ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
వానాకాలంలో హనీమూన్‌కి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రదేశాలు చాలా బెస్ట్..

వానాకాలంలో హనీమూన్‌కి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రదేశాలు చాలా బెస్ట్..

వానాకాలం (Monsoon)లో పెళ్లిళ్లంటే అందరికీ కాస్త భయంగానే ఉంటుంది. పెళ్లి సమయంలో వర్షం వచ్చి ఏర్పాట్లన్నీ పాడైపోతాయేమో అన్న అనుమానం ప్రతిఒక్కరికీ వస్తుంది. ప్రశాంతంగా పెళ్లి పూర్తయిపోతే ఓ పెద్ద పని అయిపోతుంది. కానీ తర్వాత హనీమూన్ ? నిజానికి వానలు మీ హనీమూన్‌ని పాడు చేయడం కాదు.. వర్షాకాలం మీ హనీమూన్‌ని మరింత అద్బుతంగా మారుస్తుంది తెలుసా? అయితే దానికి సరైన ప్రదేశం ఎంచుకోవడం కూడా ముఖ్యమే. మరి, వానాకాలంలో మన దేశంలో వెళ్లగలిగే, ఎంజాయ్ చేయగలిగే ఆ హనీమూన్ (Honeymoon)స్పాట్స్ గురించి తెలుసుకుందామా?

1. గోవా

tripadvisor

మన దేశంలో పర్యటక ప్రియులంతా ఒక్కసారైనా వెళ్లాలనుకునే ప్రదేశాల్లో గోవా ఒకటి. కేవలం ఎండాకాలంలోనే కాదు.. వానాకాలంలోనూ చూసేందుకు ఇక్కడ మంచి ప్రదేశాలు అందుబాటులో ఉంటాయి. మీకు, మీ భాగస్వామికి అడవులు, వన్యప్రాణులు అంటే ఆసక్తి ఉంటే గోవా దగ్గర్లోని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలకు వెళ్లవచ్చు. ఇక్కడ మాదేయి, భగవాన్ మహావీర్ వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, మొల్లెమ్ నేషనల్ పార్క్, బోండ్లా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటివన్నీ చూడొచ్చు. అంతేకాదు.. ఇక్కడి దూద్ సాగర్, అర్వలెమ్ జలపాతాల అందాలు చూసి తీరాల్సిందే. వీటితో పాటు వివిధ చర్చిలు, బీచ్‌లు చూడడంతో పాటు అక్కడి నైట్ లైఫ్‌ని ఎంజాయ్ చేయవచ్చు.

ADVERTISEMENT

2. వయనాడ్

tripadvisor

చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి మధ్యలో ఇద్దరూ కలిసి ఆనందంగా గడపాలంటే వయనాడ్‌కి చెక్కేయడం మంచిది. ఇక్కడి జలపాతాలు, నదులు, మంచు ఇవన్నీ చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే నమ్ముతారా? ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేస్తూ చక్కటి జంతుజాలాన్ని చూసే వీలుంటుంది. ముతుంగ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం, మిరియాలు, యాలకులు, తేనె.. మొదలైనవి లభించే తోటలు వంటివి మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి.

కేరళ

ADVERTISEMENT

tripadvisor

చక్కటి రిలాక్సింగ్ హనీమూన్ కోసం వానాకాలం మాత్రమే కాదు.. ఏ కాలంలో అయినా కేరళను ఎంచుకోవచ్చు. అయితే వానాకాలంలో ఇక్కడి మరో ప్రత్యేకత.. బ్యాక్ వాటర్స్‌ని చూసే అవకాశం లభించడమే.. ఇక్కడి అద్బుతమైన టీ తోటల సొగసును చూసి తీరాల్సిందే. అంతేకాదు.. ఇక్కడి అద్భుతమైన జలపాతాలు చూసి తీరాల్సిందే. ముఖ్యంగా త్రిసూర్‌లోని అతిరాపల్లి జలపాతానికి బాహుబలి చిత్రంతో మన దగ్గరే కాదు.. దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేశాయి. ఇక వీటితో పాటు అద్బుతమైన హౌజ్ బోట్స్, రుచికరమైన చేపల కూరలు వంటివన్నీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి.

4. కూర్గ్

tripadvisor

ADVERTISEMENT

ఇండియన్ స్కాట్లాండ్, కశ్మీర్ ఆఫ్ సౌత్ వంటి పేర్లతో పిలిచే కూర్గ్ కర్ణాటకలోని ఓ చక్కటి హిల్ స్టేషన్. ఇక్కడి అద్భుతమైన సీనరీలు, అందమైన వాటర్ ఫాల్స్.. మరింత ఆకట్టుకునే కాఫీ తోటలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇది జంటలు వెళ్లడానికి చక్కటి హనీమూన్ స్పాట్. ఇక్కడి అబ్బే, ఇరుప్పు జలపాతాలు మామూలు సమయంలోనే అందంగా ఉంటాయి. ఇక వర్షాకాలంలో జాలువారే నీటితో మరింత అందంగా కనిపిస్తాయి. అంతేకాదు.. ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ కూడా ఆడే వీలుంటుంది. ఇక్కడి తడియాండమాల్ కొండ నుంచి అద్బుతమైన ప్రకృతి అందాలను చూసి తీరాల్సిందే.

5. ముస్సోరీ

tripadvisor

ఉత్తరాఖండ్‌లోని ఈ అందమైన హిల్ టౌన్ రస్కిన్ బాండ్ సొంత ఊరు కూడా. ఇక్కడ జంటల కోసం ఎన్నో అద్భుతమైన అనుభవాలు వేచి చూస్తుంటాయి. ఇద్దరూ కలిసి పచ్చని ప్రకృతి ఒడిలో తిరగడం, జిప్ లైన్ కేబుల్ కార్ ట్రావెల్, ట్రెక్కింగ్, జలపాతాలను చూడడం ఇలా ఎన్నో పనులు చేసే వీలుంటుంది.

ADVERTISEMENT

6. అండమాన్

tripadvisor

హాలీవుడ్ స్టైల్లో మీ హనీమూన్‌ని జరుపుకోవాలనుకుంటే దానికి అండమాన్ నికోబార్ దీవులు సరైన ఎంపిక. అందమైన బీచ్‌లు, ఖర్జూర చెట్లు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడ లాగూన్లలో ఈత కొట్టడం చాలా మంచి అనుభూతిని అందిస్తుంది. వీటితో పాటు స్కూబా డైవింగ్, స్నోర్కెల్లింగ్, బోట్ రైడ్లు, విండ్ సర్ఫింగ్ వంటివి ఆకట్టుకుంటాయి. చుట్టూ నీలి రంగు సముద్రం, ఆకాశం కూడా మనల్ని అమితంగా ఆకట్టుకుంటాయి.

7. కొడైకెనాల్

ADVERTISEMENT

tripadvisor

సాధారణంగా ఇంతకుముందు కూడా హనీమూన్ అంటే ఊటీ, కొడైకెనాల్ అనే చెప్పేవారు. వేసవిలో ఊటీ అందాలు ఆకర్షిస్తే వర్షాకాలంలోనూ కొడైకెనాల్ ప్రకృతి అద్భుతంగా ఆకర్షిస్తుంది. తమిళనాడులోని పళని హిల్స్‌లో ఉన్న ఈ ప్రదేశం చూసిన చోటల్లా అందమైన పైన్ చెట్ల సొగసుతో ఆకట్టుకుంటుంది. ఎటు చూసినా పచ్చదనం మనసులో ఆహ్లాదాన్ని నింపుతుంది. వీటితో పాటు ఇక్కడి బేర్ షోలా ఫాల్స్, కొడైకెనాల్ పర్వతాలు చూసేందుకు మాత్రమే కాదు.. ట్రెక్కింగ్‌కి కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి షెనబగనూర్ మ్యూజియం కూడా చూసే ప్రదేశాల్లో ఒకటి. కొడైకెనాల్ లేక్‌లో బోట్ రైడింగ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. హనీమూన్ బోట్స్ అని ఇక్కడ ప్రత్యేకమైన బోట్స్ ఉండడం విశేషం.

8. డార్జిలింగ్

tripadvisor

ADVERTISEMENT

ఉదయాన్నే సూర్యోదయంతో మీ రొమాంటిక్ లైఫ్‌ని ప్రారంభించాలనుకుంటే మీరు డార్జిలింగ్‌కి వెళ్లాల్సిందే. ముఖ్యంగా అడ్వెంచర్ లవర్స్ మాత్రం ఇక్కడికి తప్పక వెళ్లాలి. ఇక్కడ మంచు దుప్పటి కప్పుకున్న టైగర్ హిల్స్ మధ్యలో ఉన్న హోటల్స్‌లో నివసిస్తూ ఆ కొండల అందాన్ని ఆస్వాదించవచ్చు. ఉదయాన్నే సూర్యోదయంతో పాటు ఇక్కడి జందీ డారా సన్ సెట్ పాయింట్ నుంచి సూర్యాస్తమయం కూడా చాలా అందంగా కనిపిస్తుంది.

9. లడఖ్

tripadvisor

కొండల మధ్య చల్లని గాలిని ఎంజాయ్ చేయాలని మీరు భావిస్తే వెంటనే లడఖ్ ట్రిప్‌కి వెళ్లాల్సిందే. లడఖ్, జాన్ స్కర్ రేంజ్ మధ్యలో జంటగా ఎంజాయ్ చేయవచ్చు. అక్కడి వానల్లో ఇద్దరూ తడిసి ముద్దయిపోవచ్చు. ఇది మీకు జీవితాంతం మర్చిపోలేని అనుభూతులను అందిస్తుంది. హిమాలయాల మధ్యనున్న ఈ ప్రదేశంలోని పచ్చని ప్రకృతి, పొలాలు చూసి ఆనందించవచ్చు. ఇక్కడి టిబెటన్, బుద్ధిస్ట్ మోటిఫ్స్‌తో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. అంతేకాదు.. మంచి ఉన్నితో చేసిన స్వెట్టర్ల వంటివి కూడా తక్కువ ధరకే లభిస్తాయట.

ADVERTISEMENT

10. ధర్మశాల

tripadvisor

ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ హిల్ స్టేషన్. ఎక్కువగా బౌద్ధ సన్యాసులు నివసించే ఈ ప్రాంతం చాలా మంచి పర్యాటక ప్రాంతం కూడా. ఇక్కడి దగ్గర్లోని బాగ్సునాగ్ జలపాతం, బౌద్ధారామాలు వంటివి చూడొచ్చు. హిమాలయాల పక్కనే ఉండడం వల్ల క్యాపింగ్, ట్రెక్కింగ్ వంటివి చేయడానికి ఈ చక్కటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న బిర్‌లో పారాగ్లైడింగ్ అనుభవం జీవితంలో మర్చిపోలేం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

20 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT