‘రాత్రి నానబెట్టిన బాదం గింజలు అలాగే ఉన్నాయి. ఇంకెప్పుడు తింటావ్?’
‘బాదంపప్పు తింటే బుర్ర బాగా పనిచేస్తుందట. రోజూ తిను. నీ మెదడు కాస్తయినా పనిచేస్తుంది’
‘రోజూ బాదం గింజలు తింటే.. మనం అందంగా తయారవుతామట’
బాదం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits Of Almonds)
ఇలాంటి మాటలు అమ్మ, అక్క, స్నేహితురాలు ఇలా ఎవరో ఒకరి నోటి నుంచి మనం రోజూ వింటూనే ఉంటాం. గర్భిణీలకు సైతం రోజూ బాదం గింజలను తినమని చెబుతారు. ఎందుకంటే.. దానివల్ల పుట్టబోయే బిడ్డ మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఒక టాక్ ఉంది.
మెదడు ఆరోగ్యం విషయంలోనే కాదు.. బాదం గింజలు (almond nuts) తినడం వల్ల ఇంకెన్నో ప్రయోజనాలున్నాయి (health benefits). వాటిని కూడా తెలుసుకొంటే.. మీరు కచ్చితంగా వాటిని మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటారనడంలో సందేహం లేదు.
1. పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు (Ample Antioxidants)
మన రక్తంలో చేరిన టాక్సిన్లు, ఇతర హానికరమైన మలినాలను మన శరీరం నుంచి ఎప్పటికప్పుడు బయటకు పంపించాల్సి ఉంటుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణజాలాన్ని ఆక్సిడేషన్‌కి గురవకుండా కాపాడుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. రోజూ చెంచా ఆల్మండ్ బట్టర్ తింటే.. రోజూవారీ మనకు అవసరమైన 30% విటమిన్ ఇ మనకు దొరుకుతుంది.
2. ప్రొటీన్లు అధికం (High Proteins)
అథ్లెట్లు, జిమ్‌కి వెళ్లేవారు.. ఎక్కువగా ప్రొటీన్ సహిత ఆహారం తీసుకొంటూ ఉంటారు. ముఖ్యంగా కండలు పెరగడం కోసమే ఇలా చేస్తుంటారు. మరి ప్రొటీన్లు అధికంగా దొరికే ఆహారం ఏంటో తెలుసా? బాదం పాలు. రోజూ పాలు తీసుకొనే అలవాటున్నవారు ఆ స్థానంలో బాదం పాలను తీసుకొంటే మీ రోజువారి అవసరాలకు తగినంత ప్రొటీన్ మీకు లభిస్తుంది.
3. కొలెస్ట్రాల్ సమతూకంగా (Balanced Cholesterol)
రోజూ బాదం గింజలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మీ రక్తంలోని హై డెన్సిటీ లిపొప్రోటీన్స్ కొలెస్ట్రాల్(HDL Cholesterol), డెన్సిటీ లిపొప్రోటీన్స్ కొలెస్ట్రాల్ల (LDL Cholesterol) మధ్య సమతూకం వస్తుంది. ఫలితంగా ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా ఉంటారు.
4. మధుమేహం అదుపులో (Control Diabetes)
అదేంటి? బాదం పప్పు తింటే మధుమేహం అదుపులో ఉండటమేంటి? అని ఆలోచిస్తున్నారా? మనం భోజనం చేసిన తర్వాత మనలోని ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. రోజూ బాదం తినడం ద్వారా ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. ఫలితంగా మధుమేహం అదుపులో ఉంటుంది.
5. వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది (Balance Acid Levels)
కొన్ని అధ్యయనాల ప్రకారం మాంసం, గోధుమలు, రిఫైన్డ్ పంచదార, ఇతర ప్రోసెస్డ్ ఫుడ్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దాని వల్ల మనకు మంచి కంటే.. చెడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీన్ని సమతౌల్యం చేసే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పనిని బాదం గింజలు చక్కగా చేస్తాయి. దీనిలో ఉన్న ఆల్కలీన్ గుణాలు శరీరంలో ఆమ్లత్వాన్ని సమతౌల్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా.. శరీర అవయవాలను క్షీణింప చేసే వ్యాధులు రాకుండా చేస్తాయి.
6. చర్మం ముడతలు పడకుండా.. (Reduces Wrinkles)
వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం సహజం. అయితే బాదం నూనెను ఉపయోగించడం ద్వారా వీటిని రాకుండా చూసుకోవచ్చు. రోజూ చర్మానికి ఈ నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఫలితంగా ముడతలు రాకుండా ఉంటాయి. అల ాగే కళ్ల కింద నల్లటి వలయాలు కూడా రాకుండా ఉంటాయి.
7. కేశ సంరక్షణ (Hair Care)
తమ కురులు దృఢంగా, ఒత్తుగా ఉండాలని కోరుకోని అమ్మాయిలెవరైనా ఉంటారా? మరి అది సాధ్యం కావాలంటే.. రోజూ బాదం నూనె తలకు పట్టిస్తే అందమైన కేశాలు మీ సొంతమవుతాయి. దీనిలో విటమిన్ ఎ, డి, బీ1, బీ2, బీ6 ఉంటాయి. ఇవి మీ స్కాల్ఫ్, జుట్టుకి పోషణ ఇస్తాయి. ఈ నూనెలో ఉన్న ఫ్యాటీ ఆమ్లాలు కురులను మృదువుగా పట్టులా మెరిసేలా చేస్తాయి.
8. పీచు పదార్థం లభిస్తుంది.. (Provides Fiber)
తగినంత పీచుపదార్థం ఆహారం ద్వారా తీసుకోనట్లయితే జీర్ణసంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మలబద్దకం వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే.. రోజూ బాదం పప్పులు తినాల్సిందే. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను క్రమబద్ధం చేసి మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. అలాగని ఎక్కువ మొత్తంలో తినాల్సిన అవసరం లేదు. రోజుకి నాలుగైదు బాదం పలుకులు తింటే చాలు.
9. బరువు తగ్గించడంలో కీలకపాత్ర (Helps In Weight Reduction)
బాదం గింజల్లో ఉన్న మోనోసాచ్యురేటెడ్ కొవ్వులు మీ జీర్ణవ్యవస్థను క్రమబద్ధం చేస్తాయి. ఫలితంగా మీ ఆకలి అదుపులో ఉంటుంది. ఫలితంగా అతిగా ఆహారం తీసుకోకుండా ఉంటారు. దీనిలోని మెగ్నీషియం మీ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచి ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాదు శరీరం అధిక క్యాలరీలను శోషించకుండా చూస్తుంది. అంటే అదనపు బరువు పెరగరనే కదా అర్థం. కాబట్టి వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.
10. ఎముకలు దృఢంగా (Makes Bones Stronger)
ఎముకలు దృఢంగా ఉండటానికి అవసరమైన పోషకాలన్నీ బాదం గింజల్లో ఉంటాయి. ముఖ్యంగా దీనిలో ఉండే పాస్ఫరస్, క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే వయసు పెరగడం కారణంగా ఎముకల్లో వచ్చే మార్పులను రాకుండా బాదం గింజలు కాపాడతాయి. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ మన దరికి రాకుండా చేస్తాయి.
Images: Shutterstock, Giphy
బాదం నూనె ఉపయోగాలను ఇక్కడ ఆంగ్లంలో చదవండి
బాదం పప్పు ఉపయోగాలపై కామెంట్లను ఇక్కడ చదవండి
కారెమిల్ బాదం గురించి తెలుసుకొని షాపింగ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి