పెళ్లయ్యాక.. మీరు మీ భాగస్వామితో చర్చించకూడని 9 విషయాలు ఇవే..!

పెళ్లయ్యాక.. మీరు మీ భాగస్వామితో చర్చించకూడని 9 విషయాలు ఇవే..!

మీరు మీ చిరకాల స్నేహితుడు లేదా బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్నారు. కాబట్టి.. ఇందులో దాపరికం ఏమీ లేదు. మీ ఇద్దరి జీవితాలకు సంబంధించిన డార్క్ సీక్రెట్స్ మీ ఇరువురికి తెలిసుండవచ్చు. అయితే పెళ్లి అవ్వకముందు పరిస్థితులు వేరు. పెళ్లయ్యాక పరిస్థితులు వేరు. వివాహం అయ్యాక కూడా.. మీ భాగస్వామితో మీరు చెప్పకూడని, చర్చించకూడని విషయాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి సుమా.1. వారి పద్ధతి నచ్చలేదని చెబితే.. ఇంతే సంగతులు


మీకు మీ అత్తారింటిలో మరదలితో లేదా మరిదితో తగవులు ఏర్పడవచ్చు. అప్పుడప్పుడు మీ అత్తమామలతో కూడా గిల్లికజ్జాల ముచ్చట్లు జరిగుండవచ్చు. అయినా సరే.. వారి పద్ధతి మీకు నచ్చలేదని మీరు మీ భాగస్వామితో నిర్మోహమాటంగా చెబితే ఇంకేమైనా ఉందా.. మీ మీద ఆయనకు దురభిప్రాయం కలగదూ. అందుకే ఇలాంటి విషయాల్లో ఆచి తూచి అడుగులు వేయాలి. కర్ర విరగకుండా పాము చావాలి అనే సామెత మాదిరిగా.. మీవారు అర్థం చేసుకొనే విధంగా ప్రత్యమ్నాయ పద్ధతిలో విషయం తన చెవిన పడేలా చేయాలి.


1-things to-not-tell-your-husband-gif-1


2. వారిని తూలనాడినంత మాత్రాన పరిస్థితి సద్దుమణగదు


మీ అత్తారింటికి వచ్చే వారి చుట్టాల ప్రవర్తన మీకు అప్పుడప్పుడు నచ్చకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీ భాగస్వామి వద్ద వారిని తూలనాడే ప్రోగ్రామ్ పెట్టవద్దు. ఇలా చేస్తే.. తనకు మరింత అసహనం పెరిగిపోతుంది.


అలా కాకుండా.. ఏదో జోక్ చెబుతున్నట్లు చెప్పి.. నవ్వుతూ అసలు విషయం తన చెవిన పడేలా చేయండి. తనకు కూడా విషయం అర్థమవుతుంది.3. పెళ్లి ఖర్చుల గురించి పదే పదే ప్రస్తావించవద్దు


మీ పుట్టింటివారు మీ పెళ్లి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టి ఉండవచ్చు. అయితే అదే విషయాన్ని పదే పదే మీవారి వద్ద చెబితే.. తనకు మీ మీద దురభిప్రాయం తప్పకుండా కలుగుతుంది. ఊరికే దెప్పిపొడవడానికి పెళ్లి ఖర్చులను ఒక సాకుగా చెబుతుందని కూడా తను అనుకోవచ్చు. అందుకే సమయం, సందర్భం లేకుండా ఆ టాపిక్ తీసుకురాకపోవడం మంచిది.


2-things to-not-tell-your-husband-gif-2 


4. గత విషయాలను గుర్తుచేయవద్దు


పెళ్లయ్యాక.. పదే పదే గత జీవితంలో జరిగిన చేదు అనుభవాలను గుర్తుతెచ్చుకొని బాధపడడం అనవసరం. అలాంటిది.. అవే విషయాలను పదే పదే జీవిత భాగస్వామి వద్ద ఏకరవు పెడితే బాగుంటుందా చెప్పండి. ఒకటి,


రెండు సార్లు తను అర్థం చేసుకున్నా.. మళ్లీ మళ్లీ అవే విషయాలను మీరు ప్రస్తావిస్తే తను అసౌకర్యంతో పాటు అసహనాన్ని కూడా పొందే అవకాశం ఉంది.5.మీ గత పరిచయాల ఊసే వద్దు


మీరు స్నేహితులుగా ఉండి.. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నా సరే.. కొన్ని విషయాలను మీ భాగస్వామితో


పంచుకోవడం అనవసరం. ముఖ్యంగా మీరు గతంలో డేటింగ్ చేసిన వ్యక్తుల గురించి లేదా మీరు ప్రేమించి ఆ తర్వాత తెగదెంపులు చేసుకున్న వ్యక్తులను గురించి కానీ.. మీ జీవిత భాగస్వామికి పదే పదే చెప్పాల్సిన పనిలేదు. పెళ్లయ్యాక వాటి ఆలోచనలనే మీ దరి చేరకుండా చూసుకోండి.6.తన స్నేహితుల గురించి ప్రస్తావించపోవడమే బెటర్


ఈ ప్రపంచంలో అందరు వ్యక్తులూ అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి.. మీవారి ఫ్రెండ్స్ మీకు నచ్చినా, నచ్చకపోయినా ఆ విషయం తన దగ్గర ప్రస్తావించవద్దు. ప్రస్తావించి తను ఫీల్ అయ్యే పరిస్థితులు కల్పించవద్దు.7.వారి సలహాలు ఇక్కడ ఏకరవు పెట్టవద్దు


మీవారి పద్ధతి సరిగా లేదని.. దానిని మార్చుకోమని మీ పుట్టింటివారు చెబితే.. అదే విషయాన్ని అత్యుత్సాహంతో


మీవారి వద్ద ప్రస్తావించవద్దు. అలా చేస్తే, మొదటికే మోసం వస్తుంది. మీ మీద దురభిప్రాయం కూడా కలుగుతుంది 


3-things to-not-tell-your-husband-gif-3 


8.తన జీతభత్యాల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దు


ప్రేమించి పెళ్లాడాక, మీ భాగస్వామి జీతభత్యాలను, మీ స్నేహితులకు వస్తున్న రాబడితో పోల్చి తన దగ్గర మాట్లాడకపోవడమే బెటర్. లేకపోతే తనను మీరు తక్కువగా చూస్తున్నారనే భావన తనకు కలుగుతుంది. ఫలితంగా మీపై ద్వేషం కూడా పెరిగే అవకాశం ఉంది. కనుక అటువంటి టాపిక్స్ మీ మధ్య రాకపోవడమే మంచిది.9. తల్లి చాటు బిడ్డగా మాట్లాడవద్దు


మీ తల్లి తన అనుభవాల సారంతో భార్యలతో భర్తలు ఎలా ప్రవర్తిస్తారన్న విషయంపై మీకు క్లాస్ తీసుకొని ఉండవచ్చు. అయితే ఆ క్లాసులో పాఠాలు మీ భర్త దగ్గర ఏకరవు పెట్టారా.. మీరు ఇబ్బందుల్లో పడినట్లే. ప్రేమాభిమానాలతో వ్యక్తుల నమ్మకాన్ని చూరగొనడంతోనే సంసారాలు నిలబడతాయని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి.