ADVERTISEMENT
home / Celebrity Life
పెళ్లి పీటలెక్కనున్న యాక్టర్ నిఖిల్.. భీమవరం డాక్టర్‌తో పెళ్లి ఫిక్స్

పెళ్లి పీటలెక్కనున్న యాక్టర్ నిఖిల్.. భీమవరం డాక్టర్‌తో పెళ్లి ఫిక్స్

నిఖిల్ సిద్ధార్థ (nikhil siddartha) హ్యాపీ డేస్, స్వామి రారా, కార్తికేయ, అర్జున్ సురవరం వంటి సినిమాలతో ఆకట్టుకున్న నటుడు. ఈ అందాల హీరో ఇప్పుడు తన జీవితంలో మరో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నాడు. అది సినిమాలకు సంబంధించింది కాదు. నిఖిల్ వివాహానికి సంబంధించింది. ఈ హీరో త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. యాక్టర్ నిఖిల్ భీమవరంకి చందిన డాక్టర్ పల్లవి (pallavi) వర్మతో పెళ్లి పీటలెక్కనున్నాడు. గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెద్దల అనుమతితో తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను నిఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరితో పంచుకున్నాడు..

భీమవరంకి చెందిన పల్లవి వర్మ అనే డాక్టర్‌ని ప్రేమిస్తున్న నిఖిల్ గోవాలో చుట్టూ అందమైన ప్రకృతి మధ్య ఆమెను ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పడంతో పెద్దల అనుమతి కూడా.. తీసుకొని వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడం విశేషం. నిశ్చితార్థాన్ని కూడా తామిద్దరూ ప్రపోజ్ చేసిన గోవాలోనే జరుపుకోవడం విశేషం. మరో రెండు నెలల్లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారట. ఏప్రిల్ 16న వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో తమ ఎంగేజ్ మెంట్‌కి సంబంధించి రెండు ఫొటోలను తన అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. ఇందులో ఒక దానిలో పల్లవిని ప్రపోజ్ చేస్తూ.. ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా నిఖిల్ కనిపిస్తున్నాడు. మరో ఫొటోలో వీరిద్దరూ కలిసి వెనక్కి తిరిగి నిలబడి ఉండడం విశేషం. మూడో ఫొటోలో నిశ్చితార్థం చేసుకొని.. ఇద్దరూ చేతుల్లోని ఉంగరాలు కనిపించేలా ఫోజిచ్చారు. 

అందుకే తొందరగా పెళ్లి చేసుకున్నా: అనుష్క శర్మ

ADVERTISEMENT

గతంలో మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ఫీట్ అప్ విత్ స్టార్స్ షో’లో తాను ఓ డాక్టర్‌ని ప్రేమిస్తున్న విషయాన్ని పంచుకున్నాడు నిఖిల్. ఆ అమ్మాయి తనకు ఎంతో స్పెషల్ అని, తనను బాగా అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు. హీరోగా తనకు ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ తను బాగా అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు నిఖిల్. అయితే ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన వివరాలను మాత్రం నిఖిల్ బయటపెట్టలేదు. ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యాక ఫొటోలతో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఈ ఫొటోలను కూడా తనకు కాబోయే భార్య ముఖాన్ని కనిపించకుండా తీయడం విశేషం.

గతంలో కథానాయిక స్వాతి, నిఖిల్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను వీరిద్దరూ ఖండించడం విశేషం. తాము ప్రేమించుకోవట్లేదని.. వీరిద్దరూ ప్రకటించిన కొన్ని నెలలకే స్వాతి వివాహం జరిగింది.  నిఖిల్ కూడా హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో నిఖిల్ వివాహం జరుగుతుందని భావించారు. కానీ ఆ తర్వాత ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు.

ఇరు కుటుంబాల వారు ఒప్పుకొని.. వివాహాన్ని రద్దు చేయడంతో నిఖిల్ పెళ్లి గురించి అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి. ఇప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ‘తను యెస్ చెప్పింది. నా జీవితంలో మరో అడ్వెంచర్ ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ రాశాడు నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. పెళ్లితో ఒక్కటి కానున్న వీరిద్దరికీ మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.

ADVERTISEMENT

పెళ్లి చేసుకొని సర్ ప్రైజ్ చేసిన టీవీ నటి సమీర.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.                                                                                 

03 Feb 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT