ADVERTISEMENT
home / Astrology
మీ సోదరుడి రాశి ప్రకారం.. ఏ రంగు రాఖీ కట్టాలో మీకు తెలుసా?

మీ సోదరుడి రాశి ప్రకారం.. ఏ రంగు రాఖీ కట్టాలో మీకు తెలుసా?

రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కా,తమ్ముళ్ల మధ్యనున్న ప్రేమను చాటి చెప్పేందుకు చేసుకునే పవిత్రమైన పండగ. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ.. తన రక్షణను కాంక్షిస్తూ ప్రతి సోదరి అన్న లేదా తమ్ముడికి రాఖీ (rakhi) కట్టడం మనం చూస్తుంటాం. అంతేకాదు.. సోదరుడికి కట్టే రాఖీ అతడికి ఆరోగ్యాన్ని, సక్సెస్‌ని అందించాలని కూడా కోరుకుంటూ ఉంటాం.

అయితే మీ సోదరుడి రాశి ప్రకారం కొన్ని రకాల రంగుల్లో ఉన్న రాఖీని.. తన చేతికి కడితే తనకు లక్ ఫ్యాక్టర్ కలిసొస్తుందట. చేతికి ఫలానా రంగు దారం కడితే మంచిదని జ్యోతిష్యం ప్రకారం కూడా చెబుతుంటారు. అందుకే మీ అన్న లేదా తమ్ముడి రాశి (zodiac sign) ప్రకారం.. అతడి చేతికి ఏ రంగు రాఖీ ఉండాలో చూసి దాన్ని కట్టండి. వారి లక్‌ని వారికి అందించండి.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

మేషం (Aries)

ఈ రాశికి అధిపతి కుజుడు. ఒకవేళ మీ సోదరుడు ఈ రాశికి చెందినవారైతే వారికి ఎరుపు లేదా పసుపు రంగు దారం ఉన్న రాఖీ కట్టండి. ఇది వారికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఆ శక్తి వారి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపించి వారు అన్నింటా ముందుకెళ్లేలా చూస్తుంది. కేవలం రాఖీ కట్టడమే కాదు.. ఈ పండగ సందర్భంగా మీ సోదరుడికి ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉన్న దుస్తులు లేదా బహుమతులు అందిస్తే ఇంకా బాగుంటుంది.

ADVERTISEMENT

వృషభం (Tarus)

ఈ రాశికి అధిదేవత శుక్రుడు. అందుకే.. ఒకవేళ మీ సోదరుడు ఈ రాశిలో పుట్టిన వారైతే వారికి నీలం, బూడిద రంగులో ఉన్న రాఖీలను కట్టండి. మీకు వీలుంటే వెండి రాఖీని కొని కట్టడం ఇంకా మంచిది. ఇది మీ సోదరుడి జీవితాన్ని మార్చేస్తుంది.

మిథునం (Gemini)

మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిలో పుట్టినవారి కోసం ఆకుపచ్చ, ఎరుపు, గంధం రంగులో ఉండే రాఖీలను ఎంచుకోవడం వల్ల మీ సోదరుడికి ఎప్పుడూ సుఖశాంతులు కలుగుతాయట.

కర్కాటకం (Cancer)

ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడికి గుర్తుగా తెల్లని ముత్యాలతో కూడిన రాఖీని లేదా వెండితో తయారుచేసిన రాఖీని కట్టడం వల్ల మీ సోదరుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడట. కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు.. తెలుపు లేదా క్రీం రంగులో ఉన్న దుస్తులు లేదా బహుమతులు కూడా అందించడం వల్ల కేవలం అప్పుడే కాదు.. సంవత్సరం మొత్తం మీ సోదరుడు ఆనందంగా ఉంటారట. 

సింహం (Leo)

సింహ రాశికి అధి దేవత సూర్యుడు. అందుకే సూర్యుడిని తలపించేలా వీరి రాఖీ రంగు కూడా ఎరుపు లేదా గులాబీ రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు.. ఈ రోజు మీ సోదరుడు ఇష్టపడే బహుమతులు ఏవైనా.. ఈ రంగుల్లో ఉండేలా చూసుకొని వారికి అందిస్తే మీ బంధం జీవితాంతం అంతే బలంగా ఉంటుందట.

ADVERTISEMENT

కన్య (Virgo)

కన్యా రాశికి అధిపతి బుధుడు. అందుకే ఈ రాశి వారికి ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న రాఖీ తీసుకొచ్చి కట్టాలట. అంతేకాదు.. ముత్యంతో చేసినవి.. గంధం రంగులో ఉండేవి కూడా తీసుకోవచ్చు. ఆకుపచ్చ రంగు బహుమతులు మీ సోదరుడు ఆనందంగా ఉండేలా చేస్తాయట.

తుల (Libra)

తుల రాశి అధిపతి శుక్రుడు. మీ సోదరుడు ఈ రాశిలో పుట్టిన వారు అయితే తనకి నీలం, టర్కోయిస్, పర్పుల్ రంగుల్లో ఉండే మంచి రాఖీలను వెతికి అందించడంతో పాటు.. తెలుపు, బూడిద వర్ణాల్లో ఉండే ఏదైనా బహుమతిని కూడా ఇవ్వడం వల్ల వారు సంవత్సరమంతా ఆనందంగా ఉంటారట.

వృశ్చికం (Scorpio)

ఈ రాశి అధిదేవత కుజుడు. అందుకే మీ సోదరుడు ఈ రాశి వారైతే.. వారికి ఎరుపు రంగులో ఉన్న రాఖీ కట్టండి. లేదా ముత్యంతో కూడినది కట్టినా బాగుంటుంది. అంతేకాదు.. ఈ పండగ రోజు వారికి ఇచ్చే బహుమతి తెలుపు రంగులో ఉండేలా చూసుకోండి. ఇది మీ సోదరుడి జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుందట.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

ADVERTISEMENT

ధనుస్సు (Saggitarius)

ఈ రాశికి అధిపతి గురుడు. అందుకే ఈ రాశివారికి పసుపు, గంధం రంగుల్లో ఉండే రాఖీ కట్టడం వల్ల వారు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారట. అయితే వీరికి బహుమతులు ఇచ్చేటప్పుడు మాత్రం ఎరుపు రంగువి ఇవ్వండి. దీనివల్ల వారి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుంది.

మకరం (Capricorn)

మకర రాశి అధిపతి శని. అందుకే ఈ రాశి వారికి నీలం రంగు రాఖీ కట్టడం వారి శ్రేయస్సుకు ఎంతో మంచిది. అంతేకాదు.. ఆ శని దేవుడిని మీ అన్న లేదా తమ్ముడిపై ఎప్పుడూ వరాల వర్షం కురిపించాలని కోరుకుంటూ పూజ చేయండి. ఈ సంవత్సరం వారి జీవితంలో ఎన్నో సంతోషకరమైన విషయాలు జరుగుతాయి.

మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!

కుంభం (Aquarius)

ఈ రాశికి అధిపతి శని. అందుకే ఈ రాశిలో పుట్టిన మీ అన్న లేదా తమ్ముడికి నీలం రంగు రాఖీని కట్టండి. ఇది వారి జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది.

ADVERTISEMENT

మీనం (Pisces)

మీన రాశికి అధిపతి గురుడు. అందుకే ఈ రాశిలో పుట్టిన మీ సోదరుడు ఆనందంగా ఉండేలా అతడికి పసుపు రంగు రాఖీ కట్టండి. అంతేకాదు.. తెలుపు రంగులో ఉన్న దుస్తులు లేదా ఇతర బహుమతులు అతడికి ఇవ్వడం వల్ల వారి కష్టాలన్నీ తొలగిపోతాయట.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

13 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT