ఇటీవలి కాలంలో చుండ్రు(dandruff) సమస్య చాలామందిని వేధిస్తోంది. రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు.. ఇలా ఎన్ని ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని బాధపడేవారు ఎందరో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యకు పరిష్కారం ఏమీ లేదా..? అనిపిస్తూ ఉంటుంది. హెన్నా(henna..) అదే గోరింటాకు పొడిని ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు.. గోరింటాకు జుట్టుని సైతం బలంగా తయారయ్యేలా చేస్తుంది.
మార్కెట్లో మనకు వివిధ రకాల బ్రాండ్లకు చెందిన హెన్నా పౌడర్లు లభిస్తున్నాయి. వాటిలో మీకు నచ్చినదాన్ని హెయిర్ ప్యాక్స్(hair packs) వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ వాటిలో రసాయనాలు ఉపయోగిస్తారనుకొంటే మీరే స్వయంగా గోరింటాకు పొడిని తయారుచేసుకోవచ్చు. దీని కోసం గోరింటాకును నీడలో ఆరబెట్టి.. మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారుచేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైతం ఉండవు.
1. హెన్నా, నిమ్మరసం, పెరుగు
కావాల్సినవి: నాలుగు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, నిమ్మకాయ ఒకటి, పెరుగు కావాల్సినంత
హెన్నా పౌడర్లో పెరుగు, నిమ్మరసం వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. తల పూర్తిగా ఆరిన.. తర్వాత కండిషనర్ రాసుకోవాల్సి ఉంటుంది. నిమ్మరసం వల్ల ఈ ప్యాక్ వేసుకొన్నప్పుడు కాస్త మంట పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ చుండ్రు సమస్యకు ఇది చక్కటి పరిష్కారాన్నిస్తుంది.
Shutterstock
2. హెన్నా, కుంకుడు కాయలు, పెరుగు
కావాల్సినవి: హెన్నా పౌడర్ నాలుగు టేబుల్ స్పూన్లు, కుంకుడుకాయల పొడి రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు
గిన్నెలో హెన్నా పౌడర్, కుంకుడుకాయల పొడి కలిపి మిశ్రమంగా చేయాలి. దీనిలో పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్ తలకు అప్లై చేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వారానికోసారి అప్లై చేసుకోవడం ద్వారా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన కుంకుడు కాయలు.. మాడును మొత్తం శుభ్రం చేసి చుండ్రు రావడానికి కారణమైన ఫంగస్‌ను నాశనం చేస్తుంది.
3. హెన్నా, ఆలివ్ నూనె, మెంతులు
కావాల్సినవి: హెన్నా నాలుగు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, మెంతుల పొడి చెంచా, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు
శుభ్రమైన గిన్నెలో పైన మనం చెప్పుకొన్నవన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని12 గంటల పాటు పక్కన పెట్టి ఉంచేయాలి. దీనిని రాత్రి సమయంలో నానబెట్టుకొంటే ఉదయం ఉపయోగించడానికి వీలుగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నుంచి మూడు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. మీ జుట్టు డ్రై హెయిర్ అయితే తలస్నానం తర్వాత కండిషనర్ రాసుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.
Shutterstock
4. హెన్నా, కోడిగుడ్డు
కావాల్సినవి: హెన్నా మూడు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె టేబుల్ స్పూన్, విప్డ్ ఎగ్ వైట్ రెండు టేబుల్ స్పూన్లు, నీరు
గిన్నెలో హెన్నా, ఆలివ్ నూనె, ఎగ్ వైట్ వేసి తగినంత నీరు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కు అప్లై చేసి అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పైగా కోడిగుడ్డులో ఉండే ప్రొటీన్ వల్ల జుట్టు బలంగా తయారవుతుంది.
సాధారణంగా చుండ్రు సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. మనం ఎన్ని చిట్కాలు పాటించినప్పటికీ ఈ సమస్యకు అవి తాత్కాలిక పరిష్కారాన్ని చూపిస్తాయే తప్ప.. శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు. కాబట్టి వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం మంచిది.
Featured Image: Shutterstock
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.