సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

మీకో విషయం తెలుసా.. ? మనం తీసుకొనే సెల్ఫీలకి, మన రాశి ఫలాలకీ లింక్ ఉంటుందట. అన్నింటి కంటే చిత్రమైన విషయం ఏమిటంటే.. రాశి ఫలాలను బట్టి ఏ వ్యక్తి ఎలాంటి సెల్ఫీ తీసుకునే అవకాశం ఉందో కూడా చెప్పేయవచ్చట. మరి ఈ సెల్ఫీ ఆస్ట్రాలజీ ముచ్చట్లు ఏమిటో మనం కూడా చూసేద్దామాAries- మేషం


ఈ రాశి  అమ్మాయిలు ఎక్కువమంది  కాస్త దర్పం చూపిస్తుంటారు. ఇక సెల్ఫీల విషయానికి వస్తే, వారు తీసుకునే సెల్ఫీలో అయినా  లేక స్నేహితులతో కలిసి తీసుకునే గ్రూపీలో అయినా తాము  అందంగా కనిపిస్తామో లేదో అన్నది ప్రధానంగా చూస్తారు. తాము అనుకున్న విధంగా  ఆ ఫోటో రాకపోతే ఆ ఫోటోని డిలీట్ చేసేవరకు ఊరుకోరు. ఒక రకంగా చెప్పాలంటే కాస్త 'ఇగో ' అనేది ఈ అమ్మాయిల్లో మనకి స్పష్టంగా కన్పిస్తుంది.


Aries-1


Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo RatnaniTaurus- వృషభం


వృషభ రాశిలో పుట్టినవారిని వారు తీసుకునే సెల్ఫీలను బట్టి కనుక్కోవడం చాలా సులభం . ఎందుకంటే.. వీరు తమకి  ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటో తమ సెల్ఫీల ద్వారా నలుగురికి చూపించే ప్రయత్నం చేస్తుంటారు . ఒక రకంగా చెప్పాలంటే.. వీరిలో కాస్తా గొప్పలు చెప్పుకొనే స్వభావం కనిపిస్తుంది.  


Taurus-1


Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo RatnaniPisces- మీనం


ఈ రాశి వారు చాలా వరకు క్రియేటివ్  అని చెప్పొచ్చు. వీరు తరచుగా చిత్ర విచిత్రమైన సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే తాము తీసుకునే ఫోటోలలో  కూడా తమ ప్రత్యేకతని చూపించడానికి ట్రై చేస్తారు. అందరిలో ఒక్కరిగా ఉండకుండా..  ఏదైనా కాస్త క్రియేటివిటీని తమ సెల్ఫీలలో వీరు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. రొటీన్ లైఫ్ స్టైల్ కాకుండా.. కాస్తా  భిన్నంగా ఉండే లైఫ్ స్టైల్ ఉండేవారు ఎవరైనా మీ బ్యాచ్ లో ఉన్నారంటే వారు ఈ రాశికి చెందివారే అయివుంటారు . 


pisces-1


Image courtesy: Team POPxo


Aquarius- కుంభం


కుంభ రాశి వారిలో మానవత్వపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదే సమయంలో వారు జీవితంలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు పోతుంటారు. అలాగే తమకు నచ్చిన విధంగా ఉండడానికే వీరు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఇది వారు తీసుకునే సెల్ఫీలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. వీరు తీసుకొనే ఏ రెండు సెల్ఫీలు కూడా ఒకేలా ఉండకపోవడం .. కాస్త  వైవిధ్యాన్ని కోరుకునేవారుగా వీరు సెల్ఫీలలో కనిపించడం విశేషం.


Aquarius-1


Image courtesy: Team POPxo


Capricorn- మకరం


ఈ రాశి వారు అంటే అందరికి సహజంగానే ఇష్టం ఉంటుంది . అదే విధంగా వీరు పోస్ట్ చేసే సెల్ఫీలకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. స్వభావ రీత్యా వారు చాలా సరదాగా ఉన్నప్పటికీ.. అదే స్థాయిలో ప్రాక్టికల్  నాలెడ్జి కూడా వీరికి ఉండడం విశేషం. వారిలో ఉండే ఏదైనా సాధించాలన్న పట్టుదల, వారు తీసుకునే ఫోటోలలో కూడా స్పష్టమవుతూ ఉంటుంది.


Capricorn-1


Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo Ratnani


 
Saggitarius- ధనుస్సు


ధను రాశి వారు సాహస ప్రియులు అని చెప్పచ్చు. వారికి ప్రపంచాన్ని చుట్టేయాలన్న తపన ఉంటుంది .. అదే వారు తీసుకునే సెల్ఫీలలో కూడా  మనకి కనిపిస్తుంటుంది. వీరిలో ఏ పనినైనా ఒక ఛాలెంజ్ మాదిరిగా తీసుకునే గుణం ఉండడంతో పాటు,  వారి సెల్ఫీలు కూడా సైతం చాలా ఆసక్తికరంగా మనకి కనిపిస్తుంటాయి. వీరు కొత్త పనులు చేయడానికి కూడా వెనుకాడరు.


saggitarus1


Image courtesy: Team POPxoScorpio- వృశ్చికం


ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో  కనిపిస్తారు . అయితే తమలో ఎన్ని భావాలు  ఉన్నా సరే వాటిని అందరిముందు చూపించడానికి  ఇష్టపడరు. వీరి మనస్తత్వం వీరు తీసుకునే సెల్ఫీలలో కూడా మనకి కనిపిస్తుంది. అదే సమయంలో వారి సెల్ఫీలలో ఏదో  తెలియని ఒక గాఢత మనకి సుస్పష్టంగా తెలుస్తుంటుంది .


Scorpio-1


Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo RatnaniLibra- తుల


తుల  రాశి వారిలో చాలా మంది  రొమాంటిక్ గా ఉంటారు. తాము  చేసే పనిలో , క్లిక్ చేసే ఫోటోలలో  కూడా తమ రొమాంటిక్ యాంగిల్ చూపడానికి  ఏమాత్రం సంకోచించరు. తమ భాగస్వాములతో వారెంత  చనువుగా ఉంటున్నారన్నది వారు తీసుకునే సెల్ఫీలలో స్పష్టమవుతుంది. వీరు పోస్ట్ చేసే సెల్ఫీలను బట్టి వీరు ఏ రాశి వారో అన్నది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది .


Libra-1


Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo RatnaniVirgo- కన్య


ఈ రాశి వారు ఎప్పుడూ  "మిస్ లేదా మిసెస్ పెర్ఫెక్ట్"  అనిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అది వారు తీసుకునే  సెల్ఫీలలో సైతం మనకి తెలుస్తుంటుంది. తాము అనుకున్న విధంగా సదరు సెల్ఫీ రాకపోతే డిలీట్ చేయడం.. వారు అనుకున్న విధంగా వచ్చే  వరకు సెల్ఫీలు తీస్తూనే ఉండడం వీరి స్వభావం .


Virgo-1


Shot on an OPPO F1s this image is courtesy OPPO and Daboo Ratnani


 


Leo- సింహం


సింహ రాశి  వారు తమ పేరుకి తగ్గట్టుగానే దర్పంగా ఉంటారు.  అందరికన్నా తమకే ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటుంటారు. ఈ తరుణంలో  వారు దిగే సెల్ఫీలలో కూడా ఈ విషయం స్పష్టముగా కనిపిస్తుంది. వీరు ఎప్పుడూ అందరికన్నా  ముందుగా సెల్ఫీ తామే క్లిక్ చేయాలని .. సెల్ఫీ తీసాక కూడా దానిని తామే ఎడిట్ చేయాలని ... చివరికి ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయాలని ఆసక్తి చూపిస్తుంటారు. చివరగా అలా పోస్ట్ చేసిన సెల్ఫీలలో తాము అందరికన్నా  బాగున్నామా లేదా అన్నది కూడా వారి దృష్టిలో కీలక అంశం.


Leo-1


Image Courtesy - team POPxo


Cancer- కర్కాటకం


కర్కాటక  రాశి వారి సెల్ఫీల ద్వారా వారి మైండ్ సెట్ మనం ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ రాశి వారు నిజజీవితంలో కాస్త సున్నితంగా ఉంటారు. తమకి కలిగిన సంతోషం, దుఃఖం, బాధ .. ఇలా ఎలాంటి భావం అయినా వారు తీసుకునే సెల్ఫీలో తెలిసిపోతుంది . అదే సమయంలో వారిని ఎక్కువగా  తమ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్ఛే వారిగా కూడా పేర్కొనవచ్చు. కారణం .. వారు దిగే ఎక్కువ శాతం ఫోటోలలో వారు తమ కుటుంబ సభ్యులతో  మనకి కనిపిస్తారు .


 Cancer-1


 


Gemini- మిథునం


సహజంగానే  ఈ రాశిలో పుట్టినవారు చాలా సరదాగా  ఉంటుంటారు. అదే స్వభావం వారు తీసుకునే సెల్ఫీలలో  కూడా మనకి స్పష్టమవుతుంటుంది. ముఖ్యంగా వారు తీసుకునే సెల్ఫీలలో సరదాగా భంగిమలు ఇవ్వడంతో పాటుగా కాస్త ఫన్నీగా కూడా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మన స్నేహితులలో ఎవరైనా ఇలాంటి వారుంటే.. వారిది వారి సెల్ఫీని బట్టి ఏ రాశి అనేది మనం తేలిగ్గా చెప్పేయవచ్చు .


Gemini-1


Image courtesy: Team POPxo


ఇలా  ఈ 12 రాశులలో  మీరు గాని మీ స్నేహితులుగాని  ఉండచ్చు . అయితే ఇలా 12 రకాలా విభిన్నమైన మనస్తత్వాల వారందరికోసం మాత్రం  OPPO ఫోన్ అన్ని రకాల సరికొత్త ఫీచర్లతో వచ్చేసింది. మీ మూడ్ బట్టి సెల్ఫీలు   క్లిక్ చేసుకోవడానికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది . OPPO మీదగ్గర ఉంటే మీ పర్ఫెక్ట్ ఫోటో  వచ్చినట్టే!