ADVERTISEMENT
home / Fiction
లోక రక్షకుడు జన్మించిన పర్వదినం – క్రిస్మస్ వేడుక

లోక రక్షకుడు జన్మించిన పర్వదినం – క్రిస్మస్ వేడుక

క్రిస్మస్ (Christmas).. క్రైస్తవుల ఆరాధ్య దైవమైన యేసు జన్మించిన పవిత్ర దినం. ఆయన పుట్టి దాదాపు రెండు వేల సంవత్సరాలు పూర్తయినా.. ఇప్పటికీ కరుణాయముడైన యేసు పుట్టినరోజును ఎంతో మహత్తరమైన రోజుగా భావిస్తూ.. చర్చిలలో ప్రార్థనలు చేయడం.. ఆ తర్వాత విందు, వినోదాలలో పాల్గొనడం అనేది ఆనవాయతీగా వస్తోంది. భారతదేశంలో క్రైస్తవుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గోవా, కేరళ లాంటి ప్రాంతాలలో క్రిస్మస్ వేడుకలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. దేశ, విదేశాల నుండి కూడా ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి.. ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం. 

నిజం చెప్పాలంటే.. ఈ క్రిస్మస్ పండగ వెనుక కూడా చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం రోమా రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పాలిస్తుండేవాడట. ఓ రోజు అతను తన రాజ్యంలోని జనులందరినీ వారి వారి స్వగ్రామాలకు వెళ్లాలని ఆదేశిస్తాడు. రాజాజ్ఞను మన్నించి నజరేతు పట్టణానికి చెందిన మేరీ, జోసఫ్‌లు కూడా తమ స్వగ్రామమైన బెత్లెహాముకి బయలుదేరుతారు. అప్పటికే మేరీ గర్భవతి. ఆమెకు అంతకు క్రితమే కలలో గ్యాబ్రియేల్ అనే దేవదూత కనిపించి “అమ్మా.. నువ్వు దైవానుగ్రహం వల్ల గర్భవతివి అవుతావు. కన్యగానే ఓ కుమారుడిని కంటావు. అతనికి ‘యేసు’ అని నామకరణం చేయండి. అతను సాక్షాత్తు ఆ దేవుడి బిడ్డ” అని చెప్పి అంతర్థానమవుతాడు.

క్రిస్మస్‌ని ఎంజాయ్ చేయాలా? అయితే ఈ పనులు తప్పక చేయండి..

జోసఫ్ ఆ తర్వాత మేరీని తన భార్యగా స్వీకరించి.. దైవాజ్ఞను పాటిస్తూ.. ఆమెను తీసుకొని నగరం దాటి వెళతాడు. ఎన్నో అష్టకష్టాలు పడి వారు కాలినడకనే బెత్లేహాము చేరుకుంటారు. కానీ ఎక్కడా నిలువనీడ కూడా దొరక్కపోవడంతో.. ఓ పశువుల పాకలో తలదాచుకుంటారు. అక్కడే మేరీ ఓ ముద్దులొలికే బాలుడికి జన్మినిస్తుంది. ఆ బాలుడిని చూడడానికి నాలుగు దిక్కుల నుండి కొందరు ప్రవక్తలు వస్తారు. వారు ఓ నక్షత్రం చూపించిన మార్గాన్ని అనుసరించి అక్కడికి వస్తారట. వారు ఆ బాలుడే లోక రక్షకుడని నిర్థారణకు వస్తారు. ఆ పసిబిడ్డకు కానుకలు సమర్పించి వెళ్లిపోతారు.

ADVERTISEMENT

ఈ కేక్ రెసిపీలతో.. మీ క్రిస్మస్‌ని అద్భుతంగా జరుపుకోండి

ఆ తర్వాతి కథ అందరికీ తెలిసిందే. హేరోదు అనే చక్రవర్తి బాల యేసును కాబోయే యూదుల రాజుగా భావించి సంహరించాలనుకోవడం.. మేరీ, జోసఫ్‌లు అతనికంట పడకుండా బెత్లేహాం వదిలి వెళ్లడం.. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాతే నజరేతుకి రావడం.. ఈ కథలన్నీ బైబిలులో ఉంటాయి. బాలయేసుగా ఎన్నో మహిమలు చూపిన దైవకుమారుడు.. పెద్దయ్యాక ప్రవక్తగా మారి సంచరించడం.. జనులను పాపవిముక్తులను గావించడం కోసం రక్తాన్ని చిందించి.. సిలువపై అసువులు బాయడంతో బైబిలులో అతి ప్రధానమైన ఘట్టం ముగుస్తుంది.

ట్రాఫిక్ పాఠాలు చెబుతున్న… ఈ శాంటా క్లాజ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ప్రేమతత్వాన్ని చాటడమే బైబిలు కథలలోని పరమార్థం. అందుకే సాక్షాత్తు ప్రేమమూర్తి అయిన యేసును క్రైస్తవులలో అనేకమంది భగవంతుడిగానూ కొలుస్తారు. ఆయన పుట్టినరోజును క్రిస్మస్ పేరుతో ఆనందంగా జరుపుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా పేదలకు దాన ధర్మాలు చేయడం, మిషనరీలకు విరాళాలు ఇవ్వడం, లోకహితం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం అనేది కూడా ఆనవాయతీగా వస్తోంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిలను అందంగా డెకరేట్ చేస్తారు. క్యాండిల్స్ వెలిగించి.. ఆ కాంతుల మధ్య దైవారాధన చేస్తారు.

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.                                             

 

 

 

ADVERTISEMENT
25 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT