ADVERTISEMENT
home / Bollywood
నమ్మలేని నిజం :  యాసిడ్ బాధితులను చూసి.. సమాజం ఎలా వ్యవహరిస్తుందో తెలుసా?

నమ్మలేని నిజం : యాసిడ్ బాధితులను చూసి.. సమాజం ఎలా వ్యవహరిస్తుందో తెలుసా?

(Deepika Padukone shared the video of Social Experiment on the occasion of  Chhapaak’s  Movie Release)

ఛపాక్ ..యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ న్యాయ పోరాటం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ విడుదలైన సినిమా ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యాసిడ్ బాధితులు (Acid attack victims) కూడా సమాజంలో భాగమేనని చూపించడమే ఈ సినిమా లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి.. దర్శకురాలు మేఘనా గుల్జార్, కథానాయిక దీపికా పదుకొణెలు కూడా నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే శంకర్ ఎహెసాన్ లాయ్ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది.

దీపిక ప‌దుకొణే ‘ఛపాక్’ చిత్రం ఎందుకు చూడాలంటే ..?

ADVERTISEMENT

Fox Star Hindi

‘ఛపాక్’ చిత్రం యాసిడ్ దాడి బాధితుల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తుందో చూపించేందుకు.. ఈ సినిమా యూనిట్ ఓ కొత్త ప్రయోగం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ రోజు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో భాగంగా సూపర్ మార్కెట్, దుస్తుల షాప్, ఫ్యాన్సీ స్టోర్.. ఇలా వివిధ రకాల షాపుల్లో యాసిడ్ బాధితులు వెళ్లినప్పుడు అక్కడున్న వారి హావభావాలను రికార్డ్ చేశారు. దీనికోసం సీక్రెట్ కెమెరాలను ఉపయోగించారు. దిల్లీ వీధుల్లోని షాపులను దీపిక సినిమాలో తాను పోషించిన మాలతి పాత్ర మేకప్ వేసుకొని సందర్శించగా ఎవరూ గుర్తు పట్టలేదు. ఆమె ఇతర యాసిడ్ బాధితులతో కలిసి వస్తువులు కొనడానికి వెళ్లినట్లుగా అక్కడికి వెళ్లారు. వీరు అక్కడికి వెళ్లినప్పుడు.. ఇతరుల ఫీలింగ్స్‌ని సీక్రెట్ కేమెరాలు చూపించాయి.

వీరందరూ కలిసి షాపింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ కొందరు వ్యక్తులు వీరిని చూసి చిరాకు పడ్డారు. మరికొందరు విసుగును వారి ముఖంపైనే చూపించారు. కొందరు భయపడ్డారు. మరికొందరు తమ పిల్లలు వారిని చూడకుండా కళ్లు మూసేశారు. ఇంకొందరు మాత్రం ప్రేమగా పలకరించారు. కొందరైతే వారి నుంచి తప్పించుకొని.. దూరంగా వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంకొందరైతే వారు దుస్తులను ప్రయత్నిస్తామని చెప్పినా కూడా దానికి ఒప్పుకోలేదు. ఈ చూపులు దీపికకి, వీడియో చూసే వారికి కొత్త కావచ్చు. కానీ ఆ యాసిడ్ బాధితులకు మాత్రం ఈ చూపులు అలవాటే. అందుకే వారు కాస్త సిగ్గు, బిడియంతో అందరితో కలిసిపోవడానికి వారి ప్రయత్నం వారు చేశారు.

ఆ సంఘటన గురించి తలుచుకుంటే.. ఇప్పటికీ భయమే: లక్ష్మీ అగర్వాల్

ADVERTISEMENT

Fox Star Hindi

“మీరు సమాజంలో చూడాలనుకున్న మార్పుకి మీరే ఆరంభం పలకండి” అంటూ ఈ వీడియోను షేర్ చేసింది దీపిక. యాసిడ్ దాడి జరగడంలో బాధితుల తప్పేమీ లేదు. కానీ సమాజం మాత్రం వారిని ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉంది. అందుకే బాధితుల పట్ల సమాజం చూసే తీరు మారాలనే సందేశం ఇస్తూ ఈ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఆఖర్లో దీపిక “ఈ రోజు పూర్తిగా ఇలా యాసిడ్ బాధితులతో పాటు.. వారిలా జీవితం గడిపాక నాకు అర్థమైన విషయం ఏంటంటే మన కంటి ముందు కొన్ని కనిపిస్తాయి. మరికొన్ని కనిపించవు. అందుకే మనం చూసే తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని చెప్పుకొచ్చింది.

ఈ వీడియోను చాలామంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు. ఓ అమ్మాయి తనపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తి పై న్యాయ పోరాటం చేయడం మాత్రమే కాదు.. ఆ తర్వాత అసలు యాసిడ్ అమ్మకాలే జరగకుండా చేసింది.ఆమె  అనుభవాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ నిజ జీవిత కథకి సినిమా రూపం ఇది. లక్ష్మి జీవిత కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు దర్శకురాలు మేఘనా గుల్జార్. విక్రాంత్ మెస్సే హీరోగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

Images: Fox Star Hindi

08 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT