ADVERTISEMENT
home / వినోదం
‘అల వైకుంఠాపురం’ ఇంటి వెనుకన్న.. రహస్యం ఇదే..!

‘అల వైకుంఠాపురం’ ఇంటి వెనుకన్న.. రహస్యం ఇదే..!

Secret behind “Ala Vaikuntapuramuloo” house

త్రివిక్రమ్ దర్శకత్వంలో.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘అల వైకుంఠాపురంలో’  చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భాగంగా వేసిన ‘వైకుంఠాపురం’ ఇంటి సెట్ డ్యూప్లికేట్ కాదని.. పక్కా ఒరిజినల్ అని వార్తలు వస్తున్నాయి. అనుకోకుండా ఆ  ఇంటిని చూసిన త్రివిక్రమ్… ఆ ఇంటి యజమానులతో మాట్లాడి అక్కడే షూటింగ్ ఏర్పాటు చేశారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. అల వైకుంఠాపురం ఒరిజినల్ హౌస్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ అధినేత కుమార్తెది కావడం విశేషం.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల AA19 చిత్రం.. హాలీవుడ్ ఫ్రీ-మేకా?

ప్రస్తుతం ఈ ఇంటిని చూసి ముచ్చటి పడి.. అచ్చం అలాంటి ఇంటినే బంజారా హిల్స్‌లో కట్టడానికి సంసిద్ధమవుతున్నారట అల్లు అర్జున్. ఇదే విషయాన్ని ఆయన ఇటీవలే ఆడియో రిలీజ్ వేడుకలో కూడా చెప్పారు. అలాగే ఆ ఇంటిని నిర్మించడం కోసం తన తండ్రి అల్లు అరవింద్‌ని సహాయం అడుగుతానని కూడా అల్లు అర్జున్ చెప్పడం గమనార్హం. ఇక సినిమా షూటింగ్ కోసం వాడిన ఒరిజినల్ ఇంటిలో.. దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ చేశారట. అల్లు అర్జున్‌తో సినిమా షూటింగ్ అనడంతో.. ఆ ఇంటి యజమానులు కూడా ఆనందంగా ఒప్పుకున్నారట. 

ADVERTISEMENT

‘అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల’ ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా…!

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠాపురంలో’ చిత్రం.. తొలి రోజు నుండే హిట్ టాక్‌ను కైవసం చేసుకుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో బన్నీ లవ్ ఇంట్రెస్ట్‌గా నటించగా.. జయరాం, టబు, మురళీ శర్మ, సునీల్, నవదీప్, సముద్రఖని, సచిన్ ఖేడ్కర్, హర్షవర్థన్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, ఇతర ముఖ్యపాత్రలలో కనిపిస్తారు. ఇక సుశాంత్, నివేతా పెతురాజ్ సినిమాలో కీలక పాత్రలలో కనిపిస్తారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. 

‘అలా వైకుంఠాపురంలో’ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో రూ. 47.85 కోట్లు దాటడం విశేషం. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.67 కోట్లకు పైమాటే జరిగిందని టాక్. సరిలేరు నీకెవ్వరు, దర్బార్ చిత్రాలతో కలిసి సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం.. బయ్యర్లకు మంచి లాభాలనే మిగిల్చింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషనులో మరో హ్యాట్రిక్ విజయం నమోదు అయ్యిందనే చెప్పవచ్చు. ఈ సినిమాకి కథను కూడా త్రివిక్రమే రాయడం గమనార్హం. అయితే కథ పాతదే అయినా.. స్క్రీన్ ప్లేలో కొత్తదనాన్ని చూపించి సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించారని సమీక్షలు రావడం గమనార్హం. 

మన బన్నీ.. ‘స్టైలిష్ స్టార్’ ఎలా అయ్యాడు? (అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్)

ADVERTISEMENT

ఈ చిత్రంలో ముఖ్య తారాగణంతో పాటు రాజేంద్రప్రసాద్, రోహిణి, రాహుల్ రామక్రిష్ణ, బ్రహ్మాజీ, అజయ్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, వైష్ణవీ చైతన్య, గోవింద్ పద్మసూర్య సహాయ పాత్రలలో నటించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. “అంగు వైకుంఠపురతు” పేరుతో మలయాళంలో కూడా ఈ చిత్రం విడుదల కావడం గమనార్హం. అలాగే ఈసారి జపాన్‌‌లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జెమిని టివి దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ని సన్ నెక్స్ట్ దక్కించుకుంది. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి                                       

 

16 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT