మేకప్ (Makeup).. ఇప్పుడు చాలామంది జీవితంలో భాగమైపోయింది. కొందరు దీన్ని రోజూ ఉపయోగిస్తే మరికొందరు మాత్రం అప్పుడప్పుడూ పార్టీలకు మాత్రమే వాడుతుంటారు. కానీ ఎప్పుడైనా మీరు మేకప్ కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ అని మీకు అనిపించిందా? అవును.. ఒక్కో లిప్ స్టిక్ ఖరీదు రెండు వేలు కూడా ఉంది. అంత ఖరీదు పెట్టి కొనే లిప్ స్టిక్ కొంటే అది ఎన్నో రోజులు రాదు కూడా. కానీ ఒక్క లిప్ స్టిక్ కొనే ఖర్చుతోనే మీ మేకప్ కిట్ కి అవసరమైన ఉత్పత్తులన్నీ (Makeup products) కొనొచ్చని మీకు తెలుసా? అవును. ఇందులో ఏ వస్తువూ రూ.100 కంటే ఎక్కువ కాదు. ఈ మేకప్ ఉత్పత్తులు తక్కువ ధరలో (affordable) కాలేజీ అమ్మాయిల నుంచి బ్యూటీ బడ్జెట్ కోసం ఎక్కు మొత్తం కేటాయించలేని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది.
1. ఐబ్రో పెన్సిల్
తక్కువ ఖర్చులో అందమైన ఐబ్రోస్ కావాలంటే ఐబ్రో పెన్సిల్ తోనే సాధ్యం. అందమైన వంపు తిరిగిన కనుబొమ్మల కోసం లాక్మే ఐబ్రో పెన్సిల్ ని ఉపయోగించవచ్చు. కాస్త గడ్డలుగా అనిపిస్తే మాత్రం బ్రష్ తో తిరిగి ఓసారి మీ కనుబొమ్మలను దువ్వుకోవాలి. దీని ధర రూ. 65
2. కాజల్
అందమైన నల్లని కళ్లు కావాలంటే అది కాజల్ తోనే సాధ్యం. దానికి అందమైన మెరుపు కోసం వీఎల్ సీసీ టైనీ ట్రావెల్ ఫ్రెండ్లీ పెన్సిల్ ఉపయోగించవచ్చు. దీన్ని మీ కళ్లకు అప్లై చేసి స్మడ్జర్ బ్రష్ సాయంతో తుడిచేస్తే సరి. ధర : రూ.39.
3. ఐలైనర్
కళ్లకు అందాన్ని తీసుకురావడానికి ఐ లైనర్ ఎంతో ప్రధానం. లాక్మే ఇన్ స్టా లైనర్ ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందమైన నల్లని రంగు మీ కళ్లకు పెట్టుకోవచ్చు. ఇది ఎంతసేపు పెట్టుకున్నా కళ్లకు ఏమాత్రం నొప్పి కలిగించదు. ధర : రూ.100
4. మస్కారా
పొడవైన అందమైన కనురెప్పలు చూస్తుంటే ఎంతో అందంగా అనిపిస్తుంది. కానీ అందరి కనురెప్పల వెంట్రుకలు పొడవుగా ఉండాలని రూలేం లేదు కదా.. మీ కనురెప్పల అందాన్ని పెంచేందుకు ఉపయోగపడే వాటర్ ప్రూఫ్ మస్కారా ఇది. సాధారణంగా మస్కారాను ప్రతి మూడు నెలలకోసారి మార్చాలని నిపుణులు చెబుతుంటారు కాబట్టి ఇది చక్కటి ఎంపిక. ధర : రూ. 99.
5. ఐ షాడో
వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో సింగిల్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మేకప్ ఉత్పత్తి. సాధారణంగా అవి లభించే ధర రూ.135 కానీ మీరు సేల్ ఉన్నప్పుడు కొని పెట్టుకోవడం వల్ల అవి వంద లోపు ధరకే లభిస్తాయి. ఇవి ఎంతో సాఫ్ట్ గా ఉండి ఇట్టే బ్లెండ్ అవుతాయి.
6. బీబీ క్రీమ్
మాయిశ్చరైజర్, ఫౌండేషన్, సన్ స్క్రీన్ అన్నీ కలగలిపి ఉండే ఈ బీబీ క్రీమ్ ఒకటే ప్యాక్ లో మూడు ప్రయోజనాలు అందిస్తాయి. తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండే లాక్మే 9 టు 5 కాంప్లెక్షన్ కేర్ క్రీం మీ చర్మపు రంగును కాపాడుతూ ఎండలో సన్ స్క్రీన్ గా కూడా పనిచేస్తుంది. ధర. రూ. 99
7. ఫౌండేషన్
బీబీ క్రీం మీకు సరిపోదు అనుకుంటే బ్లూ హెవెన్ ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. వాటర్ ప్రూఫ్, ఆయిల్ ఫ్రీ అయిన ఈ ఫౌండేషన్ ఎస్ పీ ఎఫ్ ప్రొటెక్షన్ తో లభిస్తుంది. ఇది మీ చర్మపు రంగును ఒకేలా మారుస్తుంది. మచ్చలు, డార్క్ సర్కిల్స్ ఇంకా వేరే సమస్యలుంటే వాటిని కూడా కవర్ చేస్తుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్ కూడా అందిస్తుంది. ధర : 75
8. కాంపాక్ట్ పౌడర్
మంచి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తూ చర్మానికి మెరుపు ను కూడా అందించే పౌడర్ ఉంటే బాగుంటుంది కదా.. అయితే ఎల్ 18 వారి గ్లో కాంపాక్ట్ మీకు చక్కటి ఎంపిక. దీన్ని ఎక్కడికైనా ఇట్టే తీసుకెళ్లవచ్చు. బీబీ క్రీం లేదా ఫౌండేషన్ ఉపయోగించి దానిపైన దీన్ని పౌడర్ బ్రష్ సాయంతో వేసుకుంటే బాగుంటుంది. చక్కటి ఈవెన్ టోన్ ని కొన్ని సెకన్లలో అందుకోవచ్చు. ధర : రూ. 60
9. హైలైటింగ్ పౌడర్
ద బ్లూ హెవెన్ షిమ్మర్ డస్ట్ పౌడర్ అనేది ఓ మల్టీ పర్పస్ ఉత్పత్తి. దీన్ని హైలైటర్, ఐషాడో, బ్లష్ టాపర్.. ఇలా ఏ రకంగా అయినా ఉపయోగించవచ్చు. కావాలంటే మంచి మెరుపు కోసం ఫౌండేషన్ లో మిక్స్ చేసి కూడా వాడొచ్చు. ధర : రూ.95
10. మేకప్ క్లెన్సింగ్ వైప్స్
ఐలైనర్, ఐ షాడో వంటివి అప్లై చేసినప్పుడు తప్పు జరిగితే దాన్ని సులువుగా చెరిపేసేందుకు క్లెన్సింగ్ వైప్స్ బాగా ఉపయోగపడతాయి. గిన్నీ క్లియా క్లెన్సింగ్, మేకప్ రిమూవర్ వెట్ వైప్స్ మేకప్ ని తొలగించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో సులువుగా శుభ్రం చేసి ఆపై ముఖం కడుక్కుంటే సరిపోతుంది. ధర : రూ.30
11. లిప్ లైనర్
అందమైన పెదాలను ఇంకా అందంగా కనిపించేలా చేసేందుకు లిప్ లైనర్ పనిచేస్తుంది. ఇది మీ లిప్ స్టిక్ పవర్ ని మరింత పెంచుతుంది. .మిస్ క్లెయిర్ గ్లిమ్మర్ స్టిక్స్ 58 షేడ్స్ లో లభిస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్, సులువుగా బ్లెండ్ అవుతుంది. కాబట్టి దీన్ని లిప్ స్టిక్ గా కూడా ఉపయోగించవచ్చు. ధర : 65
12. లిప్ స్టిక్
అందమైన పెదాలను ఇంకా అందంగా మార్చేందుకు లిప్ స్టిక్ ఉపయోగపడుతుంది. ఎల్ 18 బరస్ట్ లిప్ స్టిక్ కొకొవా బటర్, జొజొబా ఆయిల్ తో తయారవుతుంది. ఇది మీ పెదాలను మ్రదువుగా మారుస్తుంది. దీని రంగు చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. దీన్ని పెదాలకు అప్లై చేసి దానిపై టిష్యూ ఉంచి మరోసారి రీ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల లిప్ స్టిక్ రోజంతా అలాగే ఉంటుంది. బోల్డ్ రెడ్ లిప్ స్టిక్ మీ అందాన్ని ఎంత పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధర : రూ. 100
13. లిప్ బామ్
మీ పెదాలను మ్రదువుగా మార్చేందుకు చక్కటి మార్గం. నివియా ఫ్రూటీ లిప్ బామ్ మీ పెదాలకు చాలా మంచి పోషణను అందిస్తుంది. అందమైన రంగుతో పాటు మెరుపును కూడా అందించేందుకు ఈ లిప్ బామ్ ఉపయోగపడుతుంది. ధర : రూ. 45
14. నెయిల్ పాలిష్
మీ కాళ్లు, చేతులకు అందమైన రంగులద్దేందుకు మేబల్లీన్ న్యూయార్క్ కలర్ షో నెయిల్ పాలిష్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నెన్నో అందమైన, మెరిసే రంగులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెయిల్ పెయింట్ ఒక్క కోట్ వేస్తే చాలు.. చాలాకాలం పాటు నిలిచి ఉంటుంది. ధర రూ. 100
15. నెయిల్ పాలిష్ రిమూవర్
మీకు నెయిల్ పాలిష్ రంగును తరచూ మార్చడం అలవాటైతే కారా నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ ఉపయోగించడం మంచిది. ఈ వైప్స్ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాక్ లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని పర్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి మీ గోళ్లలో ఉన్న తేమను తొలగించకుండా నెయిల్ పాలిష్ ని తొలగిస్తాయి. ఎసిటోన్ లా గోళ్లకు హాని కూడా కలిగించవు. ధర : రూ.100
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.