ADVERTISEMENT
home / Fiction
దసరా సంబరాల వేళ.. ఆయుధ పూజ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

దసరా సంబరాల వేళ.. ఆయుధ పూజ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

(Significance of Ayudha Puja on the occasion of Dussehra)

దేవీ నవరాత్రుల సందర్భంగా.. విజయదశమి పర్వదినానికి ఒక రోజు ముందుగా ఆయుధ పూజ జరుపుకోవడం అనేది మనకు తరతరాల నుండి వస్తున్న ఆచారంగా పరిగణించవచ్చు. ఈ రోజు అందరూ తమ వృత్తికి సంబంధించిన పరికరాలను, పనిముట్లను, ఇతరత్రా సామగ్రిని అమ్మవారి ముందు ఉంచి పూజిస్తారు. రైతులు నాగళ్లను, కమ్మరులు తాము కొలిమిలో వాడే ఇనుప సామగ్రిని ఈ రోజు పూజిస్తారు. తమ పనిముట్లకు పసుపు రాసి, కుంకుమ అద్ది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు. 

తెలంగాణ సంప్రదాయకతకు అద్దం పట్టిన.. బతుకమ్మ సంబురాలు ..!

దర్జీలు తమ కుట్టు మిషన్లను, మేదరులు వెదురు సామగ్రిని, చేనేత కార్మికులు తమ మగ్గాలను ఈ రోజు పూజిస్తారు.  కర్మాగారాలలో, ఫ్యాక్టరీలలో కూడా యాజమాన్యాలు ఆయుధ పూజను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. మెషీన్లకు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఈ ఆయుధ పూజకు సంబంధించి వివిధ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు.. శమీ వృక్షం క్రింద తమ ఆయుధాలను భద్రపరిచారని అంటారు.

ADVERTISEMENT

సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..

అర్జునుడి గాండీవముతో పాటు.. భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లే ముందు.. ప్రత్యేకంగా పూజలు జరిపించారని.. ఆ విధంగా శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకొని.. పాండవులు యుద్ధానికి సమాయత్తం అయ్యారని అంటారు. భారత ప్రభుత్వం కూడా ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగే శస్త్రపూజలో పాల్గొననుంది. రఫేల్ విమాన పరికరాలకు వారు పూజలు చేయనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆయుధ పూజలను.. ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా నిర్వహించేవారు. 

ప్రస్తుతం ఈ ఆయుధ పూజ సంప్రదాయం అన్ని రంగాలకూ పాకింది. క్రికెటర్లు కూడా తమ బ్యాట్లు, స్పోర్ట్స్ కిట్స్‌కి పసుపు, కుంకుమ అద్ది.. వాటికి పై తమకున్న అక్కరను, గౌరవాన్ని చాటుకుంటున్నారు. అలాగే చాలామంది ఈ రోజు నాడు.. తమ వాహనాలకు కూడా పూజలు చేయడాన్ని ఒక సంప్రదాయంగా అనుసరిస్తున్నారు. సంగీత విద్వాంసులు కూడా ఇదే రోజు తమ వాయిద్యాలకు ప్రత్యేకంగా పూజలు చేయిస్తుంటారు. వీణ, తబలా, వేణువు లాంటి వాటిని సరస్వతి దేవీ ప్రతిరూపాలుగా భావించి పూజిస్తారు. 

పూలను పూజించే బతుకమ్మ.. శక్తిని ఆరాధించే దసరా

ADVERTISEMENT

ఆయుధపూజనే కొన్ని ప్రాంతాలలో అస్త్ర పూజ అంటారు. కేరళ లాంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా.. ప్రత్యేకంగా యుద్ధకళలకు సంబంధించిన పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. తమిళనాడు ప్రాంతంలో ఆయుధ పూజ సందర్భంగా.. సరస్వతీదేవి పూజను కూడా చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున విద్యార్థులు తమ కలాలు, పుస్తకాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను “గోలు” అంటారు. ఈ రోజున బొమ్మల కొలువు కూడా నిర్వహిస్తారు. 

Featured Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.                                                                                                                                                                                                                                          

ADVERTISEMENT

 

07 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT