ADVERTISEMENT
home / Astrology
28 జనవరి 2020 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

28 జనవరి 2020 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (28 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. మీకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమికుల బంధాలు మరింత పటిష్టమవుతాయి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. అదేవిధంగా మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ప్రేమికుల మధ్య అభిప్రాయల భేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కళలు లేదా క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తారు. మహిళలు స్వయంఉపాధి వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి . 

మిథున రాశి (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే కుటుంబ సమస్యలను వివేకంతో పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించాలి. ప్రేమికులు అవనసర తగాదాలు పెట్టుకోకుండా ఉండడం శ్రేయస్కరం. కొన్ని నిర్ణయాలను సమయస్ఫూర్తితో తీసుకోవాలి. 

ADVERTISEMENT

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.  విద్యార్థులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది.  

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పాత మిత్రులను కలుస్తారు. అలాగే మహిళలు ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలకాలి. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఇంకా కష్టపడాలి. ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆస్తి సంబంధిత చర్చలలో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను కలుస్తారు. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినా .. ఆ తర్వాత సర్దుకుపోతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

ADVERTISEMENT

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని చిత్రమైన అనుభవాలను ఎదుర్కొంటారు. అలాగే ఊహించని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అలాగే సామాజిక కార్యక్రమాలకు మీరు అతిథిగా హాజరవుతారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి  ఇదే సరైన సమయం. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే  ఆలుమగలు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు పలు సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దాన, ధర్మాలు చేస్తారు.  విద్యార్థులు కొత్త కోర్సులలో జాయిన్ అవుతారు.  

ధను రాశి (Saggitarius) – ఈ రోజు మీరు వినోదాలు, వేడుకలలో పాలుపంచుకుంటారు. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరితో ఒకరు దాపరికం లేకుండా వ్యవహరించాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ADVERTISEMENT

మకర రాశి (Capricorn) –  ఈ రోజు నిరుద్యోగులు కొంచెం కష్టపడితే అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల కెరీర్‌కు  సంబంధించి మార్పులు, చేర్పులు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు ఎంత కష్టపడినా.. ఫలితం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. కొన్ని విషయాలలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అలాగే వివేకంతో వ్యవహరించాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. 

ADVERTISEMENT

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

28 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT