ADVERTISEMENT
home / ఫ్యాషన్
పట్టు చీరకు ఇలాంటి డిజైన్ బ్లౌ‌జ్‌తో.. కొత్త లుక్ తీసుకురండి

పట్టు చీరకు ఇలాంటి డిజైన్ బ్లౌ‌జ్‌తో.. కొత్త లుక్ తీసుకురండి

పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు, పట్టుచీరల అందాలు, పరికిణీల రెపరెపలు.. ఇవే కనిపిస్తున్నాయి. అయితే పట్టు చీర లేదా పట్టు పరికిణీ ఎంత అందంగా ఉన్నా సరే.. దాని అందాన్ని మరింత పెంచే బ్లౌజ్ (blouse)వేసుకోకపోతే ఏదో లోటు ఉన్నట్లే కనిపిస్తుంది. మరి, అందరిలోనూ అందంగా మెరిసిపోవాలంటే ఆకర్షణీయమైన పట్టు చీరకు అందమైన బ్లౌజ్ ని జోడిస్తే సరి.. మరి, మీ పట్టు చీరకు ఎలాంటి డిజైన్ (design)చేయించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.. ఈ పేజీని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. మీకు బ్లౌజ్ డిజైన్ కావాల్సినప్పుడల్లా.. ఇందులో ఏది సెట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుంటే చాలు.. అందమైన బ్లౌజ్ డిజైన్లతో అందరినీ ఆకర్షించేయవచ్చు.

పట్టు ఎందుకు అంత ప్రత్యేకం?

Instagram

ADVERTISEMENT

చేనేత వస్త్రాలన్నింటిలోనూ పట్టు ఎంతో ప్రత్యేకమైనది. పట్టు పురుగులకు మల్బరీ ఆకులు మేతగా వేసి వాటిని పెంచి అవి కకూన్స్ గా మారిన తర్వాత వాటి నుంచి పట్టు దారాలను తీసి వాటితో నేసిన దుస్తులు అవి.. ఈ పట్టు వస్త్రంతో పాటు బంగారు, వెండి జరీ దారాలు కలిపి నేసి అద్భుతమైన డిజైన్లలో నేస్తూ తయారుచేస్తారు. ఇందులో సాముద్రిక పట్టు, పరంపర పట్టు, వస్త్రకళా పట్టు, వసుంధర పట్టు, ఉప్పాడ పట్టు, ఇక్కత్ సిల్క్ వంటివి పాపులర్ పట్టు రకాలు.. వస్త్రాల్లోని, డిజైన్లలోని తేడాలను బట్టి ఈ చీరల్లో తేడాలుంటాయి.

బ్లౌజ్ డిజైన్లు

మీకు తెలుసా? బ్లౌజ్ కి ఉన్న చేతులు, బ్యాక్ డిజైన్ల వల్ల బ్లౌజ్ లుక్ ని ప్రత్యేకంగా మార్చేయొచ్చు. తద్వారా మీ చీర లుక్ ని కూడా అద్భుతంగా చేయవచ్చు. ఈ తరహా బ్లౌజ్ డిజైన్లు మామూలు చీరలకు మాత్రమే కాదు.. పట్లు చీరలకు కూడా చాలా అందంగా ఉంటాయి. మరి, మీ పట్టు చీరలకు ప్రత్యేకమైన స్టేట్ మెంట్  అందించడం కోసం ఎలాంటి బ్లౌజ్ డిజైన్లు ఎంచుకోవచ్చంటే..

1. స్ట్రాపీ బ్లౌజ్

ADVERTISEMENT

Instagram

మీ బ్లౌజ్ సింపుల్ గా, బోరింగ్ గా ఉండకూడదు.. కానీ మరీ హెవీగా కూడా అనిపించకూడదు అనుకుంటే వెనుక కేవలం స్ట్రాప్స్ తో బ్లౌజ్ ని ఎంచుకోవచ్చు. అ బ్లౌజ్ డిజైన్ మీకు బోల్డ్ స్టేట్ మెంట్ లుక్ ని అందిస్తుంది. ఎంగేజ్ మెంట్, రిసెప్షన్ వంటి ఫంక్షన్లకు ఈ తరహా బ్లౌజ్ డిజైన్ కొత్తగా అద్భుతంగా ఉంటుంది.

2. మట్కా బ్లౌజ్ విత్ డోరీ

Instagram

ADVERTISEMENT

బ్లౌజ్ వెనుక వివిధ రకాల డిజైన్ల నెక్ లు పెట్టించడం ఇఫ్పుడు కామన్ గా మారింది. ఇందులో ఎక్కువగా మట్కా డిజైన్ పాపులర్. కింద వెడల్పుగా పైకి వచ్చేసరికి కుండ పైభాగంలా దగ్గరికి రావడం ఈ స్టైల్. ఇలా ఉన్న డిజైన్ కి పైన డోరీ కూడా పెట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీంతో పాటు ట్రైయాంగులర్ బ్లౌజ్ నెక్ కూడా పెట్టించుకోవచ్చు.

3. ఆఫ్ షోల్డర్ బ్లౌజ్

Instagram

మీ కాలర్ బోన్ అద్భుతంగా ఉంటుందా? అయితే మీరు చక్కటి ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మీ నెక్ లైన్ అద్భుతంగా కనిపించడంతో పాటు మీ చేతులు కూడా అందంగా కనిపిస్తాయి. ఒకవేళ మీకు స్లీవ్స్ ఉండాలని అనిపిస్తే భుజాల నుంచి పక్కకు వేలాడేలా కుట్టించుకోవచ్చు.

ADVERTISEMENT

4. షీర్ విత్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్

Instagram

బ్లౌజ్ నిండుగా ఉండాలి.. కానీ కొత్త లుక్ సొంతం కావాలి.. ఇలా మీరూ కోరుకుంటున్నారా? అయితే పట్టుతో పాటు షీర్ క్లాత్ ని కూడా బ్లౌజ్ కుట్టడానికి ఉపయోగించండి. బ్లౌజ్ వెనుక భాగంలో షీర్ క్లాత్ పై ఎంబ్రాయిడరీ చేయించుకుంటే అటు చూసేందుకు అందంగా కనిపించడంతో పాటు ఎక్కువ చర్మం కనిపించకుండానే ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్ ని మీరు సొంతం చేసుకోవచ్చు.

5. పెప్లమ్ బ్లౌజ్

ADVERTISEMENT

Instagram

మామూలు బ్లౌజ్ లు కామన్ గా అనిపిస్తే పెప్లమ్ టైప్ బ్లౌజ్ లను వేసుకోవచ్చు. పెప్లమ్ లను జీన్స్ , పటియాలా లతో మాత్రమే కాదు.. చీరతోనూ మ్యాచ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సెంటర్ స్లిట్ పెప్లమ్ అయితే చీరలపై అద్భుతంగా మ్యాచ్ అవుతుంది.

6. స్లీవ్స్ విత్ డిఫరెంట్ హెమ్ లైన్

Instagram

ADVERTISEMENT

బ్లౌజ్ ని బోల్డ్ గా ధరించడం అందరి వల్లా కాదు. కానీ దానిలో అందాన్ని జోడించాలనుకుంటే డీటెయిల్స్ లోనే అందాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. దీనికోసం అందంగా ఎసిమెట్రికల్ స్టైల్ లో కుట్టిన స్లీవ్స్ బ్లౌజ్ కి కొత్త అందాన్ని తీసుకువస్తుంది.

7. ఎంబలిష్డ్ నెక్ లైన్

Instagram

బ్లౌజ్ నెక్ డిజైన్ అందంగా ఉండడంతో పాటు మెడ చుట్టూ అద్భుతమైన డిజైన్ ఉండి అసలు నగలు పెట్టుకోకపోయినా అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. ఇది మీ లుక్ ని చాలా సింపుల్ గా చూపిస్తూనే హెవీ లుక్ ని అందిస్తుంది.

ADVERTISEMENT

8. కేప్

instagram

మీ చీర ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే దానిపై మామూలు బ్లౌజ్ కాకుండా కేప్ బ్లౌజ్ ధరించండి. లేదంటే మీ మామూలు బ్లౌజ్ కే షీర్ క్లాత్ తో రూపొందించిన కేప్ ని జత చేసుకోండి. అయితే బ్యాక్ లెస్ డిజైన్ బ్లౌజ్ ఉండడం అవసరం.

9. రెండు డోరీ టాజిల్స్ తో..

ADVERTISEMENT

Instagram

బ్లౌజ్ బ్యాక్ కనిపించినా ఫర్వాలేదు అనుకుంటూ. బ్యాక్ లెస్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారికి ఇది చక్కగా నప్పుతుంది. ఇది చాలా క్లాసీగా అనిపిస్తుంది కూడా. దీనికోసం బ్లౌజ్ మొత్తం కుట్టి వెనుక కేవలం పైన, కింద రెండు డోరీలను మాత్రమే ఏర్పాటు చేయాలి. ముందు హుక్స్ లేకుండా కుట్టి కేవలం డోరీల సాయంతో బ్లౌజ్ వేసుకునేలా ఏర్పాటు చేస్తే ఆ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ డోరీలకు చక్కటి టాజిల్స్ ఉపయోగించడం మాత్రం మర్చిపోవద్దు.

10. క్రాప్ టాప్ బ్లౌజ్

instagram

ADVERTISEMENT

క్రాప్ టాప్ బ్లౌజ్ ఇప్పుడు కొత్త ఫ్యాషన్.. బ్లౌజ్ చూసేందుకు క్రాప్ టాప్ లా ఉంటూ ఇండో వెస్ట్రన్ లుక్ ని మీకు అందిస్తుంది. హై నెక్, లాంగ్ స్లీవ్స్ వంటివి ఉంటే కాస్త లావుగా ఉన్నవారు అద్భుతంగా కనిపిస్తారు. బ్లౌజ్ మొత్తం వర్క్ చేయించుకుంటే హెవీగా ఉంటుంది. సింపుల్ గా ఉండాలనుకుంటే కేవలం చేతులు లేదా నెక్ లైన్ ఎంబ్రాయిడరీ ఎంచుకోవచ్చు.

11. వి నెక్

instagram

ఒక వైపు క్లాత్ మరో వైపు ఓవర్ లాప్ అయ్యేలా ఉండే వి షేప్ బ్లౌజ్ ప్రతి షేప్ వారికి అద్భుతంగా ఉంటుంది.. చక్కగా ఫిట్ అవుతుంది కూడా.. ఈ తరహా బ్లౌజ్ ధరించిన తర్వాత ఓ మంచి నెక్లెస్ వేసుకుంటే చాలు.. అద్భుతంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

12. పాట్ నెక్ బ్లౌజ్

Instagram

పాట్ నెక్ బ్లౌజ్ ని చాలామంది ఇష్టపడతారు. కింద యు నెక్ లా ఉంటూ పైకి వచ్చేసరికి సన్నగా మారి తిరిగి మళ్లీ వెడల్పుగా మారుతుంది. కూజా లా కనిపించే ఈ బ్లౌజ్ డిజైన్ ప్రతి ఒక్కరికీ నప్పుతుంది. కావాలంటే సన్నగా ఉన్న భాగంలో ఓ డోరీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

13. కీ హోల్ నెక్

ADVERTISEMENT

Instagram

కీ హోల్ బ్లౌజ్ ఇంతకుముందు ఫ్యాషన్ లో ఉండేది. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. మీ చర్మం కనిపించకుండానే ప్రత్యేకమైన లుక్ కోసం దీన్ని ఎంచుకోవచ్చు. ఇందులో భాగంగా హై నెక్ బ్లౌజ్ కి వీపు భాగంలో సన్నని స్లిట్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మీ సంప్రదాయబద్ధమైన బ్లౌజ్ కి మోడ్రన్ ట్విస్ట్ ఇచ్చినట్లవుతుంది.

14. రౌండ్ నెక్ బ్లౌజ్

rishabagarwal photography

ADVERTISEMENT

రౌండ్ లేదా యు నెక్ చాలామంది రెగ్యులర్ గా తమ బ్లౌజులకు ధరించడం గురించి తెలిసిందే. కానీ డీప్ యు నెక్ బ్యాక్ డిజైన్ ధరిస్తే మీరు చాలా అందంగా కనిపిస్తారు. కింద చాలా చిన్నగా ఉండేలా చూసుకుంటూ హుక్స్ లేదా బటన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కావాలంటే మంచి డోరీ కూడా కట్టుకోవచ్చు.

15. కోల్డ్ షోల్డర్ బ్లౌజ్

Instagram

ప్రస్తుతం కోల్డ్ షోల్డర్ బ్లౌజులు కామన్ గా మారిపోయాయి. చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఈ స్టైల్ ని మీరూ ఓసారి ప్రయత్నించి చూడవచ్చు. మీరు అద్భుతమైన చేతులను చూపాలనుకున్నా.. స్లీవ్ లెక్ వేసుకోవడానికి వెనుకాడుతుంటే ఇలాంటివి వేసుకోవచ్చు. సంగీత్, మెహెందీ, రిసెప్షన్ వంటి ఫంక్షన్లకు ఇది చక్కగా నప్పుతుంది.

ADVERTISEMENT

16. బోట్ నెక్ బ్లౌజ్

instagram

మీ బ్లౌజ్ కి బోట్ నెక్ షార్ట్ స్లీవ్స్ ఇచ్చినంత అందం మరే ఇతర బ్లౌజ్ ఇవ్వదంటే అతిశయోక్తి కాదు. మీ బ్లౌజ్ కి మోడ్రన్ టచ్ ఇవ్వాలంటే ఇది చక్కటి ఎంపిక. పెళ్లి వేడుకలే కాదు.. కాక్ టెయిల్ పార్టీల వంటి వాటికి కూడా ఇది చక్కగా నప్పుతుంది.

17. స్వీట్ హార్ట్ నెక్ లైన్

ADVERTISEMENT

Instagram

స్వీట్ హార్ట్ నెక్.. ఇది ఎప్పటి నుంచో ఫ్యాషన్ రంగంలో ఉన్నా.. చూసేందుకు అద్భుతంగా కనిపిస్తుంది. మీ పెళ్లి కి ఇలాంటి నెక్ ఉన్న బ్లౌజ్ చక్కటి ఎంపిక. మీ మెడ సన్నగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది.

18. జాకెట్ బ్లౌజ్

Instagram

ADVERTISEMENT

చీర కట్టుకున్నప్పుడు మీరు మీ పొట్ట, నడుము కనిపించకూడదు అని భావిస్తున్నారా? అయితే జాకెట్ బ్లౌజులు మీకు చక్కటి ఎంపిక. ఇవి చాలా పాపులర్.. ధరించడానికి సౌకర్యంగా ఉండడంతో పాటు అందంగా కూడా ఉంటాయి. మీరు మీ చీర గురించి పట్టించుకోకుండా పని చేసుకోవాలనుకుంటే ఇలాంటి స్టైల్ ఎంచుకోవడం మంచిది.

19. మట్కా బ్లౌజ్

Instagram

తాజాగా ఎక్కువ మంది ఈ తరహా బ్లౌజ్ స్టైల్ ని ఇష్టపడుతున్నారు. పాత స్టైల్ అయినా ఈ మధ్య మళ్లీ ట్రెండ్ అవుతోంది. మీ బస్ట్ లైన్ ని కాస్త పెద్దగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి ఛాతి మరీ చిన్నగా ఉందని భావించే వాళ్లు ఇలాంటివి ప్రయత్నించవచ్చు.

ADVERTISEMENT

20. స్ట్రాప్ బ్లౌజ్

Instagram

మీరు చాలా అందంగా ఉండి స్లీవ్ లెస్ వేసుకున్నా ఫర్వాలేదు అనుకుంటే సెక్సీ స్ట్రాప్ బ్లౌజ్ వేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సన్నని, టోన్డ్ చేతులు చూపుతూ ఈ బ్లౌజ్ తో పాటు చిన్న కేప్ కూడా వేసుకోవచ్చు.

21. బటన్ అప్ బ్యాక్

ADVERTISEMENT

Instagram

సాధారణంగా బ్లౌజులకు ముందు భాగం హుక్స్ ఉంటాయి.. చీర కొంగు వేసుకున్నాక అవి కవర్ అయిపోతాయి. కానీ దీనికి భిన్నంగా వెనుక వైపు అందరికీ కనిపించేలా బటన్స్ ఏర్పాటు చేస్తే అది కొత్త ఫ్యాషన్ మామూలు హుక్స్ కి బదులుగా పెద్ద పెద్ద గుండీలు పెట్టి ప్రత్యేకమైన డిజైన్లు కూడా క్రియేట్ చేసే వీలు ఇందులో ఉంటుంది.

22. హట్ షేప్ బ్యాక్

Instagram

ADVERTISEMENT

బ్యాక్ లో వివిధ డిజైన్లు ఉండడం ప్రస్తుతం ఫ్యాషన్. అలాంటి డిజైన్లలో ముఖ్యమైనది హట్ డిజైన్. బేసిక్ డీటెయిల్ తో ఉండే ఈ డిజైన్ ఎంతో క్రియేటివ్ గా కనిపిస్తుంది. ఈ బేసిక్ డిజైన్ కి మీకు నచ్చినట్లుగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఎక్కువ చర్మం కూడా కనిపించదు.

23. ఫ్రింజ్ బ్యాక్

Instagram

చీర వెనుక బటన్స్ లేదా హుక్స్ వంటివి కాదు.. చీర బ్యాక్ డిజైన్ లో ఓ చక్కటి సెల్ఫ్ టై డోరీ తో పాటు వెనుక మొత్తం వేలాడే పూసలు, దారాలతో ఫ్రింజ్ స్టైల్ లో ఉంటే చాలు.. అందమైన బ్లౌజ్ డిజైన్ మీ సొంతం అవుతుంది. దీనితో పాటు రివర్స్ పల్లూ వేసుకొని బ్యాక్ కనిపించేలా చేస్తే చాలు.. ఈ బ్లౌజ్ అద్భుతంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

24. లీఫీ ట్రిమ్

Instagram

రిసెప్షన్, సంగీత్ వంటి వేడుకల్లో ప్రతి ఒక్కరూ స్పెషల్ గా కనిపించాలని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ బోల్డ్ నెక్, బ్యాక్ స్టైల్స్ వేసుకోలేరు. ఇలాంటి వారు డిజైన్లతో కనికట్టు చేయవచ్చు. ఎసిమెట్రికల్ గా ఆకుల ఆకారంలో హెమ్ చేసిన చేతులు, బ్యాక్ నెక్ డిజైన్ తో మీ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు.. మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.

25. జాలీ బ్లౌజ్

ADVERTISEMENT

Instagram

మీ బ్యాక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండాలని మీరు కోరుకుంటే అందులో కాస్త మొత్తాన్ని జాలీ మాదిరిగా కుట్టించుకోండి. దీనికోసం ప్రత్యేకమైన వస్త్రం బయట లభిస్తుంది. అందులో మధ్యమధ్యలో రంధ్రాలు ఉంటూ అందంగా కనిపిస్తుంది. దాన్ని చీర బ్లౌజ్ వెనుక వైపు కుడితే సరిపోతుంది. అందమైన బ్యాక్ మీ సొంతం అవుతుంది.

26.బ్రూచ్ బ్యాక్ బ్లౌజ్

Instagram

ADVERTISEMENT

మన బ్లౌజ్ బ్యాక్ డిజైన్ ఎంత అందంగా ఉండాలని అనుకుంటారు. దీనికోసం ఓ మంచి ఎంబలిష్డ్ బ్రూచ్ ని ఏర్పాటు చేసుకోవాలి. డీప్ నెక్ డిజైన్ ఏర్పాటు చేసి కింద లేస్ కి ఈ బ్రూచ్ ని తగిలించి ఏర్పాటు చేయాలి. ఇది జార్జెట్, ఎంబ్రాయిడరీ చీరలకు చాలా బాగా నప్పుతుంది.

27.రౌండ్ విత్ బో

Instagram

మీ చీర చాలా ఎక్కువ ఎంబ్రాయిడరీతో ఉంటే దానికి ప్రత్యేకమైన బ్లౌజ్ వేసుకోవడానికి మీరు ఇష్టపడతారు. ఇలాంటప్పుడు పై వరకూ బ్లౌజ్ కట్ పెట్టి మధ్యలో గుండ్రని షేప్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ షేప్ వచ్చేలా శాటిన్ రిబ్బన్ తో కట్టడం వల్ల వీపులో గుండ్రని షేప్ రావడంతో పాటు శాటిన్ బో ఆకట్టుకుంటుంది.

ADVERTISEMENT

28.క్రిస్ క్రాస్ స్ట్రాప్స్

instagram

ఓ ప్రత్యేకమైన లుక్ మీ సొంతం చేసుకోవడం కోసం సరికొత్త బ్లౌజ్ డిజైన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం క్రిస్ క్రాస్ స్ట్రాప్స్ పెట్టిన బ్లౌజ్ ఎంచుకోవచ్చు. దీన్ని వేసుకున్నప్పుడు మాత్రం బ్యాక్ లెస్ బ్రా ధరించాలి. దీంతో పాటు బ్లౌజ్ ముందు కటింగ్ మరీ డీప్ గా లేకుండా చూసుకోవాలి.

29.మెష్ బ్యాక్

ADVERTISEMENT

Instagram

మీ బ్లౌజ్ బ్యాక్ మొత్తం కవరవ్వాలి కానీ ట్రెండీగా కనిపించాలి అనుకుంటే మెష్ బ్యాక్ ప్రయత్నించండి. బ్లౌజ్ వెనుక మెష్ లాగా డిజైన్ ని కుట్టించడం వల్ల కాంటెంపరరీ లుక్ మీ సొంతం అవుతుంది. చాలా అద్భుతమైన లుక్ కోసం దీన్ని ఓసారి ప్రయత్నించండి.

30.ఆర్చ్ కటౌట్

Instagram

ADVERTISEMENT

బ్లౌజ్ వెనుక బ్యాక్ ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారి కోసం ఇది ప్రత్యేకం. వెనుక ఆర్చ్ షేప్ లో కటింగ్ పెట్టి మధ్యలో డోరీలతో కడితే చూసేందుకు అద్భుతంగా కనిపిస్తుంది. క్లాసీ ట్విస్ట్ చూసేందుకు సింపుల్ గా ఉన్నా చాలా కొత్తగా కనిపిస్తుంది.

31. బ్యాక్ లెస్ విత్ బో

బ్యాక్ లెస్ వేసుకోవాలని మీకు కోరికగా ఉంటే చాలు.. బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసుకొని కింద డోరీ లేదా రిబ్బన్ బో సాయంతో దాన్ని కట్టుకోవడం వల్ల వెనుక బ్లౌజ్ ఉన్నట్లే ఉన్నా.. బ్యాక్ లెస్ లాగానే అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ మీ సెక్సీ వీపును అందంగా చూపిస్తుంది.

32. ఫ్లోరల్ టాసెల్స్

ADVERTISEMENT

instagram

టాసెల్స్ బ్లౌజులకు మంచి స్టైల్.. అలాంటి టాసెల్స్ ని బ్లౌజ్ బ్యాక్ కి మాత్రమే కాదు.. చేతులకు కూడా ఉపయోగించవచ్చు. చక్కటి స్టైలిష్ లుక్ మీ సొంతం అవుతుంది. ఎంగేజ్ మెంట్, సంగీత్ వంటి ఫంక్షన్లకు దీన్ని ధరించవచ్చు.

33. హై నెక్ బ్యాక్ బ్లౌజ్

pinterest

ADVERTISEMENT

మీకు కాలర్ బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే హై నెక్ బ్లౌజ్ ప్రయత్నించవచ్చు. ముందు వైపు కాస్త డిజైన్ ఉండేలా చూసుకుంటే అలాంటి బ్లౌజ్ ధరించినప్పుడు జ్యుయలరీ ధరించకపోయినా చిన్న పాటి చైన్ వేసుకున్నా సరిపోతుంది.

34. రేసర్ బ్యాక్

instagram

సాధారణంగా రేసర్ బ్యాక్ బ్రా వేసుకొని వ్యాయామం చేయడానికి వెళ్తుండడం మనకు తెలిసిందే.. అలాంటి స్లీవ్ లెస్ రేసర్ బ్యాక్ బ్లౌజ్ ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. హెవీ శారీ పైకి సింపుల్ లేదా ప్లెయిన్ బ్లౌజ్ ని ఈ డిజైన్ తో కుట్టించి ధరిస్తే చాలా అందంగా మెరిసిపోయే వీలుంటుంది.

ADVERTISEMENT

35. హాల్టర్ నెక్

Instagram

మీకు బ్యాక్ లెస్ బ్లౌజ్ డిజైన్లు ఇష్టమైతే హాల్టర్ నెక్ ప్రయత్నించండి. మెడ వెనుక హుక్స్ తో వచ్చే ఈ తరహా బ్లౌజ్ కింద కొంత భాగం మాత్రమే కవర్ అవుతుంది. కాబట్టి అటు బ్యాక్ లెస్ లా అనిపించడంతో పాటు ఇటు సంప్రదాయబద్ధంగా కూడా కనిపిస్తుంది.

36. టియర్ డ్రాప్

ADVERTISEMENT

Instagram

మీ బ్లౌజ్ స్పెషల్ డిజైన్ ఉండాలి కానీ అందంగా ఉండాలి అనుకుంటే చాలు.. టియర్ డ్రాప్ డిజైన్ ఉన్న బ్యాక్ డిజైన్ ధరిస్తే చాలు.. ఇది పూర్తిగా వీపును కప్పి ఉంచేలా ఉండడంతో పాటు కాస్త సన్నని నీటి చుక్క పడినట్లుగా వీపు వెనుక కట్ ఉంటుంది. అటు వెస్ట్రన్ ఇటు ఇండియన్ రెండు రకాల లుక్స్ మీ సొంతమవుతాయి.

37.క్రిస్ క్రాస్ డోరీలు

Instagram

ADVERTISEMENT

మీరు ధరించే బ్లౌజ్ వెనుక డోరీలతో డిజైన్ చేయాలనుకుంటే దాన్ని క్రిస్ క్రాస్ గా అల్లుతూ కింద ముడి వేయడం వల్ల డోరీ అందంగా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్ పాతదే అయినా.. అటు వీపు మొత్తం కనిపించకుండా ఇటు మొత్తం కవరయ్యేలా లేకుండా స్పెషల్ గా ఉంటుంది.

38.స్క్వేర్ కటౌట్

Instagram

బ్లౌజ్ బ్యాక్ డిజైన్ డెలికేట్ గా కనిపించాలంటే కేవలం రెగ్యులర్ బ్యాక్ డిజైన్ కాకుండా బ్యాక్ మొత్తం స్వ్కేర్ షేప్ లో కట్ చేసిన డిజైన్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇది మీ శాటిన్, జార్జెట్ చీరలకు అద్బుతంగా సెట్ అవుతుంది.

ADVERTISEMENT

39. యు నెక్ విత్ డోరీ

Instagram

కొత్త స్టైల్స్ ఎన్ని వచ్చినా సరే.. చక్కటి రౌండ్ లేదా యు నెక్, మోచేతుల వరకూ బ్లౌజ్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ కి పోటీ రాలేవు. ఈ బ్లౌజ్ కి కాస్త డోరీ కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది..

40. కాలర్ నెక్

ADVERTISEMENT

Instagram

హై కాలర్ నెక్ అందరికీ నప్పదు అని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది మీ చీరకు రాయల్ లుక్ ని అందిస్తుంది. దీనికి తోడుగా కావాలంటే ఫుల్ స్లీవ్స్ కూడా ప్రయత్నించవచ్చు. ఇలాంటివి రిసెప్షన్ వంటి ఫంక్షన్లకు శీతాకాలం పెళ్లిళ్లకు చక్కటి ఎంపిక.

మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్

మగ్గంపై ఎంబ్రాయిడరీ చేసిఆ వస్త్రంతో బ్లౌజ్ కుట్టడం వల్ల చూసేందుకు ఎంతో హెవీగా కనిపిస్తుంది. మీ చీర సింపుల్ గా ఉందనుకుంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఇది పెళ్లిళ్లు, ఫంక్షన్లలో అద్భుతంగా కనిపించేందుకు బాగుంటాయి. ఇందులో భాగంగా హెవీ ఎంబ్రాయిడరీ తో పాటు కొన్ని బీడ్స్ కలిసి చేసిన డిజైన్లు ఆకట్టుకుంటాయి.

కేవలం చేతులపై డిజైన్

ADVERTISEMENT

Instagram

ఇందులో భాగంగా చేతులపై అందమైన డీటెయిల్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మీ చేతులను అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. అందంగా కనిపించడంతో పాటు మిగిలిన భాగాల నుంచి మీ ఫోకస్ ని చేతుల వైపు మరలుస్తుంది.

బ్లౌజ్ వెనుక డిజైన్

బ్లౌజ్ డిజైన్ చాలా హెవీగా ఉండాలని కోరుకుంటే చాలు.. హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కుట్టించుకోవాలి. అందరిలోనూ అద్భుతంగా కనిపించేలా ఇది మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా అద్భుతమైన బ్యాక్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ఎంచుకోవచ్చు. పెళ్లి కూతుళ్లు ఇలాంటి బ్లౌజ్ ఎంచుకుంటే చాలా అందంగా ఉంటుంది.

బీడ్స్ తో బ్లౌజ్ డిజైన్

ADVERTISEMENT

Instagram

మీ బ్లౌజ్ మీద చాలా హెవీ డిజైన్ ఉండాలని కోరుకుంటున్నారా? పట్టు బ్లౌజ్ పై బీడ్స్ తో డిజైన్ కలిసి చేయడం వల్ల అద్భుతంగా కనిపిస్తుంది. అలా కాకుండా బీడ్స్ తో సింపుల్ గా కూడా కుట్టించుకోవచ్చు.

కాసులతో నెక్, చేతి డిజైన్

ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన డిజైన్లలో కాసుల డిజైన్ ఒకటి. దీన్ని మెడ చుట్టూ కుట్టించుకోవడంతో పాటు చేతులకు కూడా బోర్డర్ గా కాసులు పెట్టి కుట్టించుకోవడం కామన్ గా మారింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

15 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT