ADVERTISEMENT
home / DIY Life Hacks
మన ప్రాణాధారం నీరు.. దాన్ని పొదుపు చేయడం ఎలాగో మీకు తెలుసా?

మన ప్రాణాధారం నీరు.. దాన్ని పొదుపు చేయడం ఎలాగో మీకు తెలుసా?

నీరు (water).. సమస్త ప్రాణ కోటికి ఇది ప్రాణాధారం. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. మన భూమిపై ఒక వంతు నేల ఉంటే మరో మూడు వంతుల పాటు నీళ్లే ఉన్నాయి. కానీ ఆ నీరు మనం తాగడానికి, ఉపయోగించుకోవడానికి పనికి రాదు. భూమిపై ఉన్న కొద్ది పాటి నీటిని మాత్రమే మన అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. జనాభా పెరుగుతూ పోతుండడం వల్ల నీటి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ పోతూ ఉంది. అందుకే మన అవసరాలకు.. భవిష్యత్ తరాలకు నీరు సరిపోవాలంటే నీటి వృథాని అరికట్టాల్సిందే. మరి, నీటిని వృథా కాకుండా ఎలా కాపాడుకోవాలో, ఎలా పొదుపు (save) చేయాలో.. దాని వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం?

ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా నీటి కరువు ఏర్పడుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం నీటిని పొదుపు చేయడం తెలియకపోవడమే..ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడినా సరే.. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల మామూలు కంటే ఎక్కువ కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుందట. దీన్ని తగ్గించేందుకు వ్యక్తులుగా మనం ఉపయోగించే నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు మొక్కలు నాటడం, నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచడం వంటివి చేయాలి.

ADVERTISEMENT

నీటికి సంబంధించి ఈ గణాంకాలు చూడండి..

భూమ్మీద 70 శాతం నీటితో నిండి ఉంది. అంటే మిగిలిన ముప్ఫై శాతం నేల ఉందన్నమాట. అందులోనే అడవి, కొండలు వంటివన్నీ నిండి ఉంటాయి. మన భూమ్మీద 70 శాతం నీళ్లే ఉన్నాయి. కానీ ఆ నీటిని మొత్తం మనం వినియోగించుకోలేం. భూమ్మీద ఉన్న నీటిలో 97.5 సముద్రపు నీరే.. అవి మన ఉపయోగానికి పనికిరావు. మిగిలిన 2.5 శాతం నీటిని మాత్రమే మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ నీటిలోనూ ఎక్కువగా గ్లేషియర్లు, మంచుకొండల రూపంలో ఉంది. వాటిని వినియోగించుకోలేం. మిగిలిన నీటిని ఉపయోగించుకోవచ్చు.

మన దేశం 24 శాతం మేర భూగర్భ జలాలను వినియోగించుకుంటోంది. భారత దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. కానీ ఇంత జనాభాకి ఈ నీరు సరిపోదు. నీరు తగ్గిపోవడం వల్ల వాతావరణంలో కూడా మార్పులు వస్తున్నాయి. గణాంకాల ప్రకారం మన దేశంలోని 60 మిలియన్ల మంది నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. 2050 నుంచి కరువు బారిన పడి బిలియన్ల మంది బాధపడతారని గణాంకాలు చెబుతున్నాయి. 2040 వరకూ ప్రపంచంలోని 33 దేశాల్లో నీటి కొరత ఏర్పడుతుందట.

ADVERTISEMENT

జల్ శక్తి అభియాన్ క్యాంపెయిన్

మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ శక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నీటి యొక్క సహజమైన వనరులను కాపాడేందుకు దీన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశంలోని 255 జిల్లాలను ఎంపిక చేసుకొని ఆ జిల్లాలకు అడిషనల్, కో సెక్రెటరీస్ ని ఏర్పాటు చేశారు. వారు ఆయా జిల్లాల్లో ఈ నీటి పొదుపు స్కీమ్ ని అమలు పరుస్తారు. 1592 తాలూకాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అక్కడున్న చెరువులను కాపాడేందుకు వీరు ప్రయత్నిస్తారు. ఈ స్కీమ్ లో భాగంగా సెంట్రల్, స్టేట్ వాటర్ రిసోర్సెస్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, వాటర్ ఇంజినీర్లు, ఆఫీసర్లు వంటి వారంతా ఈ స్కీమ్ లో భాగంగా పనిచేస్తున్నారు.

ADVERTISEMENT

నీటిని పొదుపు చేయడం ఎలా?

నీటిని పొదుపు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మనం రోజూ చేసే పనుల్లోనే కాస్త జాగ్రత్త వహిస్తే చాలు.. రోజులో మనం ఉపయోగించే నీటి మొత్తాన్ని కొద్దిగా తగ్గిస్తే చాలు.. దీనికి మనం ఇంట్లోని బాత్రూం, కిచెన్.. మిగిలిన చోట్ల ఉపయోగించే నీటి మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలంతే..

బాత్రూంలో నీటిని ఎలా పొదుపు చేయాలంటే..

1. బకెట్ ని ఉపయోగించడం

స్నానం చేయడానికి షవర్ ని ఉపయోగించడం వల్ల ఎక్కువ నీళ్లు వృథా అవుతాయి. అందుకే స్నానం చేసేందుకు బకెట్ ని ఉపయోగిస్తే సరిపోతుంది.బాత్ టబ్, షవర్ వంటివి ఉపయోగించి నీళ్లు ఎక్కువగా వృథా చేయడం కంటే ఇలా బకెట్ తో స్నానం చేయడం మంచిది.

ADVERTISEMENT

2. కుళాయి కట్టేయండి.

రోజూ మనం బ్రష్ చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో నీళ్లు ఉపయోగించాల్సి వస్తుందని కుళాయి ఆన్ చేసి ఉంచుతాం. దానివల్ల చాలా నీరు వృథా అవుతుంది. అందుకే కుళాయి కట్టేసి మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేసి నీటిని వాడుకోవడం వల్ల చాలా నీళ్లు ఆదా అవుతాయి. ఇలా ఇంట్లో అందరూ చేయడం వల్ల సగటున రోజూ పదమూడు లీటర్ల నీరు ఆదా అవుతాయట.

3. ఇలాంటి సమయాల్లోనూ..

కేవలం బ్రషింగ్ సమయంలో మాత్రమే కాదు.. ముఖం కడుక్కునేటప్పుడు, షేవింగ్ చేసుకునేటప్పుడు నీళ్లు అలా వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల నీళ్లు వృథా అవుతాయి. దీంతో పాటు తరచూ కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడానికి బదులుగా రోజుకి సగటున రెండు లేదా మూడు సార్లు మాత్రమే చేయడం వల్ల నీటిని ఆదా చేసే వీలుంటుంది. అలాగే ఫ్లష్ చేయడానికి కూడా తక్కువ నీటిని ఉఫయోగించాలి. ఇలా చేయాలంటే ఫ్లష్ ట్యాంక్ లో కొంత భాగం మేర ఏదైనా ప్లాస్టిక్ డబ్బాతో కవర్ చేస్తే అందులో నీళ్లు తక్కువగా పట్టి ఫ్లష్ ఉపయోగించిన ప్రతిసారి తక్కువ నీళ్లు ఉపయోగించవచ్చు.

ADVERTISEMENT

4. లీక్ అయ్యే నీటికి అడ్డుకట్ట వేయండి.

మనం ఉపయోగించే కుళాయిలు కొన్ని రోజుల తర్వాత పాతవై పోతాయి. ఇలాంటప్పుడు అవి లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. పైప్స్ జాయింట్ల దగ్గర కూడా అప్పుడప్పుడూ అలా లీక్ అవుతుంటాయి. మీ ఇంట్లో ఇలా జరుగుతుంటే ఆ లీకేజీలను అడ్డుకోవడానికి కొత్త కుళాయిలు పెట్టడం వంటివి చేయాలి. సెకనుకు ఒక చుక్క చొప్పున అయినా ఏటా 10,200 లీటర్ల నీరు వృథా అవుతుంది. కాబట్టి వీటికి ఎంత త్వరగా అడ్డుకట్ట వేస్తే అంత మంచిది.

5. టెక్నాలజీ ఉపయోగించండి..

ప్రస్తుతం ఉన్న కొత్త టెక్నాలజీ కుళాయిలను ఇంట్లో ఉపయోగించడం వల్ల నీటి వినియోగం తగ్గినా పని మాత్రం అంతే వేగంగా జరుగుతుంది. మైక్రో ప్రాసెసింగ్ టెక్నాలజీ వల్ల నీరు నిమిషానికి ఆరు వందల మిల్లీ లీటర్ల మేర ఆదా అవుతుందట. దీనివల్ల రోజూ ఎంతో నీరు వృథా కాకుండా చూసుకోవచ్చు. ఇక సెన్సార్ లను ఫిట్ చేయడం వల్ల మనం చేతులు పెట్టినప్పుడే నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా నీరు వృథాగా పోకుండా కాపాడుకోవచ్చు.

ADVERTISEMENT

కిచెన్ లో ఎలా కాపాడుకోవాలంటే..

1. ఆ నీటిని మళ్లీ వాడండి.

కిచెన్ లో ఆర్ ఓ ఉపయోగించేవారు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు. ఇది నేరుగా కుళాయి నుంచి నీళ్లు తీసుకొని దాన్ని తాగే నీటిగా తయారుచేస్తుంది. ఇలా తయారు చేసే క్రమంలో కొంత నీటిని వృథాగా వదిలేస్తుంది. చాలామంది ఈ నీటిని సింక్ లోకి వదిలేస్తుంటారు. అయితే ఇలా వదిలేయకుండా ఆ నీటిని బకెట్ లో పట్టి వాటిని కూరగాయలు కడిగేందుకు, గిన్నెలు కడిగేందుకు ఉపయోగించడం వల్ల నీటిని పొదుపు చేసినవారవుతారు.

2. గిన్నెలు కడిగే సమయంలో..

ADVERTISEMENT

గిన్నెలను వీలైనంత ఎక్కువగా చేత్తోనే కడిగేందుకు ప్రయత్నించండి. డిష్ వాషర్ ఉపయోగించడం వల్ల ఎక్కువ నీరు వృథా అవుతాయి. ఒకసారి డిష్ వాషర్ ఆన్ చేస్తే ఎనిమిది లీటర్ల నీళ్లు ఖర్చవుతాయి. అందుకే గిన్నెలను చేత్తోనే కడిగేయాలి. అప్పుడొకటి ఇప్పుడొకటి కాకుండా అన్ని గిన్నెలు ఒకేసారి కడగడం వల్ల తక్కువ నీళ్లు ఖర్చవుతాయి.

3. పండ్లు కూరగాయలు కడిగేటప్పుడు

పండ్లు, కూరగాయలు కుళాయి కింద పెట్టి కడిగితే చాలా నీళ్లు వృథా అవుతాయి.. దీనికి బదులుగా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి అందులో కూరగాయలన్నీ కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నీళ్లను మరోసారి ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ నీటిని గిన్నెలు కడిగేందుకు లేదా గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. ఇలాగే గిన్నెలు కడిగిన నీళ్లను కూడా బకెట్ లో పట్టి వాటిని కూడా గార్డెన్ లో మొక్కలకు పోయడం వల్ల చాలా నీటిని పొదుపు చేయవచ్చు.

4. వంట చేసేటప్పుడు ఇలా..

ADVERTISEMENT

వంట చేసేటప్పుడు ఎక్కువ నీటిని పోసి ఉడికించడం వల్ల ఆ తర్వాత ఆ నీటిని వృథా గా ఒంపేయాల్సి వస్తుంది. దీంతో కూరగాయలు, ఆకుకూరల్లోని పోషకాలు కూడా నీటి ద్వారా వెళ్లిపోతాయి. కాబట్టి వీలైనంత తక్కువ నీళ్లు పోసి లేదా ఆవిరిపై ఉడికించడం వల్ల నీరు వృథా కాకుండా చూసుకోవచ్చు. దీంతో పాటు మూత పెట్టి ఉడికించడం వల్ల నీరు ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

బట్టలుతికేటప్పుడు ఇలా పొదుపు చేయండి..

1. ఎక్కువ బట్టలు ఉన్నప్పుడే..

చాలామంది ఏ రోజు బట్టలు ఆరోజు ఉతుకుతూ ఉంటారు. మీ ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉంటే ఫర్వాలేదు కానీ మరీ తక్కువ మంది ఉండి రెండు మూడు దుస్తులు మాత్రమే ఉంటే రోజూ బట్టలు ఉతక్కపోవడం మంచిది. రెండు రోజులు లేదా మూడు రోజులకోసారి మెషీన్ నిండుగా ఉన్నప్పుడే బట్టలు ఉతకండి. దీనివల్ల మీకు పని తగ్గడంతో పాటు నీళ్లు కూడా తక్కువగా అవసరం అవుతాయి.

ADVERTISEMENT

2. జీన్స్ తక్కువగా ఉతకండి.

సాధారణంగా చాలామంది రోజూ వేసుకున్నప్పుడే జీన్స్ ని ఉతకడానికి ప్రయత్నిస్తారు. కానీ జీన్స్ ఉతికేందుకు మాత్రం చాలా ఎక్కువ నీళ్లు అవసరం అవుతాయి. అందుకే నాలుగైదు సార్లు వేసుకున్న తర్వాత ఒకసారి జీన్స్ ని ఉతకండి. దీనివల్ల నీళ్లు పొదుపు అవ్వడంతో పాటు జీన్స్ కూడా ఎక్కువ కాలం పాటు మన్నుతుంది.

3. పాతబడితే మార్చేయండి.

ఒకవేళ మీ వాషింగ్ మెషీన్ పాతబడిపోయి తరచూ పనిచేయడానికి మొరాయిస్తుంటే దాన్ని మార్చేసి కొత్తది తెచ్చుకోవడం మంచిది. పాత వాషింగ్ మెషీన్ లో నీళ్లు లీక్ అవుతాయి. కొత్త వాషింగ్ మెషీన్ కొనడం వల్ల నీరు వృథా కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే తక్కువ నీటితో ఎక్కువ బట్టలు ఉతికే మంచి కంపెనీ వాషింగ్ మెషీన్ ని ఉపయోగించండి.

ADVERTISEMENT

4. ఎక్స్ ట్రా గా వద్దు..

చాలామంది బట్టలు బాగా శుభ్రం అవ్వాలని ఎక్కువ సార్లు నీళ్లు పోసి స్పిన్ చేస్తారు. సాధారణంగా రెండు సార్లకు బట్టలు పూర్తిగా శుభ్రమవుతాయి. దానికంటే ఎక్కువసార్లు వాషింగ్ మెషీన్ ఆన్ చేయడం వృథా తప్ప మరో ఉపయోగం లేదు. అందుకే ఉతికిన తర్వాత నీళ్లు పోసి స్పిన్ చేసి ఆ తర్వాత డ్రై చేయడం మంచిది.

5. చేత్తో ఉతికితే ఇలా చేయండి.

వాషింగ్ మెషీన్ కాకుండా మీరు చేత్తో బట్టలు ఉతుకుతూ ఉంటే చల్లని నీటిని ఉపయోగించండి. చల్లని నీటిని ఉపయోగించడం వల్ల మరకలు త్వరగా వదులుతాయి. మురికి కూడా తొందరగా వదిలిపోతుంది. బట్టలు నానబెట్టిన నీటిని కార్ కడిగేందుకు ఉపయోగించండి. ఆపై మామూలు నీటితో ఉతకడం వల్ల నీళ్లు పొదుపు అవుతాయి.

ADVERTISEMENT

ఇంటి బయట ఇలా పొదుపు..

1. నీరు పొంగి పొర్లకుండా చేయండి.

మోటర్ వేసి ట్యాంక్ నిండే వరకూ ఉంచడం ప్రతి ఒక్కరూ చేసే పనే. కానీ ట్యాంక్ నిండిందో లేదో తెలుసుకోవడానికి నీళ్లు ఓవర్ ఫ్లో అయ్యే వరకూ ఆగుతారు చాలామంది. అయితే ఇలా కాకుండా ఎన్ని నిమిషాలకు ట్యాంక్ నిండుతుందో లెక్కపెట్టి అన్ని నిమిషాలకు మోటర్ ఆఫ్ చేయడం లేదా ట్యంక్ నిండిందా? లేదా? చెక్ చేసి ఆఫ్ చేయడం వల్ల నీళ్లు వృథాగా పోకుండా చూడొచ్చు.

2. బకెట్ తో కడగండి.

ADVERTISEMENT

కార్ కడగడానికి పైప్ ని కాకుండా బకెట్ ని ఉపయోగించండి. బట్టలు నానబెట్టిన తర్వాత మిగిలిన సబ్బు నీళ్లతో ముందు ఒకసారి తుడిచి ఆ తర్వాత మంచి నీళ్లతో కడగడం వల్ల తక్కువ నీటితో కార్ ని కడగడం పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలిన మురికి నీటిని మొక్కలకు పోసేయండి.

3. సాయంత్రాలు నీరు పట్టండి.

మొక్కలకు నీళ్లు పట్టడానికి పైప్ ని కాకుండా బకెట్ మగ్ తో పోయడం మంచిది. అయితే సాయంత్రాలు, లేదా ఉదయం మాత్రం పట్టడం వల్ల నీటిని పూర్తిగా మొక్కలే పీల్చుకునే వీలుంటుంది. కొబ్బరి పీచు వేయడం వల్ల నీళ్లు అలా పట్టి ఉంచుతుంది. దీంతో పాటు వీలైనంత ఎక్కువగా మిగిలిన పనులు చేయగా మిగిలిన నీటిని ఉపయోగించండి.

4. కడగడం తగ్గించండి.

ADVERTISEMENT

సాధారణంగా ఇల్లు, ఇంటి బయట ఉన్న స్థలం శుభ్రం చేయడానికి చాలామంది రోజూ నీటిని ఉపయోగిస్తారు. ఇంటిని రోజూ తుడవడంతో పాటు ఇంటి బయట, మెట్లను కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నీరు వృథా అవుతుంది. ఇలా చేయడం కంటే రోజూ చీపురుతో ఊడ్చి దుమ్మును తుడిచేసి.. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తుడవడం వల్ల చాలా మేరకు నీళ్లు పొదుపు చేసుకోవచ్చు.

5. గ్రే వాటర్ సిస్టమ్..

ఇంట్లో మిగిలిన నీరు వృథా కాకుండా వేస్ట్ వాటర్ రీ యూజింగ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల నీళ్లు చాలా మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు. ఈ నీటిని మొక్కలకు ఉపయోగించడంతో పాటు బాత్రూంలలో ఫ్లష్ చేయడానికి కూడా వాడవచ్చు. ఇలా చేయడం వల్ల రోజూ వందల లీటర్ల నీళ్లు వృథా కాకుండా కాపాడుకునే వీలుంటుంది.

ADVERTISEMENT

నీటిని పొదుపు చేసేందుకు టెక్నికల్ పద్ధతులు

టెక్నాలజీ మారుతున్న కొద్దీ నీటిని ఒడిసిపట్టి పొదుపు చేసేందుకు ఎన్నో టెక్నికల్ పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. వీటిని ఉపయోగించి నీటిని పొదుపు చేసే వీలుంటుంది. ఇందులో కొన్ని పద్ధతుల ద్వారా మనం ఎంత నీటిని ఉపయోగిస్తున్నాం అని తెలుసుకొని దాన్ని తగ్గించే వీలు కూడా ఉంటుంది.

1. వాన నీటిని ఒడిసిపట్టడం

వర్షం పడినప్పుడు నీరు వృథాగా పోవడం మనం చూస్తుంటాం. ఇది చాలా కాలం పాటు భూమిలోకి ఇంకకుండా ఉండిపోతుంది. మన చుట్టుపక్కల అసలు నీరు భూమిలోకి ఇంకే వీలు లేకుండా చేసుకుంటున్నాం. కానీ వర్షం ద్వారా పడిన నీరు చాలా శుభ్రమైనవి. వీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. దీనికోసం వర్షం పడిన నీరంతా ఒక డ్రమ్ములోకి లేదా పెద్ద ట్యాంక్ లోకి చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవల్ పెరుగుతుంది. ఒక మీటర్ పొడవు, వెడల్పుతో పాటు 1.5 మీటర్ల లోతు ఉండేలా ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి అందులో ఇసుక పోసి నీరు భూమిలోకి ఇంకేలా చేయాలి. ఇలా చేయడం వల్ల నీరు వృథా అవ్వకుండా చూసుకోవచ్చు.

2. చెరువుల నీరు

నీటిని పొదుపు చేయడానికి మనం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. నీటి నిల్వను కాపాడుకునేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా చెరువులు తవ్వించడం, పూడికలు తీయడం వంటివి ప్రతి సంవత్సరం చేస్తుంది. ఈ స్థలంలో ఎలక్ట్రిసిటీ, చెట్లు వంటివి లేకుండా చూసుకోవాలి. వీటితో పాటు చెరువుల స్థలంలో ఎలాంటి నిర్మాణాలు ఏర్పాటు కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.

ADVERTISEMENT

3. కుంటలు తవ్వడం

నీటిని కుంటల రూపంలో పొదుపు చేయడం వల్ల వాటిని తర్వాత నెలల్లో ఉపయోగించుకొనే వీలుంటుంది. అందుకే ప్రతి ఊరిలో పొలాల మధ్యలో చిన్న చిన్న కుంటలు తవ్వి వాటిలో నీరు చేరుకునేలా కాలువలు ఏర్పాటు చేయాలి. అయితే దీని గురించి ముందుగా లోకల్ అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. నీరు భూమిలోకి ఇంకకుండా అలాగే ఉండాలంటే కింద టార్పాలిన్ కవర్ కప్పి వాన నీరు అందులో చేరేలా చేయవచ్చు.

4. ఎయిరేటర్స్

మామూలుగా మనం ఇంట్లో ఉపయోగించే నీటిని పైపుల ద్వారానే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కుళాయిలు ఉపయోగించడం ద్వారానే అన్ని పనులు చేస్తుంటాం. అయితే ఇలా మనం ఉపయోగించే అన్ని పనుల్లో దాదాపు యాభై శాతం నీరు వృథా అవుతుంది. ఇలా కాకుండా ఎయిరేటర్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇవి నీటిలోకి కొంత మొత్తం గాలిని చొప్పిస్తాయి. వాటి ప్రెషర్ పెరగడం వల్ల తక్కువ నీటితోనే పని పూర్తవుతుంది. నిమిషానికి ఎనిమిది లీటర్ల నుంచి ఐదు లీటర్లకు నీరు తగ్గుతుంది. దీంతో వృథా అయ్యే నీటి శాతం కూడా తగ్గుతుంది. ఇవి రూ.200 నుంచి 250 వరకూ వివిధ మోడళ్లలో లభ్యమవుతున్నాయి.

5. వాటర్ మీటర్

ADVERTISEMENT

వాటర్ మీటర్ అనేది మనం ఎంత నీటిని ఉపయోగిస్తున్నాం అని కొలిచే వస్తువు. ఇది ఉపయోగించడం కూడా సులువు. మీటర్ రీడింగ్ తీసుకోవడానికి వీలుండేలా దీన్ని ఏర్పాటు చేసుకోవాలి. ట్యాంక్ నుంచి వచ్చే పైప్ లైన్ కి దీన్ని జత చేయవచ్చు. అపార్ట్ మెంట్ అయితే మీ కిచెన్, బాత్రూంలలో దీన్ని పెట్టడం వల్ల ఎంత నీటిని ఉపయోగిస్తున్నామన్న విషయం తెలుస్తుంది కాబట్టి నీటి ఉపయోగాన్ని తగ్గించవచ్చు.

నీటి పొదుపుకి తీసుకుంటోన్న చర్యలు

చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నీటి నిల్వను పెంచేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇవి నీటి వృథా ని తగ్గించి నిల్వ ను పెంచుతున్నాయి. అవేంటంటే..

1. మహారాష్ట్ర – వాన నీటిని నిల్వ చేయడం..

ADVERTISEMENT

మహారాష్ట్ర ప్రభుత్వం 2015-16 లోనే వాన నీటిని పొదుపు చేసేందుకు ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. నీటి కొరత చాలా ఎక్కువగా ఉండే 5000 గ్రామాల్లో ఈ చర్యలను చేపట్టింది.. ఐదేళ్లలో ఈ ప్రాంతాల్లో నీటి కొరత లేకుండా చేసే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పుణె ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగింది. నీటి నిల్వను పెంచడంతో పాటు కాలువలను సరి చేసి నీరు చెరువులు, కాలువల్లో నిల్వ ఉండేలా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ జిల్లాలు పచ్చదనంతో అలరారుతున్నాయి.

2. తెలంగాణ – కాళేశ్వరం డ్యామ్

తెలంగాణ ప్రభుత్వం మేడికట్ట దగ్గర కాళేశ్వరం డ్యామ్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. సుమారు ఎనభై వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ డ్యామ్ గోదావరి నదిపై నిర్మితమైంది.. దీనివల్ల నదిలోని నీరు వృథాగా సముద్రంలో కలవకుండా కాపాడింది రాష్ట్ర ప్రభుత్వం. దీని సామర్థ్యం 16.37 టీఎంసీలు. దీనిద్వారా వచ్చిన నీటిని చెరువులు, కుంటల ద్వారా పొదుపు చేసి రైతులకు అందిస్తోంది ప్రభుత్వం. వాటిని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు తెలంగాణ రైతులు.

3. రాజస్థాన్ – పొలాల్లో చిన్న కుంటల నిర్మాణం

ADVERTISEMENT

రాజస్థాన్ ఎడారి రాష్ట్రంగా పేరొందింది. కానీ అక్కడి ప్రజలు తమకున్న నీటి కొరతను తగ్గించుకోవడానికి మంచి ప్రయత్నం చేశారు. పొలాల మధ్యలో చిన్న చిన్న కుంటలు తవ్వి వాటి ద్వారా వర్షపు నీటిని సేకరించారు. రాజేంద్ర సింగ్ ఇందులో వారికి సాయం చేశారు. ఆయన వర్షపు నీటిని సేకరించడం, నీటి ఉపయోగించే విధానాలు అక్కడి గ్రామస్థుల జీవితాలను మార్చి ఆ ప్రదేశాన్ని నీటి నిల్వ ఎక్కువగా ఉన్న ప్రాంతంగా మార్చాయి. అగార్ ఛారిటీ వారు కూడా నీటి నిల్వ పెంచేలా చర్యలు చేపట్టారు.

4.తమిళనాడు – నాగా నదిలో నిర్మాణం

తమిళనాడులోని నీరు లేని 24 జిల్లాల్లో వెల్లూరు కూడా ఒకటి. ఈ ప్రాంతానికి నీరు తీసుకురావడానికి నాగానది లో నిర్మాణాన్ని చేపట్టారు. జవాడు కొండల నుంచి వచ్చే నాగా నది తిరువన్నమలై, వెల్లూరు జిల్లాలకు నీటిని అందిస్తుంది. కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ నది రోజురోజుకీ కనుమరుగైపోతోంది. అయితే ఇరవై వేల మంది స్త్రీలు కలిసి తిరిగి ఈ నది ప్రవాహాన్ని పెంచేలా ప్రయత్నం చేశారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ నదిలో 3500 ఓవర్ ఫ్లో బావులు తవ్వడం వల్ల వర్షం పడినప్పుడు నేలలో నీటి శాతం పెరిగింది. నది కూడా తిరిగి జీవం పొందుతోంది. ఇదే పద్ధతిని దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో అమలయ్యేలా చేస్తే నీటి కొరత ఉండదు.

ADVERTISEMENT

తరచూ అడిగే ప్రశ్నలు

1. నీరు ఎందుకు అంత ప్రధానం?

నీరు మన జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం తాగేందుకు మాత్రమే కాదు.. స్నానం, వంట మొదలైన వాటిలోనూ నీరు ఎంతో ముఖ్యం. మనిషి ఆహారం లేకపోయినా జీవించగలడు కానీ నీరు లేకుండా జీవించలేడు. అందుకే మన భవిష్యత్తు తరాల కోసం నీటిని నిల్వ చేసి అందించడం మన బాధ్యత.

2. మన దేశంలో నీటి కొరతకు ముఖ్య కారణాలేంటి?

సాధారణంగా మన దేశంలో నీటి కొరతకు రెండు రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి సహజమైనవైతే రెండోది మనం చేసే పనుల వల్ల జరిగేది. నీటి నిల్వలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, ప్రభుత్వం నీటి నిల్వ గురించి శ్రద్ధ వహించకపోవడం, నీటిలో వ్యర్థ పదార్థాలు కలవడం వల్ల ఆ నీరు ఉపయోగించడానికి పనికి రాకుండా పోవడం వంటివి జరుగుతున్నాయి.

3. నీటి కొరతను అరికట్టేందుకు మార్గాలేంటి?

ADVERTISEMENT

చిన్నతనం నుంచే పిల్లలకు నీటి ఉపయోగాన్ని, దాన్ని పొదుపుచేసే మార్గాలను వివరించాలి. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు వివిధ రకాల పద్ధతులు ఉపయోగిస్తూ వాన నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతులు ఉపయోగించాలి. సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని కాపాడేందుకు నదులపై ప్రాజెక్టులు నిర్మించుకోవాలి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

10 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT