ADVERTISEMENT
home / Celebrity Life
అతని వెంట హోటల్‌కు వెళ్లా.. అప్పుడు ఏం జరిగిందంటే : విద్యాబాలన్ చెప్పిన ఆసక్తికర విషయాలు

అతని వెంట హోటల్‌కు వెళ్లా.. అప్పుడు ఏం జరిగిందంటే : విద్యాబాలన్ చెప్పిన ఆసక్తికర విషయాలు

విద్యాబాలన్ (Vidya balan).. బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ నటీమణుల జాబితాలో ముందువరుసలో ఉండే నటీమణి. కథానాయికల పట్ల సినీపరిశ్రమలో ఉన్న అనేక మూసధోరణుల నుంచి అందరినీ బయటకు తీసుకువచ్చి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో నటిస్తూ తన సత్తా చాటుకుంటోంది. నటించే ప్రతి చిత్రంతోనూ తన స్థాయిని మరింత పెంచుకుంటూ వస్తోన్న విద్య.. తాజాగా ‘మిషన్ మంగళ్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అంతేకాదు.. ఈ చిత్రంలో విద్య తన చక్కని నటనతో మరోసారి అందరినీ మురిపించింది కూడా.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో..  విద్య  పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలతో పాటు ఈ రోజుల్లో హీరో, హీరోయిన్ల పట్ల మారుతోన్న ప్రేక్షకుల ధోరణి, తన తదుపరి సినిమాలు.. వంటి ఎన్నో విషయాల గురించి ముచ్చటించింది.

ఈ క్రమంలో విద్యాబాలన్ మాట్లాడుతూ- ‘దక్షిణాది సినీపరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో చెన్నైలో ఓ దర్శకుడిని సంప్రదించా. సవివరంగా మాట్లాడేందుకు నేను ఆయన్ని కాఫీ షాప్‌కు రమ్మని కోరగా.. ఆయన మాత్రం హోటల్ రూమ్‌కి వెళ్దాం.. అంటూ పట్టుబట్టారు.

ఎన్టీఆర్ “బయోపిక్ “తో విద్యా బాలన్‌కి.. టాలీవుడ్‌లో పాపులారిటీ పెరుగుతుందా?

ADVERTISEMENT

ఎదురు చెప్పలేక నేను కూడా ఆయన వెంటే హోటల్‌కు వెళ్లా. కానీ గది తలుపు మాత్రం పూర్తిగా తెరచిపెట్టే ఉంచాను. దాంతో ఆయన చేసేదేం లేక 5 నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిజానికి ఇక్కడ నాకు హాని ఏమీ జరగలేదు. కానీ ఈ సంఘటనను మాత్రం నేనెప్పటికీ మరచిపోలేను. పరిశ్రమలో అడుగుపెట్టాలనుకునే అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే.. ఆత్మరక్షణ కంటే అవకాశాలు అందుకోవడం ముఖ్యం కాదు.. ఈ రోజుల్లో మన ప్రతిభను నిరూపించుకోవడానికి అనేక మార్గాలు, అందుకు తగిన అవకాశాలు కోకొల్లలుగా ఉంటాయి.

మనం చేయాల్సిందల్లా వాటిలో సరైన అవకాశాలను అందిపుచ్చుకొని సన్మార్గంలో మనల్ని మనం నిరూపించుకోవడమే.. అంతేకానీ.. అవకాశాల కోసం ఆత్మరక్షణను ప్రశ్నార్థకంగా మిగుల్చుకోకూడదు’ అంటూ తాను అనుభవపూర్వకంగా నేర్చుకున్న పాఠం గురించి చెప్పుకొచ్చింది విద్య.

అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ “కథానాయకుడు” (సినిమా రివ్యూ)

అంతేకాదు.. హీరో అంటే ఒకప్పుడు పదిమందిని కొట్టేవాడు.. అని చాలామంది భావించేవారని, ఇప్పుడు ఈ ఆలోచనాధోరణిలోనూ మార్పు వచ్చిందనీ చెప్పుకొచ్చింది విద్య. ‘ఈ రోజుల్లో హీరో అంటే పదిమందిని కొట్టేవాడో లేక వెండితెరపై తన బలాన్ని ప్రదర్శించేవాడో కాదు.. ఒకప్పుడు హీరో అంటే ప్రేక్షకులు ఇలానే భావించేవారు. కానీ ఇప్పుడు ఈ ధోరణి మారింది.

ADVERTISEMENT

తన జీవితం లేదా తన శక్తిపై నమ్మకంతో ముందడుగు వేసి తమని తాము ఎవరైతే నిరూపించుకుంటారో, కలలను సాకారం చేసుకుంటారో వారే హీరోలు. ప్రేక్షకులకు కూడా వారే ప్రేరణ కలిగిస్తారు. ఇలాంటి వ్యక్తులే సాధారణ ప్రజానీకంలో సైతం తామూ హీరోలు కావచ్చనే నమ్మకాన్ని కలిగిస్తారు. అందుకు తగిన  అవకాశాలు పరిశ్రమలో ఉన్నాయని తెలిసేలా చేస్తూ మీడియా కూడా వారికి సహాయం చేస్తుంది..’ అని వివరించింది విద్య. ప్రస్తుతం ఈ భామ నట్ ఖట్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తోంది. దీనికి షాన్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విద్య కేవలం నటించడం మాత్రమే కాదు.. ఈ షార్ట్ ఫిల్మ్‌కి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

ఇందిరా గాంధీ బయోపిక్ త్వరలో..

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చే విద్య.. “మిషన్ మంగళ్” చిత్రం తర్వాత ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది. అయితే దీని కంటే ముందు ఆమె ఇందిరా గాంధీ బయోపిక్‌లో నటిస్తోందని వార్తలు వినిపించాయి. ఇది నిజమో కాదో అని.. ఇప్పటివరకు ఎవ్వరూ స్పందించలేదు.

ఈ సంక్రాంతికి.. ఈ టాలీవుడ్ చిత్రాలు చాలా స్పెషల్

ADVERTISEMENT

ఈ క్రమంలో విద్య తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ- భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్ లో తాను నటిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా సమయం పడుతుందని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యే సరికి మరో రెండు సంవత్సరాల వ్యవధి పడుతుందని, ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్‌కు కూడా తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటించింది. అయితే వాటి వివరాలు నిర్మాతలు వెల్లడించిన తర్వాత అందరూ తెలుసుకోవచ్చని చెప్పింది. ఏది ఏమైనా విద్య నటనే కాదు.. తీరు కూడా అద్భుతమే మరి..

29 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT