ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
‘దిశ’ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. సర్వత్రా హర్షాతిరేకాలు..!

‘దిశ’ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. సర్వత్రా హర్షాతిరేకాలు..!

సరిగ్గా తొమ్మిది రోజుల క్రితం.. నవంబర్ 27 తేదిన అర్థరాత్రి ఓ వెటర్నరీ డాక్టర్‌ పై నలుగురు దారుణంగా అత్యాచారం చేసి, బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. #JusticeForDisha అంటూ యావత్ భారతదేశం ఆ బాధితురాలికి న్యాయం జరగాలని ఆశించింది. పార్లమెంట్‌లోనూ దీనికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని రిమాండ్ పంపారు. నిన్న కోర్టు ఈ నలుగురు నిందితులను.. సాక్ష్యాధారాల సేకరణ నిమిత్తం పోలీసులకు అప్పగించింది.

అలా కోర్టు నిందితులను తిరిగి అప్పగించిన మర్నాడే వారు ఎన్‌కౌంటర్‌కి గురవ్వడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై చాలామంది తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ వేగంగా నిర్ణయం తీసుకోలేకపోయినా.. వారికి భగవంతుడే శిక్ష విధించాడని చెబుతూ తెలంగాణ పోలీసులకు సలాం చేస్తున్నారు.

గతంలో వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో యాసిడ్ దాడి నిందితులను ఎన్ కౌంటర్ (encounter) చేసిన సజ్జనార్.. ఇప్పుడు ఈ ఘటనలోనూ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో ఆయనపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘దిశ’ కేసులో నిందితులను పోలీసులకు అప్పగించిన తర్వాత.. వారిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం షాద్ నగర్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరికి తీసుకొచ్చారు. అదే బ్రిడ్జి కింద ‘దిశ’ను వారు సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. అయితే అలా బయటకు తీసుకొచ్చిన తర్వాత.. నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు నలుగురూ పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారట. వారు పోలీసులను గాయపరిచి.. ఆయుధాలను కూడా లాక్కునే ప్రయత్నం చేయగా.. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.

ADVERTISEMENT

దీంతో నలుగురు నిందితులు అక్కడికక్కడే మరణించారు. ఘటన జరిగిన తర్వాత సీపీ సజ్జనార్.. ఆ ప్రదేశానికి వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన ప్రదేశానికి.. పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని ‘తెలంగాణ పోలీస్’ జిందాబాద్, సాహో సజ్జనార్ అంటూ నినాదాలు చేస్తూ బ్రిడ్జి కింద ఉన్న పోలీసులపై పూలవర్షం కురిపించారు. 100 కి డయల్ చేసి కూడా ..చాలా మంది అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలేవీ ఇప్పటికి తెలియకపోయినా.. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే యావత్ భారతదేశం ఈ వార్త విని సంతోషాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. అక్కడక్కడా కొందరు మానవహక్కుల గురించి మాట్లాడుతున్నా.. ఎక్కువ శాతం మంది హైదరాబాద్ పోలీసులను ప్రశంసిస్తూ ట్వీట్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ ఘటన ఎంత పాపులర్‌గా మారిందంటే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో టాప్ 10 ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌లన్నీ.. దిశ కేసు గురించినవే కావడం విశేషం. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దీనిపై ట్వీట్లు చేస్తూ పోలీసులను ప్రశంసిస్తున్నారు.

సినీ ప్రముఖల ఆనందం..

* ‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయ్యుండాలి.. ‘అంటూ నాని పోలీసులను పొగుడుతూ.. రవితేజ విక్రమ్ రాథోడ్ డైలాగ్‌ని పోస్ట్ చేసి పోలీసులను ప్రశంసించారు.

ADVERTISEMENT

* ‘దిశకి న్యాయం చేయడం ఇక్కడితో ఆగిపోదు. కానీ ఇప్పుడే మొదలవుతుంది. ఇకపై ఇలాంటి ఘోరాలను ఆపేందుకు చిన్నతనం నుంచే విద్య, వికాసం అందించాలి. రెస్ట్ ఇన్ పీస్ దిశ’ అంటూ పోస్ట్ చేశారు రవి తేజ.

* ‘మానవ హక్కులు కేవలం మానవుల కోసమే ఉంటాయి. ఇలాంటి క్రూరమైన జంతువుల కోసం కాదు. చట్టాలు ప్రజలతో చేయబడ్డాయి. పోలీసులు వాటిని అమలు పర్చారు. ఇది మరికొందరు అమాయకులైన అమ్మాయిలు వారి ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుతుందని నేను భావిస్తున్నా’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు.

* అల్లు అర్జున్ ‘జస్టిస్ సర్వ్ డ్ (న్యాయం జరిగింది)’ అని పోస్ట్ చేయగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా’ జస్టిస్ సర్వ్ డ్ (న్యాయం జరిగింది), ఇప్పుడు దిశ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ పోస్ట్ చేశారు.

* ‘అది. మీరు బ్యాడ్ అయితే నేను మీ డాడ్‌ని. రియల్ లైఫ్ హీరో తెలంగాణ డీజీపీ. ఇండియా మొత్తం వినపడాలి’ అంటూ నటుడు రామ్ పోతినేని ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

* నటి పూజా హెగ్డే ట్వీట్ చేస్తూ ‘రెస్ట్ ఇన్ పీస్ ప్రియాంకా రెడ్డి. ఓ మహిళను రేప్ చేయాలన్న ఆలోచన మనసులో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇది ఓ గట్టి మెసేజ్ అందిస్తుందని నేను భావిస్తున్నా’ అంటూ పోస్ట్ చేశారు.

* ‘నువ్వు ఈ ప్రపంచానికి చేసిన మేలుకు న్యాయం జరిగింది. దేవుడు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు నీ ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నా’ అంటూ రష్మిక పోస్ట్ చేసింది.

* మరో హీరో మంచు విష్ణు ‘ఉదయం లేవగానే చాలా మంది వార్త విన్నాను. మనం భద్రత గురించి పునరాలోచించుకుంటున్న ఈ సమయంలో మన పోలీసులు మనకు అండగా నిలిచారు. పోలీసులకు, సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మీరు మా అందరిలో భద్రతా భావాన్ని నింపారు. జై హింద్’ అని పోస్ట్ చేశారు.

* ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది. నలుగురు చచ్చారు అన్న వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజునే నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా..’ అంటూ భావోద్వేగభరితంగా ట్వీట్ చేశాడు మంచు మనోజ్.

ADVERTISEMENT

* మంచు లక్ష్మి కూడా దీనిపై ట్వీట్ చేశారు. ‘నేను అస్సలు బాధపడట్లేదు. నేను ఉరి శిక్షకు వ్యతిరేకం. కానీ గత కొన్నేళ్లలో నా ఆలోచన మారింది. ఇలాంటి రేపిస్టులకు ఉరే సరైనది. దేశానికే ఆదర్శంగా నిలిచి,, మహిళల పట్ల మనకున్న గౌరవాన్ని చాటిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.

* నటి సమంత ట్వీట్ చేస్తూ ‘ఐ లవ్ తెలంగాణ. కొన్ని సార్లు భయమే గొప్ప నిర్ణయం. మిగిలిన ఏకైక నిర్ణయం’ అని చెప్పారు. గతంలో స్పందించకపోవడానికి కూడా కారణం వెల్లడించారు సమంత. ‘ఈ ఘటన జరిగిన తర్వాత నేను దాని గురించి స్పందించలేదు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత నేను ఆ బాధితురాలికి సానుభూతి ప్రకటిస్తూ పోస్ట్ పెట్టలేదని నాకు వచ్చిన ప్రతి మెసేజ్ నేను ఈ సమాజంలోని సాటి స్త్రీల కోసం ఏమీ చేయట్లేదు అని చాటిచెప్పింది. ఒక్క ట్వీట్ తో నేను దాన్ని తగ్గించుకోలేను. అందుకే ట్వీట్ చేయలేదు’ అని చెప్పుకొచ్చారు.

* ‘రేప్ లాంటి క్రూరమైన నేరాలు చేసి మీరు ఎంత దూరం తప్పించుకుపోగలరు? తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు’ అంటూ నటి రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేశారు.

* దర్శకుడు హరీష్ శంకర్ ‘మా ట్రైలర్లు టీజర్లకు లైకులు కొట్టకపోయినా ఫర్వాలేదు. ఈ వార్తను మాత్రం ట్రెండింగ్ చేయండి. ఇలా జరిగిందని చాటింపు వేయండి. సీపీ సజ్జనార్‌కి నమస్కారం. సాష్టాంగ నమస్కారానికి ఏదైనా ఎమోజీ ఉంటే చెప్పండి’ అంటూ ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

ప్రముఖుల మాటల్లో..

దిశ ఘటనపై కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాదు.. రాజకీయ ప్రముఖులు, మహిళా హక్కుల కార్యకర్తలు కూడా మాట్లాడారు.

* స్త్రీ హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ మాట్లాడుతూ ‘దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమాజానికి మంచి ఉదాహరణ. ఇక నుంచి రేపిస్టులు నేరం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోతామేమోనన్న భయం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

* ‘ఓ సాధారణ పౌరురాలిగా నాకు చాలా ఆనందంగా ఉంది. పోలీసులు ఏ పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ చేశారో తెలీదు. కానీ పోలీసే ఉత్తమ న్యాయమూర్తి. నిందితులకు ఉరి శిక్ష వేయాలని మేం ముందు నుంచే పోరాటం చేశాం. అది ఇలా జరిగింది’ అంటూ జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఆనందం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

* ‘దేశ వ్యాప్తంగా రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి నిందితులకు కఠిన చర్యలు సరైనవి. అన్ని రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి. నిర్భయకు కూడా త్వరలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు బీఎస్పీ అధినేత్రి మాయావతి.

* ‘ఇది ఈ ఏడాదిలో అతి పెద్ద సంఘటన. మహిళల భద్రతకు గ్యారెంటీ లాంటిది. ఆ తల్లిదండ్రుల బాధనైతే తీర్చలేం కానీ ఇప్పుడు వారికి మనశ్శాంతి, అమ్మాయికి ఆత్మ శాంతి చేకూరిందది. మహిళల్లో భయం కాస్త తగ్గింది. జై తెలంగాణ పోలీస్. క్రిమినల్స్‌కి ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ పోలీసులను చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు నేర్చుకుంటారని నమ్ముతున్నా’ అన్నారు బీజేపీ నాయకురాలు ఉమా భారతి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
06 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT