ADVERTISEMENT
home / Self Help
జననాంగాల వద్ద దురదా..? ఇలా చేసి సులభంగా తొలగించుకోండి..

జననాంగాల వద్ద దురదా..? ఇలా చేసి సులభంగా తొలగించుకోండి..

నలుగురిలో ఉన్నప్పుడు జననాంగాల (genital area) వద్ద దురద (itching) వచ్చిందంటే.. దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాదు. దురద తగ్గించేందుకు గోక్కుంటే నలుగురిలో ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ అలా చేయకపోతే ఆ దురద మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు నరకం కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలైతే.. అసలు ఈ సమస్య ఎదురైతేనే సిగ్గుగా ఫీలవుతుంటారు. మరి, ఈ సమస్య ఎదురు కాకుండా.. ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం రండి..

అమ్మాయిలూ.. యోని ఆరోగ్యానికి ఇవి పాటించండి.. (Healthy Vagina Tips In Telugu)

1. చామొమైల్‌తో

చామొమైల్ లేదా చామంతిలో ఎన్నో మెడిసినల్ గుణాలున్నాయి. ఇది జననాంగాల వద్ద దురద రాకుండా కాపాడుతుంది. దీనికోసం రెండు కప్పుల నీటిని మరిగించి.. అందులో టేబుల్ స్పూన్ చామంతి పూల రెక్కలు వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఇందులో నాలుగైదు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి. ఈ నీటితో మీ జననాంగాల వద్ద రోజుకి రెండు సార్లు శుభ్రం చేసుకుంటే చాలు.. ఎలాంటి దురద ఉండదు. ఒకవేళ ఇప్పటికే దురద ఉంటే అది వెంటనే తగ్గిపోతుంది.

2. పెరుగు

ADVERTISEMENT

పెరుగులో ఎన్నో ప్రొబయోటిక్ గుణాలుంటాయి. ఇది మంచి బ్యాక్టీరియాను పెంచి.. చెడు బ్యాక్టీరియాను సంహరించడానికి తోడ్పడుతుంది. అంతే కాదు.. పీహెచ్‌ని బ్యాలన్స్ చేయడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే జననాంగాల వద్ద పెరుగు రుద్దడం వల్ల.. అక్కడున్న బ్యాక్టీరియాను ఇది తగ్గిస్తుంది. తద్వారా దురద కూడా తగ్గుతుంది.

3. వేపాకు

వేపాకులో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఈ ఆకుల రసాన్ని రుద్దడం వల్ల క్యాండిడా, ఈస్ట్ వంటివి కూడా తొలగిపోతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. దురద రాకుండా ఉంటుంది. దీనికోసం చేయాల్సిందల్లా గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో వేపాకులు వేసి మరిగించి.. ఆ నీటితో జననాంగాల భాగాన్ని రోజుకు రెండు సార్లు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి దురద ఉన్నా.. అది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది.

4.కలబంద

కలబందలో ఎన్నో మెడిసినల్ గుణాలు ఉంటాయి. అందుకే మనం కలబంద గుజ్జును తినడం వల్ల అందులోని యాంటీ ఫంగల్ గుణాలు మన శరీరంలోని తెల్ల రక్త కణాలను పెరిగేలా చేస్తాయి. దీనికోసం ఏదైనా పండ్ల రసంలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును కలిపి దాన్ని తీసుకుంటే సరిపోతుంది.

ADVERTISEMENT

5.వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇది అనేక రకాల బ్యాక్టీరియా లేదా ఫంగస్ నుంచి మనల్ని కాపాడుతుంది. దీనికోసం వెల్లుల్లి నూనెను, విటమిన్ ఇ నూనెతో కలిపి జననాంగాల వద్ద అప్లై చేసుకొని.. పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది.

6.కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో కూడా యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది సామాన్యంగా క్యాండిడా లాంటి ఫంగస్‌కి వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది. అందుకే జననాంగాల భాగంలో దురద సమస్య లేకుండా కొబ్బరి నూనెను చర్మానికి అప్లై చేసుకోవాలి. కావాలంటే గోరు వెచ్చగా చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత కాసేపటికి నీటితో కడిగేసుకోవచ్చు.

7.యాపిల్ సైడర్ వెనిగర్

ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు పీహెచ్‌ని బ్యాలన్స్ చేస్తాయి. మంచి బ్యాక్టీరియాని పెంచి.. ఈస్ట్, క్యాండిడా వంటి వాటి పెరుగుదలను నిరోధిస్తాయి. దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని.. కప్పు నీళ్లలో వేసి జననాంగాల భాగాన్ని కడుక్కోవాలి. ఇలా రోజుకి రెండు మూడు సార్లు చేయవచ్చు. లేదా స్నానం చేసే నీటిలో వెనిగర్ కలుపుకోవడం వల్ల కూడా దురద రాకుండా కాపాడుకోవచ్చు.

ADVERTISEMENT

8.గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇవి ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడతాయి. మన శరీరానికి రక్షణ కవచంలా నిలిచి పోరాడతాయి. రోజూ గ్రీన్ టీని తాగడం వల్ల ఈ ఫలితాలు చూసే వీలుంటుంది.

భలే ప్రయోజనాల బ్లాక్ టీ.. అందానికి, ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..?

దురదను తగ్గించేందుకు మార్గాలు

ADVERTISEMENT

1. స్విమ్మింగ్‌కి వెళ్లినప్పుడు లేదా జిమ్‌కి వెళ్లినప్పుడు వెంటనే బట్టలు మార్చుకోవాలి. దీనివల్ల దురద ఎక్కువగా ఉండదు.
2. సెంట్లు, స్ప్రేలు, లోషన్లు వంటివన్నీ జననాంగాల భాగంలో ఉపయోగించడం సరికాదు. అంతే కాదు.. సబ్బును కూడా ఉపయోగించకూడదు. ఇవి ఆ ప్రాంతంలో దురద వచ్చేలా చేస్తాయి.
3. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఆ భాగంలో తడి లేకుండా చూసుకోవాలి.
4. స్వీట్లు తినడం తగ్గించండి.
5. అవసరం ఉన్నప్పుడే యాంటీ బయోటిక్స్ వంటి మందులు ఉపయోగించండి. లేదంటే శరీరంపై ఈస్ట్, బ్యాక్టీరియా పెరిగిపోతుంది.
6. టైట్‌గా ఉండే లోదుస్తులు కాకుండా కాస్త వదులుగా ఉన్నవి.. కాటన్‌తో తయారుచేసినవి ఎంచుకోవడం మంచిది.

మీరు గర్భం ధరించినా.. పిల్లలకు పాలిస్తున్న తల్లులైనా.. మీకు డయాబెటిస్ ఉన్నా ఈ చిట్కాలు పాటించడం సరికాదు..

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

07 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT