ADVERTISEMENT
home / సౌందర్యం
ఇలా చేస్తే.. నెల రోజుల్లో ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది

ఇలా చేస్తే.. నెల రోజుల్లో ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది

అందమైన, ఒత్తైన కేశ సంపదను కోరుకోని వారెవరుంటారో చెప్పండి? కేవలం కోరుకోవడం మాత్రమే కాదు.. కొందరు మంచి జుట్టు (Hair) ఉన్నవారిని చూసిన ప్రతిసారి బాధపడుతుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలు పాటిస్తూ.. రకరకాల ఉత్పత్తులు వాడేస్తుంటారు. కానీ ఇవన్నీ పక్కన పెడితే.. ఆరోగ్యకరమైన కేశ సంపదను పొందాలంటే.. కొన్నిసార్లు మన జీవన శైలిలో సైతం పలుమార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల  ఫలితం చాలా తొందరగా కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం కూడా ఈ చలికాలంలో (winter) జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిద్దాం. కేవలం నెల రోజుల్లో ప్రతిఫలం కనిపించేలా కొన్ని సూత్రాలను పాటించేద్దాం

1. వేడి నీటి స్నానం వద్దు..

చాలామంది చలికాలంలో.. బాగా కాగిన నీటితో తలస్నానం చేయాలని భావిస్తారు. అయితే ఇలా వేడి నీటితో స్నానం చేయాలని అనిపిస్తే.. కాస్త కంట్రోల్ చేసుకోవడం మంచిది. వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల మీ కుదుళ్ల పై ఒత్తిడి పెరగడంతో పాటు, చర్మంలోని తేమ మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ జుట్టును రాలిపోయేలా చేస్తుంది. అలా కాకుండా.. గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే తల పొడిబారి పోకుండా ఉంటుంది. కేవలం చలికాలం మాత్రమే కాదు.. ఏ కాలంలోనైనా గోరు వెచ్చని నీరే తలస్నానానికి మంచిది. 

2. నూనె పెట్టడం మరవద్దు..

సాధారణంగా వారానికి రెండు సార్లు తలకు నూనె పెట్టుకోవడం మంచిదంటే.. అదేదో పాతకాలం మాట అని భావిస్తారు. కానీ అలా చేయడం నిజంగానే మంచిది. తరచూ జుట్టుకు నూనె పెట్టుకోవడం వల్ల.. దానికి సరైన స్థాయిలో తేమ అందుతుంది. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. తలకు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడం మాత్రమే కాదు.. కుదుళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే వెంట్రుకలు తెల్లబడిపోవడం మొదలైన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే గోరు వెచ్చని నీటితో మసాజ్ చేసుకుంటే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. 

ADVERTISEMENT

3. ట్రిమ్ చేసుకోండి .

కొన్ని సార్లు మీ జుట్టును  పొట్టిగా కత్తిరించుకోవడం వల్ల.. అవి కొంచెం లావుగా కనిపించే వీలుంటుంది. అయితే ఇక్కడ మీ జుట్టును మరీ పొట్టిగా కత్తిరించుకోవాలని అర్థం కాదు. కానీ అప్పుడప్పుడూ కాస్త ట్రిమ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. అంతే కాదు..  జుట్టు చివర్లు చిట్లకుండా కూడా ఉంటాయి.

మీ కురులు ఒత్తుగా కనిపించాలా?? అయితే ఇలా చేయాల్సిందే..

4. కాస్త నెమ్మదిగా దువ్వండి.

కొన్ని సార్లు మన జీవన శైలి వల్ల కేశాలకు ఎలాంటి నష్టం కలుగుతుందో తెలుసా..? తలస్నానం చేయగానే జుట్టును దువ్వడం, డ్రయ్యర్‌తో బాగా ఆరబెట్టడం, కండిషనర్ ఉపయోగించకపోవడం వంటివి చేయడం వల్ల జుట్టు పాడవుతుంది. ఇదే పద్ధతి ప్రతీ రోజూ అనుసరిస్తే జుట్టు  పొడి బారిపోవడంతో పాటు రాలే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి పనులు మానేయడం మంచిది.

ADVERTISEMENT

5. స్టైలింగ్ టూల్స్ వద్దు..

కొన్నిసార్లు జుట్టును లావుగా, అందంగా కనిపించేలా చేసేందుకు మనం వాటిని కర్లింగ్ చేస్తాం. విభిన్నమైన హెయిర్ స్టైల్స్ వేసుకుంటాం. వివిధ రకాల స్టైలింగ్ టూల్స్ కూడా ఉపయోగిస్తాం. ఇవన్నీ మన జుట్టును బలహీనంగా మారుస్తాయి. దీనికి వేడి కూడా కారణం కావచ్చు. 

New Year Makeover Tips: ‘కొత్త’ సంవత్సరంలో.. మీ ‘కొత్త’ లుక్ కోసం.. ఇలా మేకోవర్ చేసేయండి

6. ఈ మార్పులు చేసుకోండి.

మంచి ఆహారం తినడం వల్ల..  కేశాల నిగారింపు పెరుగుతుందని మీకు తెలుసా? జన్యుపరమైన కొన్ని అంశాలను మనం మార్చలేకపోయినా.. మన ఆహారం గురించి మాత్రం మనం శ్రద్ధ వహించవచ్చు.  కొన్ని రకాల పోషకాలు తగ్గితే జుట్టు రాలిపోతుంది. అందుకే గుడ్లు, పాలకూర, చేపలు, చిలగడదుంపలు లాంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లబడుతుంది.

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.                                                    

02 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT