ADVERTISEMENT
home / Acne
మొటిమలు నుండి తక్కువ సమయం లో  సంపూర్ణ విముక్తి పొందండి  (How To Remove Pimples In Telugu)

మొటిమలు నుండి తక్కువ సమయం లో సంపూర్ణ విముక్తి పొందండి (How To Remove Pimples In Telugu)

అందంగా చంద‌మామ‌లా మెరిసిపోవాల‌ని ప్ర‌తి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఆ అద్బుత‌మైన అందానికి మొటిమలు (pimples) అడ్డుగా మారిపోతాయి. ఏదైనా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భంలో చ‌క్క‌టి దుస్తులున్నా.. ఎంత‌మంచి మేక‌ప్ ఉన్నా.. ముఖంపై ఉన్న మొటిమలే మ‌నం అందంగా ఉన్నామ‌న్న భావ‌న‌ను తొల‌గించేస్తాయి.

ఈ ఆర్టికల్ చివరివరకు చదవండి. మొటిమలు గురించి మీరు తెలుసుకో వలసిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఎప్పుడు POPxo మీ కోసం తీసుకొచ్చింది. అందుకే ఈ పేజీని బుక్‌మార్క్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్ప‌డు మొటిమ‌లు, మ‌చ్చ‌లు లేని అంద‌మైన ముఖం (beautiful face) కోసం ఇందులో చెప్పిన చిట్కాలు పాటించండి.

మొటిమ‌లంటే ఏంటి? (What Are Pimples)

Shutter stock

ADVERTISEMENT

ఏదైనా స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డానికి మొద‌టి మెట్టు దాని గురించి తెలుసుకోవ‌డ‌మే. మొటిమ‌లు సాధార‌ణంగా మొహంపైనే కాదు.. వీపు, ఛాతి, భుజాల‌పైన కూడా వస్తుంటాయి. ఇవి ఎక్కువ‌గా మ‌న చ‌ర్మంపై ఉండే స్వేద రంధ్రాలు ఇన్ఫెక్ష‌న్ వ‌ల్ల మూసుకుపోవ‌డంతో ఏర్ప‌డ‌తాయి. మ‌న చ‌ర్మంపై ఉండే సెబేషియ‌స్ గ్రంథులు స్వేదాన్ని విడుద‌ల చేస్తుంటాయి. ఇవి విడుద‌ల చేసే నూనెలు, మృత‌చ‌ర్మంతో క‌లిసి రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో మొటిమ‌లు ఏర్ప‌డుతుంటాయి.

చ‌ర్మం ఎత్తుగా, ఎరుపు రంగులోకి మారితే మొటిమ (acne) వ‌చ్చిన‌ట్లుగా చెప్పుకోవ‌చ్చు. ఇవి సాధార‌ణంగా ఏ వ‌య‌సులోనైనా వ‌స్తుంటాయి. అయితే కౌమార్యంలో ఇవి ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఆ స‌మ‌యంలో చ‌ర్మం ద‌ళ‌స‌రిగా మారుతుంటుంది కాబ‌ట్టి స్వేద‌రంధ్రాలు మూసుకుపోయి మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. సాధార‌ణంగా ఇవి పిరియ‌డ్స్ స‌మ‌యంలో ఎక్కువ‌గా రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ స‌మ‌యంలో హార్మోన్ల‌లో హెచ్చుత‌గ్గుల వ‌ల్ల స్వేద‌గ్రంథులు వేగంగా ప‌నిచేస్తాయి. దీంతో మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి.

మొటిమ‌ల్లో రకాలు (Types Of Pimples)

Shutter stock

ADVERTISEMENT

అసలు motimalu thaggalante emi cheyali అని తెసులుసుకునే ముందు మొటిమలతో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం (types of pimples): 

1. చిన్న మొటిమ‌లు

ఇవి చూడ‌డానికి ఎరుపు రంగులో ఉండ‌వ‌చ్చు. కొన్నిసార్లు ఉబ్బెత్తుగా ఉన్నా.. చ‌ర్మం రంగులోనే క‌లిసిపోయి ఉంటాయి. చ‌ర్మపు రంధ్రాల్లో స‌హజ నూనెల‌తో పాటు బ్యాక్టీరియా ఉండిపోతే ఈ త‌ర‌హా మొటిమ‌లు వచ్చే అవ‌కాశం ఉంటుంది. వీటిని గిల్ల‌డం వ‌ల్ల న‌ల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంటుంది.

