ADVERTISEMENT
home / Humour
New Year Resolutions 2020 : కొత్త సంవత్సరం వేళ.. కొత్తగా ఆలోచించడం నేర్చేసుకుందామా..!

New Year Resolutions 2020 : కొత్త సంవత్సరం వేళ.. కొత్తగా ఆలోచించడం నేర్చేసుకుందామా..!

How to Make (and Keep) a New Year’s Resolution

కొత్త సంవత్సరం అనగానే మనకు కొత్త ఎక్సైట్‌మెంట్ వచ్చేస్తుంది. మన కోసం ఇది కొత్త ఆనందాలనూ తీసుకొచ్చేస్తుంది. గత సంవత్సరం మనల్ని కొన్ని ఇబ్బందులకు గురి చేసి ఉండచ్చు. దాని ప్రభావం కొత్త సంవత్సరం వేళ.. మన మీద పడకుండా కొత్త తీర్మానాలు చేసుకోవడం సహజమే. అయితే న్యూ ఇయర్ రిజల్యూషన్‌ను అందరూ తీసుకున్నా.. దానిని పాటించేవారు మాత్రం చాలా తక్కువమందే.  

సాధారణంగా ప్రతి సంవత్సరం మనలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వాటిని పాటించేవారు మాత్రం అరుదు. కొన్నిసార్లు వాటిని పాటించాలని భావించినా.. ఫలితం కనిపించకపోతే నిరుత్సాహపడిపోతాం. అయినా అధైర్యపడవద్దు. మీరు కూడా ఈ ఏడాది సరికొత్త న్యూ ఇయర్ రిజల్యూషన్‌ను తీసుకుంటే.. దానిని అమలుపరిచే దిశగా ధైర్యంగా దూసుకెళ్లిపోండి. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అందుకు వీలైతే సరికొత్త పద్ధతులూ..  సులువైన పద్ధతులనూ పాటించేయండి.

1. రియలిస్టిక్‌గా ఉండండి.

ADVERTISEMENT

ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాక.. చాలా  వేగంగానే ఆ గమ్యాన్ని చేరుకోవాలని భావించకండి. ఇలా భావించే  చాలామంది పెద్ద పెద్ద టార్గెట్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ టార్గెట్స్ పూర్తి చేసే క్రమంలో  మానసికంగా కుంగిపోతుంటారు. కానీ అలా కాకుండా..   చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ.. మీ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. 

2. వివరాలతో కూడా

“వారానికి మూడు సార్లు యోగా సెంటర్‌కి వెళ్లాలి. అది కూడా ఆఫీస్ పూర్తయ్యక.. సరిగ్గా సాయంత్రం 7 గంటలకే వెళ్ళాలి”.. ఇలాంటి రిజల్యూషన్ ఏదైనా తీసుకోవాలని భావిస్తున్నారా..? అయితే వెరీ గుడ్.. “రోజూ సాయంత్రం యోగా చేసేస్తాను” అన్న దానికంటే… ఇది కాస్త రియలిస్టిక్‌గా ఉంటుంది. ఎవరికైనా కొత్తలో స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది.  అందుకే దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడం కన్నా.. స్వల్పకాలపు లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. దీనివల్ల మీకు ఎప్పుడైనా ఆలస్యమైతే.. మీ రిజల్యూషన్‌కి అక్కడితో బ్రేక్ పడకుండా ఉంటుంది.

3. కొలమానాలను బేరీజు వేసుకోవాలి

మీరు తీసుకునే రిజల్యూషన్ ఏదైనా సరే.. అది కొలమానాలను బేరీజు వేసుకోవాలి. ఒకవేళ బరువు తగ్గాలని మీరు రిజల్యూషన్ తీసుకుంటే.. “వచ్చే సంవత్సరానికి ఇన్ని కేజీలు తగ్గుతాను” అంటూ ఒక నిర్థారణకు వచ్చేయకండి. “నెలకి ఓ రెండు కేజీలు తగ్గడానికి ప్రయత్నిస్తాను” అని ఒక గోల్ పెట్టుకొని.. దాన్ని సాధించడానికి ప్రయత్నించండి. అలాగే పుస్తకాలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలంటే.. “రాబోయే సంవత్సరానికల్లా పది పుస్తకాలు చదవాలి” అని కాకుండా నెలకో పుస్తకం పూర్తి చేయాలనే నియమం పెట్టుకుంటే సరిపోతుంది.

ADVERTISEMENT

4. షెడ్యూల్ వేసుకోండి.

మీరు ఒక కొత్త రిజల్యూషన్ తీసుకొని.. కొత్త పనిని ప్రారంభించే ముందు.. కొన్ని రోజులు మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే దీన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి. ముఖ్యంగా రిమైండర్స్ పెట్టుకోవడం లాంటివి చేయడం వల్ల మోటివేషన్ తగ్గకుండా ఉంటుంది. 

5. అవసరం ఉందా? ఆలోచించండి..

మీరు తీసుకున్న రిజల్యూషన్ వల్ల.. మీ జీవితంలో ఏదైనా ఉపయోగం ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు మీరు ఫోన్ చాలా ఎక్కువగా వాడుతుంటే దాన్ని తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, మంచి పోషక ఆహారం తీసుకోవడం, బరువు తగ్గడం వంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. పుస్తకాలు చదవడం, గార్డెనింగ్ లాంటి హాబీలని కొనసాగించడం వల్ల.. మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవితంలో మీ రిజల్యూషన్ అవసరం ఎంత ఎక్కువగా ఉంటే.. మీరు దాన్ని పాటించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

6. సమస్యలు గుర్తించండి.

మీరు రిజల్యూషన్ తీసుకోగానే.. ఎలాంటి సమస్యా లేకుండా అంతా సజావుగా సాగిపోతుందని చెప్పడం సరికాదు. ప్రతి దానికి అడ్డంకులు ఉంటాయి. ఇందులో కొన్నిసార్లు మన రిజల్యూషన్‌కి మన బద్ధకమే శత్రువుగా మారుతుంది. అందుకే మనం మన లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో ముందు గుర్తించి.. వాటిని పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు కొన్ని మైలు రాళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

7. స్నేహితులతో పంచుకోండి.

చాలామంది ఓ రిజల్యూషన్ తీసుకుంటారు. కానీ కొంత కాలం కాగానే బద్ధకించి దాన్ని వదిలేస్తుంటారు. ఇలాంటివారు తమకు బాగా నమ్మకస్తులైన స్నేహితులకు తమ రిజల్యూషన్ గురించి చెప్పాలి. అప్పుడు వారు తమకు వీలైనప్పుడల్లా.. మీకు దానిని గురించి గుర్తు చేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. పైగా మీరు కూడా ఒకరు పదే పదే ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నారనే భయంతోనైనా.. ఆ రిజల్యూషన్‌ను కొనసాగిస్తారు. 

8. బహుమతి అందించుకోండి.

మీ లక్ష్యానికి మీరు దగ్గరికి వెళ్తునప్పుడు.. అలాగే ఒక్కో అడుగు ముందుకేసినప్పుడల్లా.. మీకు మీరు ఓ మంచి బహుమతిని అందించుకోండి. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందన్న విషయంతో పాటు.. మీ దారిలో ముందుకెళ్లేందుకు అది మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

16 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT