ADVERTISEMENT
home / Bridal Skincare
పెళ్లి కూతుళ్లు.. తమ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?

పెళ్లి కూతుళ్లు.. తమ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?

పెళ్లి (wedding) తేదీ ఫిక్స్ అవ్వడం ఆలస్యం.. ప్రతి వధువు (bride) వివాహ వేడుకలో అద్భుతంగా ఎలా మెరిసిపోవాలా? అని ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే పెళ్లికి ఎన్నో రోజుల ముందు నుంచే తన చర్మ సంరక్షణ కోసం పలు పద్దతులను పాటిస్తూ.. అందంగా రడీ అయ్యేందుకు ప్రిపరేషన్స్ ప్రారంభించేస్తుంది. అయితే దుస్తులు, ఆభరణాల సంగతి పక్కన పెడితే.. చర్మాన్ని అందంగా మెరిసేలా చేయడం ఎలా? అన్న విషయంపై మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారు.

ఈ క్రమంలో వారు మీ అందమైన చర్మం కోసం చిట్కాలు కూడా చెబుతారు. అయితే అదే చర్మ సంరక్షణ కోసం మీరు చేయకూడని పనులేమిటో ఎవరూ చెప్పరు. ముఖ్యంగా.. మనకు కూడా ఉచిత సలహాలన్నీ విని ఏం చేయాలో అర్థం కాదు. అందుకే సౌందర్య పోషణలో మీరు అస్సలు చేయకూడని పనులు.. అదీ పెళ్లికి ముందు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం..

1. ఎక్స్ ఫోలియేషన్ ఎక్కువగా వద్దు..

మంచి ఎక్స్ ఫోలియేటర్ ఉపయోగించడం వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అది చర్మంపై ఉన్న ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని లోపలి నుంచి మెరిసిపోయేలా చేస్తుంది. అయితే మరీ ఎక్కువగా రాసుకోకుండా.. కొద్దిగా అప్పుడప్పుడూ మాత్రమే ఉపయోగించడం మంచిది. దీనికోసం మైల్డ్‌గా ఉన్న గ్లైకోయిక్ యాసిడ్ స్క్రబ్ లేదా వాల్ నట్ స్క్రబ్ ఉపయోగించాలి. వాల్ నట్ స్క్రబ్ పొడి చర్మం ఉన్నవారికి నప్పుతుంది. గ్లైకోయిక్ యాసిడ్ చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ADVERTISEMENT

2. లూఫా ముఖం కోసం కాదు..

చాలామంది స్నానం చేయడానికి లూఫాలను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని శరీరం మొత్తం స్క్రబ్ చేయడానికి ఉపయోగించవచ్చు. కానీ అది మీ ముఖంపై ఉన్న సున్నితమైన చర్మానికి మాత్రం నప్పదని గుర్తుంచుకోవాలి. లూఫా వల్ల మీ ముఖం పై ఉన్న చర్మం సున్నితత్వాన్ని కోల్పోవడం మాత్రమే కాదు.. చర్మంపై సన్నని గీతలు కూడా పడే అవకాశం ఉంటుంది.

3. మొటిమలను అలా వదిలేయండి

పెళ్లికి ముందు ఎన్నో రకాల పనులు ఉంటాయి. ఎన్నో టెన్షన్లు కూడా ఉంటాయి. వీటి వల్ల అప్పుడప్పుడూ కొందరికి మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాటిని ఏమీ చేయకుండా.. అలా వదిలేయడం మంచిది. వాటిని గిల్లడం, ముట్టుకోవడం వంటివి చేయడం వల్ల.. చర్మం మరింత పాడవుతుంది. కాబట్టి వాటిని అలాగే ఉంచేయండి. కావాలంటే వేపాకు అప్లై చేసుకోవడం లేదా వేపాకు మిశ్రమంతో తయారైన ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు.

4. ప్రయోగాలు ఇప్పుడొద్దు..

ఫలానా బ్యూటీ ప్రొడక్ట్ ఉపయోగిస్తే చాలు.. చర్మం చాలా అందంగా మారిపోతుంది అని.. ఎవరో చెప్పారని పెళ్లికి ముందు కొత్త ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రయత్నించకండి. పెళ్లికి ఓ నెల ఉందనగానే.. ఓసారి మీరు ఉపయోగించాలి భావిస్తున్న పదార్థాలన్నింటినీ ఉపయోగించి మెరుపు వస్తోందా లేదా చెక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల..  మీ చర్మానికి ఏదైనా హాని జరుగుతుందా? లేదా? అన్న విషయాన్ని కూడా గమనించవచ్చు. పెళ్లికి ముందు కొత్త రకాల క్లీనప్ లేదా ఫేషియల్స్ కూడా ప్రయత్నించకండి.

ADVERTISEMENT

5. సూర్యకాంతికి దూరంగా..

చలికాలం లేదా వర్షాకాలం కదా.. ఇక సన్ స్క్రీన్ లోషన్ అవసరం లేదు అనుకుంటూ ఎలాంటి రక్షణ లేకుండా సూర్యకాంతి మీ మీద పడుతున్నా పట్టించుకోవడం లేదా..? అయితే మరోసారి ఆలోచించండి. దీని వల్ల మీ చర్మం ట్యాన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా ఈ నలుపు అంత త్వరగా తగ్గదు. అందుకే ఈ సమస్య రాకుండా కాపాడుకోవడం మంచిది. అందుకే ఎండలోకి బయల్దేరే ముందే మీ ముఖం, శరీరంలో బయటకు కనిపించే భాగాలకు.. సన్ స్క్రీన్ లోషన్ రాయడంతో పాటు.. వాటిపై ఎండ పడకుండా స్కార్ఫ్‌తో కప్పుకోవడం మంచిది.

6. మేకప్ తొలగించేయండి..

పెళ్లి పనులు, వేడుకలతో ఎంత బిజీగా ఉన్నా.. ఎంత అలసిపోయినా సరే.. రాత్రి మేకప్ తొలిగించుకొని ముఖం కడుక్కునే వరకూ నిద్రపోకపోవడం మంచిది. దీనివల్ల ఆ కెమికల్స్ అన్నీ మీ చర్మం లోపలికి వెళ్లిపోయి.. చర్మం పాడయ్యేలా చేస్తాయి. మీ చర్మం అందంగా ఉండాలనుకుంటే.. ఎంత రాత్రయినా బద్ధకించకుండా మేకప్ తొలగించడం మంచిది.

ADVERTISEMENT

7. క్లెన్సింగ్ ఇలా వద్దు..

చాలామంది ముఖం కడుక్కోవడానికి సబ్బు లేదా క్లెన్సర్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే వీటికి బదులుగా మైల్డ్‌గా ఉండే ఫేస్ వాష్‌ని ఉపయోగించడం వల్ల మీ చర్మం అందంగా కనిపిస్తుంది. సబ్బులు, క్లెన్సర్లు మీ చర్మాన్ని రఫ్‌గా మారుస్తాయి. అంతేకాదు.. తలస్నానం చేసేటప్పుడు షాంపూ కూడా మీ ముఖంపై పడకుండా జాగ్రత్త పడాలి. షాంపూలోని కెమికల్స్ ముఖంపై ఉన్న చర్మం పొడిబారిపోయేలా చేస్తాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

10 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT