ADVERTISEMENT
home / Home & Garden
బాత్ రూమ్‌ను ఆహ్లాదంగా మార్చేసే.. అలంకరణ వస్తువులు ఇవే..!

బాత్ రూమ్‌ను ఆహ్లాదంగా మార్చేసే.. అలంకరణ వస్తువులు ఇవే..!

అద్దె ఇల్లు అయినా.. సొంతిల్లు అయినా.. ప్రతి గదినీ మన అభిరుచికి తగినట్టే అలంకరిస్తాం కదా. కానీ ఆ బాత్రూంను (Bathroom) మాత్రం ఎందుకు అలా వదిలేయడం? దాన్ని కూడా ఎంతో  కొంత అలంకరించుకోవచ్చు  కదా. నిజం చెప్పాలంటే.. చాలామందికి తమ ఇంట్లోని బాత్రూం అంతగా నచ్చదు. టైల్స్ బాగాలేకపోవడం, గాలీవెలుతురు సరిగ్గా రాకపోవడం, ఇరుగ్గా అనిపించడం, బాత్రూం గోడలకున్న పెయింట్ బాగా లేకపోవడం లాంటివి దీనికి కారణం.

అయితే కొన్ని మార్పులు చేయడం ద్వారా దాన్ని కూడా అందంగా మార్చుకోవచ్చు. అసలు స్నానాలగదిని అందంగా ఎందుకు మార్చుకోవాలి? ఎందుకంటే మన రోజు మొదలయ్యేది ఇక్కడే..  పూర్తయ్యేది ఇక్కడే కాబట్టి. రోజంతా మనపై పడిన ఒత్తిడిని వదిలించుకొనేది ఈ బాత్రూంలోనే. కాబట్టి దాన్ని కూడా మనకు నచ్చినట్టు మార్చుకోవడం అవసరం. ఈ క్రమంలో మనం కూడా బాత్రూం అలంకరణ (bathroom decor) కోసం ఎలాంటి వస్తువులు ఉపకరిస్తాయో తెలుసుకుందాం.

1. ఫెయిరీ లైట్స్

ఫెయిరీ లైట్స్‌ను ఇంట్లో ఏ మూల అలంకరిచినా ఇంటిని అందంగా, డ్రీమీగా, రిచ్‌గా మార్చేస్తాయి. బాత్రూంని సైతం డ్రీమీగా మార్చుకోవాలని భావించేవారు.. ఈ ఫెయిరీ లైట్స్‌తో అలంకరించుకోవచ్చు. బాత్రూం గోడల టాప్ కార్నర్‌లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటివల్ల మనకు షాక్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకు లేదా మన చేతులు, శరీరానికి తగిలే విధంగా వాటిని వేలాడదీయవద్దు. వీటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు పైపులు, షవర్‌కి సైతం తగలకుండా చూసుకోవాలి.

2. బాత్ మ్యాట్స్

సాధారణంగా మనం ఇంట్లో మల్టీ పర్పస్ వస్తువులను మాత్రమే వాడడానికి ఇష్టపడుతుంటాం. ఈ వాటర్ మిలన్ బాత్ మ్యాట్స్ కూడా అలాంటివే. వీటిని బాత్రూం డోర్ ముందు వేయచ్చు. ఇవి మీ బాత్రూంకి స్పెషల్ లుక్ ఇవ్వడంతో పాటు.. తడి కాళ్లను తుడుచుకోవడానికి సైతం ఉపయోగపడతాయి. 

ADVERTISEMENT

3. మొక్కలు

అసలు ఇల్లు పచ్చగా ఉంటే ఆ అందమే వేరు. ఈ మొక్కలు గాలిని శుద్ధి చేయడంతో పాటు ఆహ్లాదాన్ని కూడా అందిస్తాయి. అయితే బాత్రూంలో పెద్ద పెద్ద ఇండోర్ ప్లాంట్స్ ఉన్న కుండీలు ఉంచడం సాధ్యం కాకపోవచ్చు. కానీ బాగా  ఎత్తు ఎదగని మొక్కలను మాత్రం బాత్రూంలో ఉంచవచ్చు. అలాగే సూర్యరశ్మి పెద్దగా అవసరం లేని, పెద్దగా నీటి అవసరం లేని మొక్కలను బాత్రూంలో పెంచుకోవచ్చు.

4. కొవ్వొత్తులు

అరోమా క్యాండిల్స్ నుంచి వెలువడే పరిమళాలు.. మనలోని ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని ఉల్లాసంగా మార్చేస్తాయి. ముఖ్యంగా బిజీబిజీగా రోజు గడిపి వచ్చిన తర్వాత.. ఫ్రెషప్ అయ్యే సమయంలో ఈ క్యాండిల్స్ వెలిగించుకుని స్నానం చేస్తే ఒత్తిడి ఉఫ్‌మని ఊదేసినట్టు వెళ్లిపోతుంది.

5. షవర్ కర్టెన్

నిజం చెప్పుకోవాలంటే.. చాలామంది బాత్రూంలో షవర్ కర్టెన్లను ఏర్పాటు చేసుకోవడం అరుదు. కానీ అందమైన షవర్ కర్టెన్ వేయడం ద్వారా.. మొత్తం బాత్రూం లుక్‌నే మార్చేయవచ్చు. దీన్ని ఏర్పాటు చేయడం వల్ల మనం స్నానం చేసిన నీరు బాత్రూం అంతా  చిందకుండా ఉంటుంది. సాధారణంగా ప్లెయిన్ షవర్ కర్టెన్లు ఉపయోగిస్తారు. వాటికి బదులుగా గ్రాఫిక్ షవర్ కర్టెన్లు ఉపయోగిస్తే బాగుంటుంది.

6. వాల్ ఆర్ట్

సాధారణంగా ఇంటి గోడలను అలంకరించడానికి మనం ఫొటో ఫ్రేమ్ లేదా వాల్ ఆర్ట్ ఫ్రేములను ఎంచుకుంటాం. మూడు నుంచి ఏడు ఫ్రేములు ఎంచుకొన వాటిని అందంగా క్రమపద్ధతిలో అమర్చుకుంటాం. కానీ బాత్రూం గోడల విషయంలో అలా జరగదు. వాటికి సగం వరకు టైల్స్ ఉంటే.. మిగిలిన భాగం ప్లెయిన్‌గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఫ్రేములు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే గదుల్లో మాదిరిగా  ఎక్కువ మొత్తంలో ఫ్రేములు పెట్టడానికి కుదరకపోవచ్చు.

ADVERTISEMENT

కానీ ఒకే ఒక్క ఫ్రేముతో బాత్రూం రూపురేఖలనే మార్చేయచ్చు. అయితే మీరు ఎంచుకున్న ఫ్రేమ్ మీ బాత్రూం థీమ్‌కు సరిపోయే విధంగా ఉండాలి. దీనికోసం మెటల్‌వి కాకుండా ఫైబర్ ఫ్రేమ్ ఉన్నవి ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మెటల్ ఫ్రేమ్ ఉఫయోగించాలనుకుంటే.. సెంటెడ్ క్యాండిల్, మొక్కలు బాత్రూంలో ఉంచాల్సిన అవసరం ఉండదు.

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

10 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT