Top Ten Facts behind Sumakka Channel
సుమ కనకాల.. తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. అంతేకాదు.. సెలబ్రిటీ యాంకర్లలో కూడా ఆమె అంతే సుపరిచితురాలు. గత సంవత్సరమే తాను ‘సుమక్క’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ ఛానల్ సూపర్ స్పీడుతో దూసుకుపోతోంది. అయితే అందుకు ప్రధాన కారణం.. ఆ ఛానల్ కంటెంట్ అనేవాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆ ఛానల్ సక్సెస్ వెనుక దాగున్న సీక్రెట్ ఫ్యాక్ట్స్ మీకోసం.
1. సుమకు ఉండే సెన్సాఫ్ హ్యూమర్ గురించి మనకు తెలియంది కాదు. మాట మాటకి సెటైర్లు వేయడం.. పంచ్‌లు విసరడంలో ఆమెకు ఆమే సాటి. ఇక ఆమే స్వయంగా ఓ ఛానల్ పెడితే.. ఇక అందులో కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనవసరం లేదు. అందుకే.. ఆమె పండించే హ్యుమరే దీని వెనుక ఉన్న ప్రధానమైన సక్సెస్ సీక్రెట్.
2. మామూలు ప్రోగ్రాములకే సుమ తనదైన శైలిలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఆమే స్వయంగా ఛానల్ నిర్వహిస్తే.. అందులో ఎలాంటి టాపిక్స్ ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కామెంట్లు పెట్టు ఆన్సర్ పట్టు, నో లాఫ్ ఛాలెంజ్, బ్యాక్ టు మై కాలేజ్ లాంటి ఎపిసోడ్స్ అయితే.. ఒక్క లెక్కలో వ్యూస్ తెచ్చుకున్నాయి.
ఏమయ్యా వార్నర్.. మా తెలుగు వారి దోశ రుచి చూస్తావేంటి?
Sumakka Youtube Channel
3. ఇక ఈ ఛానల్ ప్రోమోని కూడా చాలా వెరైటీగా డిజైన్ చేశారు. అక్కొచ్చేసిందిరోయ్.. అంటూ నెటిజన్ల చేత కూడా నవ్వుల కేక పెట్టించారు. సుమకు ఉన్న ఫాలోయింగ్‌ను బట్టి.. ప్రోమో విడుదలైనప్పటి నుండే ఛానల్‌కి కూడా ఆదరణ ఇట్టే పెరిగింది. ఇది కూడా ఒక సక్సెస్ మంత్రమే.
4. ఇక వంట వీడియోల సంగతి చెప్పాలంటే.. పెద్ద కహానీయే ఉంది. ముఖ్యంగా హాస్యాన్ని పండిస్తూ వంట చేయడం సుమకే చెల్లింది అని చెప్పాలి. ‘‘చిన్నప్పుడు మా అమ్మ.. లెక్కలు బాగా వస్తాయని బెండకాయలు బాగా తినిపించింది. కానీ, లెక్కలు రాలేదు యాంకరింగ్ వచ్చింది. మీరు కూడా బెండకాయలు తినండి యాంకరింగ్ వస్తుంది’’ అంటూ సుమ విసిరే ఛలోక్తులకు నెటిజన్లు ఫిదా అయిపోయారంటే నమ్మండి.
మాటల్లోనే కాదు.. మనసులోనూ సుమ కనకాల మాణిక్యమే..!
Sumakka Youtube Channel
5. అలాగే చేసింది తక్కువ వీడియోలే అయినా.. క్వాలిటీ ఆఫ్ కంటెంట్‌కి తొలి ప్రాధాన్యమివ్వడంతో సుమక్క ఛానల్ నిజంగానే సూపర్ సక్సెస్‌తో దూసుకెళ్తోంది.
6. అదేవిధంగా ‘యామ్ ఐ సేఫ్’ అంటూ సామాజిక బాధ్యతను పెంచే కంటెంట్‌కు కూడా ఛానల్‌లో అగ్ర తాంబూలం ఇవ్వడంతో.. ఒక బాధ్యతాయుతమైన వేదికగా కూడా ‘సుమక్క’ ప్లాట్‌ఫారమ్ నిలిచింది.
Sumakka Youtube Channel
7. ఛానల్ ప్రారంభించిన తక్కువ నెలల్లోనే దాదాపు 1 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకున్న సుమక్క.. ఆ తర్వాత మరింత స్పీడుగా దూసుకుపోతోంది. దాదాపు ఛానల్‌లో అన్ని రకాల ట్రెండింగ్ టాపిక్స్ కవర్ చేస్తున్నారు. ఇదీ కూడా ఈ ఛానల్ సక్సెస్ సీక్రెట్టే.
8. అలా ఒక రెగ్యులర్ వ్లాగ్‌గా.. ఛానల్‌గా మాత్రమే కాకుండా స్పెషల్ ఇంటర్వ్యూలు చేయడం ఈ ఛానల్ మరో స్పెషాలిటీ. మహాతల్లితో ముచ్చట్లు, అడివి శేషుతో కేస్ క్లోజ్డ్ లాంటి వీడియోలు అయితే సూపర్ సక్సెస్ అయ్యాయి.
9. సుమ ఎంత బిజీ యాంకరో మనకు తెలుసు. అలాగే టీవీ షోలతో కూడా తను చాలా బిజీగా ఉంటుంది. అలాంటి సమయంలో యూట్యూబ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి కొత్త ప్రయత్నంలోకి దిగిన ఆమెను చాలామంది అభినందిస్తున్నారు. అలాగే ఈ ఛానల్‌కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇది కూడా ఒక సక్సెస్ సీక్రెట్.
10. ఇక ప్రధానంగా చెప్పాల్సింది.. ఈ ఛానల్‌లో భాగంగా రూపొందిస్తున్న వ్లాగ్స్. షూట్ గ్యాప్‌లో ముచ్చట్లు, ఈవెంట్ ముచ్చట్లు.. వీటితో పాటు బిహైండ్ ది సీన్స్ కంటెంట్ కూడా నెమ్మదిగా నెటిజన్లను ఆకట్టుకోవడం విశేషం.
Images: Youtube.com/Sumakka
‘అమ్మ… నాన్న… ఓ మళయాళీ అమ్మాయి’ (సుమ – రాజీవ్ కనకాల ప్రేమకథ)
ఇవండీ.. సుమక్క ముచ్చట్లు. ఇప్పటికే 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్.. రానున్న రోజులలో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు.
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.