా కొడగు చేరుకోవచ్చు. ఇక్కడి కొండల అందాలు, కూర్గీల జీవనవిధానం మీకు కచ్చితంగా నచ్చుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ADVERTISEMENT

6. కొడైకెనాల్

ప్రేమయాత్రలకు కొడైకెనాల్‌ను మించిన అందమైన ప్రదేశం మరొకటి ఉందా? అయినా మన బడ్జెట్ పదివేలే కాబట్టి ఈ సారికి సింగిల్‌గా వెళ్లొచ్చేద్దాం. హైదరాబాద్ నుంచి దిండుగల్‌కు రైలు మార్గం ద్వారా చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొడైకెనాల్‌కు చేరుకోవచ్చు. సముద్రమట్టానికి దాదాపుగా రెండు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ మిమ్మల్ని రీచార్జ్ చేస్తుంది. ఇక్కడ కనిపించే రమణీయత, ల్యాండ్ స్కేప్స్ మీ టూర్ ఆనందాన్ని.. సూపర్ సక్సెస్ చేస్తాయి.

Shutterstock

7. హంపి

చిన్నప్పుడు ఎప్పుడో పాఠాల్లో చదువుకున్న హంపి నగరం చూడాలనుకుంటున్నారా? హెరిటేజ్ స్పాట్ అయిన హంపీ నగరాన్ని సందర్శించడానికి అయ్యే ఖర్చు పదివేల లోపే ఉంటుంది. హైదరాబాద్ నుంచి హోస్పేట వరకు రైలులో ప్రయాణించి.. అక్కడి నుంచి సుమారుగా పది పన్నెండు కి.మీ. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తే హంపి చేరుకోవచ్చు.

ADVERTISEMENT

8. వాయనాడ్

కేరళలో ఉన్న మరో పర్యాటక ప్రాంతం వాయనాడ్. ఇది కూడా మంచి టూరిస్ట్ స్పాట్. పచ్చని కొండలు, వాటిని ఆనుకుని ప్రవహించే జలాలతో వాయనాడ్ చాలా అందంగా ఉంటుంది. ఎడక్కల్ గుహలు, చెంబ్రా శిఖరం, వాయనాడ్ లైఫ్ శాంక్చుయరీ, బనసుర సాగర్ డ్యాం.. ఇక్కడి పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ పర్యటకులకు అందుబాటు ధరల్లో బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. కాబట్టి పదివేల రూపాయలతో వాయనాడ్‌ను చుట్టి వచ్చేయచ్చు.

Shutterstock

9. మహాబలేశ్వరం

వర్షాకాలంలో బడ్జెట్లో కొండ ప్రాంతాలను సందర్శించాలనుకునేవారికి ఈ పర్యటక ప్రాంతం సరైన ఎంపిక. వ్యూ పాయింట్స్ నుంచి ఇక్కడ విస్తరించి ఉన్న కొండలను చూస్తే.. మనసంతా పులకించిపోతుంది. కొండల మీద నుంచి దూకే లింగమల జలపాతం, వెన్నా లేక్, ఆర్ధర్స్ సీట్ ఇలా ఇక్కడ సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలున్నాయి.

ADVERTISEMENT

10. పొల్లాచి

ఏడాదంతా టూరిస్టులతో కళకళలాడుతూ ఉండే పట్టణం పొల్లాచి. తమిళనాడులోని పొల్లాచి ఈ వర్షాకాలంలో సందర్శించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొండలు, వన్యజీవులు, టైగర్ ఫారెస్ట్.. ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్‌గా  ఉన్నాయి. బడ్జెట్ హోటల్స్‌లో స్టే చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో పొల్లాచి టూర్ ముగించవచ్చు.

ఇవీ పదివేల రూపాయలతో మనం సందర్శించదగిన ప్రదేశాలు. అయితే ఇది ఒకరికి అయ్యే ఖర్చు మాత్రమే. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టూర్ ప్లాన్ చేసుకోండి.

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

06 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT