ADVERTISEMENT
home / ఫ్యాషన్
ఈ 7 రకాల ప్యాంటీలు అమ్మాయిల దగ్గర.. కచ్చితంగా ఉండాల్సిందే ..!

ఈ 7 రకాల ప్యాంటీలు అమ్మాయిల దగ్గర.. కచ్చితంగా ఉండాల్సిందే ..!

ప్యాంటీ(Panty), ఇన్నర్ వేర్, బికినీ(bikini), అండర్వేర్(underwear).. పేరేదైనా కానీయండి.. అమ్మాయిల వార్డ్రోబ్‌లో వీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఏ షాపింగ్ మాల్ వైపో వెళ్తున్నారనుకోండి.. అక్కడ అందమైన లేస్ ప్యాంటీ కనబడితే కొనాలనిపిస్తుంది. ఇంకో చోట స్ట్రింగ్ ప్యాంటీ బాగా నచ్చుతుంది. అయితే వాటిని కొనుగోలు చేసే విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడిపోతుంటాం. మనం దుస్తులు కొనేటప్పుడు.. మనకు నప్పుతుందా లేదా అని ఎంతో ఆలోచిస్తాం.

లోదుస్తులుగా ధరించే బ్రా విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ప్యాంటీ విషయంలో మాత్రం ఏదో ఒకటిలే అన్నట్టుగా వ్యవహరిస్తాం. మీకో విషయం తెలుసా? మహిళల అవసరాలకు తగినట్టుగా.. ఎన్నో రకాల మోడల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. మరి వాటిలో మీకు నప్పే ప్యాంటీని ఎలా ఎంచుకోవడం? ప్యాంటీల్లో చాలా రకాలుంటాయి. మనకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు.. ఏ రకమైన దుస్తులు ధరించినప్పుడు ఎలాంటి పాంటీ ఎంపిక చేసుకోవాలో చెప్పే చిట్కాలు అందిస్తున్నాం. ఈ స్టైల్ గైడ్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

1 బ్రీఫ్స్

Shutterstock

ADVERTISEMENT

ఇది చాలా క్లాసిక్ మోడల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగించేవి వీటినే. మూడు లేదా ఐదు ఇన్నర్స్ కలిగిన బాక్స్ మనం కొనుగోలు చేస్తాం కదా. వాటిలో ఉండేవి బ్రీఫ్సే. ఇది పిరుదుల భాగాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. బ్రీఫ్స్ అంత స్టైలిష్‌గా ఉండవు. కానీ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే వాటిని ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు.

హై వెయిస్ట్ జీన్స్, ట్రౌజర్స్, ఇండియన్ వేర్, డ్రెస్సెస్, మెన్స్ట్రువల్ ప్యాంట్స్ పై వీటిని ధరించవచ్చు.

బాగా బిగుతుగా ఉన్న దుస్తుల లోపల బ్రీఫ్స్ వేసుకుంటే.. ప్యాంటీలైన్స్ స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి బాడీ ఫిట్స్ కు ఈ ప్యాంటీ నప్పదు. అలాగే లో వెయిస్ట్ ప్యాంట్స్ వేసుకున్నా.. బ్రీఫ్స్ ధరించకపోవడమే మంచిది.

2. హిప్స్టర్

బ్రీఫ్స్‌కు కాస్త ఆధునికతను జోడిస్తే.. అది హిప్స్టర్ అవుతుంది. ఇవి కూడా బ్రీఫ్స్ మాదిరిగానే పిరుదులను పూర్తిగా కవర్ చేస్తాయి. సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ వాటితో పోలిస్తే.. వీటి వెయిస్ట్ బ్యాండ్ వెడల్పు తక్కువగా ఉంటుంది.

ADVERTISEMENT

ఈ తరహా ప్యాంటీలు ఏ దుస్తులకైనా నప్పుతాయి. వెడల్పు తక్కువగా ఉంటాయి కాబట్టి.. లోవెయిస్ట్ ప్యాంట్స్, జీన్స్, షార్ట్స్ పై ధరించవచ్చు.

3. థాంగ్స్

థాంగ్స్ తరహా ప్యాంటీలు మీకు కాస్త సెక్సీ లుక్ ఇస్తాయి. ఇవి పిరుదులను మధ్యమ స్థాయిలో కవర్ చేస్తాయి. వెయిస్ట్ బ్యాండ్ వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. కానీ సౌకర్యవంతంగా ఉంటుంది.

వీటిని పెన్సిల్ స్కర్ట్స్, బాడీ కాన్ డ్రస్సులు, లోరైజ్ జీన్స్, లోరైజ్ ప్యాంట్స్ పై ధరించవచ్చు.

4. జీ స్ట్రింగ్స్

ADVERTISEMENT

Shutterstock

ఇవి థాంగ్స్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి చాలా సెక్సీగా కనిపిస్తాయి. పిరుదుల భాగాన్ని పెద్దగా కవర్ చేయవు. ముందు భాగంలో కూడా.. చాలా తక్కువ భాగాన్ని మాత్రమే కప్పి ఉంచుతాయి. అంటే త్రికోణ రీతిలో ఉన్న లేస్ తరహా వస్త్రానికి సన్నని తాడులాంటిది అటాచ్ చేసి ఉంటుంది.

వీటిని రెగ్యులర్‌గా ధరించడం కంటే.. హనీమూన్‌కి వెళ్లినప్పుడు లేదా మీ భాగస్వామితో హాట్ హాట్‌గా గడిపే సమయంలో ధరించడానికి బాగుంటాయి. అయితే ఈ ప్యాంటీ మీకు సరిగ్గా సరిపోయినప్పుడే.. మీకు సెక్సీ లుక్ ఇస్తుంది.

5. బాయ్ షార్ట్స్

ఈ ప్యాంటీలు చాలా క్యూట్‌గా ఉంటాయి. నిజానికి వీటిని అబ్బాయిలు ధరించే బాక్సర్ షార్ట్స్ చూసి డిజైన్ చేశారు. వీటిని ఏ తరహా దుస్తుల కిందైనా ధరించవచ్చు. ముఖ్యంగా షార్ట్ స్కర్ట్స్, షార్ట్ డ్రసెస్, షార్ట్ గౌన్స్ పై వీటిని ధరిస్తే మీ లుక్ చాలా నీట్‌గా, ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంది.

ADVERTISEMENT

6. కంట్రోల్ బ్రీఫ్స్

ఇవి కూడా బాయ్ షార్ట్స్ మాదిరిగానే ఉంటాయి. కానీ షేప్ వేర్ మాదిరిగా పనిచేస్తాయి. అంటే మనల్ని కాస్త స్లిమ్‌గా   కనిపించేలా చేస్తాయి. వీటిని హై వెయిస్ట్ ఉన్న ఏ దుస్తుల కిందైనా  ధరించవచ్చు.

7. సీమ్లెస్

మిగిలిన ప్యాంటీల మాదిరిగా.. ఈ తరహా వాటిపై ఎక్కడా కుట్లు ఉండవు. కాబట్టి ఎలాంటి దుస్తులు కింద వేసుకున్నా.. పైకి కనిపించకుండా ఉంటాయి. పైగా వీటి వెయిస్ట్ బ్యాండ్ వెడల్పు సైతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ రకాలకు చెందిన వస్త్రాలకైనా నప్పుతాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

24 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT