మీ బాయ్ ఫ్రెండ్ నిజంగానే లక్షల మందిలో ఒక్కడా.. అతను మీ ప్రేమకు బానిస అని చెప్పే 11 విషయాలివే

మీ బాయ్ ఫ్రెండ్ నిజంగానే లక్షల మందిలో ఒక్కడా.. అతను మీ ప్రేమకు బానిస అని చెప్పే 11 విషయాలివే

నిజంగానే ఓ మంచి మనసున్న వ్యక్తి మీ జీవితంలోకి భర్తగా వస్తే మీరు మాత్రం ఆనందంతో గంతులు వేయకుండా ఉండగలరా..? అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నిజంగానే ప్రేమించి, ఆరాధించే వ్యక్తినే సెలక్ట్ చేసుకోవాలి. మీ కలల రాకుమారుడు మీకోసం ఎలాంటి త్యాగం చేసేవాడైనా అయ్యుండాలని మీరు అనుకోవడంలోనూ  తప్పులేదు. ఈ క్రమంలో మీకు లభించబోయే వ్యక్తి నిజంగానే మంచి వ్యక్తి అని చెప్పడానికి దోహదపడే 11 గుణగణాల గురించి మనం కూడా తెలుసుకుందాం..!1.మిమ్మల్ని తను ఓ అద్భుతమైన వ్యక్తిలా చూస్తాడు


అతను ఎప్పుడూ మిమ్మల్నే చూస్తూ ఉంటాడు. మీరు తప్ప తనకు వేరే లోకమే ఉండదు. మీలో ఎవరూ గమనించని సునిశితమైన విషయాలను కూడా తాను గమనిస్తాడు. మిమ్మల్ని ఓ అద్భుతాన్ని చూసినట్లు చూస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీ అమ్మ తర్వాత ఇష్టపడే అతి పెద్ద అభిమాని అతడు.


1-Signs-you%E2%80%99re-dating-an-amazing-man


2. తప్పు చేస్తే ఒప్పుకోవడం తన నైజం


చాలా మంది తప్పు తమ వైపు ఉన్నా ఒప్పుకోవడానికి సిద్ధపడరు. కానీ తను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా కూడా తానే ముందు వచ్చి మాట్లాడుతున్నాడంటే.. తన మనసు ఎంత ఉదాత్తమైందో మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీ పట్ల కోపంగా ప్రవర్తించి ఆ తర్వాత అహంకారంతో వెళ్లిపోతే బాధపడాలి గానీ.. పదే పదే మీ వద్దకు వచ్చి సారీ చెబితే నిజంగానే అక్కున చేర్చుకోవచ్చు.3. మీ కష్టనష్టాల్లో “అతడే మీ సైన్యం”


2-signs-youre-dating


మీరు కష్టపడితే తాను కుంగిపోతాడు. మీరు బాధపడితే తాను బాధపడతాడు. మీరు అలసట చెందితే తాను మీ సేదతీరుస్తాడు. పీరియడ్స్ సమయంలో మీరు డిప్రెషన్‌లోకి వెళితే.. తాను మీకు సపర్యలు చేస్తాడు. మనిషి ఇంత మంచి వాడైతే మీరు నిజంగానే వదులుకోకూడదు సుమా.4.నిజమైన ఛాలెంజర్


మీతో తన వివాహమయ్యాక.. మీకు ఏ లోటు రాకూడదనే తాను ఇప్పటి నుండీ ప్రయత్నిస్తున్నాడు. తన లక్ష్యం దిశగా గెలుపు పోరాటం చేస్తున్నాడు. ఎన్ని అవంతరాలు ఎదురవుతున్నా ముందుకు వెళ్తున్నాడే కానీ.. వెనుకడుగు వేయడం లేదు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది కదా.5.మీ కలలకు తానే వారధి


మిమ్మల్ని ప్రోత్సహించడమే తన ధ్యేయం. మీ కలలను నిజం చేయడమే తన టార్గెట్. మీకున్న నైపుణ్యాలకు సాన బెట్టి, మీరు విజేతగా నిలిస్తే కళ్లలో ఆనందాన్ని నింపుకోవడం మాత్రమే తను చేయగలిగింది. ఇంత మంచి వ్యక్తిని మీరు దూరం చేసుకోరు కదూ.


3-signs-youre-dating 


6.మీ స్నేహితులకు కూడా నచ్చుతుంటాడు


ఈ విషయం చెబితే మీరు నొచ్చుకుంటారేమో గానీ.. నిజం చెప్పాలంటే అతను మీతో పాటు మీ స్నేహితులకు కూడా నచ్చుతాడు. అందరితోనూ కలివిడిగా ఉంటాడు. అందరితోనూ వేగంగానే కలిసిపోతాడు. కానీ, ఎందుకో అందరికన్నా మీరంటేనే తనకు ఎంతో ఇష్టం.7.ఆ పనులు చేస్తున్నాడంటే.. మీ పై ఎంత ప్రేమ ఉందో..!


ఈ రోజు ఆఫీస్ వర్క్ చేసేవారికి ఫోన్, ల్యాప్ టాప్ వంటివి ఎంత ముఖ్యమో తెలియని విషయం కాదు. కానీ మీతో ఒంటరిగా గడపాలని సెల్ స్విఛాఫ్ చేసి.. ల్యాప్ టాప్ బంద్ చేసి మీతో కబుర్లు చెప్పడానికి మాత్రమే తను పరిమితం అయ్యాడంటే.. అర్థం చేసుకోవచ్చు తాను మీ ప్రేమకు ఎంత బానిసయ్యాడో.


hfhhrfh


8.మీకు తెలియని ప్రపంచాన్నీ పరిచయం చేస్తాడు


నిజం చెప్పాలంటే.. తనకు ఈ ప్రపంచంలో తెలియని విషయాలే లేవు. మీకు తెలియని అనేక విషయాలు తనకు చాలా తెలుసు. అప్పుడప్పుడు తనకున్న నాలెడ్జి చూసి మీరు ముక్కున వేలేసుకుంటారు. అలాగే ఆశ్యర్యపోతారు. మీకు తెలియని వింతలు, విచిత్రాలు చెప్పి మిమ్మల్ని ఆసక్తిదాయకంగా వినేలా చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య.9.మీ లవ్ కెమిస్ట్రీని రక్తి కట్టించడం తనకే తెలుసు


చిలిపి పనులు చేసి మిమ్మల్ని ఆనందింపజేయడం తనకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని నవ్వించడం, కవ్వించడం, ఏడ్పించడం తాను చేసినా.. ఆ తర్వాత మిమ్మల్ని ఊరుకోబెట్టడం కూడా తనకు వచ్చు. ఆయనతో ఉన్నవేళలను మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే.. అంతకంటే మీకు ఏం కావాలి.


4-signs-youre-dating


10.మీ చిలిపి చేష్టలకు తానూ వత్తాసు పలుకుతాడు


మీరు చేసే చిన్న పిల్లల చేష్టలు మీ ఇంట్లోవారికీ, మీ స్నేహితులకు నచ్చకపోయినా తనకు మాత్రం బాగా నచ్చుతాయి. చిత్రమేంటంటే.. మీరు చేసే నవ్వు తెప్పించే పనుల్లోనూ తన చేయూతను అందిస్తాడు. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు.11.మీరు ఆనందంగా నిద్రపోవాలన్నదే తన కోరిక


మీ మధ్య ఎలాంటి గొడవ జరిగినా తనకు నిద్రపట్టదు. వెంటనే మీ మనసును శాంతింపజేయడానికి ఏదో ఒక ప్రయత్నం చేయనిదే ఆయనకు మనశ్శాంతి ఉండదు. అందుకే మీకు సారీ చెప్పైనా.. లేదా ఏదైనా కానుక ఇచ్చైనా.. లేదా మీకు నవ్వు తెప్పించే పని చేసైనా మీకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఆ రోజు మీరు సంతోషంగా నిద్రపోవడానికి తను శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాడు.