ADVERTISEMENT
home / Bridal Skincare
చర్మం ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే.. ఈ స్మూతీలు (Smoothies) తాగి చూడండి ..!

చర్మం ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే.. ఈ స్మూతీలు (Smoothies) తాగి చూడండి ..!

కార్తీక మాసంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, వన భోజనాలు, వేడుకలు, వ్రతాలు.. ఇలా ఎటు చూసినా పండగ వాతావరణమే. ముఖ్యంగా వివాహాలైతే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మరి, ఈ పెళ్లిళ్లలో అందరికంటే అద్బుతంగా కనిపించాలని కోరుకోని వధువు ఎక్కడైనా ఉంటుందా? పెళ్లికి ముందే తన చర్మ సౌందర్యం గురించి ప్రతీ వధువూ ఆలోచిస్తుంది. అయితే ఇది అంత సులభం కాదు. చర్మానికి ఆర్టిఫిషియల్ ట్రీట్‌మెంట్స్ వల్ల వచ్చే మెరుపు.. కొన్ని రోజుల పాటే ఉంటుంది. నవ వధువుగా ఎప్పుడూ మెరిసిపోతూ ఉండాలంటే.. కొన్ని పద్దతులను పాటించాల్సిందే.

దీనికి ముఖ్యమైన మాత్రం మీ కిచెన్‌లోనే ఉంది. అవును.. కిచెన్‌లోని వస్తువులను ఉపయోగించి కొన్ని స్మూతీలు (Smoothies) తయారుచేసుకొని తాగేస్తే చాలు.. మీ చర్మం లోపలి నుంచి శుభ్రంగా మారుతుంది. దీనివల్ల పెళ్లికి ముందు రోజు వరకూ.. మీరు కష్టపడి షాపింగ్ చేసి అలసిపోయినా సరే.. వివాహ వేడుకలో మాత్రం అద్భుతంగా కనిపించవచ్చు. మరి ఈ క్రమంలో మనం కూడా ఈ స్మూతీలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

కీరాతో స్మూతీ

చాలామంది అందంగా కనిపించేందుకు.. ముఖానికి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ దాని కంటే ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. డార్క్ సర్కిళ్లు దూరం చేసుకునేందుకు.. కీర ముక్కలు కళ్ల పై పెట్టుకోవడం మీకు అలవాటే కదా.. పైనుంచి అప్లై చేస్తేనే.. ఇంత ఫలితాన్ని ఇచ్చే కీర లోపల నుంచి ఇంకెన్ని పోషకాలను అందిస్తుందో కదా.. అందుకే ఈ సారి కీరదోసతో మంచి స్మూతీ తయారుచేసుకొని తాగండి. అందమైన మచ్చల్లేని చర్మం మీ సొంతం అవుతుంది.

ADVERTISEMENT

గ్రీన్ యాపిల్ స్మూతీ

మీకు యాపిల్ అంటే ఇష్టమా? రోజూ యాపిల్ తింటే చాలు.. డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదని మీరు వినే ఉంటారు. యాపిల్ చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా.. యాపిల్, పాల కూర కలిపి స్మూతీ తయారుచేయడమే. ఇది ఎన్నో విటమిన్లను.. మన శరీరానికి అందించి చర్మాన్ని స్మూత్‌గా మార్చడంతో పాటు మెరిసేలా చేస్తుంది.

క్యాబేజీ స్మూతీ

క్యాబేజీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. అయితే దాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. చర్మం అందంగా మెరిసిపోయేలా కూడా చేస్తుంది. మీకు మామూలు క్యాబేజీ నచ్చకపోతే రెడ్ క్యాబేజీ ప్రయత్నించండి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు.. మీ చర్మం పాడవకుండా కాపాడతాయి. క్యాబేజీ రుచి తెలియకుండా అందులో మీకు నచ్చిన పండ్లు కూడా వేసుకోవచ్చు.

ADVERTISEMENT

కేల్ స్మూతీ

కేల్.. మన దేశంలో తక్కువగా లభించినా.. ఎన్నో పోషకాను అందించే అద్భుతమైన ఆకు. బ్యూటీ ప్రపంచంలో కేల్‌కి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిది. ఇందులో ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. దీంతో పాటు బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల.. మీ చర్మ కణాలు రిపేర్ అవుతాయి.

బీట్ రూట్, స్ట్రాబెర్రీ స్మూతీ

బీట్ రూట్ అంటే ఎర్రగా ఉన్నా.. నాలుక దురదకు కారణమవుతుందని.. చాలామంది దాన్ని తినడానికి ఆసక్తి చూపించరు. అయితే ఇలాంటివాళ్లు బీట్ రూట్ స్మూతీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో స్ట్రాబెర్రీలు కూడా వేయడం వల్ల అటు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందుతుంది. ఇది మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. చర్మం కూడా పూర్తిగా శుభ్రంగా మారేలా చేస్తుంది. ర్యాషెస్, మచ్చల నుంచి దూరం చేస్తుంది.                             

ADVERTISEMENT

నిమ్మకాయ, బ్లూబెర్రీ స్మూతీ

నిమ్మకాయ మనకు అందిన వరం లాంటిది. దీంతో ఆరోగ్యంగా మెరిసే చర్మం మన సొంతమవుతుంది. నిమ్మ రసం, బ్లూ బెర్రీ కలిపి స్మూతీ చేసుకొని తాగడం వల్ల.. అటు మరీ తియ్యగా, ఇటు మరీ పుల్లగా కాకుండా.. మధ్యస్థమైన రుచితో అద్భుతంగా తయారవుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని లోపలి నుంచి మెరిసేలా చేస్తాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
07 Nov 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT