మన మధ్యలో సాధారణంగా రెండు రకాలకు చెందిన వ్యక్తులుంటారు. ఒకటి చలికాలం (Winter) రాగానే స్వెట్టర్లు, మఫ్లర్లు, దుప్పట్లతో కాలం గడిపేవారు. చలికాలంలో మరింత చల్లగా మంచు కురిసే ప్రదేశాలకు వెళ్లి ఆ చలిని, మంచును ఎంజాయ్ చేసేవారు రెండోరకం. మీరూ అలా చలికాలంలో ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారిలో ఒకరా? పగలు, రాత్రి ఆ చల్లని వాతావరణంలో ఆనందంగా గడపాలనుకుంటున్నారా? చలికాలం ఎప్పటికీ అయిపోకుండా అలాగే ఉండాలనుకుంటున్నారా? అయితే మరీ ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా చలికాలంలో ఈ ప్రదేశాలను సందర్శించండి. మన దేశంలోనే ఉన్న ఈ ఫ్రదేశాలు సందర్శించేందుకు పెద్దగా ఖర్చు అవ్వదు సరికదా చల్లని చలిలో ఆనందంగా గడపచ్చు.
1. ఆలి – ఉత్తరాఖండ్
సందర్శించాల్సిన ప్రదేశాలు – చూడచక్కటి పర్వత అందాలను చూడాలని మీరు భావిస్తే ఈ ప్రదేశానికి వెళ్లిపోవాల్సిందే.
మాన పర్వతాలు, మౌంట్ నందాదేవి, నార్ పర్వతం, దునాగురి, కమత్ వంటి ప్రదేశాలతో పాటు ఆలిలోని కృత్రిమ సరస్సును చూసి తీరాల్సిందే.. దీంతోపాటు ఆకుపచ్చని ,చెట్ల అందాలని చూసి తనివితీరాలంటే గోర్సోన్ బగ్యాల్ ప్రాంతాన్ని చూడాలి. ఇక కౌరీ పాస్ ట్రెక్ వద్ద ట్రెక్కింగ్ కోసం ఎంతోమంది విదేశాల నుంచి కూడా ఇక్కడికి తరలివస్తుంటారు.
2. తవాంగ్ – అరుణాచల్ ప్రదేశ్
సందర్శించాల్సిన ప్రదేశాలు – తవాంగ్ ఆశ్రమం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆశ్రమంగా పేరొందింది. సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఆశ్రమం నాలుగు వందల ఏళ్ల చరిత్రగలది. కేవలం ఇదే కాదు..దీని చుట్టూ ఉన్న సహజ ప్రకృతి అందాలన్నీ అందరినీ ఆకర్షిస్తాయి. ఇక్కడ నెలకొని ఉన్న మాధురీ సరస్సు పర్వతాల మధ్య అందంగా పారుతూ.. కళ్లుతిప్పుకోనివ్వకుండా చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోనే ఎత్తైన గొరిచెన్ పర్వతం కూడా ఇక్కడే నెలకొని ఉంది. సముద్రమట్టానికి 22,500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని చూసేందుకు ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు.
3. డల్హసీ – హిమాచల్ ప్రదేశ్
సందర్శించాల్సిన ప్రదేశాలు – భారతదేశంలో మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే ఖజ్జర్ అనే ప్రదేశం ఇక్కడే ఉంది. చుట్టూ పర్వతాలు, అందమైన లోయలు, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం.. ఇలా అక్కడి వాతావరణం అంతా ఆకట్టుకునేలా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. ఇక్కడ జోర్బింగ్, ట్రెక్కింగ్ వంటివి చేసే వీలు కూడా ఉంటుంది. సత్‌ధారా జలపాతం సముద్రమట్టానికి 2036 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జలపాతానికి దగ్గర్లో ఏడు నీటి ఊటలున్నాయి. వీటి నుంచి బయటకు వచ్చే నీరు వివిధ రకాల వ్యాధులను తగ్గిస్తుందని ప్రతీతి. కాలాటోప్ వన్యప్రాణి అభయారణ్యం వివిధ రకాల జంతువులకే కాదు.. అందమైన మొక్కలకు కూడా నెలవు. బార్కిన్ గోరల్, హిమాలయన్ మార్టన్ వంటి జంతువులు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి.
4. గురుడోంగ్మార్ – సిక్కిం
సందర్శించాల్సిన ప్రదేశాలు – గురుడోగ్మాంర్ సరస్సు మన దేశంలోనే రెండో అతిపెద్ద సరస్సు. సిక్కింలోని ఈశాన్య ప్రాంతంలోని ఈ సరస్సు అత్యంత తక్కువ ఉష్టోగ్రతలు కలిగిన సరస్సుల్లో ఒకటి. ఐస్‌ల్యాండ్‌లోని జోకుల్‌సర్లాన్ సరస్సు తర్వాత ఇదే సరస్సును తక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన సరస్సుగా చెప్పుకోవచ్చు. రావంగ్లా మేనమ్ ట్రెక్ – కేవలం ట్రెక్కింగ్‌కే కాదు.. అందమైన ప్రకృతి అందాలకు కూడా నెలవీ పర్వతం.
5. స్పితి – హిమాచల్ ప్రదేశ్
సందర్శించాల్సిన ప్రదేశాలు – లేహ్-మనాలీ హైవేలో మౌంటెయిన్ బైకింగ్ అనుభవం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కీ ఆశ్రమం – ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద ఆశ్రమాల్లో ఒకటి. పుస్తకాలు, శిల్పాలతో ఉన్న ఈ ఆశ్రమం చక్కటి ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటుంది. కుంజుం పాస్ – కులు, లాహౌల్ వ్యాలీకి మధ్యలో ఉండే ఈ పాస్ మూన్ లేక్‌ని కూడా కలుపుతుంది. చంద్రతాల్‌ని కూడా కలిపే ఈ పాస్‌లో అద్భుతమైన చంద్ర భాగా అందాలను చూసి తరించాల్సిందే..
ఇవే కాదు.. కాస్త ప్రయత్నించి వెతకాలే కానీ మన దేశంలో విదేశాలను తలదన్నే ఎన్నో లొకేషన్లు కనిపిస్తాయి. ఈ చలికాలం ట్రిప్స్ అక్కడికి వెళ్లి మన దేశం అందాన్ని ఆస్వాదించండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.