Elderly couple ties knot at Kerala old-age home – Viral News
ఆమెకు 65 సంవత్సరాలు.. ఆయనకు 67 సంవత్సరాలు. అయినా సరే.. ప్రేమ బంధం వారిని కలిపింది. నూతన దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేసింది. నిజమైన ప్రేమకి వయసు అడ్డంకి కాదని వారిద్దరూ నిరూపించారు. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది సంవత్సరాలుగా కేరళలోని ఓ ఓల్డ్ ఏజ్ హోంలో నివసిస్తున్నారు లక్ష్మి అమ్మల్. ఇటీవలే ఆ హోంలో చేరారు మీనన్. వారిద్దరికీ ముందుగానే పరిచయం ఉండడం విశేషం. మీనన్ పనిచేస్తున్న ఆఫీసులోనే గతంలో లక్ష్మి భర్త కూడా పనిచేసేవారట. కానీ ఆయన కాలం చేయడంతో ఆమె ఒంటరిగా మిగిలింది. ఆ సమయంలో ఆమె పిల్లలు కూడా తనను ఖాతరు చేయకపోవడంతో తను ఓల్డ్ ఏజ్ హోంలో చేరింది.
ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..
మీనన్‌ది కూడా దాదాపు ఇలాంటి కథే. పదవీ విరమణ చేశాక.. పిల్లలు ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉండడంతో.. ఆయనను పట్టించుకొనేవారు కరువయ్యారు. అలాంటి సమయంలో ఆయన ఆశ్రమంలో చేరారు. ఆశ్రమంలో చేరగానే.. ఆయన లక్ష్మిని గుర్తుపట్టారు. ఒకరి కథను మరొకరు చెప్పుకున్నారు. లక్ష్మికి కూడా తనకు ముందే పరిచయం ఉన్న ఓ వ్యక్తి కలవడంలో.. తన మదిలోని బాధను పంచుకోగలిగింది. ఆ తర్వాత ప్రతీ రోజు ఒకరినొకరు కలిసేవారు. కుశల ప్రశ్నలు వేసుకొనేవారు. తమ అభిరుచులను కూడా పంచుకొనేవారు.
ప్రేమ వివాహం.. పెద్దలు కుదిర్చిన వివాహం.. సెక్స్ విషయంలో ఏది బెటర్?
ఇలా స్నేహితులుగా మారిన ఈ ఇద్దరు వ్యక్తులు.. ప్రేమలో పడడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. అయితే తొలుత కలిసి ఓ బంధాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు తటపటాయించారు. పిల్లలు ఏమని అనుకుంటారో..? సమాజం ఏమని అనుకుంటుందో..? అని ఆలోచించారు. అయితే ఇది వారి జీవితం. వారే నిర్ణయం తీసుకోవాలి. అందుకే బాగా ఆలోచించి.. ఓ రోజు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇదే ఆలోచనను ఆశ్రమంలోని తమ మిగతా స్నేహితులకు తెలిపారు. వారి అభిప్రాయాలను కూడా సేకరించారు. అయితే అందరూ వీరి ఆలోచనను సమర్థించడం విశేషం.
జీవితంలో కలిసి ఏడడుగులు నడవాలని భావించిన.. ఈ వృద్ధ జంటకు ఆశ్రమ నిర్వాహకులు కూడా సహకరించారు. వారే పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశారు. ఈ వివాహానికి కేరళ ప్రభుత్వ ప్రతినిధిగా ఆ రాష్ట్ర మంత్రి శివ కుమార్ హాజరై.. వధు, వరులకు శుభాకాంక్షలు అందజేశారు. అలాగే జిల్లా కలెక్టరు కూడా ఈ పెళ్లికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ పెళ్లి సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, పాటల పోటీలు కూడా ఏర్పాటు చేశారు. వాటిలో ఆశ్రమానికి చెందిన వారందరూ హుషారుగా పాల్గొన్నారు. ఆ తర్వాత అందరూ నిండు మనసుతో కొత్త దంపతులను ఆశీర్వదించారు.
ప్లాస్టిక్ రహితం మాత్రమే కాదు.. మరెన్నో ప్రత్యేకతలతో జరిగిన వివాహం ఇది ..!
ప్రస్తుతం ఈ జంట కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక పత్రికలు, ఛానళ్లు వీరితో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాయి. సభ్య సమాజానికి ఈ జంట ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారని.. ప్రేమకు వయసుతో పనిలేదని.. ఒక వయసు వచ్చాక తోడు కోరుకోవడం ఏ మాత్రం తప్పుకాదని పలు పత్రికలు వార్తలు రాశాయి. అలాగే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా నూతన దంపతులు తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడడం విశేషం. త్రిసూర్ ప్రాంతంలోని ఇరంజల్‌కుడ అనే ఊరిలో ఈ సంఘటన జరిగింది.
Image : ANI
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.