ADVERTISEMENT
home / Fiction
గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా.. ఎలా మారిందో తెలుసా..?

గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా.. ఎలా మారిందో తెలుసా..?

సాధారణంగా ఎవరైనా గుడ్లగూబను (Owl) అశుభానికి ప్రతీకగా భావిస్తారు. రాత్రివేళ గుడ్లగూబలు కూస్తే.. ఏదో ఆపద తలెత్తుతుందని కూడా అభిప్రాయపడుతుంటారు. కానీ హిందూ పురాణాల ప్రకారం.. గుడ్లగూబకు చాలా విశిష్ట స్థానం ఉంది. గుడ్లగూబను సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీకి వాహనంగా పరిగణిస్తారు. రాత్రి నాల్గవ జాము తర్వాత..  గుడ్లగూబ ఎవరి ఇంటి మీదైతే వాలుతుందో.. ఆ రోజు నుండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట.  దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. 

పూర్వకాలంలో ఓ అడవిలో ఓ వృద్ధ జంట కాపురముండేదట. వారెంత కటిక పేదరికంతో జీవించే వారంటే.. కట్టుకోవడానికి వారింట్లో కేవలం ఒకే ఒక్క బట్ట ఉండేది. ఒకరు ఇంట్లో ఉంటే.. మరొకరు అదే బట్ట ఒంటిపై కప్పుకొని యాచనకు వెళ్లేవారు.  ఓ రోజు ఆ ఇంటి పెద్ద ఇదే తీరున యాచనకు వెళ్లినా.. ఏమీ దొరక్కపోవడంతో కలత చెంది ఓ చెట్టు క్రింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. తన కష్టాలను ఆ చెట్టుతో చెప్పుకుంటాడు.

దసరా సంబరాల వేళ.. ఆయుధ పూజ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

అదే చెట్టుపై నివసిస్తున్న గుడ్లగూబ ఈ కష్టాలను వింటుంది. అతని కష్టాలను ఎలాగైనా తీర్చాలని భావిస్తుంది. అందుకోసం ఓ పథకాన్ని రచిస్తుంది. లక్ష్మిదేవిని ఒక కంట కనిపెడుతూ.. తను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. దేవి ఏ ఇంట్లో కాళ్లు మోపడానికి ప్రయత్నిస్తుందో.. ఆ ఇంటి మేడపైకి ఎక్కి కూస్తుంది. శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో.. ఆ ఇంట్లోకి లక్ష్మిదేవి ప్రవేశించకూడదు. కనుక ఆమె కూడా కూత విని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ తాను ఏ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించినా… ఆ ఇంటి దగ్గరకే వెళ్లి గుడ్లగూబ కూస్తుండడంతో ఆమెకు అనుమానం వస్తుంది. తనవైపు గుడ్లురిమి చూస్తుంది.

ADVERTISEMENT

ఈ అవుట్ ఫిట్స్‌తో.. మీ దసరా ట్రెండీగా జరుపుకోండి ..!

అప్పుడు గుడ్లగూబ లక్ష్మీదేవిని (Goddess Lakshmi) ఓ ఇంటికి తీసుకెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న వృద్ధ దంపతులను చూసి దేవీ చలించిపోతుంది. వారి ఇంట్లో కొలువై ఉంటానని.. వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుంది. ఆ పక్షిని శుభానికి సూచికగా ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్నవారిని కనుగొంటూ.. వారికీ, ఆ మహాలక్ష్మికి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండీ తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. 

ఇటువంటిదే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ శ్రీమన్నారాయణుడు ఏర్పాటు చేసిన ఓ గానసభలో సంగీత మేధావి అయిన నారదుడికి స్థానం లభించకపోవడంతో.. తను చాలా బాధపడతాడు. పైగా అదే సభలో తుంబురుడు అగ్ర తాంబూలం అందుకోవడంతో మరింత అసూయకు గురవుతాడు. క్షణం కూడా ఆలోచించకుండా.. వివరణ అడగడం కోసం లక్ష్మీ సమేతుడైన విష్ణువుని కలవడానికి వెళ్తాడు. కానీ చెలికత్తెలు తనను అడ్డుకుంటారు. అప్పుడు నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. గుడ్లగూబను వాహనంగా స్వీకరించమని ఆదేశిస్తాడు.

అప్పుడు విష్ణువే స్వయంగా దిగి వచ్చి.. నారదుడి గర్వాన్ని అణచడం కోసం అతని పాదాల పై పడతాడు. దాంతో నారదుడు శాంతిస్తాడు. ఓ క్షణం తర్వాత.. తను చేసిన తొందరపాటు పనికి సిగ్గు పడతాడు. అప్పుడు శ్రీహరి నారదుడికి హితబోధ చేస్తాడు. సంగీతం ఎవరి సొత్తూ కాదని.. సంగీతాన్ని ప్రేమించే వారు గర్వానికి, అహంకారానికి దూరంగా ఉండాలని తెలియజేస్తాడు. ఈ విషయంలో తుంబురుడు నారదుడి కంటే మేటని అంటాడు. నిజంగా నారదుడికి సంగీతం పట్ల ప్రేమ ఉంటే.. అసలైన సంగీత తత్వాన్ని అన్వేషించమని చెబుతాడు. 

ADVERTISEMENT

ఈ ప్రపంచంలోనే మేటి సంగీత విద్వాంసుడైన ఉలూకపతి వద్దకు వెళ్లి సంగీతాన్ని అభ్యసించమని కోరతాడు. ఆ ఉలూకపతి ఎవరో కాదు.. ఓ గుడ్లగూబ. అప్పుడు ఆ గుడ్లగూబను కలవడానికి నారదుడు బయలుదేరతాడు. అప్పటికే ఉలూకపతి వద్ద కొన్ని వేలమంది శిష్యులు ఉంటారు. నారదుడిని చూసి ఉలూకపతి పరశించిపోతాడు. తన వద్ద సంగీతం నేర్చుకోవడానికి నారదుడి లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోతాడు. ఇదే క్రమంలో నారదుడి కథను విని తన కథను కూడా చెప్పడం మొదలుపెడతాడు.

ఉలూకపతి తన అసలు పేరు భువనేశుడని.. గత జన్మలో తాను ఓ చక్రవర్తినని తెలియజేస్తాడు.

ఆ భువనేశుడి కథ – 

భువనేశుడనే రాజుకి సంగీతమంటే తనకు అసలు పడేది కాదట. సంగీతం వింటేనే శరీరం పై తేళ్లు పాకుతున్న భావన కలిగేది. అందుకే తను సంచరించే ప్రాంతాలలో సంగీతాన్ని నిషేధించేవాడు. సంగీతం, పాటలు వినేవారిని ఘోరంగా శిక్షించేవాడు. కానీ వ్యక్తిగతంగా తను చాలా మంచివాడు. అనేక దాన ధర్మాలు చేసేవాడు. ఓ రోజు హరి మిత్రుడు అనే వ్యక్తి భగవంతుడిని స్తుతిస్తూ రాజుకి కనిపిస్తాడు. అతని రాగాలాపన రాజుకి కంపరాన్ని కలిగిస్తుంది. వెంటనే తనను హతమార్చాలనుకుంటాడు. కానీ బ్రాహ్మణ హత్య మహా పాతకమని తలచి.. అతనికి దేశ బహిష్కరణ శిక్ష గావిస్తాడు.

ADVERTISEMENT

కొన్ని రోజుల తర్వాత భువనేశుడు కూడా పరమపదిస్తాడు. మరు జన్మలో ఓ గుడ్లగూబగా జన్మిస్తాడు. దేశమంతా కరువు తాండవిస్తున్న క్రమంలో ఆహారం దొరక్క శుష్కించి.. చావుకి సిద్ధమవుతాడు. అదే సమయంలో యమధర్మరాజు ప్రత్యక్షమై.. భువనేశుడికి అతని జన్మకు కారణమైన విషయాన్ని చెప్పి వెళ్లిపోతాడు. భువనేశుడికి తన పూర్వ జన్మ గుర్తుకొస్తుంది. అయినా ఆకలితో మాడి.. తనను తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న సమయంలో.. అటువైపు వచ్చిన ఓ బాటసారి తనను కాపాడతాడు. భువనేశుడి ఆకలి తీరుస్తాడు.

భువనేశుడు ఆ బాటసారిని హరి మిత్రుడిగా గుర్తిస్తాడు. తన ప్రాణాలు కాపాడినందుకు.. ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి హరిమిత్రుడు బదులిస్తూ.. సంగీత సాధన చేస్తూ .. గొప్ప గాయకుడిగా పేరుగాంచమని చెబుతాడు.

ఆ రోజు నుండి గుడ్లగూబ రూపంలో ఉన్న భువనేశుడు సంగీత సాధన చేస్తూ.. అనతికాలంలోనే గొప్ప గాయకుడై తనలాగే ఎందరో శిష్యులను తయారుచేస్తుంటాడు. నారదుడు కూడా భువనేశుడి శిష్యుడిగా చేరి.. సంగీతంలోని పరమార్థాన్ని  తెలుసుకుంటాడు. నారదుడు తన శిష్యరికం పూర్తయ్యాక.. గురుదక్షిణను ఇస్తాడు. గుడ్లగూబ రూపంలో ఉన్న భువనేశుడిని సాక్షాత్తూ లక్ష్మీదేవికి వాహనంగా మారి తరించమని కోరతాడు. 

సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..

ADVERTISEMENT

పక్షిజాతిలో సాహసయాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి పేరుంది.  ఉల్లూక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటి చూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రివేళలో మాత్రమే ఇవి సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్లినప్పుడు.. గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని కచ్చితంగా నెరవేరుతుందని అంటుంటారు. అయితే ఎన్ని కథలు చెప్పినా.. ఇప్పటికీ గుడ్లగూబను అశుభానికి సూచికగా భావిస్తున్న వారు కూడా అనేకమంది ఉన్నారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

ADVERTISEMENT
08 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT