ADVERTISEMENT
home / Home & Garden
మీరు పెట్ పేరెంటా? ఈ పెట్ ఫ్రెండ్లీ మొక్కలతో ఇంట్లో పచ్చదనాన్ని నింపేయండి

మీరు పెట్ పేరెంటా? ఈ పెట్ ఫ్రెండ్లీ మొక్కలతో ఇంట్లో పచ్చదనాన్ని నింపేయండి

ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే.. ఇండోర్ ప్లాంట్స్ పెంచే విషయంలో చాలామంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే.. ఆ మొక్కల వల్ల తమ పెట్స్‌కి.. ఏదైనా హాని జరుగుతుందేమోననే భయం ఒక కారణం. అందుకే మొక్కల పెంపకానికి దూరంగా ఉంటారు. అయితే ఇందులో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి. కొన్ని రకాల మొక్కల ఆకులను పెంపుడు జంతువులు తింటే వాటికి జీర్ణసమస్యలు తలెత్తుతాయి.

అందుకే ఇండోర్ ప్లాంట్స్ పెంచే విషయంలో పెట్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. మీరు కూడా పెట్ పేరెంటా? అయితే  ఈ పెట్ ఫ్రెండ్లీ మొక్కలతో (pet friendly plants) మీ ఇంట్లో పచ్చదనం నింపేయడంతో పాటు.. మంచి పెట్ పేరెంట్ అని కూడా అనిపించుకోండి.

1. బర్డ్స్ నెస్ట్ ఫెర్న్

bird nest fern

ADVERTISEMENT

Image Source: Instagram

పెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు.. వెలుతురు తక్కువగా ఉన్నా.. బాగా ఎదిగే మొక్క కావాలనుకొనేవారికి సరైన ఎంపిక ఈ బర్డ్స్ నెస్ట్ ఫెర్న్. చాలా తక్కువ వెలుతురులో పెరిగే ఈ మొక్కకు వారానికోసారి నీరు పోస్తే సరిపోతుంది. దీన్ని చక్కగా అక్కడక్కడా వేలాడదీయవచ్చు.

Also Read: ఈ టాలీవుడ్ బ్యూటీస్.. పెంపుడు జంతువులు అంటే ప్రాణమిస్తారు..

2. స్పైడర్ ప్లాంట్

ADVERTISEMENT

spider plant

Image Source: Instagram

తక్కువ వెలుతురులో పెరిగే మరో పెట్ ఫ్రెండ్లీ మొక్క స్పైడర్ ప్లాంట్. వీటికి పిలకలు కూడా వస్తాయి. కాబట్టి వాటిని తీసి మరో కుండీలో పెంచుకోవచ్చు. వీటిని ఎండలో ఉంచడం వల్ల మరింత అందంగా పెరుగుతాయి. దీనికి కూడా వారానికోసారి నీరు పోస్తే సరిపోతుంది.

3. మనీ ట్రీ

ADVERTISEMENT

money tree

Image Source: Instagram

పెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే.. పెద్దగా శ్రద్ధ కనబరచకపోయినా.. చక్కగా పెరిగే మొక్కల కోసం చూసే వారికి చక్కటి ఎంపిక ఈ మనీ ట్రీ. కానీ కాస్త శ్రద్ధ చూపిస్తే చక్కగా పెరుగుతుంది. ఈ మొక్కకు వారానికోసారి నీరు పోస్తే సరిపోతుంది.

Also Read: పట్టులాంటి కురులు.. మృదువైన‌ చర్మం.. “రోజ్ మేరీ ఆయిల్”తోనే సాధ్యం..!

ADVERTISEMENT

4. ఎషివేరియా లోలా (Echeveria lola)

Echeveria lola

Image Source: Instagram

సిమెంట్‌కు వచ్చిన పగుళ్లు, రాళ్ల మధ్య కూడా చక్కగా పెరిగిపోతుంది ఈ మొక్క. చాలా అందంగా ఉండే ఈ మొక్క పెట్ ఫ్రెండ్లీ కూడా. రెండు మూడు వారాలకోసారి ఎండలో పెడుతూ.. అప్పుడప్పుడూ కొద్దిగా నీటిని పోస్తే సరిపోతుంది.

ADVERTISEMENT

5. బోస్టన్ ఫెర్న్

bostonfern

Image Source: Instagram

హ్యాంగింగ్ పాట్స్‌లో (వేలాడే కుండీలు) ఈ మొక్కలు వేస్తే కిందికి వేలాడుతూ.. చాలా అందంగా కనిపిస్తాయి. వీటిని బాల్కనీలో పెంచితే చాలా బాగుంటుంది. ఈ మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే.. కుండీలో మట్టి ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి.

ADVERTISEMENT

6. పార్లర్ పామ్

palm plant

Image Source: Instagram

సుమారు రెండు మీటర్ల ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క ఇంట్లో ఉంచితే చాలా అందాన్నిస్తుంది. పైగా ఇది పెట్ ఫ్రెండ్లీ కూడా. ఇంట్లో వెలుతురు బాగా ప్రసరించే చోట దీన్ని ఉంచితే ఏపుగా పెరుగుతుంది. వారానికోసారి నీరు పోస్తే సరిపోతుంది.

ADVERTISEMENT

7. బేబీస్ టియర్స్

baby tears

Image Source: Instagram

చిన్న చిన్న ఆకులతో అందంగా కనిపించే ఈ మొక్క ఇంటికి కొత్త కళను అందిస్తుంది. దీని ఆకుల మాదిరిగానే దీనికి పూచే చిన్న చిన్న పువ్వలు సైతం అందంగా ఉంటాయి.

ADVERTISEMENT

Also Read: బాదం పప్పు తింటే.. ఉండదు మన ఆరోగ్యానికి ముప్పు

 8.  వాటర్ మిలన్ ప్లాంట్

water melon plant

Image Source: Instagram

ADVERTISEMENT

చూడటానికి పుచ్చకాయ మాదిరిగా ఉంటాయి ఈ మొక్కల ఆకులు. వైవిధ్య భరితంగా ఉన్న ఈ మొక్కలు ఇంటికి సరికొత్త లుక్ ఇస్తాయి. పైగా ఈ మొక్క వల్ల పెంపుడు జంతువులకు ఎలాంటి హాని కలగదు.

9. ఫ్రెండ్షిప్ ప్లాంట్

friendship plant

Image source: Instagram

ADVERTISEMENT

పేరుకు తగ్గట్టుగానే స్నేహానికి గుర్తుగా స్నేహితులు ఒకరికొకరు ఈ మొక్కను ఇచ్చిపుచ్చుకొంటారు. మీకు కూడా ఇలాంటి మొక్క బహుమతిగా వస్తే ఎంచక్కా ఇంట్లో పెట్టేయండి. ఎందుకంటే ఇది పూర్తిగా పెట్ ఫ్రెండ్లీ. దీని ఆకులు కాస్త గరుకుగా ఉండ‌డంతో జంతువులు ఈ మొక్క ఆకులను కొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్క జాగ్రత్త.

10. పోల్కా డాట్ ప్లాంట్

polka dot plant

Image Source: Instagram

ADVERTISEMENT

పేరుకు తగినట్టుగానే ఈ మొక్క ఆకులపై వివిధ రంగుల్లో చుక్కలుంటాయి. మినియేచర్ గార్డెన్ పెంచాలనుకొనేవారు తప్పనిసరిగా.. ఈ మొక్కను తమ గార్డెన్‌లో భాగం చేసుకోవాల్సిందే. తెలుపు, పింక్ రంగుల్లో ఈ పోల్కాడాట్ మొక్కలు లభిస్తాయి. ఇవి ఇంటికే కొత్త అందాన్నిస్తాయి.

Feature Image: Instagram

13 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT