ADVERTISEMENT
home / Celebrations
నాన్నకు ప్రేమతో:  తన తండ్రికి.. ప్రిన్స్ మహేష్ బాబు ఇచ్చే బర్త్‌డే కానుక ఇదేనా?

నాన్నకు ప్రేమతో: తన తండ్రికి.. ప్రిన్స్ మహేష్ బాబు ఇచ్చే బర్త్‌డే కానుక ఇదేనా?

సూపర్ స్టార్ (Superstar).. టాలీవుడ్‌లో ఈ పదం వినగానే చాలామందికి ఇప్పటికీ ఠక్కున గుర్తుకొచ్చే హీరో పేరు కృష్ణ (Krishna). మునుపటి తరానికి చెందిన హీరో అయినప్పటికీ డేరింగ్ & డాషింగ్.. వంటి ఎన్నో పదాలు ఆయన పేరు ముందు విశేషణాలుగా మారాయి. 

అత్యధిక సినిమాల్లో నటించిన హీరోగా ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసిన  కృష్ణ మే 31వ తేదీన తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఆయన 76వ వసంతంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో  కృష్ణ తనయుడు, అలాగే అతని సినీ వారసత్వాన్ని కొనసాగిస్తోన్న మహేష్ బాబు (Mahesh Babu).. తన తండ్రికి ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారని వినికిడి.

ప్రిన్స్ మహేష్ బాబు సినీ పరిశ్రమలో తండ్రి వారసత్వాన్నే కాదు.. ఆయన అందం, అభినయం.. వంటి వాటిని కూడా పుణికి పుచ్చుకున్నారు. అంతేనా.. తండ్రి పేరు ముందు చేరిన సూపర్ స్టార్ టైటిల్‌ని కూడా మహేష్ బాబు తన అద్భుత నటప్రతిభతో కైవసం చేసుకున్నారు.

అంతేనా.. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు చేసిన హీరోగా తండ్రి రికార్డులు సాధిస్తే; ఇప్పుడు మహేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తెలుగు చిత్రసీమకు అజాతశత్రువు లాంటి హీరోగా; తెలుగు ప్రేక్షకులకు బాండ్ సినిమాలను పరిచయం చేసిన కథానాయకుడిగా.. ఎన్నో ప్రత్యేక గుర్తింపులతో పాటు.. అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న కృష్ణకు పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఓ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారట.

ADVERTISEMENT

ఇంతకీ ఆ బహుమతి ఏమై ఉంటుందని అనుకుంటున్నారు కదూ..

ఇదే విషయమై పలువురు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ – ‘‘మహేష్ బాబు తాను నటించబోయే తదుపరి సినిమా వివరాలను తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించే అవకాశాలున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ  పుట్టినరోజు వేడుకలను.. ఒక ప్రత్యేక ఈవెంట్‌గా నిర్వహించి తన 26వ సినిమా వివరాలను మహేష్ తండ్రి ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. ఇది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం’’ అని పేర్కొనడం గమనార్హం. అయితే ఈ వార్తలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

మహర్షి సినిమాతో తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే.. మరో హిట్ కొట్టిన మహేష్ బాబు తన తదుపరి చిత్రం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi); నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీలైన్‌కి మహేష్ బాబు ఫిదా అవ్వడంతో.. దానిని పూర్తిస్థాయి స్క్రిప్ట్‌గా మార్చమని కోరారట. ఆయన కోరిన మీదట బౌండెడ్ స్క్రిప్ట్‌తో మహేష్ బాబుని.. అనిల్ రావిపూడి కలవగా ఆయన కూడా ఆమోదం తెలిపారని సమాచారం.  ప్రస్తుతం ఈ సినిమా గురించే సూపర్ స్టార్ పుట్టినరోజు వేడుకల్లో మహేష్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ADVERTISEMENT

ఇక మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం.. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. దీంతో తన కెరీర్‌లో 25 చిత్రాలను మహేష్ పూర్తి చేయడం విశేషం. ఈ సినిమాలో రైతు సమస్యలు, వాటికి పరిష్కారాలతో ముడిపడిన కథాంశాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. “రైతు పైన చూపాల్సింది జాలి కాదు.. ఇవ్వాల్సింది మర్యాద..” అనే ట్యాగ్ లైన్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. అంతేనా.. #celebratingmaharshi అంటూ వివిధ వర్గాల వ్యక్తులను- అనగా రైతులు, కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు & కంపెనీ అధినేతలు.. మొదలైన వారిని కలుస్తూ చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని చెప్పచ్చు.

మరి, మహేష్ బాబు నటించబోయే.. 26వ చిత్రం ఆయన కెరీర్‌లో ఎలాంటి ఫలితాన్ని అందించనుంది? సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తండ్రికి… మహేష్ ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ ఇదేనా??.. వంటి  ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

నాని తన సినిమాకి.. అతన్నే హీరోగా ఎందుకు సెలెక్ట్ చేశాడంటే..?

ADVERTISEMENT

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఆసక్తికర ప్రకటన

సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!

27 May 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT