ADVERTISEMENT
home / Health
మీ రుతుస్రావం మీ శరీరం గురించి వివరిస్తుంది.. ఎలాగో తెలుసా?

మీ రుతుస్రావం మీ శరీరం గురించి వివరిస్తుంది.. ఎలాగో తెలుసా?

రుతుస్రావం.. స్త్రీలందరికీ ఉండే ఓ వరం అని చెప్పుకోవచ్చు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా.. పిరియడ్స్ (periods) ఆడవారి ఆరోగ్యానికి ప్రతీక అనేది సత్యం. అయితే మీ రుతుస్రావం ఏ రంగులో ఉంటోందో మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామందికి దీని గురించి తెలీదు. ఎందుకంటే రుతు స్రావం అంటే రక్తం కాబట్టి అది ఎలాగూ ఎరుపు రంగులోనే ఉంటుంది అని వారంతా అనుకుంటూ ఉంటారు.

కానీ కొన్నిసార్లు ఈ రంగు పింక్, బ్రౌన్, ఆరెంజ్ వంటి రంగుల్లో కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలను గురించి చెబుతుంది అంటూ.. మీ పీరియడ్స్ సమయంలో ఏ రంగులో బ్లీడింగ్ జరుగుతోందో గమనించమని కోరుతున్నారు గైనకాలజిస్టులు. మరి, బ్లీడింగ్ (bleeding) ఏ రంగులో ఉంటే ఏ వ్యాధికి సంకేతం అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు

ఎరుపు రంగులో మీ రుతుస్రావం ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. దీని అర్థం మీ గర్భాశయం, అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నాయని.. మీరు బిడ్డకు జన్మనివ్వడానికి వీలవుతుంది అని. ఈ తరహా రక్తస్రావం అంటే.. పిరియడ్స్ రాగానే గర్భాశయం నుంచి అప్పుడే బయటకు వచ్చిన రక్తం అన్నమాట. ఇలాంటప్పుడు రక్తస్రావం కాస్త ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటుంది.

ADVERTISEMENT

బ్రౌన్ రంగు

ఒకవేళ మీ బ్లీడింగ్ ఎరుపు రంగులో కాకుండా.. బ్రౌన్ రంగులో ఉంటే మీ గర్భాశయంలో రక్తం నిల్వ ఉండి.. రుతుస్రావం రూపంలో బయటకు వస్తోందని అర్థం. ఈ తరహా రక్తస్రావాన్ని ఎక్కువగా ఉదయం పూట గమనించవచ్చు. మీ రుతుస్రావం బ్రౌన్ రంగు ఉంటే ప్రమాద సూచికలు ఉన్నట్లు లెక్క.  పిరియడ్స్ సమయంలో అధిక నొప్పితో పాటు.. రక్తం గడ్డలుగా రావడం వంటివన్నీ కనిపిస్తుంటే.. మీ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. వీటితో పాటు ఏదైనా వాసన వస్తుంటే.. ఏదో పెద్ద సమస్యే ఉందని భావించి డాక్టర్‌ని సంప్రదించాలి.

నారింజ రంగు

మన గర్భాశయంలోని రక్తం.. అందులోని ఇతర స్రావాలతో కలిసి బయటకు వస్తే అది నారింజ రంగులో కనిపిస్తుంది. ఇలాంటిది కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది కాకుండా ఒకవేళ బ్లీడింగ్ వాసనతో ఉంటే.. గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించాలి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండి.. అది రక్తంతో కలవడం వల్లే ఇలాంటి రంగులో రుతుస్రావం కనిపిస్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో చెక్ చేయించుకోవడం మంచిది.

ADVERTISEMENT

ఎరుపు రంగు గడ్డలతో..

సాధారణంగా ప్రతి నెల పిరియడ్స్ సమయంలో మన గర్భసంచి లోపల ఉన్న పొర తొలగిపోయి.. కొంత రక్తంతో కలిసి బయటకు వచ్చేస్తుంది. పొర కాబట్టి చిన్న చిన్న గడ్డల్లాంటివి సహజంగా కనిపిస్తుంటాయి. కానీ ఈ గడ్డలు మరీ పెద్దగా ఉంటే మాత్రం.. కాస్త జాగ్రత్తపడాల్సిందే. ఇది హార్మోన్ల అసమతౌల్యత వల్ల జరుగుతుంటుంది. కొన్ని సమయాలలో ఈ పెద్ద పెద్ద రక్తపు గడ్డలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఇలాంటివి అండాశయాల్లో సిస్టులను సూచిస్తాయి. ఇలాంటివి కనిపించినప్పుడు హార్మోన్ల అసమతౌల్యతను తగ్గించేందుకు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

గులాబీ రంగు

ఒకవేళ మీ పిరియడ్స్ గులాబీ రంగులో ఉంటే.. మీరు తగినంత పోషకాహారం తీసుకోవట్లేదు అని అర్థం. లేదా మీ శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయులు తక్కువగా ఉండడం కూడా దీనికి కారణం కావచ్చు. ఇలాంటి బ్లీడింగ్ కనిపించినప్పుడు లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

ADVERTISEMENT

బూడిద లేదా నలుపు రంగు

బూడిద లేదా నలుపు రంగులో రుతుస్రావం జరిగితే..  అది చాలా పెద్ద సమస్య అని గుర్తించాలి. ఇలాంటి బ్లీడింగ్ కనిపించినప్పుడు మహిళలు చాలా నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి గర్భధారణలో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పిరియడ్స్ వస్తున్నాయంటే.. ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నట్లు అనుమానించాలి. ఎండోమెట్రియోసిస్ అంటే.. గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియం అనే పొర గర్భాశయం బయట పెరగడం అన్నమాట. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు చాలా ఎక్కువ నొప్పి పుడుతుంది. కేవలం సాధారణ సందర్భాల్లోనే కాదు.. సెక్స్ సమయంలో చాలా ఎక్కువ నొప్పి వస్తుంటే ఎండోమెట్రియోసిస్ అని అనుమానించవచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
29 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT