ADVERTISEMENT
home / Life
అమ్మాయిలూ.. పెళ్లికి ముందే పెళ్లికొడుకుని ఈ ప్రశ్నలడగండి..!

అమ్మాయిలూ.. పెళ్లికి ముందే పెళ్లికొడుకుని ఈ ప్రశ్నలడగండి..!

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి (marriage) చాలా ముఖ్యమైంది. అందుకే పెళ్లి చేసే ముందు.. మన పెద్దలు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. అన్ని చూసినా.. కొన్ని సందర్భాల్లో మనల్ని అన్ని విధాలుగా అర్థం చేసుకునే భాగస్వామి దొరక్కపోవచ్చు. అయితే పెళ్లికి ముందు మీకు కాబోయే భాగస్వామితో (partner) మాట్లాడటం ద్వారా అతని ధోరణి, మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీకు కాబోయే భర్త మనస్తత్వం గురించి తెలుసుకోవడానికి, మీ సందేహాలను తొలగించుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు (questions) అడిగితే బాగుంటుందో ఓసారి చూద్దామా?

1. పెళ్లి తర్వాత నన్ను ఉద్యోగం చేయనిస్తారా?

అమ్మాయిలు ఆర్థికంగా స్వాంతంత్ర్యం కలిగి ఉండడం చాలా అవసరం. కానీ కొన్నిసార్లు.. ఉన్నత స్థానాలను చేరుకొనే సత్తా ఉన్నప్పటికీ.. పెళ్లి తర్వాత చాలామంది మంది అమ్మాయిలు ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇలా చేయడం వారికి కూడా ఇష్టముండదు. మీరు పెళ్లి తర్వాత కూడా పని చేయాలని భావిస్తే.. మీకు కాబోయే భాగస్వామి కూడా దీనికి అంగీకరిస్తే.. నిర్మొహమాటంగా ఇంటి పనులు పంచుకోవాలని చెప్పండి. ఎందుకంటే.. ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చి.. మళ్లీ ఇంటెడు చాకిరీ చేయాలంటే కష్టం కదా.

Giphy

ADVERTISEMENT

2. ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారు?

ఈ ప్రశ్న మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఇది కచ్చితంగా అడగాల్సిన ప్రశ్న. ఎంతమంది పిల్లలు కావాలని మాత్రమే కాదు.. ఎప్పుడు తల్లిదండ్రులుగా మారాలని అనుకుంటున్నారో కూడా అడగడం  ముఖ్యమే. ఎందుకంటే.. పిల్లలు పుట్టడంతోనే మహిళ జీవితం మొత్తం మారిపోతుంది. ఈ విషయంలో మీ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం.. ముందుగానే చర్చించుకోవడం మంచిది.

3. ఉమ్మడి కుటుంబమా? వేరు కాపురమా?

ఈ ప్రశ్న అడగడం వెనక ముఖ్య ఉద్దేశం.. అతడు తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తాడో తెలుసుకోవడానికే. మీ తల్లిదండ్రులైనా.. మీ భాగస్వామి తల్లిదండ్రులైనా.. వారు మీ ఇద్దరి జీవితంలోనూ చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తారు. మీకు వెన్నుదన్నుగా నిలుస్తారు. కాబట్టి ఈ విషయంలో వారిద్దరినీ దృష్టిలో పెట్టుకొని  నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఇద్దరి కుటుంబాల మధ్య  సమస్యలు ఏర్పడినా.. మీ ఇద్దరే వాటిని  పరిష్కరించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకరి తల్లిదండ్రులను మరొకరు అంగీకరిస్తే.. మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.

Giphy

ADVERTISEMENT

4. పొద్దున్నే నిద్ర లేస్తావా? నువ్వు నిద్ర లేచినప్పుడే.. నేను కూడా నిద్ర లేవాలా?

మీకు కాబోయే భర్తకు ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు ఉండి.. మీకు ఆ అలవాటు లేకపోతే? బిజీబిజీగా సాగిపోతున్న.. నేటి తరం జీవనవిధానంలో భార్యాభర్తలుగా సంతోషంగా ఉండాలంటే.. ఇద్దరూ కలసి ఎంతో కొంత సమయం గడపాల్సిందే. మీ భర్త ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లాల్సి ఉంటే.. మీరు కూడా దానికి అనుగుణంగా  మీ సమయాన్ని మార్చుకోవాలిగా. లేదంటే ఉదయాన్నే మీ భర్తతో కలసి వేడి వేడిగా ఓ కప్పు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పే అవకాశాన్ని కోల్పోతారు.

5. మీ జీతమెంత? ఎంత ఖర్చుపెడతారు?

కాబోయే భార్యాభర్తలుగా ఆర్థికపరమైన విషయాల గురించి చర్చించుకోవడంలో తప్పు లేదు. అంతేకాదు ఈ విషయంలో ఇద్దరూ కలసి చర్చించుకోవడం అవసరం. ఎంత సంపాదిస్తారో తెలుసుకుంటే సరిపోదు. ఎంత ఖర్చుపెడతారు? ఎంత పొదుపు చేస్తారనేది కూడా తెలుసుకోవాలి. ఈ విషయంలో అతను అడిగే ప్రశ్నలకు సైతం మీరు సమాధానం చెప్పాలి. ఆర్థికపరమైన విషయాలు ఇప్పుడు మనకు చాలా చిన్నవిగా కనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో అవే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇద్దరూ స్పష్టతతో వ్యవహరించడం మంచిది.

6. పెంపుడు జంతువులంటే నీకిష్టమేనా?

కొంతమందికి పెంపుడు జంతువులంటే ఇష్టం ఉండచ్చు. మరి కొందరికి అవి నచ్చకపోవచ్చు. ఈ విషయంలో మీ ఇద్దరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. దాన్ని బట్టే పెట్ పెంచాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే కొంతమందికి పెట్స్ అంటే ఇష్టమున్నా.. కొన్ని రకాల జంతువులను పెంచడం ఇష్టం ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఇష్టాయిష్టాలు తెలుసుకుంటే.. అసలు పెంచాలా వద్దా? పెంచితే.. ఏ జంతువును పెంచాలని ఓ నిర్ణయానికి రావచ్చు.

ADVERTISEMENT

Giphy

7. నిర్ణయాలు కలిసే తీసుకుందామా?

ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే.. పెళ్లి అంటేనే ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవడం. ప్రతి విషయంలోనూ ఒక్కరే నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. భాగస్వామి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోయినా అది వారిపై ప్రభావం చూపిస్తుంది. మీ ఇద్దరికీ సంబంధించిన విషయాలు చిన్నవైనా, పెద్దవైనా.. ఇద్దరూ కలసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సంసార నావ సుఖంగా సాగిపోతుంది.

8. ఒకరికోసం మరొకరం సర్దుకుపోగలమా?

ఈ ప్రశ్న ఎందుకు అడగాలంటే.. తనలో మీకు నచ్చని విషయాలుండొచ్చు. అతనికి కూడా మీ లక్షణాలు కొన్ని నచ్చకపోవచ్చు. అయితే ఒకరిని భాగస్వామిగా అంగీకరిస్తున్నామంటే.. వారి ప్లస్ పాయింట్స్‌తో పాటు మైనస్ పాయింట్స్‌ను కూడా అంగీకరించాల్సిందే. దానికి తగినట్లు ఇద్దరూ సర్దుకోవాల్సిందే. అవసరమైనప్పుడు మనం ఓ మెట్టు కాస్త తగ్గి.. భాగస్వామిని ఓ మెట్టు పైకెక్కించాలి. ఈ సూత్రం భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తుంది.

9. బ్యాచిలర్‌గా చేయాలనుకున్న పనులన్నింటినీ పూర్తి చేశారా?

అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా.. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు కొన్ని పనులు చేయాలనుకుంటారు. దాన్నే మనం బకెట్ లిస్ట్ అని పిలుస్తుంటాం. ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌కి వెళ్లడం లాంటివి అన్నమాట. మాటల్లో అతని సీక్రెట్ విష్ మీకు తెలిస్తే.. దాన్ని నిజమయ్యేలా చేసి సర్ప్రైజ్ చేయండి.

ADVERTISEMENT

Giphy

10. భార్యాభర్తలుగా మనకెదురైన సమస్యలను మనం పరిష్కరించుకోగలమా?

భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండటం ఎలా సహజమో.. అలకలు కూడా అంతే సహజం. కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య మనస్పర్థలు సైతం ఏర్పడవచ్చు. అయితే ఒకరిపై ఒకరికున్న ప్రేమ, ఎప్పటికీ కలిసి ఉండాలనే తపన ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఇద్దరూ కలిసి అధిగమించవచ్చు.  దీనికోసం మీ దగ్గర ఉండాల్సిన లక్షణాలు ఒకరిపై మరొకరికి ప్రేమ, అనురాగం, ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం.

11. వంట చేయడం తెలుసా?

ఉద్యోగం చేసినా చేయకపోయినా.. తన భార్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం భర్త విధి. అప్పుడప్పుడూ మీ కోసం తను వంట చేయడం లేదా మీరు ఊరికి వెళ్లినప్పుడైనా తను వండుకోవాలి కదా.

ADVERTISEMENT

12. ఒకేసారి ఇద్దరికీ వేర్వేరు వస్తువులు కావాలనిపిస్తే..?

ఇలా జరగడం సహజం. ఎందుకంటే ఏ ఇద్దరికీ ఒకేరకమైన అభిరుచులుండవు. ఈ విషయంలో కొన్నిసార్లు ఇద్దరికీ గొడవలు రావచ్చు. కానీ మీ ఇద్దరూ ఒకరికోసం ఒకరు సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ ఒక్కరే కాంప్రమైజ్ అవ్వడం కూడా మంచిది కాదు. ఈ విషయం ఇద్దరూ అర్థం చేసుకోవాలి.

Giphy

13. పెళ్లి తర్వాత స్వతంత్రంగా ఉండే అవకాశం నాకు ఉంటుందా?

పెళ్లి అంటే మీ స్వాతంత్ర్యాన్ని హరించేది కాకూడదు. కాబట్టి మీ స్నేహితులతో కలసి కిట్టీపార్టీలకు వెళ్లడం, వారితో కలసి టూర్లకు వెళ్లడం.. ఇలాంటి విషయాల్లో మీరు మీ భర్త ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోగలిగే స్వతంత్రం మీకుండాలి. ఎందుకంటే.. పెళ్లి మీ జీవితానికి ఆనకట్టలా అడ్డుపడకూడదు. అలాగే ఈ విషయం గురించి మీ ఇద్దరూ ముందే చర్చించుకుంటే.. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ADVERTISEMENT

ఓ నిర్ణయానికి వచ్చేముందు.. మీ బాయ్ ఫ్రెండ్‌ను ఈ ప్రశ్నలు అడగండి

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

25 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT