ADVERTISEMENT
home / Bath & Body
చర్మాన్ని మెరిపించే సున్నిపిండి.. ఎలా తయారుచేయాలో తెలుసా?

చర్మాన్ని మెరిపించే సున్నిపిండి.. ఎలా తయారుచేయాలో తెలుసా?

మార్కెట్లో ఉన్న ఎన్నో రకాల సబ్బులు, మరెన్నో ఫేస్ వాష్‌లు.. అందులో ఏది వాడాలో.. దేనివల్ల చర్మానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో.. అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఉత్పత్తులను.. చర్మానికి ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది.

అలాంటి సహజసిద్ధమైన ఉత్పత్తుల్లో ముఖ్యమైనది సున్నిపిండి (bath powder). మన బామ్మల కాలం నుంచి చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తూ వస్తున్న ఈ పిండి.. పొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా, మంచి ప్యాక్‌గా పనిచేసి ఎన్నో చర్మ సమస్యలను దూరం చేస్తుంది. క్లెన్సింగ్, ఎక్స్ ఫోలియేటింగ్, మాయిశ్చరైజింగ్ వంటివన్నీ చేసే సున్ని పిండిని చాలామంది సబ్బుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. మరి, దీని ప్రయోజనాలేంటో.. సున్ని పిండిని ఎలా తయారు చేసుకోవాలో మనమూ తెలుసుకుందాం రండి.

ఎన్నెన్నో ప్రయోజనాలు..

సున్నిపిండి వల్ల మన చర్మానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. పోషకాలు నిండి ఉన్న ఈ సున్ని పిండిలోని శనగ పిండి, పెసర పిండి, బియ్యప్పిండి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తాయి. ఇక పసుపు, తులసి ఆకులు, వేపాకులు యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ఫంగస్, బ్యాక్టీరియాను తొలగిస్తాయి. అంతేకాదు.. ఇందులోని సహజ నూనెలు చర్మానికి మాయిశ్చరైజేషన్ పెంచుతాయి. చర్మం చాలా సున్నితంగా మారుతుంది.

ADVERTISEMENT

అంతేకాదు.. ఇందులోని గులాబీ రేకులు ట్యాన్‌ని తగ్గిస్తాయి. అలాగే చర్మం జిడ్డుగా మారకుండా.. నిమ్మరసం పాలు కాపాడతాయి. సున్నిపిండిని రెగ్యులర్‌గా వాడడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులో పాలు చేరిస్తే చాలు.. చర్మం సున్నితంగా మారుతుంది. మచ్చల్లేని చర్మం మీ సొంతమవుతుంది. మొటిమలు, ముడతలు కూడా తగ్గి.. చర్మంలో యవ్వన కాంతి కనిపిస్తుంది.

అంతేకాదు.. ఇది మంచి స్క్రబ్‌లా పనిచేయడం వల్ల.. చర్మంపై ఉన్న సన్నని వెంట్రుకలు కూడా తొలగిపోతాయి. అయితే దీన్ని రాసుకోవడంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఎలా పడితే అలా కాకుండా సర్కులర్ మోషన్స్‌లో మసాజ్ చేసుకోవాలి. లేదంటే చర్మంపై సన్నని గీతలు పడి ముడతలు పడే అవకాశం ఉంటుంది. 

సున్ని పిండి తయారీ ఎలా?

సున్ని పిండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

ADVERTISEMENT

పెసర పిండి – పావుకేజీ
ఉలవల పిండి – పావు కేజీ
శనగ పిండి – పావు కేజీ
ముల్తానీ మట్టి – పావుకేజీ
పసుపు – 50 గ్రా
గులాబీ రెక్కల పొడి – 50 గ్రా
నారింజ తొక్కల పొడి – 50 గ్రా
వేపాకుల పొడి – 50 గ్రా (వేపాకులు నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి)
తులసి పొడి – 50 గ్రా
మెంతి ఆకుల పొడి – 50 గ్రా
బియ్యం పిండి – 50 గ్రా.
గోధుమ పిండి – 50 గ్రా.
బాదం పప్పులు – నాలుగైదు (పొడి చేసుకోవాలి)

ఎలా తయారుచేయాలంటే..

ముందుగా పప్పులన్నింటినీ.. బాగా ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని పిండిలా చేసి వాటన్నింటినీ కలపాలి. వీటన్నింటికీ కలిపి జల్లించాలి. ఆకులను నీడలో ఆరబెట్టుకొని.. బాగా ఎండిపోయిన తర్వాత మెత్తగా చేసుకోవాలి. వీటిని కూడా జల్లెడ పట్టుకోవాలి. ఆపై ఈ పొడులన్నింటినీ కలుపుకోవాలి. తర్వాత ఓ గాజు సీసాలో వీటన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. దీన్ని రోజూ కొద్దిగా తీసుకొని స్నానానికి ఉపయోగించవచ్చు.

ADVERTISEMENT

ఎలా ఉపయోగించాలంటే..

సున్ని పిండిలో నీళ్లు, పాలు, నిమ్మరసం, పెరుగు.. ఇలా అందుబాటులో ఉన్నవి ఉపయోగించవచ్చు. వాటిని అందులో పోసి సిద్ధం చేసుకోవాలి. దాన్ని అప్లై చేయడానికి ముందుగా.. శరీరం మొత్తానికి మీకు అందుబాటులో ఉన్న నూనెను రాసుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో శరీరం మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. నూనె రాసిన తర్వాత సున్నిపిండిని అప్లై చేసుకోవడం వల్ల.. చర్మానికి ఇది పూర్తిగా అంటుకుంటుంది.

దీనిని రుద్దడం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోవడంతో పాటు.. రక్త ప్రసరణ కూడా బాగా సాగుతుంది. చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. ముఖంపై అప్లై చేసుకున్న తర్వాత.. శరీరం మొత్తం రుద్దుకోవడం వల్ల .. కాస్త ఎక్కువ సమయం పాటు ముఖంపై ఉన్న చర్మం వీటి గుణాలను పీల్చుకుంటుంది. తద్వారా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
20 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT