ADVERTISEMENT
home / DIY Fashion
షూ బైట్‌తో బాధపడుతున్నారా ? అయితే  ఈ 15 చిట్కాలు  మీకోసమే.. (Tips To Prevent Shoe Bites)

షూ బైట్‌తో బాధపడుతున్నారా ? అయితే ఈ 15 చిట్కాలు మీకోసమే.. (Tips To Prevent Shoe Bites)

ఆ మధ్య నేను కొత్త బ్యాలెరినా ఫ్లాట్స్ (ballerina flats) కొన్నాను. కొత్త చెప్పులు కొన్నాను కదా అనే ఉత్సాహంతో షాపింగ్ కి వాటిని తొడుక్కొని వెళ్లాను. అవి నా కాలికి చాలా బాగున్నాయి. కానీ కొంత సమయం తర్వాత నా పాదాలు వద్ద అసౌకర్యంగా అనిపించింది. కాస్త సమయం గడిచిన తర్వాత చీలమండ, కాలి వేళ్ల దగ్గర కూడా నొప్పిగా అనిపించసాగింది. అడుగు తీసి అడుగు వేస్తుంటే.. ఆ నొప్పి మరింత ఎక్కువ అవుతోంది.

మరి కాసేపయ్యేసరికి నా కొత్త చెప్పులు తీసి అవతలకు విసిరేయాలనిపించింది. నాకెందుకలా అనిపించిందో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా..! నా కాలిని చెప్పులు కరిచేశాయి. వీటినే ఇంగ్లీష్‌లో shoe bites అంటారు. ఇలాంటి పరిస్థితి మీక్కూడా ఎదురయ్యే ఉంటుంది. అలాగని మనం ఇష్టపడి కొన్న చెప్పులను పారేయలేం కదా..! అందుకే shoe bites రాకుండా చూసుకోవడానికి, చెప్పుల కారణంగా అయ్యే గాయాలను తగ్గించుకోవడానికి మా దగ్గర కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో మీరూ తెలుసుకొని Happy feet మీ సొంతం చేసుకోండి.

ఈ చెప్పులు కరవడం అంటే ఏంటి? (What Is Shoe Bites)

చెప్పులు, షూ, బ్యాలెరినా ఫ్లాట్స్, వెడ్జెస్, పంప్స్ వంటివి ధరించినప్పుడు, వాటికి.. పాదాలకు మధ్య కలిగే రాపిడి కారణంగా నడవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సాధారణంగా చీలమండ, మడమలు, కాలి వేళ్లు, పాదాల అడుగున ఈ రాపిడి ఏర్పడుతుంది. ఇది మరింత ఎక్కువగా ఉంటే గడ్డలు, ఆనెలు(corns), దద్దుర్లు, బొబ్బలు వంటివి ఏర్పడే అవకాశాలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి చీము పట్టడంతో పాటు ఇతర స్రావాలు సైతం వాటిలో చేరతాయి.

ADVERTISEMENT

చెప్పులు ఎందుకు కరుస్తాయి? (Why Do Sandals Bite)

ప్రధానంగా రెండు కారణాల వల్ల చెప్పులు పాదాలను కరిచేందుకు అవకాశాలున్నాయి.

1) ధరించడానికి అనువుగా లేనివి.. (Not Wearable)

కొన్ని రకాల చెప్పులు చూడటానికి చాలా బాగుంటాయి. కానీ వాటిలో కొన్ని ధరించడానికి అంతగా అనుకూలంగా ఉండవు. ఉదాహరణకి ప్యూర్ లెదర్‌తో తయారు చేసిన బ్యాలెరీనా ప్లాట్స్ మనం కొనుగోలు చేశామనుకోండి. వాటిని ధరించినప్పుడు వేళ్ల దగ్గర పట్టేసినట్టుగా అనిపిస్తే వాటితో కాస్త దూరం కూడా నడవలేం. ఎక్కువ సమయం వాటిని ధరించి ఉండలేం. ఇలాంటి వాటి వల్ల shoe bites వచ్చే అవకాశం ఉంది. అలాగే పాదరక్షల నాణ్యత సరిగ్గా లేకపోయినా అవి మనల్ని కరవచ్చు.

2) పాదాలకు సరిపోనివి.. (Not Wearing Proper Size)

ADVERTISEMENT

పాదాలకు సరిగ్గా సరిపోని చెప్పులు లేదా షూస్ వేసుకొంటే.. సరిగ్గా గాలి ఆడక ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. womenfitness.net వెబ్ సైట్ ప్రకారం, 90% మంది మహిళలు తాము వేసుకోవాల్సిన సైజు కంటే తక్కువ సైజులో ఉన్న చెప్పులు ధరిస్తున్నారని తెలపడం జరిగింది. వారిలో 80% మంది తాము ధరించిన షూస్, చెప్పులు తమకు నొప్పిని కలిగిస్తున్నాయని చెప్పారు. చెప్పాలంటే.. పురుషులతో పోలిస్తే తొమ్మిది రెట్లు ఎక్కువగా మహిళల పాదాలకు సంబంధించి ఆనెలు, వేళ్లు వంకర్లు పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

మన వయసు పెరిగే కొద్దీ పాదాల పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ చాలామంది తమ పాదాల సైజు కాలానుగుణంగా మార్పు చెందుతుందని గుర్తించలేరు. దీనివల్ల వేసుకోవాల్సిన సైజు కంటే చిన్నవి ధరించడం వల్ల పాదాలను చెప్పులు కరవచ్చు. ముఖ్యంగా 55 ఏళ్ల వయసు పైబడిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

పాదరక్షల మోడల్ వల్ల కూడా ఈ సమస్య వస్తుందా? (Can Model Of Footwear Be A Problem For Shoe Bite)

అవును నిజమే. మనం ధరించే కొన్ని రకాల పాదరక్షలు మన పాదాలకు ఇబ్బందిని కలిగిస్తాయి. ముఖ్యంగా పంప్స్, బెల్లీస్, ఆక్సఫర్డ్స్, మ్యూల్స్ వంటివి మన పాదాలను కరుస్తాయి. సాధారణంగా మన శరీరం బరువు మొత్తం పాదాలపైనే పడుతుంది. అందుకే వాటికి చిన్న దెబ్బ తగిలినా.. అది మనకు పెద్ద ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే మనం చిన్నవే కదాని వదిలేసిన షూ బైట్స్ ఆ తర్వాత  పెద్ద గాయాలుగా మారుతుంటాయి. అందుకే ఎలాంటి చెప్పులు ధరిస్తే మనకు ఈ సమస్య రాకుండా ఉంటుంది? ఏ చెప్పులు ధరిస్తే అవి మన పాదాలను కరుస్తాయి? అనేది తెలుసుకోవడం ముఖ్యం. దానికోసం చెప్పులను కొనేటప్పుడు కేవలం అవి పాదాలకు సరిపోయాయా లేదా అని మాత్రమే చూడకుండా.. వాటిని ధరించినప్పుడు పాదాలకు సౌకర్యవంతంగా ఉన్నాయో లేదో కూడా పరీక్షించాలి. అందుకే వాటిని ధరించి అటూ ఇటూ నడవాలి.

ADVERTISEMENT

చెప్పులు కరిచాయా? ఈ 15 చిట్కాలు మీ కోసమే.. (15 Tips To Reduce Shoe Bites)

కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా షూ బైట్స్ వల్ల ఏర్పడిన గాయాలను తగ్గించుకోవచ్చు.

టూత్ పేస్ట్ (Toothpaste)

టూత్ పేస్ట్‌లో ఉండే మెంథాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా వంటివి గాయాలను తగ్గించే హీలింగ్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. అందుకే చెప్పులు కరవడం వల్ల పాదాలపై ఏర్పడిన గాయాలకు టూత్ పేస్ట్ రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మరింత  వేగంగా గాయం తగ్గాలంటే రాత్రి నిద్రపోయే ముందు టూత్ పేస్ట్ రాసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. అయితే దీనికోసం జెల్ తరహావి కాకుండా తెల్లని టూత్ పేస్ట్ ఉపయోగించాల్సి ఉంటుంది.

పెట్రోలియం జెల్లీ (Petroleum Jelly)

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారి పాదాలకు తరచూ చెప్పుల కారణంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ఎల్లప్పుడూ తమ వెంట పెట్రోలియం జెల్లీ ఉంచుకోవడం మంచిది. పాదాలను శుభ్రం చేసుకొన్న తర్వాత పెట్రోలియం జెల్లీని చెప్పులు కరిచిన చోట అప్లై చేసుకోవాలి. కాసేపాగిన తర్వాత చెప్పులను ధరిస్తే ఎలాంటి నొప్పి లేకుండా హాయిగా నడవచ్చు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ అప్లై చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే.. పెట్రోలియం జెల్లీ రాసుకొంటే సరిపోతుంది.

ADVERTISEMENT

ఐస్ (Ice)

ఇంట్లో ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఐస్ క్యూబ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని చెప్పులు కరిచిన చోట పెడితే ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కాను పాటించడం ద్వారా దురద, నొప్పి, మంట వంటివి వెంటనే తగ్గుతాయి. ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య ఎదురైతే కాఫీ షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌లో దొరికే ఐస్ క్యూబ్స్ వాడవచ్చు. షాపు వారిని అడిగితే కచ్చితంగా మనకు వాటిని ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా ఈ చిట్కాను పాటించి ఉపశమనం పొందవచ్చు.

తేనె (Honey)

చెప్పులు కరిచినప్పుడు తక్షణ ఉపశమనం కోసం తేనెను ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికోసం ఆర్గానిక్ తేనె వాడాల్సి ఉంటుంది. అలాగే తేనె రాసుకొన్న వెంటనే బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే దానిపై దుమ్ము చేరి గాయం మరింత ఇబ్బంది పెడుతుంది.

కలబంద (Aloe Vera)

చర్మానికి సంబంధించి ఎలాంటి సమస్యకైనా కలబంద చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. కలబంద గుజ్జు చెప్పులు కరిచిన చోట రాస్తే చల్లగా ఉండటంతో పాటు.. దురద కూడా తగ్గుతుంది. దాన్ని వెంటనే కడిగేయకుండా వీలైనంత ఎక్కువ సమయం ఉంచుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల గాయం తాలూకా మచ్చ ఏర్పడకుండా ఉంటుంది.

నిమ్మ రసం (Lemon Juice)

నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ గుణాలు సహజసిద్ధమైన యాంటి సెప్టిక్గా పనిచేస్తాయి. ఇవి దురదను తగ్గిస్తాయి. అలాగే చెప్పులు కరవడం వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ ఫలితం మీరు పొందాలనుకొంటే.. నిమ్మరసంలో దూది ముంచి దాన్ని ఆ ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రోజూ రెండుసార్లు చొప్పున వారం రోజులు పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ADVERTISEMENT

కొబ్బరి నూనె (Coconut Oil)

పొడి చర్మం నుంచి దురదల వరకు చర్మానికి సంబంధించిన ఏ సమస్య అయినా దానికి చక్కటి పరిష్కారం కొబ్బరి నూనె. పాదరక్షల కారణంగా పాదాలకైన గాయాలకు ఇది చక్కటి పరిష్కారం. దీనికోసం నూనెలో దూదిని ముంచి చెప్పులు కరిచిన చోట రాసుకొంటే నొప్పి తగ్గుతుంది. అలాగే రెండు చెంచాల కొబ్బరి నూనెలో చెంచా కర్పూరం కలిపి రాసుకొన్నా ఫలితం కనిపిస్తుంది.

బంగాళాదుంప (Potato)

బంగాళాదుంపలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంటి చిట్కాల కోసం ఉపయోగించే వస్తువుల జాబితాలో ఇది కచ్చితంగా ఉంటుంది. ఇది షూ బైట్స్‌ని కూడా సమర్థంగా తగ్గిస్తుంది. బంగాళాదుంపని సన్నగా గుండ్రంగా కట్ చేసి.. దానితో పాదాలు, మడమలను సున్నితంగా రుద్దడం ద్వారా ఇవి తగ్గుముఖం పడతాయి. అలాగే బంగాళాదుంప రసం తీసి అందులో దూదిని ముంచి పాదరక్షల కారణంగా గాయాలైన చోట రాసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవి మరింత త్వరగా తగ్గుముఖం పట్టాలంటే ఆలూ రసంలో కొద్దిగా పసుపు, పెప్పర్ మింట్ నూనె కలపాలి.

పసుపు+వేప (Turmeric)

పసుపు, వేప రెండింటిలోనూ యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలుంటాయి. అందుకే వీటికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం కల్పించారు. ముందుగా 5 లేదా 6 వేపాకులు, చెంచా పసుపు తీసుకొని నీటితో కలిపి ముద్దలా తయారుచేసుకోవాలి. దీన్ని చెప్పులు కరిచిన చోట రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ చిట్కాని రోజుకి రెండుసార్లు పాటించడం ద్వారా బొబ్బలు, దద్దుర్లు కారణంగా పాదాలకు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.

ఆలివ్ నూనె (Olive Oil)

ఆలివ్ నూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. షూ బైట్స్‌ను తగ్గించుకోవడానకి ఆలివ్ నూనెను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. మొదటిది, ఆలివ్ నూనెను బాదం నూనెతో కలిపి మిశ్రమంగా చేసి మర్థన చేసుకొంటే ఇన్స్టెంట్ రిలీఫ్ దొరుకుతుంది. రెండోది, ఆలివ్ నూనె, తేనె సమాన భాగాల్లో తీసుకొని మిశ్రమంగా చేయాలి. దీన్ని చెప్పులు కరిచిన చోట అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.

ADVERTISEMENT

బియ్యప్పిండి (Rice)

చెప్పులు కరవడం వల్ల ఏర్పడిన గాయాల మచ్చలను బియ్యప్పిండితో పొగొట్టవచ్చు. దీనికోసం బియ్యప్పిండిని తగినంత నీటిలో కలిపి ముద్దగా చేయాలి. దీన్ని గాయంపై అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గాయం తగ్గడంతో పాటు.. దానివల్ల కలిగే నొప్పి కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే అక్కడి చర్మం తిరిగి ఏర్పడేలా చేస్తుంది.

రబ్బింగ్ ఆల్కహాల్ (Alcohol)

దీనిలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు గాయాలను త్వరగా నయం చేస్తాయి. ఇది నొప్పి, మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా.. రబ్బింగ్ ఆల్కహాల్‌లో దూదిని ముంచి దాంతో చెప్పులు కరిచిన చోట అప్లై చేసుకోవాలి. ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అప్లై చేసుకోవడం ద్వారా గాయం త్వరగా మానిపోతుంది.

ఆస్పిరిన్ (Aspirin)

తలనొప్పి తగ్గించే దివ్యౌషధంగా మాత్రమే ఆస్పిరిన్ గురించి మనకు తెలుసు. కానీ ఇది గాయాల వల్ల వచ్చిన వాపు, మంటను కూడా తగ్గిస్తుంది. అంటే పాదరక్షల వల్ల పాదాలకు అయిన గాయాలకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. అలాగని దీనికోసం ఆస్పిరిన్ మాత్ర వేసుకోవాల్సిన అవసరం లేదు. మరేం చేయాలనుకొంటున్నారా? ఆస్పిరిన్ మాత్రను పొడిగా చేసి దాన్ని నీటిలో కలిపి ముద్దగా చేయాలి. దీన్ని చెప్పులు కరిచిన చోట రాసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.

టాల్కం పౌడర్ (Talc Powder)

పాదాలకు అధికంగా చెమట పట్టడం కూడా చెప్పులు కరవడానికి ప్రధాన కారణం కావచ్చు. మీకు ఈ సమస్య ఉన్నట్లయితే రోజూ పాదాలకు టాల్కం పౌడర్ రాసుకోండి. ఇది మీ పాదాలను పొడిగా ఉంచుతుంది. అలాగే ఈ రకమైన గాయాల వల్ల కలిగే మంటను సైతం తగ్గిస్తుంది.

ADVERTISEMENT

వెన్న (Butter)

వెన్న చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి మాత్రమే కాదు.. పొడిబారడం, దురద వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే చెప్పులు ధరించడం వల్ల ఏర్పడే గాయాలకు సైతం మందుగా పనిచేస్తుంది. వెన్నను కాస్త కరిగించి చెప్పులు కరిచిన చోట మందంగా రాసి.. కొంత సమయం గడిచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజులో మూడు నాలుగు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చేయడం కుదరదనుకొంటే.. రాత్రి నిద్రపోయే ముందు వెన్నను పాదాలకు రాసి ఉదయాన్నే శుభ్రం చేసుకొన్నా ఇదే ఫలితం కనిపిస్తుంది.

వీటితో పాటు ఫుట్ క్రీం, స్క్రబ్, మాస్క్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా పాదాలు ఎప్పుడూ అందంగా కనిపించేలా చేసుకోవచ్చు. అలాగే పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే పాదాలను అందంగా తయారుచేసుకోవచ్చు. దానికోసం అవసరమైన ఉత్పత్తుల గురించి ఇక్కడ చదవండి.

చెప్పులు కరవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (Tips To Follow To Avoid Shoe Bites)

పాదరక్షల కారణంగా పాదాలకు గాయాలు అవకుండా చూసుకోవాలంటే.. ఈ పది విషయాలు పాటించండి.

ADVERTISEMENT

  1. చెప్పులు కరవకుండా ఉండాలంటే వాటిని కొనేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. పాదరక్షలు మీరు ధరించడానికి సౌకర్యవంతంగా ఉన్నాయో లేదో ముందే పరిశీలించాలి. అందుకే మీరు కొనుగోలు చేయాలనుకొంటున్న వాటిని పాదాలకు తొడుక్కొని అటూ ఇటూ నడవాలి. ఆ సమయంలో మీకు ఇబ్బందిగా అనిపిస్తే వాటిని కొనకపోవడమే మంచిది. అలాగే ఆన్ లైన్‌లో చెప్పులను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే.. మన పాదానికి సరిపోయే చెప్పులు వేర్వేరు బ్రాండ్లలో వేర్వేరు సైజుల్లో  దొరుకుతాయి. దీని మీద పూర్తి అవగాహన ఉంటేనే ఈ పని చేయండి. లేదంటే దుకాణంలో తీసుకోవడమే ఉత్తమం.
  2. మీరు ధరించే బూట్లు మీ పాదాలను కరుస్తాయని మీరు భావించినట్లయితే.. ఎక్కడెక్కడ గాయాలయ్యే అవకాశం ఉందో అక్కడ షూ లోపలి భాగంలో బ్యాండ్ ఎయిడ్ అతికిస్తే సరిపోతుంది. షూకి బ్యాండ్ ఎయిడ్ అతికించడం ఇష్టం లేకపోతే పాదాలకు వేసుకోవచ్చు. దీనికోసం స్కిన్ ఫ్రెండ్లీ వైట్ టేప్ కూడా ఉపయోగించవచ్చు.
  3. మీ పాదరక్షలు కొత్తవైనా.. లేదా పాదాలకు సరిపోకపోయినా.. కచ్చితంగా అవి మీ పాదాలను కరిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు కాస్త దళసరిగా ఉండే సాక్స్‌ని పాదాలకు ధరించాలి. ఇవి చెప్పుల వల్ల మీ పాదాలు రాపిడికి గురవకుండా చేస్తాయి. అలాగే షూ వదులుగా అయ్యేలా చేస్తాయి.
  4. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆముదంలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని.. వరసగా మూడు రోజుల పాటు కొత్త షూ లేదా చెప్పుల లోపలి వైపు రాయడం వల్ల అవి పాదాలను కరవకుండా ఉంటాయి. ఈ చిట్కాను వాటిని ధరించడానికి ముందే పాటించాల్సి ఉంటుంది.
  5. జిప్ లాక్ బ్యాగులో నీటిని నింపి దాన్ని చెప్పులు లేదా షూలో ఉంచి.. దాన్ని ఫ్రిజ్ లో పెట్టాలి. నీరు గడ్డకట్టే క్రమంలో చెప్పులు వదులుగా తయారవుతాయి.
  6. షూ ధరించడానికి ముందు దానిలో సాక్స్లను కూరాలి. ఆ తర్వాత సాక్స్ వేడెక్కే వరకు హెయర్ డ్రయర్తో బ్లో డ్రై చెయ్యాలి. వేడెక్కిన సాక్స్ బూట్లను వదులుగా అయ్యేలా చేస్తాయి. కాబట్టి అవి పాదాలను కరుస్తాయనే భయం అవసరం లేదు.
  7. షూ లేదా చెప్పులు తొడుక్కొన్నప్పుడు మీకు కాలివేళ్లు లేదా మడమలు కొన్నిచోట్ల బిగుతుగా ఉన్నాయనే భావన  కలగొచ్చు. అలాంటి చోట్ల క్యాండిల్ వ్యాక్స్ లేదా క్రేయాన్ వ్యాక్స్ రాయాలి. చెప్పు లోపల వ్యాక్స్ రాయడం వల్ల పాదాల చర్మం రాపిడికి గురి కాకుండా ఉంటుంది.
  8. షూ బైట్ ప్రొటెక్టర్ ఉపయోగించడం ద్వారా షూ వల్ల పాదాలకు గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు. ఇది సాధారణంగా మనం ఉపయోగించే shoe sole మాదిరిగానే ఉంటుంది. మందంగా, మెత్తగా, ట్రాన్సపరెంట్‌గా ఉంటుంది. ఇవి షూ బైట్ నుంచి పాదాలను కాపాడటం మాత్రమే కాకుండా.. పాదరక్షలు అసౌకర్యంగా లేకుండా చేస్తాయి.
  9. కాస్త ఇరుకుగా అనిపించే బూట్లు ధరించడం వల్ల కాలివేళ్లు బొబ్బలెక్కే అవకాశం ఉంది. మరి అలా జరగకుండా ఉండాలంటే.. U షేప్ లో ఉన్న టో ప్రొటెక్టర్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. 

చివరిగా ఓ మాట.. చెప్పులు అందంగా ఉన్నాయి కదా అని అవి మీ పాదాలకు సరిపోకపోయినా.. లేదా అవి మీకు అసౌకర్యంగా ఉన్నా పట్టించుకోకుండా వాటిని కొనుగోలు చేయద్దు. ఎందుకంటే.. మీ ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని పక్కన పెట్టి ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అంటే పాదరక్షలు మీ పాదాలకు రక్షణగా ఉండాలి కానీ.. అవి మీకు ఇబ్బంది కలిగించకూడదు.

AWESOME NEWS! POPxo SHOPలో ఇప్పుడు 25% డిస్కౌంట్ తో ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో దొరుకుతున్నాయి. కూపన్ కోడ్ POPXOFIRST ఉపయోగించి షాపింగ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

నేటి లేటెస్ట్ ట్రెండ్ బో షూస్ వాడకం అని చెప్పుకోవచ్చు.. ఈ ఆర్టికల్ ఆంగ్లంలో చదవండి

ప్రతీ మహిళ ఈ షూస్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.. ఈ ఆర్టికల్ ఆంగ్లంలో చదవండి

ఈ షూ జతలు కాలేజీ అమ్మాయిలకు ప్రత్యేకం.. ఈ వ్యాసం ఆంగ్లంలో చదవండి

27 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT