చర్మ సంరక్షణ పద్ధతులు, మేకప్ టెక్నిక్స్ (makeup) ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి కాలాన్ని బట్టి.. వయసును బట్టి మారుతూనే ఉంటాయి. అయితే మీ మేకప్ రొటీన్‌లో చాలా మార్పులు చేయాల్సిన కాలం వచ్చిందంటే చాలు.. మీ వయసు ముప్ఫై (thirty years) దాటిందని అర్థం. ముప్ఫై ఏళ్లు దాటిన తర్వాత.. ఉపయోగించే ఉత్పత్తుల నుంచి.. మేకప్ చేసుకునే పద్ధతి వరకూ ప్రతి దానిలోనూ మార్పులొస్తాయి. అంతేకాదు.. మేకప్ కంటే ముఖ్యంగా మీ చర్మం ఆరోగ్యం గురించి ఆలోచించడం మీకు అలవాటవుతుంది.
మీ స్కిన్ కేర్ రొటీన్ బాగుంటే.. మీరు మేకప్‌తో చాలా అందంగా కనిపిస్తారు. దానితో పాటు మేకప్ వేసుకునే పద్ధతిలో.. కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఈ క్రమంలో మనం కూడా ముప్ఫై ఏళ్ల వయసు దాటిన వారు.. మేకప్ వేసుకోవడంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలో తెలుసుకుందాం
1. ప్రైమర్ తప్పనిసరి
Shutterstock
సాధారణంగా చాలామంది ఇరవైల్లో ఉన్నప్పుడు.. ప్రైమర్‌ని తమ మేకప్‌లో భాగం చేసుకోరు. నేరుగా ఫౌండేషన్ లేదా పీసీ క్రీమ్‌తో మేకప్ ప్రారంభించేస్తారు. కానీ ముప్ఫై ఏళ్ల వయసు దాటిన వారి మాత్రం.. తమ చర్మ రంధ్రాలు వెడల్పుగా మారి బాగా కనిపిస్తుంటాయి. అందుకే ఫౌండేషన్ వేసుకుంటే అవి కనిపించే వీలుంటుంది కాబట్టి.. ప్రైమర్ తప్పనిసరి అని చెప్పుకోవచ్చు.
2. కలర్ కరెక్షన్ ప్రయత్నించండి..
ఈ వయసుకు చేరుకున్నారంటే.. మీ చర్మం మొత్తం తప్పక పిగ్మంటేషన్ మార్క్స్ ఉండి ఉంటాయి. అలా లేవంటే మీరు లక్కీ అనుకోవాలి. అలాగే మీ చర్మం పై కొత్త కణాలు పుట్టుకురావడం కూడా తగ్గుతుంది. అందుకే చర్మం కాస్త పొడిగా, నల్లగా కనిపిస్తుంటుంది.
మీకు నల్లని వలయాలు గనుక ఉంటే.. అవి ఈ వయసులో చాలా పెద్దగా కనిపిస్తుంటాయి. అందుకే కలర్ కరెక్షన్ ప్యాలెట్‌ని తెచ్చుకొని.. నల్లగా మారిన భాగాలు కూడా మీ చర్మం రంగులోకి మారేలా దాన్ని అప్లై చేసుకోవాలి. అప్పుడు చర్మం మొత్తం ఒకే రంగులో అందంగా కనిపిస్తుంది.
3. ఫౌండేషన్‌లో ఆర్గాన్ ఆయిల్
Shutterstock
ఆర్గాన్ ఆయిల్‌లో ‘విటమిన్ ఈ’తో పాటు.. ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీ చర్మం అందంగా కనిపించేందుకు ఇవి ఎంతో అవసరం. అందుకే రోజూ మీరు ఉపయోగించే ఫౌండేషన్‌లో.. రెండు మూడు చుక్కలు ఆర్గాన్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల ముఖ చర్మంలో బాగా నిగారింపు వస్తుంది. ఇలా వీలున్నప్పుడల్లా మీ చర్మ సంరక్షణ కోసం.. ఆర్గాన్ ఆయిల్‌ను మేకప్‌తో కలిపి ఉపయోగించడం మంచిది.
4. చర్మానికీ రిలాక్సేషన్
చర్మం ముడతలు పడుతుందని ఇబ్బంది పడడం మానేయండి. ఎందుకంటే ఈ వయసుకు చేరుకున్న తర్వాత.. చర్మంపై ముడతలు రావడం తప్పనిసరి. ఈ సమయంలో చర్మానికి రిలాక్సేషన్ అవసరం. అలాగే చర్మానికి సున్నితత్వం కూడా అవసరం.
మేకప్ వేసుకోవడం వల్ల చర్మం కొంతవరకు.. ముడతలు లేకుండా కనిపిస్తుంది. కానీ అది పర్మినెంట్ కాదు. కానీ మీ చర్మాన్ని మసాజ్ సాయంతో రిలాక్స్ చేయడం వల్ల.. ముడతలు మరింత లోతుకు పోకుండా ఉంటాయి.
5. బ్యాగ్‌లో అది తప్పనిసరి
Shutterstock
ఈ వయసు వచ్చిన తర్వాత చర్మంపై వెంట్రుకలు రావడం సహజం. వ్యాక్సింగ్ చేసుకున్నా.. అక్కడక్కడా వెంట్రుకలు వేగంగా పెరగడం వల్ల అవి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఇక ముఖంపై అయితే మరీనూ. ఇలాంటి వెంట్రుకలు చూడగానే.. వాటిని తీసివేసేందుకు ఎక్కడికి వెళ్లినా బ్యాగ్‌లో ఓ ట్వీజర్ పెట్టుకోవడం మర్చిపోవద్దు.
6. న్యూడ్ ఐలైనర్ పెన్సిల్
సాధారణంగా ఈ వయసులో కళ్లు లోతుకి వెళ్లిపోయినట్లు కనిపిస్తాయి. కాబట్టి మీరు కళ్లకు నల్లని కాజల్‌ని అప్లై చేసుకోకుండా లేత రంగులను ఎంచుకోవడం మంచిది.
7. గ్లిట్లర్ పిగ్మెంట్ వద్దు..
Shutterstock
చర్మానికి, కళ్లకు మెరుపులతో కూడిన మేకప్ వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ వయసులో అలాంటి మేకప్ వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటి మేకప్.. ఒకవేళ మీ చర్మంపై ఉన్న ముడతల్లో నిండిపోతే అది ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. మీరే కావాలని ఆ ముడతలను హైలైట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే దాన్ని ప్రయత్నించకపోవడం మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.