2. గ‌డ్డ‌ల్లాంటి మొటిమ‌లు (cysts)

ADVERTISEMENT

ఇవి చూడ‌డానికి చాలా పెద్ద‌గా.. ఎరుపు రంగులో క‌నిపిస్తాయి. ఇవి చాలా నొప్పిని కూడా కలిగిస్తాయి. ఇవి ఎక్కువ‌గా చెంప‌లు, నుదురు, ఛాతి, వీపు భాగాల్లో మాత్ర‌మే వస్తుంటాయి. బ్యాక్టీరియా, నూనెలు రంధ్రాన్ని మూసేసి.. లోప‌ల ఇన్ఫెక్ష‌న్ వ్యాపిస్తే ఇవి ఎక్కువ‌గా ఏర్ప‌డ‌తాయి. ఈ త‌ర‌హా మొటిమ‌లు ఎక్కువ‌గా చీముప‌ట్టి ఉంటాయి. ఇలాంటివి ఎక్కువ‌గా వ‌స్తుంటే.. ఒక‌సారి డెర్మ‌టాల‌జిస్ట్‌ని సంప్ర‌దించి చికిత్స తీసుకోవ‌డం మంచిది.

3. బ్లాక్‌హెడ్స్‌

చ‌ర్మంపై ఉండే వెంట్రుక‌ల రంధ్రాల్లో దుమ్ము, నూనె నిండి.. అవి మూసుకుపోతే బ్లాక్‌హెడ్స్ ఏర్ప‌డ‌తాయి. ఇవి చాలా చిన్న‌గా న‌లుపు రంగులో క‌నిపిస్తుంటాయి. ఇవి పెద్ద‌గా నొప్పిని క‌లిగించ‌క‌పోయినా.. వీటిని తొల‌గించేట‌ప్పుడు మాత్రం చాలా ఇబ్బందిపెడ‌తాయి.

4. వైట్ హెడ్స్‌

ADVERTISEMENT

బ్లాక్‌హెడ్స్‌కి, వైట్ హెడ్స్‌కి తేడా ఒక‌టే. హెయిర్ ఫాలికల్స్‌లో నూనె, దుమ్ము నిండితే ఇవి ఏర్ప‌డ‌తాయి. అయితే ఆ త‌ర్వాత అవి గాలి త‌గిలితే బ్లాక్‌హెడ్స్‌గాను, త‌గ‌ల‌కుండా చ‌ర్మం లోప‌లే ఉండిపోతే వైట్‌హెడ్స్‌గానూ మార‌తాయి.

మొటిమ‌లు ఏర్ప‌డ‌డానికి కార‌ణాలు (Reasons For Pimples)

Shutter stock

మ‌న స‌మ‌స్య ఎందుకు వ‌చ్చిందో తెలుసుకోకుండా.. దానికి స‌మాధానం వెత‌క‌డం క‌ష్టం. అందుకే మ‌నం ముందుగా మొటిమ‌లు ఏర్ప‌డ‌డానికి ఉండే ముఖ్య కార‌ణాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు మ‌నం స‌రైన ఆహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, మ‌రికొన్ని సార్లు మ‌న హార్మోన్ల అస‌మ‌తౌల్య‌త వ‌ల్ల‌.. ఇంకొన్నిసార్ల‌యితే.. స‌రైన ఉత్ప‌త్తులు ఉప‌యోగించ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా మొటిమ‌లు ఏర్ప‌డుతుంటాయి. ఈ  క్రమంలో ఈ మొటిమ‌లు  మ‌న ముఖంపై ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డానికి కార‌ణాలేంటో తెలుసుకుందాం రండి.

ADVERTISEMENT

హార్మోన్స్ లో మార్పులు

ఈ ద‌శ‌లోనే చాలామంది మొటిమ‌లను మొద‌టిసారి చూస్తారు. కౌమార్యంలో మ‌న శ‌రీరంలో వ‌చ్చే హార్మ‌న్ల మార్పు వ‌ల్ల.. స్వేద‌గ్రంథులు ఎక్కువ‌గా ప‌నిచేసి ఎక్కువ మోతాదులో నూనెల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. అందుకే ఈ ద‌శ‌లో చాలామంది మొటిమ‌ల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అమ్మాయిల్లో 10 నుంచి 14, అబ్బాయిల్లో 12 నుంచి 16 సంవ‌త్స‌రాల వ‌ర‌కూ మొటిమ‌లు ఇబ్బందిపెడ‌తాయి. ఈ వ‌య‌సులో దాదాపు 80 శాతం మంది మొటిమ‌ల‌తో బాధ‌ప‌డ‌తార‌ని WebMD ప‌రిశోధ‌న‌లో తేలింది.

కాలుష్యం (Pollution)

అవును.. కాలుష్యం కూడా మొటిమ‌ల‌కు ఓ ప్ర‌ధాన కార‌ణ‌మే. అయితే ఇది నేరుగా మ‌న మొటిమ‌ల‌కు కార‌ణం కాదు. కానీ ఇందులోని విష‌ప‌దార్థాలు చ‌ర్మం పాడ‌య్యేందుకు కార‌ణ‌మ‌వుతాయి. ఇవి మ‌న చ‌ర్మంపై ఉన్న స‌హ‌జ నూనెలను త‌గ్గించి.. ర‌క్ష‌ణ పొర‌ను క్షీణింప‌జేస్తాయి. దుమ్మూ, ధూళి మ‌న చ‌ర్మంపై చేరి చ‌ర్మ‌రంధ్రాల‌ను త్వ‌ర‌గా మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవకాశాలుంటాయి.

Shutter stock

ADVERTISEMENT

ఆహార‌పు అల‌వాట్లు (Food Habits)

మ‌నం రోజూ తీసుకునే ఆహారం కూడా చ‌ర్మ ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది. మ‌నం నూనె ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకుంటే మొటిమ‌లు.. ఎక్కువ‌గా రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఒక నెల‌పాటు చ‌క్క‌టి డైట్ పాటిస్తూ వీట‌న్నింటికీ దూరంగా ఉంటే మొటిమ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. ఇదేదో టిప్ అనుకుంటున్నారేమో.. నూనె ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాలు మ‌న శ‌రీరంలో ఇన్సులిన్ స్థాయుల‌ను పెంచుతాయి.

ఇన్సులిన్ మ‌న చర్మంపై ప‌నిచేసి నూనెలు ఎక్కువ‌గా విడుద‌ల‌య్యేలా చేస్తుంది. దీనివ‌ల్ల మొటిమ‌లు ఎక్కువ‌గా వచ్చే అవ‌కాశాలుంటాయి. మొటిమ‌లు తగ్గించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌డు అన్నం, బ్రెడ్‌, చ‌క్కెర వంటివి త‌గ్గించండి. వీటి బ‌దులు పండ్లు, కూర‌గాయ‌లు, ముడి ధాన్యాలు ఎక్కువ‌గా తీసుకోండి. మీకే తేడా క‌నిపిస్తుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పిజ్జా బ‌దులు స‌లాడ్ తినాల్సిందే.

హార్మోన్ల అస‌మ‌తౌల్య‌త‌ (Hormonal Imbalance)

కేవ‌లం కౌమార్యంలోనే కాదు.. ఆ త‌ర్వాత కూడా హార్మోన్ల స్థాయుల్లో మార్పుల‌ను బ‌ట్టి మొటిమ‌లు రావ‌చ్చు. ముఖ్యంగా మ‌న శ‌రీరంలో ఆండ్రోజ‌న్ (టెస్టోస్టిరాన్‌) స్థాయులు ఎక్కువైన‌ప్పుడు మొటిమ‌లు ఎక్కువ‌గా రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. దీంతో పాటు రుతుక్ర‌మం, మెనోపాజ్ స‌మ‌యంలోనూ హార్మోన్ల‌లో మార్పుల వ‌ల్ల మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి.

ADVERTISEMENT

Shutter stock

ఒత్తిడి (Stress)

ఎప్ప‌టినుంచో ఆస‌క్తితో వేచిచూస్తున్న పార్టీకి ముందే.. పెద్ద మొటిమ వ‌చ్చి అందంతో పాటు ఆనందాన్ని కూడా చెడ‌గొడుతుంది. అయితే ఇలా మీకొక్క‌రికే కాదు.. చాలామందికి జ‌రుగుతుంటుంద‌ట‌. ఒత్తిడి ఎక్కువైన‌ప్పుడు మ‌న చ‌ర్మంలో స్వేద‌గ్రంథులు ఉత్తేజిత‌మై ఎక్కువ‌గా నూనెల‌ను విడుద‌ల చేస్తాయ‌ట‌. దీంతో మొటిమ‌లు స‌హజంగా వ‌స్తుంటాయి. అందుకే ప‌రీక్ష‌ల స‌మ‌యంలోనూ మ‌నకు మొటిమ‌లు ఎక్కువ‌గా రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.

మొటిమ‌లు తగ్గించేందుకు వివిధ మార్గాలు (Different Ways To Remove Pimple)

మొటిమ‌లు ఎందుకు వ‌స్తాయి.. మీ మొటిమ‌లు ఎలాంటివి.. అవి ఎందుకు వ‌చ్చాయి తెలుసుకున్నారు కాబ‌ట్టి.. వాటిని తొల‌గించుకోవ‌డం కూడా చాలా సుల‌భ‌మే.

ADVERTISEMENT

Shutter stock

మ‌నం శ‌రీరంలోని మిగిలిన భాగాల కంటే ముఖంపై ఉన్న చ‌ర్మం చాలా సున్నిత‌మైంది. మీకు ఇటీవ‌లే మొటిమ‌లు రావ‌డం ప్రారంభ‌మైతే.. స‌హ‌జ ఉత్ప‌త్తులు మీకు చాలా మేలు చేస్తాయి. ఇవి మీ చ‌ర్మానికి ఎలాంటి నష్టం క‌లిగించ‌కుండా మొటిమ‌ల‌ను తొల‌గిస్తాయి. మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటే.. మీ చ‌ర్మానికి జొజొబా నూనెను రుద్దండి. ఇది మ‌న చ‌ర్మంలో ఎక్కువ‌గా వ‌చ్చే నూనెల‌ను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు చ‌ర్మాన్ని కాపాడ‌తాయి.

మ‌రో మార్గం క‌ల‌బంద జెల్. ఇందులోని యాంటీఇన్‌ఫ్ల‌మేట‌రీ ఆమ్లాలు (కొలెస్ట‌రాల్‌, క్యాంపెస్ట‌రాల్‌, బి-సిటోస్టెరాల్‌), యాంటిసెప్టిక్ గుణాలు బ్యాక్టీరియానే కాదు.. ఫంగ‌స్‌, వైర‌స్‌ల‌ను కూడా నాశ‌నం చేస్తాయి. ఇంట్లోనే మంచి ఫేస్‌ప్యాక్ వేసుకోవాల‌నుకుంటే ప‌సుపు, తేనె, పెరుగుల‌తో ప్యాక్ వేసుకోండి. తేనెలోని యాంటీఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు చ‌ర్మాన్ని కాపాడితే, పెరుగు చ‌ర్మానికి మంచి ఎక్స్‌ఫోలియేట‌ర్‌గా ప‌నిచేస్తుంది. ప‌సుపు చ‌ర్మం రంగును పెంచుతుంది. ఈ మూడింటి కాంబినేష‌న్‌తో మీ చ‌ర్మంపై మొటిమ‌లే లేకుండా చేసుకోవ‌చ్చు.

హెర్బల్ ఉత్ప‌త్తులు (Herbal Products)

మీరు ఇంట్లో త‌యారుచేసుకునే ఫేస్‌ప్యాక్స్ వేసుకోవాల‌నుకోక‌పోతే.. మార్కెట్లో దొరికే హెర్బల్ ఉత్పత్తులు వాడండి. లోట‌స్ హెర్బ‌ల్స్‌, కామ ఆయుర్వేద‌, హిమాల‌యా, ఫారెస్ట్ ఎస్సెన్షియ‌ల్స్ వంటి బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను ఎంచుకోవ‌చ్చు. ఇవి సున్నిత‌మైన చ‌ర్మానికి కూడా స‌రిప‌డే ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేస్తాయి.

ADVERTISEMENT

 

ముఖం పై మొండి మచ్చలను ఇలా తొలగించుకోవచ్చు

Shutter stock

ADVERTISEMENT

మెడిసిన‌ల్ ఉత్ప‌త్తులు (Medical Products)

హెర్బ‌ల్ ఉత్ప‌త్తులు మాత్రమే కాకుండా.. మ‌న చ‌ర్మాన్ని మొటిమ‌ల నుంచి ర‌క్షించేందుకు చాలా ర‌కాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఉప‌యోగించే ముందు నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది. ఓర‌ల్ యాంటీబ‌యోటిక్స్‌ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ త‌గ్గుతుంద‌ని ప్ర‌ముఖ డెర్మ‌టాల‌జిస్ట్ అప‌ర్ణా సంతానం స‌ల‌హా ఇస్తున్నారు.

అంతేకాదు.. ఓర‌ల్ రెటినాయిడ్స్‌ని కూడా తీసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌లు పూర్తిగా త‌గ్గుముఖం ప‌డతాయ‌ట‌. ట్రెటినాయిన్‌, అడ‌ప‌లీన్‌, టాజారొటీన్ వంటివి ఎక్కువ‌గా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇవి మ‌న చ‌ర్మంపై ఎక్కువ‌గా ఉండే జిడ్డును తొల‌గించి మొటిమ‌లు రాకుండా ఆపుతాయి. అయితే వీటిని తీసుకునే ముందు వైద్యుల స‌ల‌హా త‌ప్ప‌నిస‌రి. ఇవి కాకుండా మొటిమలను తగ్గించేందుకు కాస్మెటిక్స్ కూడా లభిస్తున్నాయి.

Shutter stock

ADVERTISEMENT

ఆహార‌పు అలవాట్లు మార్చుకోవాలి (Changes In Food Diet)

మొటిమ‌లు రావ‌డానికి ఆహార‌పు అలవాట్లు కూడా ఒక కార‌ణమే. కాబ‌ట్టి వాటిని నివారించేందుకు మ‌న ఆహారంలో ఎక్కువ‌గా ఆరోగ్య‌క‌రమైన‌వి ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డాలి. నూనె ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్సులిన్ స్థాయులు పెరిగి మొటిమ‌లు ఎక్కువ‌య్యే ప్రమాదం ఉంటుంది. ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ‌గా ఉండే ఆహారం మొటిమ‌ల‌ను త‌గ్గిస్తుంది. అందుకే అవి ఎక్కువ‌గా ఉండే ఈ ప‌దార్థాల‌ను మ‌న ఆహారంలో భాగం చేసుకోవాలి. అవి

1. కూర‌గాయ‌లు
2. పండ్లు
3. ముడిధాన్యాలు
4. చేప‌లు
5. న‌ట్స్‌
6. సోయా ఉత్ప‌త్తులు

తీసుకోకూడ‌ని ప‌దార్థాలు

1. అన్నం
2. వైట్ బ్రెడ్‌
3. చ‌క్కెర‌
4. డైరీ ఉత్ప‌త్తులు

ADVERTISEMENT

మొటిమ‌లను మేక‌ప్‌‌తో (Makeup) ఎలా క‌వ‌ర్ చేయాలి (How To Cover Pimples With Makeup)

Shutter stock

మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి శాశ్వ‌త ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తూనే.. ఈలోపు ఎక్క‌డికైనా వెళ్లాల్సి వ‌స్తే.. తాత్కాలికంగా వాటిని మేక‌ప్‌‌తో (Makeup)   క‌వ‌ర్ చేసుకోవ‌చ్చు. మేక‌ప్ ఎలా వేసుకోవాలంటే..

1. ప్రైమ‌ర్ – పెయింటింగ్ ప్రారంభించేముందు.. కాన్వాస్‌ని శుభ్రంగా ఎగుడుదిగుడు లేకుండా చేసుకుంటాం క‌దా.. ఇదీ అలాంటిదే. చ‌క్క‌టి ప్రైమ‌ర్ చ‌ర్మ‌రంధ్రాల‌ను మూసేస్తుంది. చ‌ర్మంపై ఉన్న ముడ‌త‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను క‌వ‌ర్ చేసి మేక‌ప్‌ (Makeup) బేస్‌కి మంచి అందాన్ని అందిస్తుంది.

ADVERTISEMENT

2. క‌న్సీల‌ర్‌ – మీ చ‌ర్మ‌రంగు..కు ఇంకాస్త లైట్‌గా ఉండే క‌న్సీల‌ర్‌ని ఎంచుకొని మ‌చ్చ‌లు, న‌ల్ల‌ని వల‌యాలు ఉన్న ప్రాంతాల్లో దాన్ని ఉప‌యోగించాలి. క‌న్సీల‌ర్‌ని బాగా రుద్ద‌డం కాకుండా.. చేతి మునివేళ్ల‌తో కొద్దిగా అద్దిన‌ట్లుగా చేయ‌డం మంచిది.

3. ఫౌండేష‌న్ – మీ చ‌ర్మ రంగు మొత్తం ప్యాచీగా కాకుండా.. మొత్తం ఒకే రంగులో క‌నిపించేలా చ‌క్క‌గా ఫౌండేష‌న్ రుద్దుకోండి. మెడ‌ను కూడా మ‌ర్చిపోవ‌ద్దు.

మొటిమ‌లు తగ్గేందుకు పాటించాల్సిన చిట్కాలు (Home Remedies For Pimples)

ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన త‌ర్వాత.. బాధ‌ప‌డ‌డం కంటే అది రాక‌ముందే జాగ్ర‌త్త‌ప‌డ‌డం మంచిది. మొటిమ‌ల విష‌యంలో ఇది చాలా ప్ర‌ధానం. సాధార‌ణంగా మొటిమ‌లు ఏదైనా ముఖ్య‌మైన ఘ‌ట్టానికి ముందుగా రావ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. మేక‌ప్‌తో వీటిని క‌వ‌ర్ చేసుకోవ‌చ్చు. కానీ అంత పెద్ద మొటిమ‌ను మేక‌ప్‌తో క‌ప్పిపుచ్చ‌డం కాస్త క‌ష్ట‌మైన ప‌నే. అందుకే మొటిమ‌లు వ‌స్తున్నాయ‌న‌గానే.. రాత్రికి రాత్రే కొన్ని చిట్కాలు ఉపయోగిస్తే వెంటనే వీటిని త‌గ్గించుకోవ‌చ్చు. (home remedies for pimples):

ADVERTISEMENT

Shutter stock

మౌత్‌వాష్‌తో… (With Mouth Wash)

నోటిని చ‌క్క‌గా శుభ్రం చేసి బ్యాక్టీరియాను దూరంగా ఉంచ‌డమే కాదు.. మొటిమ‌ల‌ను త‌గ్గించేందుకు కూడా మౌత్‌వాష్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందుకోసం రాత్రి ఒక చుక్క మౌత్‌వాష్‌ని మొటిమ‌ల‌పై వేసి కాస్త రుద్ది ప‌డుకోండి. ఉద‌యానికి అది పూర్తిగా తగ్గిపోతుంది.

టూత్‌పేస్ట్‌తో… (With Tooth Past)

ప‌ళ్ల‌ను త‌ళ‌త‌ళా మెరిసేలా చేసే టూత్‌పేస్ట్.. మొటిమ‌ల‌ను త‌గ్గించ‌గ‌ల‌దంటే న‌మ్మ‌లేరేమో కానీ ఇది నిజం. అయితే రోజులో క‌నీసం రెండుమూడుసార్లు దీన్ని మొటిమ‌పై రాయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

Shutter stock

ఆస్ప్రిన్ మాత్ర‌తో.. (With Aspirin Tablet)

ఈ మాత్ర కేవ‌లం త‌ల‌నొప్పిని త‌గ్గించేందుకే కాదు.. మొటిమ‌ల్లాంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులోని యాంటీఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు మొటిమ‌ల‌ను త‌గ్గిస్తాయి. ఇందుకోసం ఒక టాబ్లెట్‌ని పొడిగా చేసి.. నీటితో క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మొటిమ‌పై రుద్దాలి. రాత్రంతా అలాగే ఉంచితే చాలు. ఉద‌యానికి మొటిమ‌లు త‌గ్గిపోతాయి.

వెల్లుల్లి ( Garlic)

వెల్లుల్లిలో ఎన్నో యాంటీబ్యాక్టీరియ‌ల్ గుణాలున్నాయి. అందుకే ఇది మొటిమ‌ల‌ను త‌గ్గించేందుకు కూడా చ‌క్క‌గా తోడ్ప‌డుతుంది. మొటిమ‌ల‌పై చిన్న వెల్లుల్లి ముక్క‌తో బాగా రుద్దండి. ఇలా చేస్తే చాలా తొంద‌ర‌గా మొటిమ‌లు త‌గ్గుతాయి.

ADVERTISEMENT

Shutter stock

ఈత‌కు వెళ్లండి.. (Swimming Also Helps)

ఈత‌కు, మొటిమ‌ల‌కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈత మంచి వ్యాయామం, మూడ్‌ని పెంపొందించే మార్గ‌మే కాదు. ఇది మొటిమ‌లు త‌గ్గించేందుకూ తోడ్ప‌డుతుంది. స్విమ్మింగ్ పూల్‌లోని క్లోరిన్ మొటిమ‌ల‌ను ఎండిపోయేలా చేస్తుంది. దీంతో అవి త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ఆల్క‌హాల్ రుద్దితే.. (Apply Alcohol)

ఆల్క‌హాల్‌లో యాంటీబ్యాక్టీరియ‌ల్, యాంటీఫంగ‌ల్ గుణాలు మొటిమ‌లు త్వ‌ర‌గా త‌గ్గిపోయేలా చేస్తాయి. మ‌రి, మీరు మొటిమ‌ల నుంచి విముక్తి పొందాలంటే.. ఆల్క‌హాల్‌తో మొటిమ‌లున్న ప్రాంతంలో రాస్తే స‌రి.

ADVERTISEMENT

Shutter stock

యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar)

యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. వివిధ చర్మ సమస్యలను దూరం చేసేందుకు దీన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మొటిమలు తగ్గించేందుకు కొద్దిగా దూదిని తీసుకొని దాన్ని యాపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి.. మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి.

తేనె, దాల్చిన చెక్క (Honey, Cinnamon)

తేనెలో కూడా యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ఇది మొటిమలను తగ్గించి చర్మానికి తేమను అందిస్తుంది. దాల్చిన చెక్క కూడా మొటిమలను తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఈ రెండింటినీ కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రుద్దడం వల్ల మొటిమలు తగ్గడం మనం గమనించవచ్చు.

ADVERTISEMENT

Shutter stock

టీట్రీ ఆయిల్ (Tea Tree Oil)

మొటిమలను తగ్గించడంలో ఎస్సెన్షియల్ ఆయిల్స్.. ముఖ్యంగా టీట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ వంటివి బాగా తోడ్పడతాయి. ఒక చర్మ తత్వం ఉన్నవారికి నప్పే ఉత్పత్తులు మరొకరికి నప్పవు. కానీ ఎస్సెన్షియల్ ఆయిల్స్ మాత్రం అందరికీ ఒకేలా పనిచేస్తాయి. దూదిని ఈ నూనెలో ముంచి మొటిమలు ఉన్న ప్రదేశంలో రుద్దాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మొటిమలు వేగంగా తగ్గుతాయి.

గ్రీన్ టీ (Green Tea)

గ్రీన్ టీలో ఎన్నో రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపించడంతో పాటు మొటిమలను కూడా తగ్గిస్తాయి. దీనికోసం గ్రీన్ టీని నీటిలో వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత దాన్ని చల్లార్చి దూదితో చర్మంపై రుద్దాలి. లేదంటే స్ప్రే బాటిల్లో వేసి ముఖానికి స్ప్రే చేయాలి. పొడిబారేంత వరకూ అలాగే ఉంచి నీటితో కడిగేసుకోవాలి.

చర్మ సంరక్షణ కోసం చిట్కాలు (Tips For Healthy Skin)

ADVERTISEMENT

Shutter stock

మీ ముఖంపై మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయంటే మీ జీవ‌న శైలి, స్కిన్‌కేర్ రొటీన్ ఎలా ఉంద‌ని ఓసారి ప‌రిశీలించుకోవాలి. కొన్ని అవ‌స‌ర‌మైన ప‌ద్ధ‌తుల‌ను రోజూ పాటించ‌డం వ‌ల్ల మొటిమ‌లు రాకుండా కాపాడుకోవ‌చ్చు.

అవేంటంటే..
1. రోజూ కనీసం రెండుసార్లు ముఖం క‌డుక్కోవాలి.
2. రోజూ స‌న్‌స్క్రీన్ ఉప‌యోగించండి.
3. ఫేషియ‌ల్ స్క్ర‌బ్‌కి దూరంగా ఉండండి.
4. మంచి మేక‌ప్ ఉత్ప‌త్తుల‌ను ఎంచుకోండి.
5. రోజూ రాత్రి ప‌డుకునే ముందు మేక‌ప్ తొల‌గించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.
6. రోజంతా నీళ్లు ఎక్కువ‌గా తాగుతూ ఉండండి.
7. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండండి.

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు (FAQs)

ADVERTISEMENT

Shutter stock

1. మొటిమలను ఎందుకు గిల్లకూడదు?

మొటిమ‌లు వ‌చ్చినప్పుడు వాటిని చేతితో గిల్ల‌డం చాలామంది చేసేదే. ఆ ప్రాంతంలో నొప్పి పెడుతుంటే గిల్లితే త్వ‌ర‌గా త‌గ్గుతుందేమోన‌ని చాలామంది అలా చేస్తుంటారు. కానీ ఇది చాలా త‌ప్పు. ఇలా గిల్ల‌డం వ‌ల్ల మొటిమ‌లు తగ్గ‌వు స‌రిక‌దా.. మ‌రింత‌గా పెరుగుతాయి. అంతేకాదు.. మొండి మ‌చ్చ‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది కూడా. అందుకే ఎంత గిల్లాల‌నిపించినా.. మొటిమ‌లు వ‌చ్చిన‌ప్పుడు ఆ ప్రాంతాన్ని అస‌లు ముట్టుకోకుండా ఉండ‌డ‌మే మంచిది.

Shutter stock

ADVERTISEMENT

2. మొటిమలు వస్తున్నాయంటే.. నేను నా చర్మాన్ని శుభ్రపర్చుకోవడం లేదని అర్థమా?

మొటిమలు రావడానికి కేవలం చర్మ సంరక్షణ పాటించకపోవడమే కారణం కాదు.. చర్మాన్ని గట్టిగా స్క్రబ్ చేసినా మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆల్కహాల్ ఉత్పత్తులు వాడడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. అప్పుడు కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో ఇవి హార్మోన్ల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మైల్డ్ సోప్, గోరు వెచ్చని నీటితో తరచూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమలను కొద్ది శాతం తగ్గించే వీలుంటుంది.

Shutter stock

3. పిజ్జా లేదా ఏదైనా ఆయిలీ ఫుడ్ తింటే మొటిమలు వస్తాయా?

మొటిమలు రావడానికి కారణం మన చర్మ రంధ్రాలు మూసుకుపోవడం. అంతేకానీ ఆయిలీ ఫుడ్ తినడం కాదు. అయితే చాలామంది పోషకాహార నిపుణులు.. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం ఉంటుంది. అంతేకానీ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల.. చర్మం ఆయిలీగా మారి మొటిమలు వస్తాయని చెప్పడానికి ఏమాత్రం ఆధారాలు లేవు.

ADVERTISEMENT

Shutter stock

4. టీనేజ్ తర్వాత.. నాకు మొటిమలు రావడం ఆగిపోతుందా?

సాధారణంగా పద్నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల వయసు వారిలో హార్మోన్లలో అసమతౌల్యత ఎక్కువగా ఉంటుంది. ఈ మార్పుల వల్ల వారిలో మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే టీనేజ్ తర్వాత మొటిమల సమస్య తగ్గిపోవాలని రూలేం లేదు. ముందే చెప్పుకున్నట్లు మొటిమలు రావడానికి చాలా కారణాలుంటాయి. కాబట్టి పెద్ద వయసు వారిలోనూ కొందరిలో మొటిమలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే మొటిమలకు కారణమయ్యే ఒత్తిడి, కాలుష్యం బారిన పడకుండా.. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతో హార్మోన్ల స్థాయిని కంట్రోల్లో ఉంచుకుంటే మొటిమలు రాకుండా కాపాడుకోవచ్చు.

 

ADVERTISEMENT

మీరు తెలుసుకోవలసిన మరికొన్ని ఇంటరెస్టింగ్ టాపిక్స్:

మొటిమల ద్వారా కలిగే మొండి మచ్చలుని ఎలా తగ్గించాలి?

ఆయుర్వేదం మీ అందాన్ని పెంచడానికి ఎంత చక్కగా ఉపయోగపడుతుందో తెలుసా?

చక్కని మృదువైన మెరిసే చర్మం కోసం ఇంటి చిట్కాలు

ADVERTISEMENT
16 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT