ADVERTISEMENT
home / వినోదం
అత్యంత ఘనంగా సాగనున్న..”అల వైకుంఠపురంలో” మ్యూజికల్ కాన్సర్ట్..!

అత్యంత ఘనంగా సాగనున్న..”అల వైకుంఠపురంలో” మ్యూజికల్ కాన్సర్ట్..!

అల వైకుంఠపురంలో(Ala Vaikuntapuramuloo).. అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే కథానాయికగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదల కాబోతున్న సినిమా ఇది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ఓ కారణం ఈ సినిమాలోని అద్భుతమైన పాటలు కూడా. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని.. ప్రతి పాట అద్భుతమని ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా పాటలకు పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన లభిస్తోంది

ఈ సందర్భంగానే ఈరోజున (జనవరి 6) యూసుఫ్ గుడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో అతి పెద్ద సంగీత ఉత్సవం (Musical Concert) నిర్వహించేందుకు ఈ చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. దీనికోసం అత్యంత పెద్ద వేదికను కూడా నిర్మిస్తున్నారట. ఇది దక్షిణాదిలోనే అతి పెద్ద మ్యూజికల్ కాన్సర్ట్ కానుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమం కోసం 162 అడుగుల వెడల్పు, 52 అడుగుల పొడవున్న స్టేజ్‌ని ఏర్పాటు చేస్తున్నారట. దక్షిణాదిలో ఇంత పెద్ద స్టేజ్ వేసి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్‌తో పాటు ‘సామజవరగమనా’ పాట పాడిన గాయకుడు సిడ్ శ్రీరామ్, ‘రాములో రాములా’ పాట పాడిన అనురాగ్ కులకర్ణి, ‘ఓ మై గాడ్ డాడీ’ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, ‘బుట్ట బొమ్మ’ పాట పాడిన అర్మాన్ మాలిక్‌లు కూడా హాజరై తమ తమ పాటలను స్టేజి మీద లైవ్‌గా పాడి వినిపిస్తారు. వీరితో పాటు రోల్ రైడా, లేడీ కాశ్, రాహుల్ నంబియార్, ప్రియ సిస్టర్స్‌లు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుండగా.. ఎంజే5 డ్యాన్స్, ఇండియన్ రాగా వారు ప్రత్యక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

ADVERTISEMENT

వీరితో పాటు ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ మొత్తం హాజరు కాబోతోందట. ప్రి రిలీజ్ ఈవెంట్‌ని ఇలా మ్యూజికల్ కాన్సర్ట్‌గా నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమానికి ఈ సినిమా స్టార్స్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్ర ప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, తదతరులు  హాజరు కానున్నారు. ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్‌ని తాజాగా సినిమా యూనిట్ విడుదల చేసింది.

‘సామజవరగమనా’.. అంటూ ప్యారిస్‌లో రొమాన్స్ చేస్తున్న బన్నీ ..!

ఇందులో భాగంగా ‘అల వైకుంఠపురమ్ములో’ అంటూ సాగే పాట కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పాటలు హిట్ కావడం గురించి తమన్ ఓ రేడియో ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ‘పెద్ద పెద్ద సంస్థలతో కలిసి పని చేయడం తనకెంతో ఆనందంగా ఉందని.. వారందరినీ చూస్తూ తాను కెరీర్‌లో ఎదిగానని’ వెల్లడించారు. వారితో పని చేయాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని.. ఇప్పటికి అది నిజమైందని వెల్లడించారు. 

ADVERTISEMENT

ఈ సినిమా థీమ్ గురించి చెబుతూ పెద్ద పె’ద్ద బంగ్లాల్లో లేని ఆనందం కూడా చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటుందని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. మన స్థానం మనం సంపాదించే డబ్బును బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మన స్థాయి మాత్రం మనమే పెంచుకోవాలి. దానికి మన వ్యవహార శైలే కొలమానం. ఇదే ఈ సినిమా ద్వారా వెల్లడించబోతున్నాం’ అని త్రివిక్రమ్ తెలిపారు. మరి, త్రివిక్రమ్ డైలాగ్స్‌కి అల్లు అర్జున్ ఎక్స్ ప్రెషన్స్ కలిసినజజ ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధిస్తుందో విడుదల తర్వాత చూడాల్సిందే. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ బై ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.

“స్టైల్‌గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది – “అల వైకుంఠపురంలో” టీజర్‌లో అల్లు అర్జున్

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

 

ADVERTISEMENT
06 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT