ADVERTISEMENT
home / Family
ప్యారీ టు సంస్కారీ: మనకు నిత్యం ఎదురయ్యే.. 14 మంది ఆంటీలు ..!

ప్యారీ టు సంస్కారీ: మనకు నిత్యం ఎదురయ్యే.. 14 మంది ఆంటీలు ..!

పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లడం అందరికీ ఇష్టమే. ఎందుకంటే.. అక్కడికి మన చుట్టాలందరూ వస్తారు. వారందరినీ ఒక్కసారే కలుసుకొనే అవకాశమొస్తుంది. కొంతమంది దూరపు చుట్టాలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లోనే పరిచయమవుతారు. అయితే మన బంధువుల్లో ఎవరింట్లో శుభకార్యం జరిగినా.. అక్కడ మాత్రం సందడి ఆడవాళ్లదే. వారే ముందుండి ఆ కార్యక్రమాలను నడిపిస్తుంటారు.

వారు లేకపోతే అసలు ఉత్సాహమే ఉండదు. అలాంటి అత్తలు, పెద్దమ్మలు, పిన్నిలు మనందరికీ కచ్చితంగా ఉంటారు. వీళ్లందరినీ మనం ఇంగ్లీషులో ఆంటీ (aunty) అని పిలిచేస్తుంటాం. వీరిలో ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. మన జీవితంలో చాలా కీలక పాత్ర పోషించే ఈ ఆంటీల్లో(aunts..) విభిన్న తరహా వ్యక్తిత్వం ఉన్నవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గట్టిగా మాట్లాడే ఆంటీ

మన ఇంట్లోనే మాట్లాడుతున్నా.. వారి గొంతు పక్క వీధికి కూడా వినబడుతుంది. గట్టిగా మాట్లాడడం, పెద్దగా నవ్వడం కొంతమంది ఆంటీల మ్యానరిజమ్. ఇలాంటి పెద్దమ్మ (aunt) ఎవరైనా మనింటికి వచ్చారంటే.. చాలు. ఇరుగుపొరుగు వాళ్లకి చుట్టాలొచ్చారని మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫలానా వాళ్లు మీ ఇంటికొచ్చారా ఏంటి? అనడుగుతారు.

కొన్నిసార్లు వీళ్లు మాట్లాడుతుంటే మన చెవులు పగిలిపోతుంటాయి. ‘నువ్వు మాట్లాడితే లౌడ్ స్పీకర్ లేకపోయినా.. లక్ష మందికి నీ మాట వినిపిస్తుంద’ని వేళాకోళమాడతారు. కొన్నిసార్లు ఇలాంటి ఆంటీలతో ‘కాస్త నెమ్మదిగా మాట్లాడు’ అని చెప్పాలనుకుంటాం. కానీ మనల్ని ఏమంటుందోననే భయంతో ఏమీ మాట్లాడం.

ADVERTISEMENT

tumblr

2. కూపీ లాగే ఆంటీ

అనకూడదు గానీ.. ఇలాంటి వాళ్లు ఇంటికి వస్తున్నారంటే భయమే. ‘అమ్మో అత్త వస్తుందే.. ఎన్ని ఆరాలు తీస్తుందో’ అని అనుకోకుండా ఉండలేం. వీరు ఇంటికి రావడం మొదలు.. వెంటనే ఇంటరాగేషన్ మొదలుపెట్టేస్తారు.

కూపీ లాగడంలో వీరు నిష్ణాతులు. ఏదో విధంగా తమకు కావాల్సిన సమాచారం తెలుసుకుంటారు. వాళ్లకున్నవి రెండు కళ్లే అయినా.. అందరిమీదా ఓ కన్నేసి ఉంచుతారు. అదెలా సాధ్యమో అర్థం కాదు. ఇలాంటి వాళ్లను దేశం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. లేకపోతే.. గూఢచారి నెం.1 గా మారి ఉండేవారు. 

ADVERTISEMENT

Tumblr

3. ఎంకరేజ్ చేసే ఆంటీ

సాధారణంగా అమ్మాయిలు కాస్త ధైర్యం చేసి..  ఏ పని చేసినా ఎవ్వరూ హర్షించరు. అది హెయిర్ కట్ కావచ్చు. లేదా మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ కావచ్చు. లేదా కెరీర్ కూడా కావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఎంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత వ్యతిరేకతలోనూ మనల్ని ప్రోత్సహించే అత్తమ్మ, పెద్దమ్మ లేదా పిన్ని ఎవరో ఒకరుంటారు. వారు చెప్పే సంగతులు మనలో పాజిటివిటీని నింపుతాయి. వారి మాటలు మనకి ధైర్యాన్నిస్తాయి. ఇలాంటి వారు అందరికీ ఫేవరెట్‌గానే ఉంటారు. అప్పుడప్పుడూ వారిని చూస్తుంటే ఓ జనరేషన్ ముందు పుట్టేశారనిపిస్తుంటుంది.

ADVERTISEMENT

Tumblr

4. ఎగ్జాంపుల్ ఆంటీ

మనం మాట్లాడే ప్రతి విషయానికి వీళ్ల దగ్గర ఓ ఉదాహరణ ఉంటుంది. కొన్నిసార్లు మనం మాట్లాడే విషయం వాళ్లకి  అర్థం కాకపోయినా సరే.. తమకు తెలిసిందేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు.  మరి కొన్నిసార్లు మనం చెప్పేదానికి వారు చెప్పేదానికి అసలు సంబంధం ఉండదు.

ఉదాహరణకు.. మనల్ని “నువ్వు చేసే పని ఎలా ఉంది” అని అడిగిందనుకోండి. మనం దానికి “కాస్త కష్టంగానే ఉంది ఆంటీ.. ప్రెజర్ ఎక్కవనిపిస్తోంది” అని చెబుతాం. దానికి ఆమె మాత్రం  ‘మా వాచ్ మెన్‌కి కూడా అందుకే నిద్ర పట్టట్లేదట’ అంటూ తలతిక్క సమాధానం చెబుతుంది. ఇంతకీ మనం చెప్పిందేమిటి? దానికి వాళ్లింటి వాచ్‌మెన్‌కి సంబంధం ఏంటి. ఇలాంటి మాటలు వింటే కొన్నిసార్లు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. “ప్లీజ్ ఆంటీ.. (aunty) ఇక ఆపేయండి” అని కూడా అనాలనిపిస్తుంది.

ADVERTISEMENT

Tumblr

5. పక్కింటి ఫేవరెట్ ఆంటీ

పేరుకి పక్కింటి వాళ్లంటాం కానీ.. నిజానికి వారు కూడా మన కుటుంబ సభ్యుల్లాంటివారే. వారితో అంత కలివిడిగా ఉంటాం. వారికి మన ఇష్టాల గురించి.. మనం చేసే పనులన్నింటి గురించి తెలుస్తుంటాయి. కావాలంటే మీరే ఓసారి గమనించండి. వాళ్లింట్లో వండిన కూరలు, పిండి వంటలు వేడివేడిగా తీసుకొచ్చి.. “నీకిష్టం కదా అని తెచ్చాను” అంటుంది మీ పక్కింటి ఆంటీ.

నిజానికి మన బంధువులు, స్నేహితుల కంటే.. మన ఇష్టాల గురించి మన పక్కింటి ఆంటీకే బాగా తెలుస్తాయి. మంచి పని చేస్తున్నప్పుడు ఎలా పొగుడుతుందో.. తప్పు చేసినప్పుడు కూడా అలాగే తిడుతుంది. ఇలాంటి పక్కింటి ఆంటీలు అందరికీ దొరికితే ఎంత బాగుంటుంది.

ADVERTISEMENT

Tumblr

6. నెక్స్ట్ జెన్ ఆంటీ

కొంతమంది అత్తలు ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సాప్.. ఇలా అన్నింటితోనూ తీరుబడి లేకుండా ఉంటారు.  సోషల్ మీడియాలో మనకంటే ఎక్కువ సంగతులు వారికే తెలుసు. లేదా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారు తమ వయసున్నవారితో కంటే.. మనతో మాట్లాడడానికే ఇష్టపడతారు. ఎందుకంటే మనతో మాట్లాడితేనే కదా.. వారు ఎప్పటికప్పుడు అప్ టు డేట్  ఉండచ్చు.

Tumblr

ADVERTISEMENT

7. “నా పిల్లలు రత్నాలు” అని చెప్పే ఆంటీ

అసలు ఇలాంటి వాళ్లు మనింటికి వస్తున్నారంటేనే చాలు.. ఓ పక్క భయంగా.. మరో పక్క చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మనల్ని వారి పిల్లలతో పోలుస్తుంటారు. లేదా వాళ్ల పిల్లలను తెగ పొగుడుతుంటారు. “నా కూతురు ఎంత తెలివైందో తెలుసా? నా కొడుకు ఎంత గొప్ప పని చేశాడో తెలుసా?” అని చెబుతుంటారు.

అది విన్న మన అమ్మా,నాన్న ‘నువ్వెందుకే.. పనికి రాకుండా పోయావని’ మనకు తలంటేస్తారు. కొన్నిసార్లు ఇలాంటి వాళ్లకి “మీ గొప్పలు.. మీ దగ్గరే పెట్టుకోమని” చెప్పాలనుకుంటాం. కానీ పెద్దవాళ్లనే గౌరవంతో ఆ మాట మనలోనే దాచుకుంటాం.

Tumblr

ADVERTISEMENT

8. సినిమాటిక్ ఆంటీ

అసలు ఇలాంటి ఆంటీని చూస్తే… అచ్చం సినిమాలో మాదిరిగా అనిపిస్తూ ఉంటుంది. అసలు సినిమాల్లో హీరోయిన్గా చేయాల్సిన ఆవిడ.. ఇలా మన మధ్య ఉందని ఆశ్చర్యపోతుంటాం. అంత ఉత్సాహంగా ఉంటారు. ఆవిడ మాటతీరు కూడా అంతే చమత్కారంగా ఉంటుంది. ఎలాగంటే సినిమాల్లో నిర్మలమ్మలా అన్నమాట.

Tumblr

9. స్ట్రిక్ట్ ఆంటీ

వీరు మనం ఎలాంటి తప్పూ చేయకపోయినా.. అందులో ఏదో ఒక తప్పు వెతుకుతుంటారు. అసలు మనం ఏ పనీ చేయకపోయినా ఏదో ఒక తప్పు అంటగట్టడానికి చూస్తుంటారు. కొన్నిసార్లు మనల్ని దేనికి పనికిరాని వారి కింద జమకడుతుంటారు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అసలు వారికి కనిపించకుండా ఉండటానికే మనం ప్రయత్నిస్తుంటాం.

ADVERTISEMENT

Tumblr

10. మ్యాచ్ ఫిక్సింగ్ ఆంటీ

మనకు పెళ్లీడు వచ్చిందని అమ్మానాన్న గుర్తిస్తారో లేదో గానీ.. వీరు మాత్రం మన వయసు పద్దెనిమిది కూడా దాటనివ్వరు. ఓ సంబంధాలు తీసుకొచ్చేస్తుంటారు. ‘ఫలానా వారి అబ్బాయిది ఎంత పెద్ద ఉద్యోగమో. పైగా మంచోడు. ఇలాంటి సంబంధం తప్పిపోతే మళ్లీ మనకు దొరకదు’ అని అమ్మ మెదడులోకి  ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటారు. పైగా “మీకు ఇష్టమైతేనే,, పెద్దగా బలవంతం ఏమీ లేదని” చెబుతుంటారు. మనకి కూడా “నీకు త్వరలోనే పెళ్లి రోజులు దగ్గరికొచ్చాయిలే” అని తన కళ్లతోనే హింట్ ఇచ్చేస్తారు. 

ADVERTISEMENT

Tumblr

11. ఫిట్నెస్ ఫ్రీక్ ఆంటీ

కొంతమంది ఆంటీలు వయసు పెరుగుతున్నా.. యంగ్‌గానే కనిపిస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ల పక్కన మనమే.. కాస్త వయసు ఎక్కువ ఉన్నవారిలా కనిపిస్తాం. వాళ్లు తిండి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక్క రోజు కూడా జిమ్ కెళ్లడం లేదా వాకింగ్ చేయడం మానరు. అసలు వారి లైఫ్ స్టైల్ చూస్తే.. అలా లేనందుకు మన మీద మనకే కోపం వస్తుంది.

Tumblr

ADVERTISEMENT

12. నో కాంప్రమైజ్ ఆంటీ

మీరు తిన్నా, తినకపోయినా, తినలేని పరిస్థితుల్లో ఉన్నా.. ఈవిడకి అనవసరం. ఆవిడ పెట్టింది మీరు తినాల్సిందే. అప్పుడే భోజనం చేసి వాళ్లింటికి వెళ్లినా సరే.. ఆవిడ మళ్లీ మీకు వడ్డిస్తుంది. చచ్చినట్టు దాన్ని తినాల్సిందే. వద్దంటున్నా కొసరి కొసరి వడ్డిస్తుంటుంది. మన మీద ఆవిడి చూపించే  ప్రేమ మనకి సంతోషాన్ని కలిగించినా.. పొట్ట పగిలిపోతుందేమోనని భయం కూడా వేస్తుంటుంది.

Tumblr

13. కంపేరిజన్ ఆంటీ

కొంతమందికి మాటలంటే ఇష్టం. మరికొందరికి పాటలంటే ఇష్టం. కానీ వీళ్లకి మాత్రం ఒకరితో మరొకరిని పోల్చడమే ఇష్టం. మన అన్నయ్య రూపాన్ని హీరో నాగశౌర్యతో, మనల్ని వాళ్ల అపార్ట్‌మెంటులో ఉన్న పిల్లతో పోలుస్తుంది. మనం కాలికి వేసుకున్న చెప్పుల్ని టీవీ సీరియల్లో విలన్ వేసుకున్న  చెప్పులతో పోలుస్తుంది. అసలు మనకీ, ఆవిడ పోల్చే వాటికి సంబంధమే ఉండదు. అయినా ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరితో పోలుస్తూ ఉంటుంది.

ADVERTISEMENT

Tumblr

14. సంస్కారవంతమైన ఆంటీ

ఈ ఆంటీలకు వేరే వ్యాపకమేమీ ఉండదు. ఎప్పడూ పూజలూ, పునస్కారాలు, గుళ్లూగోపురాలూ అంటూ తిరుగుతుంటారు. అప్పుడప్పుడూ మనకి కూడా దైవ పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. మనల్ని కూడా ఆధ్యాత్మికత దిశగా నడపడానికి చూస్తుంటారు. కొన్నిసార్లు వారు మన మంచికే చెబుతున్నారనిపించినా.. మరికొన్నిసార్లు మాత్రం కాస్త చిరాకుగా అనిపిస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

11 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT