ADVERTISEMENT
home / వినోదం
విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ సినిమా ఫస్ట్ లుక్ అదిరింది కదూ ..!

విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ సినిమా ఫస్ట్ లుక్ అదిరింది కదూ ..!

విక్టరీ వెంకటేష్ (venkatesh) – ఈ పేరంటే ఏ వయసు వారికైనా అభిమానమే. అదే సమయంలో ఏ హీరో ఫ్యాన్ అయినా ఈయనని అభిమానించకుండా ఉండలేరు. ఎందుకంటే తెర పై ఆయన పండించే హాస్యం.. అసాధారణమైన నటన ఒకెత్తయితే… బయట కూడా ఆయనకున్న మంచి మనసు ఎంతోమంది అభిమానాన్ని మూటకట్టుకునేలా చేసింది.

అయిదు భాషలలో తెరకెక్కుతున్న.. ‘విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్’ చిత్రం

మొన్నీమధ్యనే ‘వెంకీ మామ’ అంటూ తన రియల్ మేనల్లుడితో రీల్ పైన కూడా కనిపించి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు వెంకీ. ఇక తాజాగా ఆయన ఒక కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆ  సినిమా ఫస్ట్ లుక్స్‌ని ఇటీవలే విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పుడు అంతర్జాలంలో ఎక్కడ చూసినా కూడా ఆ ఫస్ట్ లుక్స్ ట్రెండ్ అవుతున్నాయి. నెటిజెన్స్ కూడా ఆ లుక్స్ గురించే చర్చించుకుంటున్నారు.

నారప్ప ఫస్ట్ లుక్ (narappa first look) మీరు కూడా చూసేయండి.

ADVERTISEMENT

చూశారుగా.. ఒక పల్లెటూరి వాడిగా.. అదే సమయంలో చేతిలో కొడవలితో రౌద్రం పలికిస్తున్న వెంకటేష్ అద్భుతంగా ఉన్నాడు కదా! పైగా నారప్ప (narappa) అంటూ కాస్త వైవిధ్యమైన టైటిల్‌ని పెట్టడం కూడా ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా ఉంది. ఇక ఇప్పటికే మీలో చాలామందికి ఇది తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ చిత్రానికి తెలుగు రీమేక్ అని తెలిసే ఉంటుంది. అయితే తమిళంలో ధనుష్‌ని చూసిన తరువాత.. ఆ పాత్రలో వెంకటేష్ ఎలా సరిపోతాడు అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేయడం జరిగింది. కాని ఈ ‘నారప్ప’ టైటిల్‌తో ఎప్పుడైతే ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయో .. అప్పుడే ఈ సినిమా పైన నెలకొన్న సందేహాలు అన్నీ పటాపంచలు అయిపోయాయి.

ఇక ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన కలైపులి ఎస్ థాను తెలుగులో సైతం నిర్మిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పకుడిగా సురేష్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుండి అనంతపురంలో మొదలుకానుంది. ఈ షెడ్యూల్ దాదాపు నెలరోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది.

దేశాన్నే అబ్బురపరిచిన.. హైదరాబాదీ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ : ఈ టాప్ 5 విశేషాలు మీకోసం

‘నారప్ప’ చిత్రం సాంకేతిక వర్గం విషయానికి వస్తే, మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా.. శ్యామ్ కే నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎక్కువగా ఆకర్షించేది పోరాట సన్నివేశాలే. అందుకోసం ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్స్ వ్యవహరించబోతున్నారు.

ADVERTISEMENT

అలాగే ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలని ఎంపిక చేయడం విశేషం. ఆయనని ఎంపిక చేసినప్పుడు.. చాలామంది ‘ఇది ఓ పొరపాటు నిర్ణయం’ అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఎందుకంటే ఆయన తన కెరీర్‌లో తీసిన నాలుగు చిత్రాలు కూడా కుటుంబకథా చిత్రాలు కావడం.. అలాగే వాటిలో యాక్షన్ ఎక్కువగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలకు ప్రాధాన్యత ఉన్నప్పటికి.. అంతర్లీనంగా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక వ్యక్తి చేసే పోరాటమే ఈ సినిమా కథ కావడంతో.. అటువంటి కథాంశాన్ని శ్రీకాంత్ అడ్డాల సమర్ధవంతంగా తెరకెక్కించగలడని భావించే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఏదైతేనేమి… దర్శకుడిగా తన ఆఖరి చిత్రంతో.. నెగటివ్ మార్కులు సాధించిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రం ద్వారా మరలా అందరి చేత పాజిటివ్ మార్కులు వేయించుకోవాలని ఆశిద్దాం. అలాగే ఈ ‘నారప్ప’ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో ఒక మంచి చిత్రంగా మిగిలిపోవాలని కోరుకుందాం..

‘జొమాటో’లో ఉబర్ ఈట్స్ విలీనం .. ఈ ఆసక్తికర పరిణామం వెనుక కారణాలివే..!                                                                                                   

22 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT