ADVERTISEMENT
home / ఫ్యాషన్
తెలుగు రాష్ట్రాలకు చెందిన.. ఈ అద్బుతమైన చేనేత చీరల గురించి మీకు తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు చెందిన.. ఈ అద్బుతమైన చేనేత చీరల గురించి మీకు తెలుసా?

చీరలు ( sarees).. అంటే ఇష్టం లేని ఆడవాళ్లు ఎవరూ ఉండరేమో.. అందులోనూ పెళ్లిళ్లు, ఫంక్షన్లు.. ఇతర వేడుకల్లో చీరలు కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు కూడా. అసలే శ్రావణ మాసం.. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో పాటు పూజలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో చీర కట్టుకోవడానికి ఏదైతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ  చేనేత (hand loom) చీరలను ఓసారి చెక్ చేయండి. ఇందులో మీకు నచ్చిన చీరను ఎంచుకోండి.

1. ధర్మవరం చీర

అనంతపురం జిల్లాలో పట్టు చీరలకు ప్రసిద్ది చెందిన ఊరు ధర్మవరం. ఇక్కడ తయారుచేసే పెళ్లి పట్టు చీరలు చాలా హెవీగా ఉండడం వల్ల కంచి తర్వాత.. ఈ చేనేత చీరలకే ఎక్కువ క్రేజ్ వచ్చేసింది. బంగారు జరీతో పాటు చక్కటి క్వాలిటీ పట్టుతో.. అద్బుతమైన డిజైన్ల పల్లూతో తయారు చేసే చీరలు ఈ ప్రాంతం సొంతం. సాధారణంగా పల్లు, బోర్డర్‌లు చీరకు వ్యతిరేక రంగుల్లో ఉండడం వల్ల.. ఈ చీరలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడి చీరల్లో ముఖ్యంగా పసుపు, మెరూన్, పింక్, బ్లూ, గ్రీన్ వంటి రంగులు ఎక్కువగా కనిపిస్తాయి.

2. మంగళగిరి చీర

ADVERTISEMENT

గుంటూరు జిల్లాలో ఉన్న ఈ టౌన్ విజయవాడకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చేనేత మగ్గాలపై నేసిన చీరలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. కేవలం చేనేత కాటన్ చీరలు మాత్రమే కాదు.. జరీ చీరలకు కూడా ఈ టౌన్ చాలా ఫేమస్. మంగళగిరి కాటన్‌లో బంగారు రంగు బోర్డర్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ చీరల బోర్డర్ మాత్రమే కాదు.. బుటా వర్క్ కూడా బంగారు రంగులోనే ఉండడం వల్ల ఈ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

3. కలంకారీ చీర

కలంకారీ చీరలను దక్షిణాది రాష్ట్రాల్లో చాలా చోట్ల తయారుచేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తయారైన కలంకారీ చీరల ప్రత్యేకత వేరుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చేనేత చీరలు రెండు చోట్ల తయారవుతాయి. తయారైన ప్రదేశాన్ని బట్టి వీటి రంగులు, డిజైన్లు, నేతలోనూ తేడాలుంటాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి వద్ద, క్రిష్ణా జిల్లాలోని మచిలీపట్నం వద్ద ఈ చీరలను నేస్తుంటారు. అయితే ఈ రెండు చోట్ల స్టైల్స్ వేరుగా ఉండడం వల్ల .. తయారైన టౌన్ల పేరుతో శ్రీకాళహస్తి కలంకారీ స్టైల్, మచిలీపట్నం కలంకారీ స్టైల్ పేరుతో ఫేమస్ అయ్యాయి.

4. ఉప్పాడ చీర

ADVERTISEMENT

ఉప్పాడ అనేది తూర్పు గోదావరి జిల్లాలోని ఓ టౌన్. ఇక్కడ చేనేత మగ్గాలపై నేసే చీరలకు ఎంతో పేరుంది. విభిన్నమైన రంగులు, చక్కటి డిజైన్లతో పాటు.. అందమైన ప్యాటర్న్‌తో రూపొందించే ఈ చేనేత చీరలు ఎంతో ఫేమస్. కేవలం ఈ  ప్రాంతపు కాటన్ చీరలను మాత్రమే కాదు.. ఉప్పాడ పట్టు చీరలను కూడా చాలామంది ఇష్టపడతారు. బంగారం, వెండి జరీతో తయారు చేసే ఈ చీరలను నేత మగ్గాలపై ప్రత్యేకంగా జాందాని ప్రక్రియలో నేస్తారు. 

5. వెంకటగిరి చీర

Facebook

నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన పట్టుతో నేసే చీరలు ఈ వెంకటగిరి చీరలు. ఇక్కడ నేసే చీరల్లో కాటన్‌తో పాటు పట్టు చీరలు కూడా ఉండడం విశేషం. ఈ తరహా చేనేతను కూడా జాందానీ పద్ధతిలోనే నేస్తారు. ఈ చీరలు చాలా తక్కువ బరువు ఉంటాయి. కాబట్టి వీటిని ఏ కాలంలోనైనా సులువుగా ధరించే వీలుంటుంది. వెంకటగిరి చీరలు చక్కటి రంగుల్లో చుక్కలు, చిలుకలు, ఆకులు, పువ్వుల డిజైన్లలో ఉంటాయి. బంగారు రంగులో ఉండే ఈ మోటిఫ్స్ చీరకు మంచి లుక్ తెచ్చిపెడతాయి.

ADVERTISEMENT

6. పోచంపల్లి చీర

పోచంపల్లి నల్గొండ జిల్లాలో ఉన్న టౌన్. ఇది హైదరాబాద్‌కి చాలా దగ్గరగా ఉండడంతో.. ఈ చీరలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక్కత్‌గా పేర్కొనే ఈ చీరల్లో కాటన్‌తో పాటు పట్టు చీరలు కూడా లభిస్తాయి. ఈ డిజైన్ చాలా విభిన్నంగా ఉండడం విశేషం. ఇక్కత్ అంటే టై అండ్ డై  పద్ధతితో దారాలను తయారుచేసి వాటితో నేసే చీరలు. ఈ చీరలు సంప్రదాయబద్ధమైనవే కాదు.. జనరేషన్‌కి తగినట్లుగా మారుతూ అందరికీ నచ్చేలా మారుతున్నాయి కూడా. ఇందులోనే ఓ రకమైన తీలియా రుమాల్‌ని ప్రస్తుతం పెద్ద పెద్ద ఫ్యాషన్ షోలలో ఉపయోగిస్తున్నారు. దీన్ని డబుల్ ఇక్కత్ అని అంటారట.

7. నారాయణ్ పేట చీర

facebook

ADVERTISEMENT

నారాయణ్ పేట చీరలలోనూ పట్టు చీరలున్నా.. ఇందులో కాటన్ చీరలు చాలా ఫేమస్. మహబూబ్‌నగర్‌లోని ఓ టౌన్ నారాయణ పేట. ఇక్కడ ప్లెయిన్‌గా, చెక్స్‌తో ఉండేలా చీరలను నేస్తుంటారు. బోర్డర్, పల్లు ఒక రంగులో.. చీర దానికి వ్యతిరేక రంగులో ఉండేలా.. ఇక్కడి చీరలను నేయడం విశేషం. ఈ చీరల బోర్డర్‌లో కేవలం బంగారు రంగు జరీతో గీతలు మాత్రమే ఉండడం విశేషం. ఈ చీరలు చాలా తక్కువ బరువుతో ఉండి.. ఎవరికైనా ధరించేందుకు సులువుగా ఉండడం వీటి ప్రత్యేకత.

8. గద్వాల్ చీర

తెలంగాణలో ఫేమసైన చీరల్లో మొదట నిలిచేది గద్వాల్ చీరలే. మహబూబ్‌నగర్‌లోని గద్వాల్‌లో నేసే ఈ చీరలను జరీ బోర్డర్, జరీ పల్లూతో తయారుచేస్తారు. చీర మొత్తం కాటన్.. కేవలం బోర్డర్, పల్లూ మాత్రం జరీతో ఉండడం ఈ చీరల ప్రత్యేకత. ఈ జరీ, కాటన్ వస్త్రాలను వేర్వేరుగా నేసి ఆ తర్వాత కలుపుతారట. ఈ చీరల్లో అద్భుతమైన రంగులుండడం దీని ప్రత్యేకత. కుప్పడం, తిప్పడం వంటి రకాలు ఈ చీరల్లోనే కనిపిస్తాయి. ఈ సారి షాప్‌కి వెళ్లినప్పుడు “కుప్పడం చీరలని” షాపు వాడు చెబితే అవేంటి అనుకోకండి. అవీ గద్వాల్ పట్టు చీరల్లో ఒక రకం అని అర్థం చేసుకోండి.

9. పుట్టపాక చీర

ADVERTISEMENT

నల్గొండ జిల్లాలోనే తయారయ్యే మరో రకం చీరలు ఈ పుట్టపాక చీరలు. ఈ చీరలు ప్రత్యేకమైన పుట్టపాక టై అండ్ డై పద్ధతిలో తయారవుతాయి. ఇవి చాలా ఫేమస్ కూడా. చూసేందుకు సంబల్ పురీ కాటన్ చీరల్లా కనిపించే ఈ చీరలు మాత్రం చాలా తక్కువ బరువుతో.. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.

10. సిద్ధిపేట చీర

సిద్ధిపేట చీరలు కూడా తెలంగాణలో మంచి ప్రఖ్యాతి గాంచిన చీరలే. కాటన్ వస్త్రాలపై టై అండ్ డై వర్క్ చేసి తయారుచేసే ఈ చీరల్లో కేవలం సహజ రంగులను మాత్రమే ఉపయోగిస్తారట. అందుకే ఇవి కాస్త డల్‌గా కనిపించినా.. వీటిపై వర్క్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తాయి. సిద్ధిపేటకే ప్రత్యేకమైన గొల్లభామ వర్క్ ఈ చీరలపై కనిపిస్తుంది. ఇందులోని బుట్ట డిజైన్ ఒకప్పుడు చాలా పెద్ద ట్రెండ్. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మార్కెట్లో వీటికి పెద్దగా డిమాండ్ లేకపోవడం వల్ల.. ఇక్కడి చేనేత కార్మికులు కూడా కొత్త డిజైన్లు రూపొందించి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

06 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT