గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ మహిళ.. ఓ కేసు విషయంలో న్యాయపోరాటం చేస్తోంది. కొందరు ఆకతాయిలు తన వ్యక్తిగత సమాచారాన్ని అశ్లీల సైట్లలో పోస్టు చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమె తన భర్తతో కలిసి 2017 సంవత్సరంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనులో.. ఇదే విషయమై ఫిర్యాదు చేసింది. అయినా సరే.. ఇప్పటి వరకూ ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఆమె పేరును తొలిగించమని సదరు వెబ్‌సైట్ నిర్వాహకులతో పాటు.. గూగుల్ సంస్థ అధికారులకు కూడా పోలీసులు లేఖ రాశారు.
తెలంగాణ హైకోర్టు కూడా గూగుల్‌కు (Google) ఈ క్రమంలో లీగల్ నోటీసులు పంపింది. అయితే ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని.. ఇది తమ పరిధిలో లేని అంశమని గూగుల్ భద్రతా నిపుణులు తెలిపారు. ఇటీవలే ఈ కేసు బాధితురాలు ఇదే విషయానికి సంబంధించి.. తన తోటి ఉద్యోగులు హేళన చేయడంతో.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన వివరాలను ఆయా అశ్లీల వెబ్‌సైట్ల నుండి తొలిగించేలా చూడమని.. కారకులను అరెస్టు చేయమని మళ్లీ రాచకొండ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఆమె సమస్య పరిష్కారమవుతుందో లేదో తెలియదు.
కాజల్ అగర్వాల్‌తో డేటింగ్ అని చెప్పి.. రూ. 60 లక్షలకు టోకరా..!
ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్న మహిళల శాతం గణనీయంగా పెరుగుతోంది. గతంలో కూడా సినీ హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేశాక.. వాటిని వెబ్ సైట్లలో పోస్టు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముఠా ఒకటి హైదరాబాద్‌లో దొరికింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు కూడా. అయినా ఈ ఆగడాలు తగ్గలేదు. సరి కదా.. రోజురోజుకీ శ్రుతిమించిపోతున్నాయి. సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. ఇలాంటి చెత్త కంటెంట్‌ను పోస్టు చేసే ఆకతాయిలు కూడా పెరుగుతున్నారు.
ఈ స్మార్ట్ “గాజులు” ధరిస్తే చాలు.. అమ్మాయిలు సెల్ఫ్ సెక్యూరిటీ పొందినట్లే..!
ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు ఎక్కువ ఫోటోలు పోస్టు చేయవద్దని… అలాగే వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని పేర్కొన్నారు. అలాగే పర్సనల్ ఫోన్ నెంబర్లను ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. అలాగే మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో కూడా.. పూర్తిస్థాయిలో వివరాలను అందివ్వడం మంచిది కాదని తెలిపారు. అలాగే బాధితులు ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుంటే.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి కేసు నమోదు చేస్తే మంచిదని.. ఆలస్యం చేయడం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
“SH(OUT)”తో లైంగిక వేధింపులకు.. ఇక చెక్ పెడదాం..!
ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ సంస్థల డేటాబేస్‌ల నుండి.. ఇతరుల సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఆ సమాచారాన్ని వినియోగించుకొని.. నేరాలకు పాల్పడతున్నారు. ఈ నేరాలలో భాగంగా ఎక్కువగా మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఏదేమైనా.. నేడు ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని.. అప్పుడప్పుడు అవగాహన రాహిత్యంతో మనం వదిలేసే డేటాని కూడా సైబర్ నేరగాళ్లు.. తమకు అనుగుణంగా మలచుకోవచ్చని పోలీసులు అంటున్నారు.
Featured Image: Pixabay
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.