ADVERTISEMENT
home / సౌందర్యం
కాజల్ లాంటి కళ్లు కావాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

కాజల్ లాంటి కళ్లు కావాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

మన కళ్లు (eyes) మన మనోఫలకానికి ప్రతిరూపాలు. మన మనసు ఎలా ఉంటుందో.. మన కళ్లు కూడా అలాగే ఉంటాయి. మనం సంతోషంగా ఉంటే అది కళ్లలో కనిపిస్తుంది. బాధగా ఉన్నా కళ్లలోనే కనిపిస్తుంది. అందుకే కళ్ల అందం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కళ్లు పొడిగా, నిర్జీవంగా,  నల్లటి వలయాలతో, వాచినట్టుగా కనిపిస్తే  ఏం బాగుంటుంది.

ఐ మేకప్‌తో ఎంత కవర్ చేసినప్పటికీ సహజమైన అందానికి ఏవీ సాటి రావు కదా. అందుకే సహజమైన పద్ధతిలో కళ్లను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. మీరెప్పుడైనా గమనించారా? సినిమా హీరోయిన్ల కళ్లు ఎప్పుడూ చాలా ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తాయి. మీక్కూడా మీ నయనాలు అంతే అందంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. దానికోసమే ఈ సహజసిద్ధ చిట్కాలు(natural tips).

రోజ్ వాటర్:

అలసిన కళ్లను మళ్లీ తాజాగా మార్చడానికి రోజ్ వాటర్‌తో పాటించే ఈ చిట్కా మంచి ఫలితాన్నిస్తుంది. అంతేకాదు.. డార్క్ సర్కిల్స్, ముడతలు కూడా తగ్గుముఖం పడతాయి. దీనికోసం దూదిని రోజ్ వాటర్లో ముంచి కళ్లపై పది నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. కళ్లు ఫ్రెష్‌గా కనిపిస్తాయి.

బంగాళాదుంప:

ఉబ్బినట్టుగా ఉన్న కళ్లపై బంగాళాదుంప పెట్టుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనిలో ఉన్న పొటాషియం డీహైడ్రేట్ అయిన కళ్లను ఫ్రెష్‌గా మార్చేస్తుంది. విటమిన్ సి కళ్ల చుట్టూ ఏర్పడిన డార్క్ సర్కిల్స్‌ను తొలగిస్తుంది. దీనికోసం బంగాళాదుంప స్లైసులను మూసిన కళ్లపై ఓ పదినిమిషాల పాటు ఉంచుకొంటే సరిపోతుంది.

ADVERTISEMENT

కీరదోస

Shutterstock

కళ్లు ఎప్పుడైనా అలసినట్టుగా తయారైతే.. మనం చేసే మొదటి పని రెండు కీర దోస ముక్కల్ని తీసి కళ్ల మీద పెట్టుకోవడం. అయితే ఈ సారి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచిన కీర దోస ముక్కల్ని తీసి కళ్ల మీద పెట్టుకోండి. పది నిమిషాల పాటు లేదా కీరదోస ముక్కలు కాస్త వెచ్చదనాన్ని కలిగించేంత వరకూ కళ్లపైనే ఉంచుకోవాలి. దీనివల్ల కళ్లు తిరిగి హైడ్రేట్ అవుతాయి.

స్ట్రాబెర్రీ

కొన్నిసార్లు కళ్లు ఉబ్బినట్టుగా ఉండటంతో పాటు.. కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. స్ట్రాబెర్రీతో పాటించే ఈ చిట్కా కళ్లను అందంగా మార్చేస్తుంది. దీనికోసం స్ట్రాబెర్రీలను ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత వాటి తొడిమలు తొలగించాలి. ఆ తర్వాత వాటిని గుండ్రటి ముక్కలుగా కోసి కళ్లపై ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది.

ADVERTISEMENT

టీ బ్యాగులు

Shutterstock

నిద్ర సరిగ్గా లేనప్పుడు మరుసటి రోజు.. కళ్లు మంటలు పెడుతుంటాయి. ఎర్రగా మారిపోతాయి. ఇలాంటప్పుడు టీ బ్యాగులు ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికోసం వాడేసిన టీ బ్యాగులను ఫ్రిజ్‌లో కాసేపు ఉంచాలి. ముందుగా కను రెప్పలపై  కొన్ని చుక్కల ఆలివ్ నూనెతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగులను కనురెప్పలపై ఉంచుకోవాలి. కాసేపటి తర్వాత కళ్లు మంటలు తగ్గి ఫ్రెష్‌గా కనిపిస్తాయి.

మజ్జిగ

ఎప్పుడైనా కాస్త వేడి చేసిందంటే చాలు. మజ్జిగ తాగుతాం. కళ్లు మంట పెట్టినప్పుడు కూడా మజ్జిగను ఉపయోగిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మజ్జిగ కళ్లను ఫ్రెష్‌గా కనిపించేలా చేస్తుంది. దీనికోసం రెండు కాటన్ ఉండలను మజ్జిగలో ముంచి.. వాటిని అలసిన కళ్లపై ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత వాటిని తొలిగించాలి. ఈ చిట్కా అలసిన కళ్లకు మాత్రమే కాదు.. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించుకోవడానికి సైతం పనిచేస్తుంది.

ADVERTISEMENT

పుదీనా

Shutterstock

కళ్లకు సంబంధించిన సమస్యలకు చికిత్స అందించే విషయంలో.. పుదీనాకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కాబట్టి కళ్లు ఫ్రెష్‌గా కనిపించాలన్నా పుదీనాను ఉపయోగించవచ్చు. కొన్ని పుదీనా ఆకులను మెత్తగా చేసి.. ఆ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేసుకోవాలి. ఈ చిట్కా కళ్లను చల్లబరచడం మాత్రేమ కాకుండా నల్లటి వలయాలను సైతం తగ్గిస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

17 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT