నేడు కాలం మారిపోయింది. చిన్న కుటుంబాల వ్యవస్థ అనేది ఏర్పడినా.. కొన్ని చోట్ల ఉమ్మడి కుటుంబాలు (joint family) సైతం ఆనందంగా జీవించడం మనం చూస్తూనే ఉన్నాం. చిన్న కుటుంబాల వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నట్లే.. ఉమ్మడి కుటుంబం వల్ల కూడా ప్రత్యేకమైన లాభనష్టాలు ఉన్నాయి. పెళ్లయి అత్తమామలతో కలిసి జీవిస్తున్న కొత్త జంటలు.. తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవడానికి ఇబ్బంది పడే సంగతి నిజమే.
రాత్రుళ్లు తప్ప.. పగలు వీరికి ఒంటరిగా గడిపే వీలుండదు. పైగా రాత్రుళ్లు కూడా ఎవరు ఎప్పుడొచ్చి తలుపు కొడతారో అర్థం కాదు. గట్టిగా మూలిగితే ఇతరులు ఏమనుకుంటారో అని భావిస్తూ.. ఆనందాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలామంది చేస్తారు. మరి, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు సెక్స్‌తో పాటు (sex), ఇద్దరి మధ్య దగ్గరితనంలో ఎలాంటి మార్పులొస్తాయి.. అవి ఎదుటి వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? అనే విషయాలపై తమ అభిప్రాయాలను వెల్లడించడానికి సిద్ధమయ్యారు ఓ ఏడుగురు మహిళలు
1. ఉమ్మడి కుటుంబంలో ఉండడం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ దానికోసం మీరు త్యాగం చేయాల్సినవి చాలానే ఉంటాయి. నేను, నా భర్త కలిసి ఉమ్మడి కుటుంబంతో పాటు రెండు సంవత్సరాలు ఉన్నాం. ఆ సమయంలో నా భర్త కోసం నేను తనకు మూడ్ తెప్పించేలా దుస్తులను ధరించాలని భావించేదాన్ని. అయితే అది కుదిరేది కాదు. సెక్స్ సంగతి పక్కన పెడితే మేం కౌగిలించుకునేటప్పుడు, ముద్దు పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. కేవలం రాత్రి సమయాల్లో.. అది కూడా ఎలాంటి శబ్దం లేకుండా సెక్స్‌లో పాల్గొనాల్సి వచ్చేది.
ఈ తొలి వార్షికోత్సవ రొమాన్స్ ముచ్చట్లు.. ఆలుమగలకు ప్రత్యేకం..!
2. మేం ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటాం కాబట్టి నా భర్త, నేను కలిసి ఓ చక్కటి ప్లాన్ వేసుకున్నాం. మేమిద్దరం మా కుటుంబానికి తెలియకుండా ఆఫీస్ నుంచి సెలవు తీసుకున్నాం. ఉదయం ఆఫీస్‌కి వెళ్తున్నామని చెప్పి.. ఇంటి నుంచి బయల్దేరి ఓ హోటెల్‌కి వెళ్లాం. అక్కడ రోజంతా గడిపి.. సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేశాం. ఇది మా ఇద్దరి బంధంలో ఆ కొత్తదనాన్ని నిలిపి ఉంచడంతో పాటు.. ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పి సీక్రెట్‌గా కలుస్తున్నామన్న థ్రిల్‌ని కలిగించడంతో సెక్స్ కూడా.. ఇంకా అద్భుతంగా అనిపించింది.
3. పెళ్లి తర్వాత.. మా అత్తగారింట్లో ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండేవాళ్లం. మాది మూడు బెడ్ రూంలు ఉన్న అపార్ట్ మెంట్. మా అత్తమామలతో పాటు మరిదికి, మాకు వేర్వేరు గదులు ఉన్నాయి. కానీ రాత్రి అందరూ టీవీ చూస్తూ ఉంటే.. మేం మాత్రం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. దాంతో మేం మా ఇంట్లో అందరికీ ఓ సర్టిఫికేషన్ ప్రోగ్రాం చేస్తున్నామని చెప్పి.. దాని కోసం రోజూ చదువుకోవాలని చెప్పాం. టీవీ శబ్దం వల్ల చదువుకోవడం ఇబ్బంది కాబట్టి.. తలుపు పెట్టుకున్నామని వారు భావించేవారు. మేం గదిలో ఏం చేస్తున్నామో వారికి తెలిసేది కాదు.
సరిగ్గా అప్పుడే మా అమ్మా,నాన్న వచ్చారు. మరి, తనేం చేశాడంటే..?
4. ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇద్దరూ కలిసి ఉండే సమయం చాలా తగ్గిపోతుంది. ఇద్దరూ కలిసి కేవలం బెడ్రూంలో ఉండాలి. కొత్తగా ప్రయత్నించే అవకాశం ఉండదు. పెద్దగా శబ్దం చేయడానికి కూడా కుదరదు. కొన్ని రోజులకు ఇది బోరింగ్‌గా అనిపిస్తుంది. మా విషయంలో అయితే.. మా గదిలో బాత్రూం కూడా లేకపోవడం వల్ల మరింత ఇబ్బంది ఎదురయ్యేది. మా బాత్రూంకి హాల్ నుంచే వెళ్లాలి. దీంతో ఇద్దరూ కలిసి స్నానాలు చేయడం, బాత్రూంలో సెక్స్ చేయడం వంటివి.. అసలు ఊహించుకోవడం కూడా కష్టంగా ఉండేది. దీంతో పాటు సెక్స్ తర్వాత శుభ్రం చేసుకోవడం, కండోమ్ పడేయడం వంటి చిన్న పనులు కూడా చాలా ఆలోచించి.. బయట ఎవరైనా ఉన్నారో లేదో చెక్ చేసి చేయాల్సి వచ్చేది.
5. మేమిద్దరం ఉమ్మడి కుటుంబంలో ఉన్నా.. సెక్స్ అద్భుతంగా సాగేందుకు అద్బుతమైన మార్గాన్ని ఎంచుకున్నాం. రోజూ చేసే సెక్స్‌కి భిన్నంగా ఎప్పుడైనా కొత్తగా, ప్రత్యేకంగా ప్రయత్నించాలనిపించినప్పుడు.. ఏదైనా ఆఫీస్ పార్టీ ఉందని లేక ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నారని చెప్పి వెళ్లేవాళ్లం. హోటల్లో గది బుక్ చేసుకొని ఆ రాత్రంతా ఆనందంగా గడిపి అర్థరాత్రి లేదా మరుసటి రోజు ఉదయాన్నే తిరిగి వచ్చేవాళ్లం. మా బంధాన్ని కొత్తగా, ప్రత్యేకంగా మార్చుకోవడానికి మాకు ఇదో అందమైన మార్గంగా కనిపించింది.
6. మా ఇంట్లో ఎప్పుడూ చాలామంది ఉండేవారు. దాంతో మా ఇద్దరికీ కొంత సమయం కేటాయించుకోవడం కష్టంగా ఉండేది. మా అత్తమామలు ఎప్పుడు బయటకు ట్రిప్స్‌కి వెళ్తారా? అని వేచి చూసేవాళ్లం. వాళ్లు వెళ్లిన తర్వాత కొత్త కొత్త ప్రయోగాలు చేసేవాళ్లం. మళ్లీ ఈ అవకాశం ఎప్పటికో గానీ దొరకదు అన్న ఫీలింగ్.. మేం చాలా ఎంజాయ్ చేసేలా చేసేది. చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించేది.
7. మా ఇంట్లో ఇది కామన్‌గా జరిగేది. వేరే అవకాశం ఏమీ ఉండదు. మేమంతా డిన్నర్ చేసిన తర్వాత.. అందరం కలిసి కూర్చొని టీవీ చూస్తుంటాం. అప్పుడు మాలో ఒకరు ఆవలిస్తూ బెడ్రూంలోకి వెళ్లిపోతారు. కాసేపట్లోనే మరొకరు కూడా నిద్ర వస్తోందంటూ వెళ్లిపోతాం. ప్రతి ఒక్కరికీ దీని గురించి తెలుసు. కానీ దాని గురించి ఏం మాట్లాడరు. అంతకంటే చేయగలిగింది ఇంకేం ఉంటుంది చెప్పండి?
ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు.. ప్రైవసీ అనేది పెద్ద సమస్య అనే చెప్పుకోవాలి. ఇలాంటి సమస్యలు మీరు ఏవైనా ఎదుర్కొన్నారా? అయితే మాతో పంచుకోండి.
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.