ADVERTISEMENT
home / ఫ్యాషన్
క్రిస్మస్ పండగకి.. ఈ ట్రెండీ దుస్తులతో కొత్త లుక్ మీ సొంతమవుతుంది

క్రిస్మస్ పండగకి.. ఈ ట్రెండీ దుస్తులతో కొత్త లుక్ మీ సొంతమవుతుంది

క్రిస్మస్ (christmas).. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ. ఈ సందర్భంగా అందమైన దుస్తులు (outfit), ఆకర్షణీయమైన ఆభరణాలు ధరించాలని చాలామంది అనుకుంటారు. క్రిస్మస్ కోసం ప్రత్యేకమైన బహుమతులు మాత్రమే కాదు.. అందమైన దుస్తులు కూడా సిద్ధం చేసుకుంటారు. నోరూరించే ప్లమ్ కేక్, వాసనతోనే ఆకట్టుకునే వివిధ రకాల వంటకాలు ఇవన్నీ మీకు హాలిడే ఆనందాన్ని అందిస్తాయి.

మరి, క్రిస్మస్ పండక్కి మీ బంధువుల ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా? లేదా ఏదైనా క్రిస్మస్ పార్టీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? మరి, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలంటే ఎలా? సింపుల్.. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేలా దుస్తులు ధరిస్తే సరి. క్రిస్మస్ సందర్భంగా అందరూ ఒకేలా ఎరుపు రంగు దుస్తులతో కనిపిస్తుంటారు. మరి, వారందరిలో మీరు స్పెషల్‌గా కనిపించాలంటే ఈ దుస్తులను ధరించండి.

1. ఓవర్ సైజ్డ్ స్వెటర్

ప్రస్తుతం ఓవర్ సైజ్డ్ దుస్తులు వేసుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇన్‌ఫ్లూయెన్సర్ మాసూమ్ మీనావాలా మీకు సూచిస్తున్న ఈ హై వెయిస్ట్ ట్రౌజర్‌.. అలాగే రిబ్డ్ ఓవర్ సైజ్ స్వెటర్ ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య మిమ్మల్ని ఎంతో ప్రత్యేకంగా చూపుతుంది. అలాగే బీజ్, వినైల్ వంటి రంగులు సీజన్‌కి సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

2. క్రాప్‌డ్ స్వెటర్

క్రాప్‌డ్ స్వెటర్లను ప్రస్తుతం యువత అమితంగా ఇష్టపడుతున్న లేటెస్ట్  ఫ్యాషన్‌గా చెప్పుకోవచ్చు. మీ దగ్గర మంచి హై వెయిస్ట్ బాటమ్స్ ఏవైనా ఉంటే.. వాటితో కలిపి ఈ స్వెటర్‌ని ధరించవచ్చు. స్వెటర్ సింపుల్‌గా ఉన్నా.. మీరు మాత్రం ఫ్యాషనబుల్‌గా కనిపిస్తారు. క్రిస్మస్ పండగ సందర్భంగా.. మీ లుక్ అదిరిపోవాలంటే పార్టీ డ్రస్ కోడ్ అయిన రెడ్‌ని ధరిస్తే సరి.

3. మినీ విత్ స్టాకింగ్స్

స్కర్ట్స్, షార్ట్స్.. ఇలాంటి పొట్టి దుస్తులకి చాలా డిమాండ్ ఉంది. కానీ వాటిని సీజన్‌కి తగినట్లుగా ధరించాలంటే వింటర్ సేఫ్ సొల్యూషన్ వైపు చూడాల్సిందే. అవే స్టాకింగ్స్. వీటితో మీ షార్ట్ డ్రస్సులకు లేయరింగ్ చేసి ప్రత్యేకంగా కనిపించండి. పొట్టి దుస్తులతో పాటు మోకాళ్ల పైకి ఉండే స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆలివ్ రంగులో ఉన్న అవుట్ ఫిట్స్‌కి జతగా నలుపు రంగు స్టాకింగ్స్, యాక్సెసరీస్ ధరించిన ఈ ఫ్యాషనిస్టా చాలా అందంగా ఉంది కదా..

ADVERTISEMENT

4.మినీ విత్ హై బూట్స్

చలికాలంలో బెస్ట్ ఫ్యాషన్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారా..? అయితే  హై బూట్స్ ట్రై చేయండి. ఎలాంటి షార్ట్ డ్రస్‌తో అయినా ఇవి చక్కగా మ్యాచ్ అవుతాయి. ఇటు మిమ్మల్ని చలి నుండి కాపాడడంతో పాటు.. ఫ్యాషనబుల్‌గా ఉంటాయి. అందరిలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపుతాయి కూడా. ఇవి మీ తొడల వరకూ ఉండడం వల్ల.. మీ కాళ్లు కనిపించే అవకాశం ఉండదు. అయితేనేం ఆకర్షణీయంగా ఉంటాయి. ఎల్‌బీడీతో పాటు బూట్స్ ధరించి.. మ్యాచింగ్‌గా మంచి జాకెట్, చక్కటి హ్యాండ్ బ్యాగ్‌తో కొత్త లుక్ సొంతం చేసుకోవచ్చు.

5. స్వెటర్ డ్రస్

మీకు షార్ట్ డ్రస్సులంటే ఇష్టమా? అయితే వాటిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం.. మామూలు డ్రస్ కాకుండా స్వెటర్ డ్రస్ ఎంచుకోండి. ఈ డ్రస్ వేసుకున్న తర్వాత.. దానికి చక్కగా మ్యాచ్ అయ్యే యాక్సెసరీస్ ధరించడానికి ప్రయత్నించండి. కావాలంటే ఇదే డ్రెస్‌కి జతగా స్టాకింగ్స్ వేసుకోవచ్చు. అలాగే స్వెటర్ పైన అద్బుతమైన జాకెట్‌ని ధరించడంతో పాటు.. హ్యాండ్ బ్యాగ్, స్టెలట్టోస్ అన్నీ ఒకే రంగులో ఉండేలా చూసుకోవడం వల్ల ప్రత్యేకంగా కనిపించే వీలుంటుంది.

ADVERTISEMENT

6. లాంగ్ డ్రస్

ఎక్కడికైనా వెళ్లేందుకు మీకు పెద్దగా సమయం లేదా? అలాగే ఏం వేసుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నారా? అయితే లాంగ్ డ్రెస్ ధరించండి.. దీనివల్ల చలిగా అనిపించదు సరికదా.. వ్యాక్సింగ్ చేయించుకోకపోయినా ఇతరులకు తెలీదు. డ్రస్ కింద మంచి థర్మల్ టైట్స్ వేసుకుంటే సరిపోతుంది. ప్రింటెడ్ లేదా ప్లీటెడ్ మ్యాక్సీ డ్రస్ ఎంచుకుంటే ప్రతి సందర్భానికి ఇది మ్యాచ్ అయిపోతుంది.

7. టర్టిల్ నెక్

చలికాలంలో కాస్త వెచ్చదనాన్ని కోరుకోవడంతో పాటు.. ఫ్యాషనబుల్‌గా కనిపించాలని భావిస్తున్నారా..? అయితే చక్కటి టర్టిల్ నెక్ ప్యాంట్ ఎంచుకోండి. దీనిపై మంచి జెగ్గింగ్ లేదా జీన్స్ ధరించి లాంగ్ కోట్ వేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అవుట్ ఫిట్స్‌తోనే అందరి మధ్య మీరే ప్రత్యేకంగా కనిపించే వీలుంటుంది. దీన్ని ఓ మంచి స్టైలిష్ బ్యాగ్‌తో మ్యాచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

ADVERTISEMENT

8. స్టైలిష్ వైట్ టాప్

తెలుపు రంగు టాప్స్ ఇష్టం లేని వారు ఎవరూ ఉండరేమో.. అందుకే ఆ రంగు ప్యాంట్లు ఎన్ని ఉన్నా మనకు సరిపోవు. బడ్జెట్ సరిపోకపోయినా స్టైలిష్‌గా కనిపించాలంటే.. ఓ చక్కటి స్పెషల్ డిజైన్ తెలుపు రంగు టాప్ ఎంచుకోండి. మీ జీన్స్, జెగ్గింగ్స్, ట్రౌజర్స్, స్కర్ట్స్ వేటితో అయినా ఇది ఇట్టే మ్యాచ్ అయిపోతుంది. అందరిలోనూ మీకు స్పెషల్ లుక్ అందిస్తుంది.

9. రంగుల ట్రౌజర్

చాలామంది ఎక్కడికి వెళ్లినా బ్లూ లేదా నలుపు రంగు జీన్స్ ధరిస్తూ ఉంటారు. కానీ ట్రౌజర్స్‌లో వివిధ రకాలుంటాయి. అవి చాలా కలర్ ఫుల్‌గా ఉంటాయి. వాటిని వార్డ్ రోబ్‌లో భాగం చేసుకోవడంతో పాటు.. క్రిస్మస్ కోసం వాటిని ఎంచుకోండి. ఇందులో ఆప్షన్లు లెక్కలేనన్ని ఉంటాయి. పేస్టల్ రంగుల నుంచి బోల్డ్ రంగుల వరకూ ప్రతి ఒక్కటి ఎంచుకోవచ్చు. ఈ పింక్ రంగు ప్యాంట్ చూడండి. దానికి అద్భుతమైన టెడ్డీబేర్ కోట్ చక్కగా మ్యాచ్ అయింది. అలాగే యాక్సెసరీస్  మ్యాచ్ కాకపోయినా.. అన్నీ ఒకేలా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.

ADVERTISEMENT

10. యానిమల్ ప్రింట్

ప్రింటెడ్ డ్రస్ ఎప్పటికీ ట్రెండ్‌లోనే ఉంటుంది. ఇక చలికాలంలో అయితే డార్క్ కలర్ డ్రస్సులు ధరించడం ఫ్యాషన్. అంతేకాదు.. ఈ సీజన్‌లో యానిమల్ ప్రింట్స్ కూడా ఎక్కువ మంది వేసుకుంటారు. వాటిని కూడా మీ వార్డ్ రోబ్‌లో భాగం చేసుకోండి. క్రిస్మస్ లంచ్‌లో భాగంగా దీన్ని ధరించడంతో పాటు.. లేయర్స్ కూడా జోడించండి. యాక్సెసరీస్‌‌‌లోనూ కొత్తదనం చూపిస్తూ.. ప్రత్యేకమైన లుక్ సొంతం చేసుకోండి.

11. ఫాక్స్ ఫర్

క్రిస్మస్ అనగానే చాలామంది క్యూట్ అండ్ స్పెషల్‌గా తయారవ్వాలని భావిస్తారు. మీరూ అలాగే భావిస్తుంటే.. ఈ ఫ్యాషన్ స్టైల్‌ని ఫాలో అవ్వచ్చు. అలాగే చక్కటి జాకెట్ ధరించి.. దానికి తోడుగా ఫాక్స్ ఫర్‌తో తయారుచేసిన హ్యాండ్ బ్యాగ్‌ను జత చేయవచ్చు. లేదా ఫర్‌తో తయారుచేసిన జాకెట్ ఎంచుకొని.. ప్లెయిన్ యాక్సెసరీస్‌తో మ్యాచ్ చేయవచ్చు. ఎలా చేసినా క్రిస్మస్ అవుటింగ్‌లో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.

ADVERTISEMENT

12. బ్లేజర్

ఈ హాలిడే సీజన్‌లో మరో లేయరింగ్ ఆప్షన్ బ్లేజర్. “అదేంటి ఇది ఫార్మల్ డ్రస్సింగ్ కదా.. అలాగే ఆఫీస్  మీటింగ్స్‌‌కి మాత్రమే వాడతారు.. మరేంటి.. పార్టీలకు వేసుకొని వెళ్లమని అంటున్నారు?” అని సంశయిస్తున్నారా..? డోంట్ వర్రీ.. ఇప్పుడు బ్లేజర్ కేవలం అఫిషియల్ వేర్ మాత్రమే కాదు.. పార్టీలకు కూడా వాడవచ్చు. పేస్టల్ రంగులు లేదా యానిమల్ ప్రింట్స్ వంటివి ఎంచుకోవడం వల్ల ఇవి ప్రత్యేకంగా కనిపించే వీలుంటుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
13 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT