మర్మెయిడ్ వేవ్స్ (Mermaid waves).. సన్నగా.. వేలాడినట్లుండే జుట్టుకు ప్రత్యామ్నాయంగా కొత్తగా ఏదైనా హెయిర్ స్టైల్ (Hairstyle) ప్రయత్నించాలని భావించేవారికి ఇదో చక్కటి స్టైల్. మర్మెయిడ్ వేవ్స్ అంటే చిన్నగా సన్నగా ఉండే కర్ల్స్. ఇవి చూసేందుకు డిస్నీ పాత్ర ఏరియల్‌లా కనిపిస్తాయి. కాబట్టి వీటిని మర్మెయిడ్ కర్ల్స్ అని పిలుస్తారు.
ఇది మీ జుట్టును లావుగా మార్చి చూపిస్తుంది. అందుకే స్ట్రెయిట్‌గా సన్నగా కనిపించే జుట్టున్న వాళ్లు దీన్ని ప్రయత్నించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మర్మెయిడ్ హెయిర్ స్టైల్ లేదా మర్మెయిడ్ కర్ల్స్ కావాలంటే మూడు రకాల మార్గాలున్నాయి. చాలా సులభమైన ఆ మార్గాల గురించి తెలుసుకుందాం.
1. ఓవర్ నైట్ వేవ్స్ హెయిర్ స్టైల్
దీనికి కావాల్సిన సమయం కేవలం పది నిమిషాలు. అది కూడా ఉదయం కాదు.. ముందు రోజు రాత్రే.. చక్కటి వేవీ హెయిర్ కోసం దీన్ని ఉపయోగించవచ్చు. దీనివల్ల కుదుళ్ల నుంచి జుట్టు కర్లీగా కనిపిస్తుంది.
కావాల్సినవి
రబ్బర్ బ్యాండ్స్
హెయిర్ స్ప్రే
కర్ల్స్ చేసే విధానం
ముందుగా జుట్టును రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కోవైపున మరో రెండు భాగాలు చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని ఒక్కో జడగా అల్లుకోవాలి. సాధారణ జడగా కాకుండా డచ్ బ్రెయిడ్‌గా అల్లుకోవడం ఇంకా మంచిది. తర్వాత జడలను గట్టిగా వేసుకోవాలి. వాటిని కొప్పులా చుట్టుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. తర్వాత హెయిర్ స్ప్రే కొట్టుకొని పడుకోవాలి. ఉదయాన్నే జడలు విప్పి వేళ్లతో దువ్వుకోవాలి. ఆ తర్వాత.. మరోసారి హెయిర్ స్ప్రే కొట్టుకోవడం వల్ల కర్ల్స్ అలాగే నిలిచి ఉంటాయి.
Learn More: Special hair hairstyles for ladies
ఇలా చేస్తే మీ పొట్టి జుట్టు కూడా.. పొడుగ్గా కనిపిస్తుంది..!
ఫ్లాట్ ఐరన్ బీచ్ వేవ్స్ హెయిర్ స్టైల్
దీనికి పట్టే సమయం 20 నుంచి 30 నిమిషాలు. ఇది చాలా సులభమైన పద్ధతి. మర్మెయిడ్ వేవ్స్‌ని ఫ్లాట్ ఐరన్ సాయంతో చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు కాస్త వేగంగా తయారై బయటకు వెళ్లాలన్నప్పుడు మాత్రం దీన్ని ప్రయత్నించవచ్చు. కానీ తలపై ఉన్న వెంట్రుకలను కర్ల్ చేయడానికి మాత్రం.. కాస్త ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది.
కావాల్సినవి
రబ్బర్ బ్యాండ్స్
ఫ్లాట్ ఐరన్
హెయిర్ స్ప్రే
కర్ల్స్ చేసే విధానం
జుట్టును ముందుగా నాలుగు భాగాలుగా చేయాలి. ఆ తర్వాత మధ్య పాపిట తీసి రెండు వైపు రెండు భాగాలు చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని జడలా అల్లుకోవాలి. చివర వరకూ ఇలా అల్లుకున్నాక.. ఫ్లాట్ ఐరన్ తీసుకొని ఒక్కో జడను ప్రెస్ చేయాలి. ఇలా పదిహేను సెకెన్ల వరకూ చేస్తూ ఉండాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఆ తర్వాత జడలు విప్పి వేళ్లతో దువ్వుకుంటూ జుట్టును సెట్ చేసుకోవాలి. తర్వాత హెయిర్ స్ప్రే కొట్టుకోవాలి. అంతే బీచ్ వేవ్స్ సిద్ధం.
ఈ అందాల నాయికల హెయిర్‌స్టైల్స్‌తో.. మీరూ హీరోయిన్‌లా మెరవండి..!
కర్లింగ్ వాండ్ కర్ల్స్ హెయిర్ స్టైల్
ఈ హెయిర్ స్టైల్ చేసుకోవడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. ఇది చాలా సులభం కూడా . అయితే మిగిలిన రెండు పద్ధతుల కంటే ఇది కాస్త కష్టమైనది.
కావాల్సినవి
కర్లింగ్ వాండ్
సీ సాల్ట్ స్ప్రే
కర్ల్స్ చేసే విధానం
దీనికోసం కూడా జుట్టును మధ్య పాపిట తీసి అంగుళం మందంతో జుట్టును తీస్తూ దాన్ని కర్లింగ్ వాండ్‌కి చుట్టాలి. వాండ్ వెడల్పును బట్టి కర్ల్స్ చిన్నవిగా లేదా పెద్దవిగా వస్తాయి. ఇలా అడుగుభాగం వరకూ.. అలా వాండ్ చుట్టూ తిప్పుతూ ఉండడం వల్ల చక్కటి కర్ల్స్ వస్తాయి. కర్ల్స్ అన్నీ చేసుకున్న తర్వాత వేళ్లను అందులో పెట్టి కాస్త దువ్వినట్లు చేయడం వల్ల అవి వదులుగా తయారవుతాయి. ఆ తర్వాత సీ సాల్ట్ (సముద్రపు ఉప్పు) నీళ్లు కలిపి చేసిన స్ప్రేని కొట్టాలి. కర్ల్స్ సిద్ధం.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
31 రోజులు.. 31 హెయిర్‌స్టైల్స్.. నెలలో ప్రతిరోజూ కొత్తగా కనిపించండిలా..!