ADVERTISEMENT
home / Health
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ పద్ధతులను పాటించేయండి..!

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ పద్ధతులను పాటించేయండి..!

థైరాయిడ్ (Thyroid) సమస్య.. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి పది మందిలో ఐదుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ సమస్య స్త్రీల నుండి వారి సంతానానికి కూడా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు స్వతహాగానే ఇంటి పనులతో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుకు వెళ్లేవారైతే బయట పనులతో కూడా ఒత్తిడికి గురవుతారు. దాంతో పాటు రుతుచక్రం, గర్భధారణ.. వంటి కారణాల వల్ల కూడా వారిలో హార్మోన్ల మార్పులు సంభవిస్తుంటాయి. ఒకవేళ మీకు థైరాయిడ్ ఉందన్న అనుమానం ఉన్నా.. లేక దీని గురించి మరింత తెలుసుకోవాలనుకున్నా ఈ కథనాన్ని చదివేయండి

 

Shutterstock

ADVERTISEMENT

థైరాయిడ్ సమస్యలోని రకాలు

మన గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి థైరాయిడ్ గ్రంథి (gland). మన శరీరం మెటబాలిజాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాయిడ్ హార్మోన్లు మన శరీర మెటబాలిక్ యాక్టివిటీలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇవి మన శరీరంలోని వివిధ కణాలు ఎంత శక్తిని ఉపయోగించాలో కూడా పర్యవేక్షిస్తుంటాయి. సాధారణంగా మన శరీరం విడుదల చేసే హార్మోన్లు కణాల శక్తిని ఎక్కువగా ఉపయోగించేలా చేస్తాయి. ఒకవేళ ఈ హార్మోన్ తక్కువగా విడుదలైతే.. శరీరం శక్తిని తక్కువగా వినియోగించుకుంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం కొవ్వు రూపంలో నిల్వ ఉండిపోతుంది. ఎక్కువగా విడుదలైతే శరీర కణజాలాలు ఎక్కువగా పనిచేయడం వల్ల.. అస్సలు ఎంత తిన్నా కొవ్వు కరిగిపోతుంది. 

Shutterstock

ADVERTISEMENT

హైపో థైరాయిడిజం

శరీరంలో థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించి.. అది విడుదల చేసే హార్మోన్ల స్థాయి కూడా తగ్గితే శరీరం ఉపయోగించుకునే శక్తి స్థాయులు కూడా తగ్గుతాయి. ఇది సాధారణంగా పిట్యూటరీ గ్రంథి పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి మన శరీరం థైరాయిడ్ గ్రంథిని బయట నుంచి వచ్చిన వస్తువు అనుకొని.. దానికి వ్యతిరేకంగా యాంటీబాడీలు విడుదల చేస్తుంది. తద్వారా కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. దీనిని ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజం లేదా హషిమోటోస్ థైరాయిడిజం అంటారు.

హైపర్ థైరాయిడిజం

థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేసి.. ఎక్కువ హార్మోన్లను విడుదల చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు.  కాబట్టి ఎప్పటికప్పుడు దానికి సంబంధించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

థైరాయిడ్ సమస్య లక్షణాలు

థైరాయిడ్ సమస్య సాధారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అయోడిన్ లోపం, వివిధ రకాల మందుల ప్రభావం , ప్రసవం తర్వాత హార్మోన్లలో మార్పుల వల్ల వస్తుంటుంది. అలాగే జన్యుపరంగా కూడా ఈ సమస్య వస్తుంటుంది. దీన్ని గుర్తించేందుకు కొన్ని లక్షణాలను ఆధారంగా తీసుకోవచ్చు.

ADVERTISEMENT

అలసట ఎక్కువగా ఉండడం

Shutterstock

థైరాయిడ్ సమస్య వల్ల శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా లేదా తక్కువగా విడుదలవుతుంటుంది. దీని వల్ల శరీరం శక్తిని ఎక్కువగా వినియోగించడం లేదా తగినంత శక్తి అందక అలసిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి కొన్ని రోజులుగా చేసే పనిలో ఏ మార్పూ లేకపోయినా.. మీరు అతిగా అలసిపోతున్నారంటే థైరాయిడ్ ఉందేమోనని అనుమానించాలి.

చర్మం పొడిబారిపోవడం

తినే ఆహారం నుంచి శక్తి రాకపోవడం, పోషకాలు అందకపోవడం వంటివన్నీ లేకపోవడం వల్ల చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం, గోళ్లు పెళుసుబారి విరిగిపోవడం వంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నింటితో పాటు చర్మానికి కూడా తగిన పోషణ అందకపోవడం వల్ల.. ఎన్ని క్రీములు రాసినా చర్మం పొడిబారిపోవడం చూడొచ్చు.

ADVERTISEMENT

ఎక్కువగా బరువు తగ్గడం లేదా పెరగడం

Shutterstock

కొన్ని రోజులుగా మీరు విపరీతంగా బరువు పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం గమనిస్తుంటే.. థైరాయిడ్ సమస్య ఉందేమోనని అనుమానించాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో జీర్ణ క్రియ వేగం తక్కువవడం వల్ల బరువు పెరుగుతుంది. లేక వేగం పెరగడం వల్ల బరువు తగ్గిపోతుంది.

మలబద్ధకం లేదా విరేచనాలు ఎక్కువవ్వడం

థైరాయిడ్ హార్మోన్ తక్కువవడం వల్ల జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. దీంతో ఆహారం పేగుల్లో సరిగ్గా కదలదు కాబట్టి మలబద్ధకం కూడా ఎదురవుతూ ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి ఆహారం త్వరగా జీర్ణమై.. అందులోని పోషకాలు శరీరానికి అందకముందే విరేచనం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు విరేచనాలు జరగడం చూడొచ్చు.

ADVERTISEMENT

ఇర్రెగ్యులర్ పిరియడ్స్

Shutterstock

థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో రుతుక్రమం కూడా సరిగ్గా ఉండదు. ఇలా ఇర్రెగ్యులర్ పిరియడ్స్ వల్ల గర్భధారణలోనూ ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. శరీరంలో హార్మోన్ల పనితీరు కూడా దెబ్బతింటుంది కాబట్టి అండం విడుదలలోనూ సమస్యలు ఎదురవుతాయి.

ADVERTISEMENT

థైరాయిడ్ సమస్యను గుర్తించేదెలా?

Shutterstock

థైరాయిడ్ సమస్యను గుర్తించేందుకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయులను చూస్తే తెలిసిపోతుంది. కొన్నిసార్లు టీ3, టీ4 హార్మోన్ల స్థాయులను కూడా గమనిస్తారు. టీఎస్ హెచ్ స్థాయులు ఎక్కువగా ఉంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదని.. థైరాయిడ్ హార్మోన్ తగిన స్థాయిలో విడుదలవ్వట్లేదని అర్థం. అదే థైరాయిడ్ ఎక్కువగా విడుదలవుతుంటే.. పిట్యుటరీ గ్రంథి దాన్ని తగ్గించే క్రమంలో టీఎస్‌హెచ్ స్థాయులను తక్కువ చేస్తుంది. ఇవి కాకుండా థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉందా? లేదా? అన్న విషయాన్ని అల్ట్రాసౌండ్, బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT

థైరాయిడ్‌కి చికిత్సలివే..

థైరాయిడ్ సమస్య ప్రారంభమవగానే దానికి ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. అందులో మూడు రకాల చికిత్సలు ఉంటాయి.

Shutterstock

మందులతో..

థైరాయిడ్ సమస్య లక్షణాలు కనిపిస్తుండగా పరీక్ష చేస్తే.. టీఎస్ హెచ్ స్థాయులను బట్టి థైరాయిడ్ హార్మోన్ తక్కువ లేదా ఎక్కువగా విడుదలయ్యేలా కొన్ని మందులను రాస్తారు వైద్యులు. ఈ మందులు థైరాయిడ్ స్థాయులను నియంత్రిస్తాయి.

ADVERTISEMENT

Shutterstock

రేడియోయాక్టివ్ అయోడిన్

హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి ఈ ట్రీట్ మెంట్ ఎక్కువగా అందిస్తుంటారు. ఇందులో భాగంగా రేడియోయాక్టివ్ అయోడిన్ ఉన్న మాత్రలు లేదా లిక్విడ్‌ని అందిస్తారు. వీటి ద్వారా థైరాయిడ్ గ్రంథిలోని కొన్ని కణాలు పనిచేయడం ఆపేస్తాయి. తద్వారా థైరాయిడ్ హార్మోన్ విడుదల తగ్గుతుంది. అయితే ఈ చికిత్స వల్ల కొన్నాళ్లకు హైపో థైరాయిడిజం ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. దీన్ని చాలా తక్కువ మందికి ఉపయోగిస్తారు.

సర్జరీ

థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువగా విడుదలవుతుండడం..  మందులకు అది కంట్రోల్ కాకపోవడం.. థైరాయిడ్ క్యాన్సర్ రావడం వంటి కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథిని కొద్ది భాగం లేదా పూర్తిగా తొలగించి.. ఆ మేరకు హార్మోన్లను బయట నుంచి అందిస్తారు.

ADVERTISEMENT

సమస్య తగ్గేలా ఆహారనియమాలు

థైరాయిడ్ సమస్య తగ్గించుకోవడానికి మొదటి మెట్టు మందులతో పాటు జీవనశైలిని మార్చుకోవడం. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల హార్మోన్ల స్థాయి సమతుల్యమై సమస్య దూరమయ్యే వీలుంటుంది. ఒకవేళ తగ్గకపోయినా.. మరింత పెరగకుండా ఉండేందుకు దీన్ని ఉపయోగించవచ్చు. అందుకు తీసుకోవాల్సిన, తీసుకోకూడదని పదార్థాలేంటో చూద్దాం..

తీసుకోవాల్సిన పదార్థాలు

Shutterstock

ADVERTISEMENT

అయొడైజ్డ్ ఉప్పు

అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ సూత్రాల ప్రకారం థైరాయిడ్ హార్మోన్ సరైన స్థాయిలో విడుదల కావాలంటే అయోడిన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ అది తక్కువైతే హైపోథైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు ఎదురవుతాయి. మన శరీరం అయోడిన్‌ని ఉత్పత్తి చేయలేదు కాబట్టి.. అయోడిన్ ఎక్కువగా ఉండే ఉప్పు లాంటి పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆ లోటును తగ్గించుకోవచ్చు.

బ్రెజిల్ నట్స్

బ్రెజిల్ నట్స్‌లో సెలేనియం ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ని పునరుత్తేజం చేస్తుంది. కేవలం థైరాయిడ్ స్థాయులను మెరుగుపర్చడమే కాదు.. క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గించడం, వాపును తగ్గించడం వంటివి కూడా చేస్తాయి. రోజూ ఎనిమిది బ్రెజిల్ నట్స్ వరకూ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే డయేరియా, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ADVERTISEMENT

Shutterstock

పండ్లు, కూరగాయలు

ఆకుపచ్చని ఆకుకూరలు, రంగు రంగుల కూరగాయలు, పండ్లు ఎన్నెన్నో పోషకాలకు నెలవు. వీటి వల్ల పీచుపదార్థంతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని క్రియలు సవ్యంగా జరుగుతాయి.. అయితే గాయిటరోజెన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తీసుకుంటే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

ADVERTISEMENT

పాలు, గుడ్లు

గుడ్లలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హైపోథైరాయిడిజంని తగ్గిస్తుంది. రోజుకు కనీసం రెండు గుడ్లు తీసుకోవడం వల్ల థైరాయిడ్ స్థాయులు సాధారణ స్థితిలో ఉంటాయి. ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే.. పచ్చ సొనని తీసుకోవద్దు. వీటితో పాటు కొవ్వు తక్కువగా ఉండే పాలు, పనీర్ తీసుకోవడం కూడా మంచిది. వీటిలో అయోడిన్, సెలేనియం రెండూ ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ల స్థాయిని అదుపులో ఉంచుతాయి. రోజూ కనీసం ఒక గ్లాసు పాలు, అర కప్పు పెరుగు, పావు కప్పు పనీర్ వంటివి తీసుకోవచ్చు.

Shutterstock

ADVERTISEMENT

చేపలు, చికెన్

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చెడు కొవ్వును తగ్గిస్తే.. సెలీనియం థైరాయిడ్ హార్మోన్ల స్థాయి సరిగ్గా ఉండేలా చేస్తుంది. అయితే దీనికోసం చేపలను ఎక్కువగా వేయించకుండా చూసుకోవాలి. అలాగే థైరాయిడ్ స్థాయులు సాధారణ స్థితిలో ఉండేలా టీ3 (ట్రైఅయడోథైరోనిన్) హార్మోన్‌ని.. టీ4 (థైరాక్సిన్)గా మార్చడంలో జింక్ తోడ్పడుతుంది. జింక్ చికెన్‌లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దీన్ని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది.

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. జింక్, సెలేనియం, అయోడిన్ వంటివి కూడా ఉంటాయి. వీటిని రోజూ స్మూతీ, బ్రేక్ ఫాస్ట్ లేదా ఇతర పదార్థాల్లో కలుపుకొని తీసుకోవడం వల్ల థైరాయిడ్ స్థాయులు అవసరమైనంత స్థాయిలో ఉంటాయి. రోజూ కనీసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం ఇష్టం లేకపోతే.. రోజూ రెండు టేబల్ స్పూన్ల అవిసె నూనెను ఉపయోగించినా అవే ఫలితాలు పొందొచ్చు.

ADVERTISEMENT

ఇవి తీసుకోకూడదు

Shutterstock

హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నవారు పైన చెప్పిన పదార్థాలు ముఖ్యంగా సెలేనియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. వీటిలో గుడ్లు, బ్రెజిల్ నట్స్, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోకూడదు. అలాగే హైపో థైరాయిడిజం ఉన్నవారు కింద పేర్కొన్న ఆహారంతో పాటు గ్రీన్ టీకి కూడా దూరంగా ఉండడం మంచిది.

ప్రాసెస్ చేసిన ఆహారం
ప్రాసెస్ చేసిన ఆహారం మన హార్మోన్లపై ప్రభావం చూపి థైరాయిడ్ స్థాయులను మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను తీసుకోవడం సరికాదు.

ADVERTISEMENT

గ్లుటెన్ ఉన్న ఆహారం
థైరాయిడ్ సమస్య ఉన్నవారి జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. కాబట్టి వారు గ్లుటెన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.

Shutterstock

చక్కెర
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయులు పెరుగుతాయి. అవి కంట్రోల్లో ఉండకపోతే హైపోథైరాయిడిజం స్థాయులు అదుపులో ఉండవు.

ADVERTISEMENT

సోయా ఉత్పత్తులు
సోయాలో గాయిటరోజెన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండడంతో పాటు.. హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవారు దీన్ని కాస్త ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

థైరాయిడ్ సమస్య తగ్గేందుకు ఇంటి చిట్కాలు

ఆహారం, మందులతో పాటు.. ఇంట్లోనే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల.. ఇంటి వైద్యంలా పనిచేసి అవి కూడా థైరాయిడ్ సమస్యను తగ్గుముఖం పట్టిస్తాయి. అవేంటో చూద్దాం

ఎస్సెన్షియల్ ఆయిల్స్

ADVERTISEMENT

Shutterstock

థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో ఎన్నో ఎస్సెన్షియల్ ఆయిల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏదో ఒక ఆయిల్‌ని కొన్ని చుక్కలు తీసుకొని.. స్పూన్ కొబ్బరి నూనెతో కలిపి గ్లాసు నీళ్లలో వేసుకొని రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో భాగంగా లెమన్ గ్రాస్ ఆయిల్, లవంగం నూనె, చందనం నూనె, లావెండర్ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్, రోజ్ మేరీ ఆయిల్ వంటివి ఉపయోగించవచ్చు.

నెట్టిల్ టీ

నెట్టిల్ అనేది ఓ రకమైన ఆయుర్వేద మూలికలాంటిదే. దీన్ని ఉపయోగించడం వల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గడంతో పాటు ఆర్థరైటిస్ నుంచి మూత్రనాళ సంబంధిత సమస్యల వరకూ అన్నీ తగ్గుతాయి. టీపొడితో పాటు నెట్టిల్ కూడా నీళ్లలో వేసి మరిగించాలి. దీన్ని రోజూ తాగడం వల్ల థైరాయిడ్ సాధారణ స్థితికి చేరుకుంటుంది.

అశ్వగంధ

ADVERTISEMENT

Shutterstock

ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకు అశ్వగంధ చూర్ణాన్ని మందుగా చెప్పారు. ఇది హార్మోన్ల స్థాయిని కూడా సమతుల్యం చేస్తుంది. ఆరోగ్య సమస్యలు తట్టుకునే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాదు.. శరీరంలో వచ్చే వాపును కూడా ఇది తగ్గిస్తుంది. దీని కోసం అశ్వగంధ చూర్ణాన్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

గుగ్గుల్

గుగ్గుల్ అనేది ఓ ఆయుర్వేద మూలిక. ఇది ముకుల్ మిర్ అనే చెట్టు నుంచి తీసిన జిగురు. ఇందులో సహజసిద్ధమైన ప్లాంట్ స్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్లు బ్యాలన్స్ అయ్యేలా చేస్తాయి. థైరాయిడ్ ఉత్పత్తిని స్టిమ్యులేట్ చేసి టీ4 హార్మోన్.. టీ3గా మారేందుకు కూడా తోడ్పడుతుంది.

కెల్ప్

ADVERTISEMENT

Shutterstock

నోరీ, కెల్ప్, కొంబు లాంటి సీవీడ్ థైరాయిడ్‌ని తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. వీటిలో అయోడిన్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దాంతో పాటు బి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపర్చి రెగ్యులేట్ చేస్తాయి. అలసటను తగ్గించి మూడ్‌ని ఆనందంగా మారుస్తాయి. అంతేకాదు.. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. రోజూ 150 మైక్రోగ్రాముల చొప్పున దీన్ని తీసుకోవడం వల్ల చాలామంచి ఫలితాలను గమనించవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు

ADVERTISEMENT

Shutterstock

1. థైరాయిడ్ వచ్చిందని గుర్తించే క్రమంలో.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరంలోని కణాలన్నింటికీ తగినంత శక్తి అందదు. కాబట్టి ఎప్పుడూ అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. అలాగే రుతుక్రమంలో మార్పులు కనిపిస్తాయి. ఇంకా గుర్తించకపోతే కొన్నాళ్లకు కీళ్లు, కండరాలు నొప్పిగా అనిపించడం, బరువు పెరగడం వంటివి కూడా కనిపిస్తాయి. చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు, మొటిమలు.. వంటివి కూడా ఎదురవుతాయి. ఈ లక్షణాల ఆధారంగా వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి.

2. థైరాయిడ్ ప్రమాదకరమైన సమస్యా?

థైరాయిడ్ గ్రంథికి వచ్చే సమస్యలన్నీ ఒకే రకంగా ఉండవు. గాయిటర్ నుంచి క్యాన్సర్ వరకూ ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ల స్థాయి ఎక్కువ లేదా తక్కువయ్యే సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని సంవత్సరాల వరకూ చికిత్స చేయకపోతే ఇవి గుండె పోటు, నరాలు బలహీనపడడం.. వంటి సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉందని తెలియగానే.. సత్వర చికిత్స తీసుకోవడం మంచిది.

ADVERTISEMENT

Shutterstock

3. హైపో థైరాయిడిజం ఉంటే.. క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి క్రూసిఫెరస్ కూరగాయలకు దూరంగా ఉండాలా?

క్యాలీఫ్లవర్, క్యాబేజీ కుటుంబానికి చెందిన పలు రకాల కూరగాయలను  క్రూసిఫెరస్ కూరగాయలు అంటుంటారు. వీటిలో ముఖ్యంగా  బ్రొకొలీ, ముల్లంగి వంటివి ప్రధానమైనవి. ఇవే కాదు.. చిలగడదుంప, పాలకూర, కేల్, సోయా బీన్స్, పీచ్, అవకాడో, ఆవ ఆకులు వంటి వాటిలో గాయిటరోజెన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తప్పక తీసుకోవాలనుకుంటే మాత్రం వీటిని బాగా ఉడికించి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులోని గాయిటరోజెన్స్ తొలగిపోతాయి.

4. థైరాయిడ్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వీలుందా?

మీకు థైరాయిడ్ సమస్య వస్తుందని అనుమానంగా ఉంటే దాన్ని రాకుండా చేయడానికి.. థైరాయిడ్‌ని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయాలి. దీని కోసం చెడు అలవాట్లను మానేయడంతో పాటు గాయిటరోజెన్స్ ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండేలా జింక్, సెలేనియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అయోడిన్‌ని కూడా తగిన స్థాయిలో తీసుకోవాలి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

29 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT