ADVERTISEMENT
home / Bollywood
రణ్‌వీర్‌ని చూసి.. 200 % కష్టపడుతున్నా : షాలినీ పాండే

రణ్‌వీర్‌ని చూసి.. 200 % కష్టపడుతున్నా : షాలినీ పాండే

షాలినీ పాండే (Shalini Pandey).. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి. ఆ తర్వాత 118, తాజాగా ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాల్లో నటించినా అవి అంతగా విజయం సాధించలేదు. తమిళంలో ‘100% లవ్’ రీమేక్.. ‘100% కాదల్‌’తో పాటు ‘గొరిల్లా’ వంటి చిత్రాల్లో కూడా నటించింది షాలిని. ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం రెండు పెద్ద ప్రాజెక్టులున్నాయి. అనుష్క కథానాయికగా కనిపించనున్న బహుభాషా చిత్రం ‘నిశ్శబ్ధం’లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది షాలిని. ఇది కాక ఇటీవలే రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ చిత్రం ‘జయేష్ భాయ్ జోర్దార్’ చిత్రంలో కూడా కథానాయికగా ఎంపికైంది.

దీపిక కోసం ఆ సినిమాలో.. నటించకూడదని అనుకున్నా: రణ్ వీర్ సింగ్

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న షాలిని.. రణ్‌వీర్‌తో కలిసి నటించడం గురించి ఓ ఇంటర్వ్యూలో తన భావాలను పంచుకుంది. “ఈ సినిమాతో నేను బాలీవుడ్‌లో అడుగుపెట్టాలన్న కోరిక తీరుతోంది. బాలీవుడ్‌లో ‘జయేష్ భాయ్ జోర్దార్’ వంటి అద్భుతమైన చిత్రంతో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇంతకంటే మంచి కథ నా బాలీవుడ్ తెరంగేట్రానికి దొరకదేమో. ఇది అంత అద్భుతమైన కథ. నేను నా ఆడిషన్‌తో దర్శకుడు దివ్యాంగ్ ఠక్కర్‌ని.. నిర్మాత మనీష్ శర్మను మెప్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా కష్టపడి పని చేస్తాను. యశ్ రాజ్ సంస్థ నుంచి ఫోన్ రాగానే నేను పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది అని భావించాను” అని తెలిపింది షాలిని.

ADVERTISEMENT

తన భర్త ఆఫర్ కి ‘NO’ చెప్పిన దీపిక పదుకొనే ..!

అంతేకాదు.. తన సహ నటుడు రణ్‌వీర్ సింగ్ గురించి కూడా చాలా చెప్పుకొచ్చిందీ బ్యూటీ. “రణ్‌వీర్ సింగ్ లాంటి పవర్ హౌజ్ నటుడి పక్కన నేను నటిస్తున్నానని.. అది కూడా నా మొదటి బాలీవుడ్ చిత్రంలోనే అని గుర్తుచేసుకుంటే చాలు. నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. కేవలం ఆనందం మాత్రమే కాదు.. అది నాలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ఒక నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని అనిపిస్తోంది. దానికి ఈ సినిమా మంచి అవకాశం అని అనుకుంటున్నా. తనతో నటించేటప్పుడు నా స్థాయి కంటే.. ఎక్కువగా కష్టపడి నటించాలని నాకు తెలుసు. అందుకే ప్రతి సీన్‌లోనూ రాజీ పడకుండా 200 శాతం కష్టపడి పనిచేస్తాను. తన పక్కన తక్కువగా కనిపించకూడదంటే నేను కూడా అంతే స్థాయిలో ఉండాలి. అందుకే నేను కూడా నా 200 శాతం కష్టంతో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని భావిస్తున్నా” అని తెలిపింది షాలిని.

ADVERTISEMENT

“రణ్‌వీర్ చాలా జీనియస్. స్క్రిప్టులో ఉన్నదాని కంటే మరింత ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. స్క్రిప్టుకి తనదైన లేయర్ జోడించి పని చేస్తుంటాడు. అలాంటి వ్యక్తితో కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉండి తనని చూస్తూ నేర్చుకోవడం.. తనలా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించడం వంటివి నాకెంతో ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ “జయేష్ భాయ్ జోర్దార్” సినిమా తర్వాత నేను నటిగా మరింత పరిణితి చెందుతానని నాకు పూర్తి నమ్మకం ఉంది. మొత్తంగా ఈ తరం సూపర్ స్టార్ రణ్ వీర్‌తో తెరను పంచుకోవడం, ఆయనకు జోడీగా నటించడం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది షాలిని.

“దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రణ్‌వీర్ జయేష్ భాయ్ అనే గుజరాతీ వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో రణ్‌వీర్ కోర మీసంతో.. పక్క పాపిటతో కనిపించడం గమనార్హం. పోలో టీ షర్ట్, హై వెయిస్ట్ ప్యాంట్‌తో ఈ ఫస్ట్‌లుక్‌లో రణ్‌వీర్‌ని చూస్తుంటే నవ్వొచ్చేలా ఉంది. ఈ సినిమా కోసం భాష నేర్చుకోవడంతో పాటు గుజరాతీ భాషలోనూ మాట్లాడనున్నాడట.  ఓ సాధారణ వ్యక్తి భయం కలిగించే పరిస్థితుల్లో పడినప్పుడు అసాధారణమైన పని చేస్తాడు. అలాంటి ఓ ప్రేమ, జాలి కలిగిన సాధారణ వ్యక్తి జయేష్ భాయ్. మహిళలకు, మగవారికి సమానమైన హక్కులుండాలని తను భావిస్తాడు. ఇలాంటి పాత్ర నేను ఇంతకుముందెప్పుడూ పోషించలేదు. దీనికోసం నన్ను నేను పూర్తిగా మార్చుకున్నా” అంటూ తన మదిలోని భావాలను పంచుకుంది షాలిని.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

ADVERTISEMENT
13 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT