ADVERTISEMENT
home / Life
నిశ్చితార్థం తర్వాత.. పెళ్లి గురించి అమ్మాయి ఏం ఆలోచిస్తుందో మీకు తెలుసా?

నిశ్చితార్థం తర్వాత.. పెళ్లి గురించి అమ్మాయి ఏం ఆలోచిస్తుందో మీకు తెలుసా?

పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తోంది. ప్రతి రోజూ వేల పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. మీరూ అలా పెళ్లి (Marriage) చేసుకునేందుకు సిద్ధమైపోతున్నారా? మీ నిశ్చితార్థం (Engagement) కూడా జరిగిపోయిందా? ఇంకేంటి.. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోవడమే మిగిలిందా..? అయితే ఈ కథనం మీరు చదవాల్సిందే.

నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి జరిగిపోయినట్లేనని మన పెద్దలు చెబుతుంటారు. మీ చేతికి ఉంగరం పెట్టినప్పటి నుంచే.. మీ జీవితం కూడా మారడం ప్రారంభమవుతుంది. అయితే నిశ్చితార్థం అనేది ఎంతో ఆనందాన్ని.. మరికొంత భయాన్ని.. భవిష్యత్తు గురించి గందరగోళాన్ని కూడా తన వెంట తీసుకొస్తుంది. ఇలాంటి సమయంలో, నిశ్చితార్థం అయ్యాక.. అసలు పెళ్లికి సిద్ధమయ్యే అమ్మాయి (Girl) ఎలా ఫీలవుతుందో.. ఏం ఆలోచిస్తుందో మీకు తెలుసా? ఈ క్రమంలో తన మదిలో కదలాడే కొన్ని రకాల ఆలోచనల గురించి తెలుసుకుందాం రండి.

1. వావ్.. ఈ రింగ్ ఎంత అద్భుతంగా ఉందో..

ADVERTISEMENT

అవును.. ఈ రింగ్ నాకోసం నేనే కదా సెలెక్ట్ చేసుకున్నా.. అయినా ఇది నాదే కదా.. నా వస్తువును నేను ఇష్టపడడంలో తప్పేముంది?

2. హే.. కాబోయే శ్రీవారూ..

నేను ఇక నాకు కాబోయే శ్రీవారిని.. నా స్నేహితులకు పరిచయం చేయడం ప్రారంభించవచ్చేమో. ఓహ్.. దేవుడా.. తను ఇప్పుడు నాకు కాబోయే భర్త.. అది తలచుకుంటేనే నా పెదాలపై చిరునవ్వు వచ్చేస్తోంది.

ADVERTISEMENT

3. ఫేస్ బుక్‌లో నా రిలేషన్ షిప్ స్టేటస్ మార్చేస్తాను..

హా.. నా లవ్ ఆఫ్ లైఫ్‌తో నా నిశ్చితార్థం జరిగిపోయిందోచ్.. వావ్.. అప్పుడే కంగ్రాచ్యులేషన్స్ మెసేజ్‌లు వచ్చేస్తున్నాయ్.. నా స్నేహితులు ఇంత ఫాస్ట్‌గా ఉన్నారేంటో..

4. ఈ రోజే ఫొటోలు కూడా పోస్ట్ చేసేయనా?

అమ్మో.. అన్నీ ఒక్క రోజే వద్దులే.. అందరూ నన్నో పిచ్చిదాన్ని అనుకుంటారు. రేపో.. ఎల్లుండో పోస్ట్ చేస్తాను.

ADVERTISEMENT

5. ఈ రోజు నుంచి నేను మిసెస్ ఫలానా అని చెప్పుకోవాలా?

హా.. నా ఇంటి పేరు మార్చుకోవాలా? వద్దా? దీని గురించి ఆలోచించాల్సిందే. అవును.. నేను రెండు ఇంటి పేర్లు వాడితే ఎలా ఉంటుంది? చూడాలి..

7. కానీ నేను ఇల్లు వదిలి వెళ్లిపోవాలి..

ADVERTISEMENT

నేను అమ్మా, నాన్నలను ఎంతగానో మిస్సవుతాను. ఈ ఇంటిని కూడా. నా గదిని, నా బెడ్, నా దిండును కూడా. ఓకే.. ఇప్పటి నుంచే ఏడవడం వద్దు.

8. నాకు అత్తమామలు వచ్చేస్తారా?

కొత్త కోడలిగా ఎన్ని బాధ్యతలు నిర్వహించాలో..

ADVERTISEMENT

9. నేను నిజంగా పెళ్లికి సిద్ధంగా ఉన్నానా?

ఇన్ని రకాల బాధ్యతలు.. నిర్ణయాలు, ఇవన్నీ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఇవన్నీ ఆలోచిస్తుంటే భయంగా అనిపిస్తోంది. నేను చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా అని కూడా అనిపిస్తోంది. 

10. నేను తనని ప్రేమిస్తున్నా కదా..

నేను తనని నిజంగా ప్రేమిస్తున్నా.. నా జీవితమంతా తనతో గడిపేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఇంకెందుకు ఆలోచన?

ADVERTISEMENT

11. రేపటి నుంచి షాపింగ్ ప్రారంభించాల్సిందే..

చాలా తక్కువ సమయంలో.. చాలా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎలా అవుతుందోనని నాకు కంగారుగా అనిపిస్తోంది.

12. ఇప్పటి నుంచి నేను డైటింగ్ చేయడం మాత్రమే కాదు.. తనకి కూడా డైట్ ఫుడ్ పెడతాను.

ADVERTISEMENT

కొన్ని రోజుల్లో తను నాకు భర్త కాబోతున్నాడు. ఇప్పటి నుంచే తన ఆరోగ్యం గురించి నేను శ్రద్ధ వహించాలి. మేమిద్దరం పెళ్లి రోజు అద్భుతంగా కనిపించాలి కదా.. అందుకే కాస్త ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం అవసరం.

13. పెళ్లి కూతురుగా సిద్ధమైతే నేను ఎంత అందంగా ఉంటానో కదా..

పెళ్లి కూతురిగా పీటలపై కూర్చోవడానికి నేను సిద్ధం. వధువుగా నేను ఎంత అందంగా ఉంటానో.. నాకు అందంగా సిద్ధమయ్యేందుకు ఇంకా రెండు నెలలు ఉన్నాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

14 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT